దేవాలయంలోని దేవతా విగ్రహానికి ఎదురుగా నిలబడి ఎందుకు ప్రార్ధన చేయరాదు?
పిల్లలు దేవతా విగ్రహానికి నిలబడి ఉంటే పక్కకు జరిగి నిలబడమని పెద్దలు
మందలిస్తారు. అనేక దేవాలయాలలో ఈ సమస్య లేకుండేలాగా విగ్రహానికి ఎదురు
భాగంలో ఇనుప కంచెను నిర్మిస్తారు. విగ్రహాన్ని సూటిగా కాకా కాస్త ఎడంగా
కుడివైపునకు కానీ, ఎడమవైపునకు కానీ నిలబడి దేవుడిని చూస్తూ
ప్రార్థించవచ్చు. సూటిగా దేవుడి దృష్టి పదేలాకాక ౩౦ డిగ్రీలు పక్కగా చేతులు
జోడించి నిలబడి ప్రార్ధనలు చేయాలి. దేవతా విగ్రహం నుండి వెలువడే దైవ
కృపాశక్తి సర్పగాతిలో తరంగాలుగా ప్రవహిస్తూ భక్తుడిని చేరుతుంది. కావున
విగ్రహం వద్ద ఉన్నప్పుడు చేతులు జోడించి ఉంచి కళ్ళు మూసుకొని పరిపూర్ణంగా
దైవధ్యానంలో మినిగి ఉండాలి.
అలా చేతులు జోడించి ఉండటం వాళ్ళ మెదడు
నుండి ప్రాణశక్తి కలిగువుంటుంది. కావున అలా నమస్కారం పెట్టి ఉంచడం ద్వారా
శారీరిక బలం, బుద్ధిబలం మరియు ఆత్మవిశ్వాసం పొందబడుతారు. మానవదేహం సూటిగా
దైవ విగ్రహం నుండి వెలువడుతున్న దివ్యకిరణాలను భరించలేదు. కావున
విగ్రహానికి సూటీగా ప్రార్ధన చేయరాదని చెప్పబడింది.
No comments:
Post a Comment