15 October 2015

చంద్ర గ్రహణం :-

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా! అలా తిరిగే క్రమంలో భూమి, సూర్య చంద్రుల మధ్యలోకి వస్తుంది. అలా చంద్రునిపై భూమి నీడ పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే, సూర్యుడు, చంద్రుడు, భూమి సరళరేఖలా ఏర్పడినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. ఈ చంద్రగ్రహణం పౌర్ణమి రోజున వస్తుంది.

చంద్రగ్రహణం అప్పుడు భూమి నీడ చంద్రుని కప్పివేస్తుంది. దాంతో చంద్రునిలో కొంతభాగం దట్టమైన నీడలా, నల్లగా కనిపిస్తుంది. సూర్యునికి, చంద్రునికి మధ్యలో వచ్చిన భూమి ఎడమవైపు సగభాగంలో నివసించేవారికి చంద్రగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం అన్ని ప్రాంతాలవారికీ కనిపించదు. గ్రహణం కనిపించినా, కనపడకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కనుక గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

చంద్రగ్రహణం సమయంలో పాటించాల్సిన నియమాలు :-
* గ్రహణ సమయంలో దైవ ప్రార్ధన చేసుకోవాలి.
* గురు మంత్రాన్ని స్మరించుకోవడం మంచిది.
* ఆ సమయంలో యాదృచ్చికంగా సాధుసన్యాసులు ఎవరైనా తారసపడితే వారికి భక్తిగా నమస్కరించుకోవాలి.
* గ్రహణ సమయంలో ఏమీ తినకపోవడం మంచిది.
* గ్రహణం విడిచేవరకూ నిద్రించకూడదు.
* గ్రహణ సమయంలో స్త్రీపురుష సమాగమం తగదు.
* ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకుని మాత్రమే గ్రహణాన్ని చూడాలి. తిన్నగా గ్రహణాన్ని చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంది.
* గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎక్కడికీ వెళ్ళకూడదు. ఇంట్లో కూడా కదలకుండా పడుకోవాలి.
* గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి.
* గ్రహణానంతరం నది లేదా కాలువలో స్నానం చేయగలిగితే శ్రేష్టం.
* రుద్రాక్ష ధరించడానికి చంద్రగ్రహణ సమయం మంచిది.
* గ్రహణ సమయంలో పాదరస శివలింగాన్ని దర్శించుకున్నట్టయితే ఆర్ధికాభివృద్ధి ఉంటుంది. అనారోగ్యాలు నశిస్తాయి. ఎలాంటి కలతలూ, కల్లోలాలూ దరిచేరవు.


దుర్గ దేవి :-

రాణి రుద్రమదేవి :-

భరతఖండం చరిత్ర గర్భంలో ఎన్నో కోణాలు, దృక్కోణాలు. తరచి చూడాలన్న తపన ఉండాలే కానీ చరిత్రపుటల్లో ఎన్నో అద్భుతాలు, సాహస గాథలు కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి, ఆవిష్కృతమవుతాయి. క్రీస్తుకు పూర్వం నుంచే అనూహ్యమైన, సువిశాల రాజ్యాలు, సామ్రాజ్యాలు అనేకం అవిర్భవించాయి. రాజుల పాలనలో ప్రముఖంగా కన్పించేవి కుట్రలు, కుతంత్రాలు, పోరాటాలు, యుద్ధాలు. ప్రవహించేవి సామాన్యుల రక్తపుటేర్లు. వినిపించేవి ప్రజల అరణ్యరోధనలు, హాహాకారాలు.

అయితే ఆ కాలంలో కూడా దట్టంగా అలుముకున్న కారు చీకట్ల లోనూ అరుదుగానైనా కొన్ని కాంతి పుంజాలున్నాయి. సుపరిపాలనను అందించిన మహారాజులూ, మహా రాణులూ ఉన్నారు. శత్రు దుర్భేద్యమైన సైన్యాలు నిర్మించి, సుభిక్షమైన స్వర్ణయుగాలు స్ధాపించిన చక్రవర్తులూ, ప్రభువులూ ఉన్నారు. ఒక్కసారి గంతంలోకి తొంగిచూస్తే భరత ఖండాన్ని ఎన్నో రాజ వంశాలు, ఎందరో సామ్రాట్ లు, ఎందరో రాజాధి రాజులు ఎందరో మహా రాజులు పాలించినట్టు మనకు అవగతమవుతుంది. ఒక్కో వంశంలో అనేక మంది రాజులు, రారాజులు. ఒక్కొక్కరిది ఒక్కో విశిష్టమైన, వైవిధ్యమైన పాలన. ఒకరు ప్రజలను నానా హింసలకు గురిచేసి నరహంతలై పీక్కుతింటే మరొకరు అదే ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్నారు. ఒకరు తమ మతం తప్ప పర మతాలు పనికి రావని మత మార్పిళ్ళకి పాల్పడి సామాజిక, సాంస్కృతిక బీభత్సం సృష్టిస్తే, మరి కొందరు సర్వమతాల సారం ఒకటేనని చాటారు. మత సహనాన్ని బోధించారు, పాటించారు. కొందరు రాజులు కరకు కత్తులతోనే పాలన సాగించారు. కానీ మరికొందరు మాత్రం శాంతి, ప్రేమ, పూదోటలు వేశారు. కొందరు రాజులు ప్రజలను కేవలం పన్నులు చెల్లించేవారుగా, బానిసలుగా చూశారు. కానీ మరికొందరు మాత్రం ప్రజా సంక్షేమమే ఊపిరిగా బతికారు. ఆధునిక పాలకులకు సైతం ఆదర్శప్రాయమయ్యారు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. యావత్ తెలుగునాడును ఏకం చేసి, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుభిక్ష పాలనను అందించిన కాకతీయవంశ గజకేసరి, సామ్రాజ్ఞి..రాణీ రుద్రమదేవి.

జనరంజక పాలన :-
రుద్రమదేవి పాలన ప్రజారంజకమై భాసిల్లింది. శాంతి, సుస్థిరతలతో విరాజిల్లింది. దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ క్రితమే ఆమె సమాజంలో బలంగా వేళ్ళూనిన పురుషాధిక్యంపై సవాలు విసిరింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అన్న పురుషాధిక్యం తలలు వంచింది, అందరి నోళ్లు మూయించింది.


కాకతీయుల పాలనా కాలం :-
తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలతో పాటు ఇప్పటి కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలోని చాలా భాగాలు రుద్రమ సామ్రాజ్యంలో అంతర్భాగాలయ్యాయి. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే ఈమె దక్షిణాపథంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరం. రాణీరుద్రమ తనదైన శైలిలో, అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్టుగా ఏ ఇతర రాజలూ అర్థం చేసుకోలేదు. ఆమె సాహసానికీ, ధీరత్వానికీ, తెగువకూ, పాలనా దక్షతకూ మారుపేరుగా నిలిచింది. తెలుగు మహిళ పాలనా పటిమను- తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. అందుకే ఇప్పటికీ రాణీ రుద్రమ పేరు వింటేనే తెలుగు వారి ఒళ్ళు గగురుపొడుస్తుంది. తెలుగు జాతి రోమాంచితమవుతుంది.


శత్రువుల పాలిట సింహస్వప్నం :-
అసమాన పరాక్రమశాలి రాణీ రుద్రమదేవి. ఆమె కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనమై నిలిచింది. రుద్రమ్మ తన భుజ శక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహ ప్వప్నమైంది. ఆనాడే స్త్రీ సాధికారతను అమలు చేసిన మహారాణి ఆమె. అంతశ్శత్రువుల, బైటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షణాన తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన ఛత్తీస్ గఢ్ బస్తర్ సీమ వరుకు, పడమరన బెడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గంజాం.. అంటే అస్సాం వరకు కాకతీయ సామ్రాజ్యం విస్తరింపజేసింది.


మూల పురుషుడు కాకర్త్య గుండ్యన :-
క్రీ.శ. 1083 నుంచి 1323 వరకు దాదాపు 250 ఏళ్ళపాటు తెలుగు నేలనేలింది కాకతీయ వంశం. వీరికాలంలోనే తెలుగునాడంతా ఒకే తాటిమీదకు వచ్చింది. వీరి కాలంలోనే త్రిలింగ, ఆంధ్ర పదాలకు ఒక అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. దేశపరంగా, జాతిపరంగా కూడా ఎంతో ప్రచారంలోకి వచ్చాయి. ఈ వంశానికి మూలపురుషుడు కాకర్త్య గుండ్యనుడు.


