11 November 2013

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనా ?

'మానవ సంబంధాలన్నీ ఆర్థిక ఆర్థిక సంబంధాలే' అని కారల్‌ మార్క్స్‌ ఏనాడో చెప్పాడు. అది నిజమేనని నేటి సమాజం నిరూపిస్తోంది. మానవ సంబంధాల్లో ఆర్థికపరమైన అంశాలకే మనుషులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మానవుడు సంఘజీవి. తన తోటివారితో, కుటుంబసభ్యులతో ప్రేమానురాగాలతో వుండాల్సింది పోయి మనిషి నేడు ఆర్థిక విషయాలకే ప్రాధాన్యం ఇవ్వడం విచారకరం. మనిషిలో పెరుగుతున్న స్వార్థం, డబ్బుమీద పెరుగుతున్న మోజు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, కొడుకులు, కూతుళ్లు డబ్బుకిస్తున్న ప్రాధాన్యత ప్రేమానురాగాలకు ఇవ్వకపోవడం రోజురోజుకూ వారి మధ్య అగాధాన్ని పెంచుతోంది.


ఆపద సమయాలలో ఆదుకునే బంధుమిత్రులు నేడు కరువయ్యారు. ధనార్జనే ధ్యేయంగా ఆలోచనలు మారిపోతున్నాయి. మానవ విలువలు అంతకంతకూ దూరమవుతున్నాయి. తల్లిదండ్రులు చూపించిన ప్రేమ, వాత్సల్యం సంతానం మరిచిపోతున్నారు. కంటికి రెప్పలా, ప్రాణానికి ప్రాణంగా పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను వారి పిల్లలు పట్టించుకోవడంలేదు. దాంతో ఎందరో నేడు దిక్కులేనివారుగా రోజులు వెళ్లదీస్తున్నారు. కని, పెంచి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొందరు తల్లిదండ్రులు చదువుల పేరిట పిల్లల్ని హాస్టళ్లలో, వసతి గృహాలలో వదులుతున్నారు. ఇందుకు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు కావడం ఒక కారణం. వీటన్నింటికీ ప్రధాన కారణం ఆర్థికమూలాలే అనడంతో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలను నిర్దేశిస్తున్నాయనడం సందేహం ఎంతమాత్రం లేదు.

ప్రతి గుండే చేప్పేది ఈ రోజునా అదే, "మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే".
ఎందుకిలా జరుగుతుంది?

No comments:

Post a Comment