ఈ వంశంలో సప్తమ చక్రవర్తి అయిన గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, పుత్ర సంతానం లేదు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు తలొగ్గిన ఆయన, రెండవ కుమార్తె రుద్రమదేవినే కుమారుడిగా పెంచాడు, అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతిదేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినపుడు ఆమె వయసు పధ్నాలుగేళ్ళే. అప్పటి నుంచి ఆమె తండ్రి చాటు బిడ్డగా దాదాపు పాతికేళ్ళ పాటు పాలన సాగించింది. ఆమె ఆడపిల్లన్న నిజాన్ని చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారు. అనంతరం రుద్రమదేవి చక్రవర్తిగా 1262 నుంచి 1289 వరకు అంటే ఇరవైఏడేళ్ళ పాటు అప్రతిహతంగా పాలన సాగించింది. సువిశాలమైన భూభాగాన్ని ఒక మహిళగా అసమాన ధైర్యసాహసాలతో ఎంతో సమర్థవంతంగా పరిపాలించడం వల్ల ఈ కాలం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణధ్యాయంగా నిలిచిపోయింది.

ప్రతికూల పరిస్థితులను అధిగమించి :-
రుద్రమదేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్నిసహించలేని సామంతులనుంచి, దాయాదులనుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్టించగానే ఎదురుతిరిగారు. తిరుగుబాట్లు లేవదీశారు. అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. అదే సమయంలో దేవగిరి యాదవ మహదేవుడు ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమ పైకి దండెత్తి వచ్చాడు. మహదేవునిపై పది రోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపరభద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుడ్ని ఆ యుద్ధంలో మట్టికరిపించి మూడు కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. ఆ విధంగా శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మళ్ళీ తలెత్తకుండా చేసింది. తరువాత 1262 సంవత్సరంలో తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని ఆక్రమించాడు. కాని రుద్రమ సేనా నాయకులైన పోతినాయకుడు, ప్రోలినాయకుడు వీరిని ఓడించి తిరిగి అక్కడ కాకతీయుల అధికారం నెలకొల్పారు.


రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ పట్టోధృతి అంటే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశమంతా కలియ దిరిగింది. ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒక చోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మూయడం చూసి రుద్రమ తల్లడిల్లింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకండా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ''మహామంత్రీ.. గ్రామగ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇక పై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పడడానికి వీల్లేదు.'' అని ప్రకటించింది.

మార్కోపోలో ప్రశంస :-
ఇటలీ దేశ రాయబారి మార్కో పోలో 1293 సంవత్సరంలో కాకతీయ రాజ్యంగుండా ప్రయాణించి గోల్కొండను సందర్శించాడు. గోల్కొండ ఆ కాలంలో కాకతీయులకు సైనిక కేంద్రంగా ఉండేది. మార్కో పోలో రుద్రమదేవిని అత్యంత సమర్థురాలైన, పాలనాదక్షతగల చక్రవర్తిగా అభివర్ణించాడు.


ప్రజాసేవలో :-
రుద్రమదేవి పాలన గురుంచి, ఆనాటి కాలమాన విశేషాల గురించి తెలిపే సరైన చారిత్రక ఆధారాలు గానీ, శిలా శాసనాలు గానీ పెద్దగా లేవు. రెండున్నర శతాబ్దాలపాటు నిర్విఘ్నంగా సాగిన కాకతీయుల పాలనపై సమగ్ర పరిశోధనలు జరగాల్సి ఉంది. రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. వేలాది ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువులను ఆ రోజుల్లో సముద్రాలుగా వ్యవహరించేవారు. వీరి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం కూడా విస్తరించింది, విరాజిల్లిది.


తిక్కనామాత్యుడు :-
మనుమసిద్ధి ఆస్థాన మహాకవి, కవిత్రయంలో ఒకరైన తిక్కనామాత్యుడు తమ రాజ్యం శత్రువుల వశం కావడంతో తమ ప్రభువుల రాయబారిగా రుద్రమను ఆశ్రయించాడు.


కట్టడాలకు, కళలకు నిలయం :-
శత్రుదుర్భేద్యమైన ఓరుగల్లు కోట, వేయి స్తంభాల గుడి, పాలంపేటలోని రామప్ప గుడి, భద్రకాళి ఆలయం, ఘణపురం కోటగుళ్ళు కాకతీయుల శిల్పకళా పోషణకు, నైపుణ్యానికి చక్కని తార్కాణం. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు ధీటైన పేరిణి శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుబోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జయాప సేనాని పేరిణి నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్పకళ, నృత్యం కలగలసిపోయి విరాజిల్లాయి.


వీరభద్రునితో వివాహం :-
పధ్నాలుగవ యేటనే పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు ఇరవై ఐదవ యేట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రేశ్వరుడితో వివాహమైంది. వారికి ఇద్దరు కూతుళ్ళు ముమ్మడమ్మ, రుద్రమ్మ కలిగారు. ఈమెకు మరో పెంపుడు కూతురు రుయ్యమ్మ కూడా ఉంది. తనకు మగ సంతానం లేక పోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడ్ని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది.


సర్వవర్గ సమానత్వం :-
ప్రజల సాంస్కృతిక జీవనంపై పట్టు లేకపోతే పాలన దుర్లభమవుతుందని గ్రహించిన మేధావి, రాజనీతిజ్ఞురాలు రుద్రమ. అందుకే ఆమె రాజ్యంలో జాతరలకు, పండుగలకు, ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. శైవ-జైన మతాల మధ్య అమోఘమైన సఖ్యత సమకూర్చిన అసలు సిసలైన లౌకిక పాలకురాలు రుద్రుదేవి. అలాగే ఆమె తన ముగ్గురు కూతుళ్ళను వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన రాజులకిచ్చి వివాహం జరిపి సర్వ వర్గ సమానత్వాన్ని చాటింది. రాజనీతిజ్ఞతను ప్రదర్శించింది.


అంబదేవుని దొంగదెబ్బ :-
అనేకసార్లు ఓటమి పాలైన వల్లూరు నేలే అంబదేవుడు రుద్రమదేవి పై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదనుకోసం చూస్తున్న సామంతుడైన అంబదేవుడికి సమయం కలసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకే ఎక్కుపెట్టాడు.


అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయింది. అంబదేవుడికి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. కత్తిపట్టి స్వయంగా కదన రంగాన దూకింది. అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్ళ పైచిలుకే. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేక పోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేని అంబదేవుడు కపట మాయోపాయం పన్నాడు.


ఆ రోజు రాత్రి వేళ యుద్ధక్షేత్రానికి సమీపంలోని గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్ళను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు పర్చాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయిందో నల్లగొండ చెందుపట్ల శాసనంలో ఉంది. అయితే రుద్రమ మనవడు ప్రతాపరుద్రుడు అమ్మమ్మ శపథం నెవేర్చాడు.ద్రోహి అంబదేవుడిని హతమార్చాడు. తెలుగువారే కాదు జాతి యావత్తూ గర్విందగ్గ అసమాన పాలనాదక్షురాలు రుద్రమ. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీక. స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాక. అసమాన పరాక్రమశాలి రాణీ రుద్రమదేవి.

Success :-

తెలుగు సామెతలు :-

1.
అంత్యనిష్ఠూరం కన్నా
ఆది నిష్ఠూరం మేలు

2.
అంబలి తాగే వారికి
మీసాలు యెగబట్టేవారు కొందరా

3.
అడిగేవాడికి
చెప్పేవాడు లోకువ

4.
అత్తలేని కోడలుత్తమురాలు
కోడల్లేని అత్త గుణవంతురాలు

5.
అనువు గాని చోట
అధికులమనరాదు

6.
అభ్యాసం
కూసు విద్య

7.
అమ్మబోతే అడివి
కొనబోతే కొరివి

8.
అయితే ఆదివారం
కాకుంటే సోమవారం

9.
ఆలూ లేదు చూలు లేదు
కొడుకు పేరు సోమలింగం

10.
ఇంట్లో ఈగల మోత
బయట పల్లకీల మోత

11.
ఇల్లు కట్టి చూడు
పెళ్ళి చేసి చూడు

12.
ఇంట గెలిచి
రచ్చ గెలువు

13.
ఇల్లు పీకి
పందిరేసినట్టు

14.
ఎనుబోతు మీద
వాన కురిసినట్టు

15.
చెవిటి వాని ముందు
శంఖమూదినట్టు

16.
కందకు లేని దురద
కత్తిపీటకెందుకు

17.
కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18.
కుక్క కాటుకు
చెప్పుదెబ్బ

19.
కోటి విద్యలూ
కూటి కొరకే

20.
నీరు పల్లమెరుగు
నిజము దేవుడెరుగు

21.
పిచ్చుకపై
బ్రహ్మాస్త్రం

22.
పిట్ట కొంచెం
కూత ఘనం

23.
రొట్టె విరిగి
నేతిలో పడ్డట్టు

24.
వాన రాకడ
ప్రాణపోకడ
ఎవరి కెరుక

25.
కళ్యాణమొచ్చినా
కక్కొచ్చినా ఆగదు

26.
మింగమెతుకులేదు
మీసాలకు సంపంగి నూనె

27.
ఆడబోయిన తీర్థము
యెదురైనట్లు

28.
ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29.
ఆది లొనే
హంస పాదు

30.
ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే
మహా వృక్షము

31.
ఆకలి రుచి యెరుగదు
నిద్ర సుఖమెరుగదు

32.
ఆకాశానికి
హద్దే లేదు

33.
ఆలస్యం
అమృతం
విషం

34.
ఆరే దీపానికి
వెలుగు యెక్కువ

35.
ఆరోగ్యమే
మహాభాగ్యము

36.
ఆవులింతకు అన్న ఉన్నాడు కాని
తుమ్ముకు తమ్ముడు లేడంట

37.
ఆవు చేనులో మేస్తే
దూడ గట్టున మేస్తుందా?

38.
అబద్ధము ఆడినా
అతికినట్లు ఉండాలి

39.
అడగందే అమ్మైనా
అన్నము పెట్టదు

40.
అడ్డాల నాడు బిడ్డలు కాని
గడ్డాల నాడు కాదు

41.
ఏ ఎండకు
ఆ గొడుగు

42.
అగ్నికి వాయువు
తోడైనట్లు

43.
ఐశ్వర్యమొస్తే
అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44.
అందని మామిడిపండ్లకు
అర్రులు చాచుట

45.
అందితే జుట్టు
అందక పోతే కాళ్ళు

46.
అంగట్లో అన్నీ ఉన్నా,
అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47.
అన్నపు చొరవే గాని
అక్షరపు చొరవ లేదు

48.
అప్పు చేసి
పప్పు కూడు

49.
అయ్య వారు వచ్చే వరకు
అమావాస్య ఆగుతుందా

50.
అయ్యవారిని చెయ్యబొతే
కోతి బొమ్మ అయినట్లు

51.
బతికుంటే
బలుసాకు తినవచ్చు

52.
భక్తి లేని పూజ
పత్రి చేటు

53.
బూడిదలో పోసిన
పన్నీరు

54.
చాదస్తపు మొగుడు
చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు

55.
చాప కింద
నీరులా

56.
చచ్చినవాని కండ్లు
చారెడు

57.
చదివేస్తే
ఉన్నమతి పోయినట్లు

58.
విద్య లేని వాడు
వింత పశువు

59.
చేతకానమ్మకే
చేష్టలు ఎక్కువ

60.
చేతులు కాలినాక
ఆకులు పట్టుకున్నట్లు

61.
చక్కనమ్మ
చిక్కినా అందమే

62.
చెడపకురా
చెడేవు

63.
చీకటి కొన్నాళ్ళు
వెలుగు కొన్నాళ్ళు

64.
చెరువుకి నీటి ఆశ
నీటికి చెరువు ఆశ

65.
చింత చచ్చినా
పులుపు చావ లేదు

66.
చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67.
చిలికి చిలికి
గాలివాన అయినట్లు

68.
డబ్బుకు లోకం
దాసోహం

69.
దేవుడు వరం ఇచ్చినా
పూజారి వరం ఇవ్వడు

70.
దరిద్రుడి పెళ్ళికి
వడగళ్ళ వాన

71.
దాసుని తప్పు
దండంతో సరి

72.
దెయ్యాలు
వేదాలు పలికినట్లు

73.
దిక్కు లేని వాడికి
దేవుడే దిక్కు

74.
దొంగకు దొంగ బుద్ధి,
దొరకు దొర బుద్ధి

75.
దొంగకు
తేలు కుట్టినట్లు

76.
దూరపు కొండలు
నునుపు

77.
దున్నపోతు మీద
వర్షం కురిసినట్లు

78.
దురాశ
దుఃఖమునకు చెటు

79.
ఈతకు మించిన
లోతే లేదు

80.
ఎవరికి వారే
యమునా తీరే

81.
ఎవరు తీసుకున్న గోతిలో
వారే పడతారు

82.
గాడిద సంగీతానికి
ఒంటె ఆశ్చర్యపడితే,
ఒంటె అందానికి
గాడిద మూర్ఛ పోయిందంట

83.
గాజుల బేరం
భోజనానికి సరి

84.
గంతకు తగ్గ బొంత

85.
గతి లేనమ్మకు
గంజే పానకం

86
గోరు చుట్టు మీద
రోకలి పోటు

87.
గొంతెమ్మ కోరికలు

88.
గుడ్డి కన్నా
మెల్ల మేలు

89.
గుడ్డి యెద్దు
చేలో పడినట్లు

90.
గుడ్డు వచ్చి
పిల్లను వెక్కిరించినట్లు

91.
గుడినే మింగే వాడికి
లింగమొక లెఖ్ఖా

92.
గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93.
గుడ్ల మీద
కోడిపెట్ట వలే

94.
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95.
గుర్రము గుడ్డిదైనా
దానాలో తక్కువ లేదు

96.
గురువుకు
పంగనామాలు పెట్టినట్లు

97.
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98.
ఇంటి దొంగను
ఈశ్వరుడైనా పట్టలేడు

99.
ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100.
ఇంటికన్న
గుడి పదిలం

101.
ఇసుక తక్కెడ
పేడ తక్కెడ

102.
జోగి జోగి రాసుకుంటే
బూడిద రాలిందంట

103.
కాచిన చెట్టుకే
రాళ్ళ దెబ్బలు

104.
కాగల కార్యము
గంధర్వులే తీర్చినట్లు

105.
కాకి ముక్కుకు
దొండ పండు

106.
కాకి పిల్ల
కాకికి ముద్దు

107.
కాలం కలిసి రాక పోతే
కర్రే పామై కాటు వేస్తుంది

108.
కాలు జారితే తీసుకోగలము
కాని నోరు జారితే తీసుకోగలమా

109.
కాసుంటే
మార్గముంటుంది

110.
కడుపు చించుకుంటే
కాళ్ళపైన పడ్డట్లు

111.
కలకాలపు దొంగ
ఏదో ఒకనాడు దొరుకును

112.
కలిమి లేములు
కావడి కుండలు

113.
కలిసి వచ్చే కాలం వస్తే,
నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114.
కంచే
చేను మేసినట్లు

115.
కంచు మ్రోగునట్లు
కనకంబు మ్రోగునా !

116.
కందకు
కత్తి పీట లోకువ

117.
కరవమంటే కప్పకు కోపం
విడవమంటే పాముకు కోపం

118.
కీడెంచి
మేలెంచమన్నారు

119.
కొండ నాలికకి మందు వేస్తే
ఉన్న నాలిక ఊడినట్లు

120.
కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121.
కొండను తవ్వి
ఎలుకను పట్టినట్లు

122.
కొన్న దగ్గిర కొసరే గాని
కోరిన దగ్గర కొసరా

123.
కూసే గాడిద వచ్చి
మేసే గాడిదను చెరిచిందిట

124.
కూటికి పేదైతే
కులానికి పేదా

125.
కొరివితో
తల గోక్కున్నట్లే

126.
కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127.
కొత్తొక వింత
పాతొక రోత

128.
కోటిి విద్యలు
కూటి కొరకే

129.
కొత్త అప్పుకు పొతే
పాత అప్పు బయటపడ్డదట

130.
కొత్త బిచ్చగాడు
పొద్దు యెరగడు

131.
కృషితో
నాస్తి దుర్భిక్షం

132.
క్షేత్ర మెరిగి విత్తనము
పాత్ర మెరిగి దానము

133.
కుడుము చేతికిస్తే
పండగ అనేవాడు

134.
కుక్క వస్తే రాయి దొరకదు
రాయి దొరికితే కుక్క రాదు

135.
ఉన్న లోభి కంటే
లేని దాత నయం

136.
లోగుట్టు
పెరుమాళ్ళకెరుక

137.
మెరిసేదంతా
బంగారం కాదు

138.
మంచమున్నంత వరకు
కాళ్ళు చాచుకో

139.
నోరు మంచిదయితే
ఊరు మంచిదవుతుంది

140.
మంది యెక్కువయితే
మజ్జిగ పలచన అయినట్లు

141.
మనిషి మర్మము..
మాను చేవ...
బయటకు తెలియవు

142.
మనిషి పేద అయితే
మాటకు పేదా

143.
మనిషికి
మాటే అలంకారం

144.
మనిషికొక మాట
పశువుకొక దెబ్బ

145.
మనిషికొక తెగులు
మహిలో వేమా అన్నారు

146.
మంత్రాలకు
చింతకాయలు రాల్తాయా

147.
మీ బోడి సంపాదనకు
ఇద్దరు పెళ్ళాలా

148.
మెత్తగా ఉంటే
మొత్త బుద్ధి అయ్యిందట

149.
మొక్కై వంగనిది
మానై వంగునా

150.
మొరిగే కుక్క కరవదు
కరిసే కుక్క మొరగదు

151.
మొసేవానికి తెలుసు
కావడి బరువు

152.
ముల్లును ముల్లుతోనే తీయాలి
వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153.
ముందర కాళ్ళకి
బంధాలు వేసినట్లు

154.
ముందుకు పోతే గొయ్యి
వెనుకకు పోతే నుయ్యి

155.
ముంజేతి కంకణముకు
అద్దము యెందుకు

156.
నడమంత్రపు సిరి
నరాల మీద పుండు

157.
నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో
నీ మాటలో అంతే నిజం ఉంది

158.
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159.
నవ్వు
నాలుగు విధాలా చేటు

160.
నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161.
నిదానమే
ప్రధానము

162.
నిజం
నిప్పు లాంటిది

163.
నిమ్మకు
నీరెత్తినట్లు

164.
నిండు కుండ
తొణకదు

165.
నిప్పు ముట్టనిదే
చేయి కాలదు

166.
నూరు గొడ్లు తిన్న రాబందుకైనా
ఒకటే గాలిపెట్టు

166.
నూరు గుర్రాలకు అధికారయినా
భార్యకు యెండు పూరి

167.
ఆరు నెళ్ళు సావాసం చేస్తే
వారు వీరు అవుతారు

168.
ఒక ఒరలో
రెండు కత్తులు ఇమడవు

169.
ఊపిరి ఉంటే
ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170.
బతికి ఉంటే
బలుసాకు తినవచ్చు

171.
ఊరంతా చుట్టాలు
ఉత్తికట్ట తావు లేదు

172.
ఊరు మొహం
గోడలు చెపుతాయి

173.
పనమ్మాయితొ సరసమ్ కంటే
అత్తరు సాయిబు తో కలహం మేలు

174.
పాము కాళ్ళు
పామునకెరుక

175.
పానకంలో పుడక

176.
పాపమని పాత చీర ఇస్తే
గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177.
పచ్చ కామెర్లు వచ్చిన వాడికి
లోకమంతా పచ్చగా కనపడినట్లు

178.
పండిత పుత్రః
పరమశుంఠః

179.
పనిలేని మంగలి
పిల్లి తల గొరిగినట్లు

180.
పరిగెత్తి పాలు తాగే కంటే
నిలబడి నీళ్ళు తాగడం మేలు

181.
పట్టి పట్టి పంగనామం పెడితే
గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182.
పెదవి దాటితే
పృథ్వి దాటుతుంది

183.
పెళ్ళంటే నూరేళ్ళ పంట

184.
పెళ్ళికి వెళుతూ
పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185.
పేనుకు పెత్తనమిస్తే
తలంతా గొరికిందట

186.
పెరుగు తోట కూరలో పెరుగు యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

187.
పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188.
పిచ్చోడి చేతిలో రాయిలా

189.
పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190.
పిల్లికి చెలగాటం
ఎలుకకు ప్రాణ సంకటం

191.
పిండి కొద్దీ రొట్టె

192.
పిట్ట కొంచెము
కూత ఘనము

193.
పోరు నష్టము
పొందు లాభము

194.
పోరాని చోట్లకు పోతే
రారాని మాటలు రాకపోవు

195.
పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196.
పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197.
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198.
రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199.
రామాయణంలో
పిడకల వేట

200.
రామాయణం అంతా విని
రాముడికి సీత
యేమౌతుంది
అని అడిగినట్టు

201.
రామేశ్వరం వెళ్ళినా
శనేశ్వరం వదలనట్లు

202.
రెడ్డి వచ్చే
మొదలాడు అన్నట్టు

203.
రొట్టె విరిగి
నేతిలో పడ్డట్లు

204.
రౌతు కొద్దీ గుర్రము

205.
ఋణ శేషం
శత్రు శేషం ఉంచరాదు

206.
చంకలో పిల్లవాడిని ఉంచుకుని
ఊరంతా వెతికినట్టు

207.
సంతొషమే సగం బలం

208.
సిగ్గు విడిస్తే
శ్రీరంగమే

209.
సింగడు
అద్దంకి పోనూ పొయ్యాడు
రానూ వచ్చాడు

210.
శివుని ఆజ్ఞ లేక
చీమైనా కుట్టదు


Walking :-

దేహము :-

హ్యాపీ :-

Guess :-

వండెర్ పుల్ బిజినెస్ :-

ఒక వూళ్ళో చాలా కోతులుండెవి. ఒక రోజు ఒక బిజినెస్ మాన్ ఆ వూరికొచ్చికోతులను వంద చొప్పున కొంటానని ప్రకటించాడు.

అదివిన్న వూరువాళ్ళు " వీదిలో తిరిగే కోతుల్ని వంద చొప్పునెవడు కొంటాడు ..... ఆయనొక పిచ్చివాడు" అని నమ్మలేదు. కానీ ఒకరిద్దరు దాన్ని తేలికగా తీలుకోలేదు. వస్తే వంద లేకపోతే మనది పోయేదేమీలేదు అని ప్రయత్నించారు. వాళు వంద చొప్పున సంపాదించుకున్నారు.

ఆ వార్త వూరంతా గుప్పుమంది. అంతే అందరూ కోతులెనకపడ్డారు. ఖాలీ లేకుండా కోతుల్ని పట్టి వంద చొప్పున సంపాదించారు. కొన్ని రోజుల తరువాత ఆ బిజినెస్ మాన్ రెండొందలని ప్రకటించాడు. అంతే అటూ ఇటూ పరిగెత్తి మరీ మిగిలిన కోతుల్ని పట్టి అమ్మారు.

వూరిలో కోతులు దాదాపుగా అమ్మేసారు. అప్పుడు ఆ బిజినెస్స్ మాన్ ఐదు వందలని ప్రకటించాడు.
అంతే వూరి వాళ్ళకి నిద్రాహారాలు మర్చిపోయిమరీ కోతులకోసం గాలించి గాలించి మరీ పట్టుకుని అమ్మేసారు. ఇంకా వూళ్ళో బయట కోతులే లేవు.

ఆ సమయంలో బిజినెస్స్ మాన్ ఒక కోతి వెయ్యి రూపాయలు ఇస్తా అని ప్రకటించాడు.
కానీ ప్రకటించిన వెంటనే ఆయన అర్జంటుగా సొంతూరు వెళ్ళవలసిన పనిపడంది. బిజినెస్స్ అంతా ఒక్కడే చూసుకునేవాడు. కనుక ఒక అసిస్టెంట్ నియమించి వూరికెళ్ళాడు.

ఇంకేటి వూరివాళ్ళి మంచి నీళ్ళుకూడా త్రాగ మర్చిపోయారు. అసలు వూళ్ళోకోతులే లేవు. మరి కోతికి వెయ్యి అంటె మంచి ఆఫర్ మిస్స్ అవుతున్నామన్న బెంగ పట్టుకుంది.

అది పసిగట్టిన అసిస్టెంట్ వూరివాళ్ళతో " ఇక్కడున్న కోతుల్ని నేను మీకు ఏడు వందల చొప్పున మీకు ఇస్తాను. వూరునుండి వచ్చే మా షావుకారుకి మీరు వెయ్యి చొప్పున అమ్మెయ్యండి. మీకు ఒక కోతికి మూడు వందలు లాభం. " అని లోపాయకారి వుపాయం చెప్పాడు.

ఆవార్త వూరంతా పొక్కింది. ఇంకేముంది మంచి బేరం దొరికింది అని ఆ అస్సిస్టెంట్ దగ్గర క్యూ కట్టారు. డబ్బున్నోళ్ళు కోతి మందల్ని కొనేసారు. పేదవాళ్లు పైనాంసియర్స్ దగ్గర అప్పు చేసి మరీ ఏడువందలిచ్చి మరీ కొన్నారు. అలా ఆ అస్సిస్టెంట్ తన దగ్గరున్న మొత్తం అన్ని కోతుల్నీ అమ్మేసాడు.

ఆ బిజినెస్స్ మాన్ ఎప్పుడొస్తాడో తెలీదు !! కొన్ని రోజులకి వాడు వస్తాడన్న నమ్మకమూ పోయొంది. కానీ ఆశ చావక ఏడు వందలిపెట్టికొన్న ఆ కోతుల్ని వదల్లేక వాటిని కాపలా కాయలేక వాటిని మేపలేకా సతమత మౌతూ బ్రతికేస్తున్నారు.

ఇదే వ్యాపారమంటే !! దాన్నే మనం ఇప్పుడు "స్టాక్ మార్కెట్" అంటున్నాం!!
ఈ వ్యాపారం ఎంతమందినో అప్పులపాలు చేసి రోడ్డునకీడ్చింది!!
కొద్దిమందిని మాత్రమే కోటీశ్వరుల్ని చెసింది !!


విన్నపం :-

13 October 2015

శ్రీమద్ భగవద్ గీత :-


హ్యాపీ :-

ధ్యానం :-

• ఫిట్‌నెస్ మంత్ర :-
రోజువారీ ఒత్తిళ్లు, అలసట.. వంటివి తగ్గించి మానసికోల్లాసాన్ని అందించే అద్భుతమైన ప్రక్రియ 'ధ్యానం'. అందుకే చాలామంది వ్యాయామం, యోగా.. వంటి వాటితో పాటు మెడిటేషన్‌కి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఇది ఒంటరిగా చేయడం కంటే బృందంగా చేస్తే మరిన్ని అదనపు ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల అనుకూల వాతావరణం ఏర్పడడంతో పాటు ఉత్సాహం, పనిమీద శ్రద్ధ.. వంటివి రెట్టింపవుతాయని వారంటున్నారు. మరి 'బృంద ధ్యానం (గ్రూప్ మెడిటేషన్)' వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో మనం కూడా తెలుసుకుందామా..!

• మనసు లగ్నం చేయచ్చు :-
మెడిటేషన్ అంటే.. 'హమ్మయ్య.. ఇవ్వాల్టికి పని పూర్తయింది..' అన్నట్లుగా కాకుండా దానివల్ల కలిగే ప్రయోజనాలన్నీ పొందేలా చేయాలి. అందుకు చుట్టూ ఉండే పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఇంట్లో టీవీ సౌండ్, కుటుంబ సభ్యుల మాటలు, ఇంటి చుట్టూ వాహనాల శబ్దాలు.. చుట్టూ ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు మెడిటేషన్ చేయడం సరైనది కాదు.. పైగా చుట్టూ ఇలాంటి పరిస్థితులున్నప్పుడు మెడిటేషన్‌పై శ్రద్ధ కూడా క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకొని, కుటుంబ సభ్యుల్ని కూడా అందులో భాగస్వాముల్ని చేయాలి. ఇలా అందరితో కలిసి మెడిటేషన్ చేస్తుంటే మీకు దానిపై మరింత ఆసక్తి, ఉత్సాహం పెరుగుతాయి.

• ఆందోళన దూరం :-
ఒంటరిగా కంటే బృందంతో కలిసి ధ్యానం చేయడం వల్ల మానసిక ఆందోళనలు, ఒత్తిళ్ల నుంచి త్వరగా విముక్తి పొందచ్చంటున్నారు నిపుణులు. దీనివల్ల నాడీవ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఉండడంతోపాటు కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉండి.. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అందరితో కలిసి ధ్యానం చేయడం వల్ల అందరితో బాగా కలిసిపోవచ్చు.. మీకున్న బాధలు, సమస్యలు.. వంటివి ఇతరులతో పంచుకోవచ్చు. తద్వారా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

• క్రమం తప్పకుండా :-
కొంతమంది ఇంట్లో పనుల వల్లనో లేదంటే బద్ధకించో క్రమం తప్పకుండా చేయాల్సిన కొన్ని పనుల్ని వాయిదా వేస్తుంటారు. అందులో వ్యాయామం, మెడిటేషన్.. వంటివి కూడా ఉండచ్చు. 'అబ్బ ఈ రోజు ఇంట్లో కాస్త ఎక్కువ పనుంది.. రేపటి నుంచి చేద్దాంలే..' అంటూ రోజూ ఆ పనులను వాయిదా వేస్తూ ఉంటారు. ఇలా రోజూ చేస్తూ పోతే కొన్ని రోజులకు దానిపై ఉండే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గడానికి బదులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా వాయిదా వేయకుండా మీ మనసును కంట్రోల్ చేసుకొని రోజూ మెడిటేషన్ చేసే అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం ఒంటరిగా చేయడం కంటే మెడిటేషన్ శిక్షణ తరగతుల్లో చేరడం ఉత్తమం. తద్వారా రోజూ తరగతి ఫలానా సమయానికి ఉంటుంది కాబట్టి కచ్చితంగా ఆ సమయానికి అక్కడికి వెళ్లి అందరితో పాటు మెడిటేషన్‌లో పాల్గొనచ్చు. తద్వారా క్రమం తప్పకుండా మెడిటేషన్ చేసి.. అన్ని ప్రయోజనాలనూ పొందచ్చు.

• ఆరోగ్యానికి మేలు :-
అందరితో కలిసి ధ్యానం చేయడం వల్ల దానిపై ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు.. అందరూ కలిసి నిపుణులు ఇచ్చే సూచనల ప్రకారం ముందుకెళ్లచ్చు. ధ్యానంలో భాగంగా గట్టిగా గాలి పీల్చి వదిలే క్రమాన్ని సరిగ్గా చేస్తే శరీరంలోని విషపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఫలితంగా శరీరం శక్తిమంతమవుతుంది. అలాగే ఈ ప్రక్రియ వల్ల శరీరంలోని అన్ని అవయవ వ్యవస్థల పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి ఇలా బృందంతో కలిసి నిపుణుల ఆధ్వర్యంలో ధ్యానం చేయడం వల్ల దానిపై ఆసక్తి పెరగడమే కాకుండా.. రోజంతా ఉల్లాసంగా ఉండచ్చు.

• సలహాలు.. సూచనలు :-
ఒంటరిగా మెడిటేషన్ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆ ప్రక్రియ బోరింగ్‌గా అనిపించచ్చు. దీంతోపాటు కాసేపు ధ్యానం చేశాక నిద్ర కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పైగా మిమ్మల్ని ఎవరూ పర్యవేక్షించరు కాబట్టి మీరు కూడా దానిపై శ్రద్ధ వహించకపోవచ్చు. కాబట్టి బృందంతో కలిసి చేస్తే.. చుట్టూ అందరూ ఉంటారు.. పర్యవేక్షించేవారు కూడా ఉంటారు కాబట్టి వారిని చూసి చేయాలనే ఆసక్తి కలుగుతుంది. అలాగే శిక్షణనిచ్చే నిపుణులు, తోటివారి నుంచి తగిన సలహాలు, సూచనలు కూడా తీసుకోవచ్చు. అలాగే గ్రూప్‌తో కలిసి మెడిటేషన్ చేయడం వల్ల ఆ ప్రక్రియ బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది.
చూశారుగా.. బృందంతో కలిసి ధ్యానం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో! అయితే ధ్యానం కోసం శిక్షణ తరగతులకు వెళ్లే తీరిక లేనివారు కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, లేదంటే చుట్టుపక్కల వారిని.. కలుపుకొని ధ్యానం చేయచ్చు. తద్వారా ఆశించిన ఫలితాన్నీ పొందచ్చు.

దసరా - నవదుర్గలు -విశిష్టత :-

ప్రకృతిలోని చైతన్యశక్తి. ప్రకృతి స్వరూపాలనన్నింటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి, ఒకే ఒక చైతన్య పర తత్త్వ శక్తియందు నిలిపితే జన్మసాఫల్యాన్ని పొందుతాడు. తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవులయందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి, చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసికొంటే దివ్యానుభూతిని పొందుతాడు.

‘‘సర్వరోగోపశమనం సర్వోపద్రవ నాశనం
శాన్తిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభమ్’’


సర్వ రోగములను, సర్వ ఉపద్రవములను పోగొట్టి, సర్వారిష్టాల్ని పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది- నవరాత్రి వ్రతం అని పేర్కొన్నది స్కాంధ పురాణం.

‘నవ’ అంటే తొమ్మిదని, క్రొత్త అని సామాన్యార్థాలు. కానీ, నవ అంటే పరమేశ్వరుడని, ‘రాత్రి’ అంటే పరమేశ్వరి అని నిర్ణయ సింధువు తెలుపుతోంది.

కనుక, నవరాత్రి వ్రతమంటే- పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థము. నవరాత్రి వ్రతమంటే తొమ్మిది రాత్రులు చేయు వ్రతమని చెపుతారు. ‘‘సూయతే స్తూయతే ఇతి నవః’’ అనగా నవ శబ్దమునకు స్తుతిం పబడుచున్నవాడని అర్థము. పరమాత్మ ‘నవ’ స్వరూపుడు. శబ్దరూపమైన వేదం- ప్రకృష్టమైన ‘నవ్య స్వరూపం’. అదే ప్రణవ స్వరూపం. ‘‘నవో నవో భవతి జాయ మానః’’ పరమాత్మ నిత్య నూతనుడు. అందరి చేత స్తోత్రింపబడుచున్నవాడు. శివశక్తులకు భేదం లేదు. అం దుకే జగన్మాతకు ‘శివా’ అనే నామం కూడా ఉంది.

జగజ్జనని- ‘రాత్రి’ రూపిణి. పరమేశ్వరుడు-ప గలు. జగన్మాత ఆరాధనే- రాత్రి వ్రతం. రాత్రి దేవియే- మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి వంటి రూపనామములతో పూజింపబడుతోంది. అందుకే మాతకు ‘కాళరాత్రి’ అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి, పగలు తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము తీసికొని తొమ్మిది తిథులు అనగా పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీదేవికి పూజ చేస్తారు.

‘పాడ్యమి’ అంటే ‘బుద్ధి’ అని చెప్పబడింది. మనుష్యుల బుద్ధియే శారదాదేవి. పాడ్యమి నుండి శారదా దేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. సర్వ శుభములను చేకూర్చుతుంది. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ‘ఉత్సవం’ అంటారు. ఇది పెద్ద ఉత్సవం- మహోత్సవం. ఇది- దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాల అంతరార్థం.

పసుపు, కుంకుమ, పూలు, పరిమళ సుగంధ ద్రవ్యములు మొదలైన మంగళకరమైన వస్తువుల యందు, ఆవు నేతి యందు ప్రజ్వలిస్తూ ప్రకాశించే ‘జ్యోతి’ స్వరూపంలోనూ, గో మాత యందు, ముత్తయదువల యందు, త్యాగబుద్ధి కలవారి యందు భాసిల్లుతుంది- మంగళగౌరీ దేవి.సర్వ కార్య దిగ్విజయమునకు మంగళగౌరీ పూజ చెప్పబడింది. అందుకే వివాహంలో నూతన వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు.
త్రిపురాసుర సంహారానికి బయలుదేరే ముందు గౌరీదేవిని అర్చించి విజయాన్ని పొందాడు పరమ శివుడు. ‘గౌరీ కల్యాణం వైభోగమే’ అంటూ అనాదిగా పెద్ద ముత్తయదువలు శుభములు పల్కుతూ కల్యాణ సమయంలో గానం చేయటం మన సంప్రదాయం.

హిమాలయ పర్వత శ్రేణిలో తెల్లని కాంతితో ఆవిర్భవించిన చల్లని తల్లి గౌరీదేవి. ‘గౌరీ గిరి రాజ కుమారీ గాన వన మయూరీ గంభీర కౌమారీ...’ అంటూ ‘గౌరీ’ రాగంలో, ముత్తుస్వామి దీక్షితులు గానం చేసిన కీర్తన నవరాత్రి పూజలో మొదటి రోజు అర్చనకు స్ఫూర్తినిస్తుంది.

చలించని మనస్సు, భ్రమించని దృష్టివలన ఏకాగ్రత సాధ్యమవుతుంది. నిష్కామబుద్ధితో తోటివారికి తోడ్పడుతూ, సమస్త జీవులపట్ల దయ, ప్రేమ, కరుణలను చూపిస్తూ, విద్యుక్త్ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ విశ్వకల్యాణాన్ని కాంక్షిస్తే- ఏకాగ్రత సాధ్యమవుతుంది. అదే ‘ధ్యానం’. ధ్యానయోగాన్ని ప్రసాదించేది - జగన్మాత శరన్నవరాత్రి పూజ.

యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై సమస్తస్యై నమో నమః


ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కు జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం... త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప. ఆ జగన్మాతకు సేవచేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన అద్భుత వరం.

నవరాత్రులలో దేవిని నవ మూర్తులుగానూ, నవశక్తులుగానూ ఆరాధిస్తారు. అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్ధిష్ట నిర్ణయంగా కనిపించదు. వరుస క్రమంలో మార్పులు ఉంటాయి. తిథి, నక్షత్రాలను బట్టి ఆనాటి రూపవిశేషం ఉంటుంది. ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచరాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. అంటే శృంగేరి పీఠంలో, విజయవాడ కనకదుర్గ దేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, అలాగే తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మూెత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి, ఆయా ప్రాంతాలవారీగా అమ్మవారి రూపాలు మారుతుంటాయి.

నవదుర్గలు :-
హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

ధ్యానం :-
యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం
యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా
యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం
నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ


ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక.


నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే


నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది.


ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||


ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది


నవదుర్గలు :-
సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలోనవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది.


ప్రథమం శైల పుత్రీతి
ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్ర ఘంటేతి
కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి
షష్ఠం కాత్యాయనీతి చ
సప్తమం కాలరాత్రీతి
మహాగౌరీతి చాష్టమం
నవమం సిద్ధిదా ప్రోక్తా
నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా


ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని వుంది. 


మహా శక్తిస్వరూపిణి అయిన దుర్గా మాతని మనం అనేక రూపాలాలో కొలుచుకుంటాము. ఐతే వాటిలో ముఖ్యమైనవి 9 అవతారాలు. వారినే మనం నవదుర్గలని అంటుంటాం.

దుర్గా మాత ముఖ్యమైన అవతారాలు మూడు. మాహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. వీరు శ్రీమహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరూ తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందారు.

1. శైలపుత్రి :-
నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుకజన్మలో దక్షప్రజాపతి కుమార్తె సతి. హిమవంతుడు పర్వతరాజు. కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటిన చంద్ర వంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమె పూజ జరుగుతుంది.


2. బ్రహ్మచారిణి :-
దుర్గామాత అవతారాలలో రెండవది అయిన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో తులసి మాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయనిగా పూజిస్తారు.


3. చంద్రఘంట :-
దుర్గామాత మూడవ అవతారమైన చంద్రఘంట మాత శిరసున అర్ధచంద్రుడిని గంటరూపంలో ధరించింది. అందువలననే ఆమెకి ఈ నామధేయం కలిగింది. సింహవాహిని ఐన ఈమె బంగారు దేహఛాయ కలిగి, పది హస్తాలతో ఉంటుంది. ఈమె పది హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలము, విల్లు, కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.


4. కూష్మాండ :-
సూర్యలోక నివాసిని అయిన కూష్మాండదేవి, సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది. ఈమె దేహఛ్ఛయతో దశ దిశంతాలు వెలుగు పొందుతాయి. సింహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము, విల్లు, అమ్ము, కమలము, అమృతభాండము, చక్రము, త్రిశులము, జపమాల ఉంటాయి.


5. స్కందమాత :-
కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గ ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.


6. కాత్యాయని :-
దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయనిమాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధించారు. బంగారు మేనిఛాయతో, అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు. ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులలో అభయప్రదాన ముద్రలో ఉంటుంది. ఈమె వాహనం సింహం.


7. కాళరాత్రి :-
దుర్గమాత ఏడవ అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చిమ్మచీకటిలా నల్లగా ఉంటుంది. చెదరిన జుట్టుతో, మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు మూడు కళ్ళు. ఈమె ఉచ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతుంటాయి. ఈమెకు నాలుగు హస్తములు. కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భాయాలని పారదోలేవిగా ఉంటాయి. ఎడమచేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతోచేసిన రంపంలాంటి అయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే ఐనా ఈమెని పూజించిన వారికి అన్ని శుభములని కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు.


8. మహాగౌరి :-
దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి. ఈమె చంద్రునిపోలిన మేనిఛాయతో ఉంటుంది. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్తలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు. అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు. రెండు చేతులలో త్రిశులం, దమరుకము ధరించి మిగిలన రెండుచేతులతో వర, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.


9. సిద్ధిదాత్రి :-
దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్దులను (అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇసిత్వ, మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు) ప్రసాదించగలిగే దేవత. ఈమె ద్వారానే పరమశివుడు ఈ సిద్ధులని సంపాదించాడని, అర్ధనారీశ్వరుడిగా
పేరుపొందాడని దేవీపురాణంలో చెప్పబడింది. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ, చక్ర, గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.


Tip :-

Acupressure :-

దుర్గాదేవి :-

12 October 2015

Blood Pressure :-

This Is How To Reduce High Blood Pressure In 5 Minutes Without The Use Of Drugs :-
Under the influence of physical stress or physical overload, your muscles get really tense and the blood vessels contract, so the pressure in them rises. That is how your blood pressure increases. Important question is how to reduce high blood pressure naturally and fast and how it can be back to normal ?

This is an old Chinese medicine which is presented by the doctor of the Moscow football club “Spartak”, Lu Huns.

How to reduce high blood pressure in 5 minutes without any drugs.

Point No.1 :-
There is a line in your boy which passes behind the earlobe to the middle of the clavicle. You don’t need to massage this line but slowly pamper it with annoticeable movement of the arm from the top to the bottom. Repeat this 10 times on the right and 10 time on the left side of the body.


Point No. 2 :-
The second point is located on part of the face at the earlobe at a distance of half a centimeter for the ear in the direction towards the nose. Massage this point for 1 min on each side of the face. It is important to feel pressure during the massage.


After this simple treatment, blood pressure will return to normal
According to Lu Huns, what matters is – proper blood flow!
According to Chinese folk medicine it is important to have normal blood flow in the body. They believe that diseases happen when there is stagnation of the blood and vice versa or if you improve your blood flow diseases will go away. This is why massaging the key points really helps.

శనిత్రయోదశి :-

శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడు.
శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా ఏలినాటి శని ప్రసన్నుడవుతాడు. అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నవగ్రహాలలో ...ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవత..
వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.


'శనీశ్వర జపం నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ
సంభూతం తమ్ నమామి శనైశ్చరం | ఓం శం శనయేనమ:||


'ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్
'ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః |


'శని గాయత్రీ మంత్రం-
'ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. |
'ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ |


"బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
'సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మేశని' |ఓం శం శనైస్కర్యయే నమః ఓం శం శనైశ్వరాయ నమః||
|ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||
కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:


| ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం!!


బ్రహ్మోత్సవాలు :-

బ్రహ్మోత్సవం అంటే ఏమిటి?

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయినబ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి 'బ్రహ్మోత్సవాలు' అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే- నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి 'బ్రహ్మోత్సవాలు'. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ సంబంధంలేదనీ తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి చాలా పెద్దయెత్తున జరిగేవి కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటారనీ ఇంకొందరి భావన. ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటున్నారని మరికొందరి భావన.

బ్రహ్మోత్సవాలు మొత్తం నాలుగు రకాలు

నిత్య బ్రహ్మోత్సవం :-
ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇవి మూడురోజులుగానీ అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి.


శాంతి బ్రహ్మోత్సవం :-
కరవు, కాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి 'శాంతి బ్రహ్మోత్సవాలు'. ఇలాంటి శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రకాలంలో చాలామంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజులపాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి.


శ్రద్ధా బ్రహ్మోత్సవాలు :-
ఎవరైనా భక్తుడు, తగినంత ధనాన్ని దేవస్థానంలో, దైవసన్నిధిలో సమర్పించి, భక్తిశ్రద్ధలతో జరిపించుకొనేది 'శ్రద్ధా బ్రహ్మోత్సవం'. శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్ధా బ్రహ్మోత్సవాలను 'ఆర్జిత బ్రహ్మోత్సవాలు'గా పేర్కొంటున్నారు.


ఒకరోజు బ్రహ్మోత్సవం :-
రథసప్తమి రోజు స్వామిని సప్తవాహనాలలో ఊరేగిస్తారు. అందువల్ల దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవమని చెబుతారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంలో స్వామిని ఊరేగిస్తారు.


చక్రస్నానానంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలలో ఊరేగిస్తారు. సప్తాశ్వాల, సప్తమి నాటి, సప్తవారాల సంకేతంగా సూర్యుడు పుట్టినప్పుడు ఈ ఉత్సవం జరుగుతుంది.

లోకం తీరు :-

బతుకమ్మ పండుగ :-

ఓ ముద్దుల చెల్లి.... ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు... అంతా వీరాధీవీరులే... అందరకీ పెళ్లిళ్లు అయ్యాయి... అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు... కానీ వదినలకు మాత్రం అసూయ..! ఓ రొజు వేటకెళ్లిన అన్నలు ఎంత కాలమైన తిరిగిరాలేదు... అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేదించారు... యాతన తట్టుకొలేక ఆ చెల్లి ఇల్లొదిలి వెళ్లిపొయింది.. ఆ తర్వాత అన్నలొచ్చారు... ముద్దుల చెల్లి ఎక్కడని... భార్యల్ని నీలదీశారు... విషయం అర్థమైంది... తిండి తిప్పల్లేవు... నిద్రహారాల్లేవు... చెల్లికోసం వెదకని పల్లె లేదు... ఎక్కని గుట్టలేదు !!

ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ వుండగా... పెద్ద తామరపూవొకటి కనపడింది... వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది... ఆ తర్వాత కొంత సేపటికి... ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు... ఆ పూవును తీసుకెళ్లి... తన తొటలొని కొలనులొ వేశాడు... కొలను చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి... కొంతకాలానికీ విష్ణుమూర్తి దిగొచ్చి... తామరను మనిషిగా చేశాడు. ఆమే శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు... పువ్వులకు బతుకుదెర్వు చూపింది కాబట్టి "బతుకమ్మ" అయింది !!
పైదంతా ఒక కథ... మహిషాసురుని చంపిన తర్వాత... అలసి సొలసి మూర్చబోయిన అమ్మవారికి... మహిళలంతా కలసి పాటలతొ స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో కథ !!

ఆత్మ త్యాగంతొ తెలంగాణలోని ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే... "బతుకమ్మ" అని పెద్దలంటారు !!

"బతుకమ్మ" కి మంత్రాలుండవు... కలసి పాడుకునే పాటనే మంత్రం..! "బతుకమ్మ" కి గుడులుండవు... నలుగురు గుమిగూడిన చోటే గుడి... నాలుగు చేతులు కలిస్తే ఆట... జన జీవన సౌందర్యమే... "బతుకమ్మ" కలిసి బతకమనే పండుగే "బతుకమ్మ" పండుగ... బతుకే ఒక ఉత్సవం అనే బోధించే పండగ ప్రపంచంలో ఇదోక్కటే కావచ్చు !!

బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య రోజు ‘పెత్రమవస్య’ గా లేక ‘ఎంగిలిపూవు బతుకమ్మ’గా పిలుచుకుంటూ ఆనాటి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుకలు కొనసాగిస్తం. ‘మహర్నవమి’ గా నవమిరోజు ‘సద్దుల పండుగ’ పేరుతో తిరిగి పెద్ద ఎత్తున ‘బతుకమ్మ’ పేర్చుకొని వైభవంగా పండుగను జరుపుకుంటం. తీరుతీరు పూలతో, తీరైన వంటలతో తల్లిని కొలుస్తూ పాడే పాటలు, తమ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో కూడిన పాటలు ఇలా బతుకమ్మ పండుగకు పాడుకునే పాటలు ఎన్నో.

అంతేకాదు, పండుగ ప్రారంభం నుండి తొమ్మిదవ రోజు వరకే గాకుండా, బతుకమ్మను సాగనంపే వరకు ఎన్నో సన్నివేశాలు. ఆ సన్నివేశాలకు తగిన పాటలు, ఆటలు నిజంగా చూసే కన్నులకు, వినే చెవులకూ ఆనందమే.


పెత్రమావాస్య రోజు జరుపుకునే పండుగను ‘ఎంగిలిపూవు బతుకమ్మ’ గా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పిలుస్తం. ఈ పండుగకు ఒకరోజు ముందు నుండే పూలను సేకరించి నీళ్ళలో వేస్తం. అయితే, ఎంగిలిపూవు బతుకమ్మ లేక పెత్రమావాస్య రోజు తమ పెద్దలకు నైవేద్యాలు సమర్పిస్తం. పెత్రమావాస్య రోజు పెద్దవిగా బతుకమ్మలను పేర్చి, సంబరం చేసుకుంటూ ఆనాటి నుండి ఆ తొమ్మిది రోజులు, దుర్గా నవరావూతుల్లో ప్రతిరోజు బతుకమ్మలను పేరుస్తం. ఈ తొమ్మిది రోజులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆడటంతోపాటు ఆట అనంతరం స్త్రీలు రకరకాల వాయినాలను ఇచ్చుకుంటుంటరు.

మొదటి రోజు వక్కలు, తులసి ఆకులు, సత్తుపిండి మొదలైనవి. రెండవ రోజు పప్పు, బెల్లం ప్రసాదంగా, మూడవ రోజు బెల్లం వేసి ఉడికించిన శనిగపప్పు, నాలుగో రోజు నానిన బియ్యం (బెల్లం కలిపిన పాలలో నానబెట్టిన బియ్యం), ఐదవ రోజు అట్లు పోసి ప్రసాదంగా పంచుకుంటాం. ఆరవ రోజు బతుకమ్మ పేర్చము, ఆడము. ఆ రోజు బతుకమ్మ అలిగిందనే విశ్వాసం ఒకటుంది.


ఏడవ రోజు పప్పు బెల్లం, ఎనిమిదవ రోజు నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు ప్రసాదంగా తయారు చేసి పంచుకుంటం. గతంలో ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు బతుకమ్మలను పేర్చడం, వాయినాలు ఇచ్చుకోవడం జరిగేది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు బతుకమ్మలు పేరుస్తున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో పెత్రమావాస్య రోజు, సద్దుల బతుకమ్మ నాడు రెండు రోజులు మాత్రమే ఘనంగా జరుపుకోవడం, మధ్య రోజుల్లో బతుకమ్మ ఆడటం చూస్తున్నం.

తొమ్మిదవ రోజు నాటి బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’ అంటం. పండుగ ఉత్సాహం ఈ రోజు అధికంగా కనిపిస్తుంది. దసరా పండుగకు ముందురోజు బతుకమ్మ పండుగ. ఈ రెండు రోజులు సంతోషంగా గడపడం కోసం పల్లెను చేరే వాళ్ళతో, ఊర్లన్నీ సంబరంగా ఉంటయి. అంతేకాదు, ఎక్కువ పూలతో ఈనాటి బతుకమ్మలను చాలా పెద్దవిగా చేసి, ఐదు రకాల సద్దులు కలిపి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తుంటం.

బతుకమ్మను పేర్చే విధానం, పూజించే తీరునుబట్టి ప్రజలు తనను ఆరాధించడానికే శక్తి ఆ రూపాన్ని కోరిందా అనిపిస్తుంది. శ్రీ చక్రోపాసనం సర్వోత్కృష్టమైన శక్త్యారాధన విధానాల్లో ఒకటి. బతుకమ్మను పేర్చేటప్పుడు కమలం షట్చక్షికం/అష్టదళ పద్మాన్ని వేసి పేర్చడం మొదపూడతారు. శ్రీ చక్రంలోని మేరు ప్రస్తారం బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటది. శ్రీ చక్రంలోని కుండలినీ యోగ విశేషశక్తిగా బతుకమ్మలో గౌరమ్మను నిలుపడం జరుగుతది. ఇక్కడి స్త్రీలు గౌరమ్మను, లక్ష్మి, సరస్వతిగా భావించి పూజిస్తరు. పాటలను పాడుతుంటరు. ఎన్నో పాటలు ఉన్నప్పటికీ బహుళ ప్రచారంలో ఉన్నపాట ‘శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ...’

‘శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతి సతివయ్యి
బ్రహ్మ కిల్లాలివై
పార్వతిదేవివై
పరమేశురాణివై
భార్యవైతివి హరునకు గౌరమ్మా...
అలా బతుకమ్మ ఆటలో పాడుకునే మరో గౌరిపాట...
శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో
చేయబూనితివమ్మా ఉయ్యాలో
కాపాడి మమ్మేలు ఉయ్యాలో
కైలాసవాసి ఉయ్యాలో
శంకరీ పార్వతి ఉయ్యాలో
శంభూని రాణి ఉయ్యాలో
తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో
ధ్యానింతునమ్మ ఉయ్యాలో....

-అంటూ రకరకాల పూలతో, పసుపు కుంకుమలతో, నైవేద్యాలతో పూజిస్తామని తెలుపుతూ, జయము శుభము కల్గించమని వేడుకుంటరు.

బతుకమ్మ పండుగ రోజు సాయంకాలం, గ్రామంలోని గుడి ముందరగాని, ఎప్పుడు అందరూ కలిసి జరుపుకునే ఏదేని మైదానానికి చేరుకొని బతుకమ్మ ఆటను ఆడుతరు. బతుకమ్మను పెట్టి ఆడే చోట వెంపలి చెట్టుగాని, పిండిచెట్టు గాని పెట్టి, గౌరమ్మను నిల్పి పూజ చేసి ఆట మొదపూడతరు. స్త్రీలు వలయాకారంగా నిలబడి కుడివైపుకు జరుగుతూ, చప్పట్లు చరుస్తూ, వంగి లేస్తూ, ఒక స్త్రీ పాట చెబుతూ ఉంటే, మిగతా వాళ్ళందరూ పాడుతుంటరు.

ఇలా సాగే బతుకమ్మ ఆట పాటను గమనిస్తే ఈ పండుగ ప్రయోజనమేమిటో అర్థమవుతుంది. అన్ని వర్గాలవారు కలిసి ఆడటంలో మానవ సంబంధాలు, సమిష్టి భావనలు పెంపొందుతయి. భారతదేశ ఔన్యత్యాన్ని, తెలంగాణ ప్రశస్థిని తెలిపే ఈ సాంస్కృతిక విశిష్టత తరతరాలుగా కొనసాగుతోంది. స్త్రీల సమైక్యత, వారిలోని కళాత్మకత ఈ సందర్భంగా చక్కగా వెల్లడవుతుంది.

కుటుంబం, అనుబంధం, చారివూతక నేపథ్యం, పౌరాణికతలు మొదలైనవి జోడించిన పాటల వల్ల రాబోయే తరానికి మౌఖికంగా, ఆచరణాత్మకంగా ఆ సాహిత్యాన్ని, వారసత్వాన్ని అందించిన వాళ్ళం కూడా అవుతం.

బతుకమ్మ ఆట తరువాత స్త్రీలు కోలాటాలు వేస్తరు. ఈ కోలాటాలను కొన్ని చోట్ల కర్రలతో, మరికొన్ని చోట్ల ఇత్తడి, వెండి కోలలతో, మరికొన్ని ప్రాంతాలలో చేతులతో వేస్తూ ఆనందిస్తరు. ఈ కోలాటం పాటలు రసరమ్యంగా, ఆనందంగా, వినోదాత్మకంగా ఉంటయి.

‘చేమంతి వనములో భామలు, చెలియకుంటలోన భామలు, చెలియకుంటలోన భామలు వోలలాడినారు...’ అంటూ గొల్లభామలు - కృష్ణుని పాటలు.


‘రాత్రి వచ్చిన సాంబశివుడు ఎంతటి మాయల వాడోయమ్మ’ అనే శివ మహత్యం తెలిపే పాటలు, ‘చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన....’ అంటూ సాగే పాటపూన్నో పాడుకుంటరు.

అదే విధంగా గౌరిపూజ చేసి, గౌరమ్మ కళ్యాణం (పసుపు ముద్ద గౌరమ్మ) చేసి, గౌరిని అంటే బతుకమ్మను సాగనంపుతూ పాటలు పాడుకుంటరు. ఈ పండుగ వేళ చేసే ప్రతీ పని ఆట, పాట అన్నీ మానవ జీవితంలోని సన్నివేశాలను ముఖ్యంగా స్త్రీలు కోరుకునే పేరంటం, సౌభాగ్యాలను చిత్రిస్తయి. వినవంతూ నింట్లో పుట్టి హిమవంతూ నింట్లో పెరిగి...’ అంటూ సాగే పాటలు స్త్రీల ఉద్దేశ్యాలను తేటతెల్లం చేస్తాయి !!

సత్యం :-

భగవంతుడి అనుగ్రహం పొందాలన్నా, మోక్షం ప్రాప్తించాలన్నా సత్యమే ఆధారం. ఎందుకంటే సత్యమనేది ఒక సద్గుణం మాత్రమే కాదు. అది బ్రహ్మ స్వరూపం. అదొక మహత్తరమైన శక్తి. సత్యమనే మాట పలకడం ఎంత సులభమో సత్యమైన మాటను నిలుపుకోవడం అంత కష్టతరం. భగవంతుడు ఈ మానవ జన్మ ఇచ్చినందుకు జీవనసత్యం తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇతరులకు సత్యవాక్పాలనలో ఆదర్శంగా నిలవాలి. పరోపకారమనేది అసలైన జీవన సత్యమని స్థూలంగా ధర్మశాస్త్రాలు చెబుతున్నా, సత్యంతో అనేక ధర్మసూత్రాలు ముడివడి ఉన్నాయి. ఇతరులను పీడించరాదనీ, సకల ప్రాణికోటినీ ప్రేమించాలనీ, స్వార్థ చింతనకు మనసులో తావీయరాదనీ ఉద్బోధిస్తారు. రుజువర్తన, నిజాయతీ, చిత్తశుద్ధితో జీవన ప్రస్థానం కొనసాగించాలనీ, అరిషడ్వర్గాలను దూరంగా ఉంచాలనీ, వీటన్నింటితోను సత్యమనే సద్గుణానికి సాన్నిహిత్యం ఉందనీ ఉపనిషత్తులు, వేదాలు చెబుతున్నాయి.

సత్యాచరణవల్లనే మనమేమిటో మనకు బోధపడుతుంది. తేజోమయ తపం వల్ల యజ్ఞం, సత్యం ఆవిర్భవించాయి. ధర్మాత్ముణ్ని ఆవలితీరానికి చేర్చే నౌక కేవలం సత్యమే. సత్యాసత్యాల మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉం టుంది. అంతిమ విజయం సత్యానిదే. సోమదేవుడు సత్యాన్ని పాటించి, అసత్యాన్ని అంతం చేస్తాడని వేద కథనం. అసత్యమాడినవారికి దుర్గతులు, సత్యమాడినవారికి సద్గతులు ప్రాప్తిస్తా యంటారు. 'సత్యం వద, ధర్మం చర'- సత్యాన్నే పలకాలనీ, ధర్మాన్నే ఆచరించాలనీ తైత్తరీయోపనిషత్తు చెప్పింది. సత్యపాలనలో అలక్ష్యం, ఏమరుపాటు తగదనీ వివరించింది. సత్యం పలకడమంటే అమృతపానం చేయటం.


తపస్సు చేసేవారికి, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవారికి, సత్యపాలన చేసేవారికే బ్రహ్మలోకం లభ్యమవుతుందని 'ప్రశ్నోపనిషత్తు' చెబుతోంది. సత్యనిష్ఠ మనిషిని శాశ్వతంగా పవిత్రుడిగా చేస్తుంది. దోషరహితుడైన యోగి, జ్యోతిర్మయ స్వరూపమైన పవిత్రమైన ఏ ఆత్మను దర్శిస్తాడో, అదే సత్యమని 'ముండకోపనిషత్తు' వ్యాఖ్యానిస్తోంది.

సృష్టిలోని సమస్త జనులకు సత్యమే శరణమనీ వారి ప్రతిష్ఠకు సత్యమే కారణమనీ, వారి శక్తికి మూలం సత్యమేననీ ఛాందోగ్యోపనిషత్తు ప్రవచిస్తోంది. అరుణ రుషి తన పుత్రుడైన శ్వేతకేతువుతో అష్ట సిద్ధుల్లో మొదటిదైన 'అణిమ'యే యావత్ప్రపంచానికి 'ఆత్మ' అనీ అదే సత్యమనీ, సకల జీవరాశుల మనుగడకు సత్యమే మూలబీజమనీ చెబుతాడు. సత్యపూర్వకంగా ప్రవర్తించినందువల్లనే దేవతలు కీర్తిని ఆర్జించగలిగారనీ, సత్యవాక్కు తప్ప మరేదీ పలకరాదని 'శతపథ బ్రాహ్మణం' బోధిస్తోంది. ఈ అఖిల సృష్టికీ సత్యసాక్షి సూర్య భగవానుడేనని చతుర్వేదాలూ అంగీకరించాయి. మానవుడు అసత్యమాడి చట్టం నుంచి, ధర్మం నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నా, కర్మ సాక్షి సూర్య భగవానుడి దృష్టినుంచి మాత్రం తప్పించుకోలేడు. యుగాలు, రుతువులు మారినా సత్యం మాత్రం మారదు. అది నిత్యమైనది. సత్యవాక్పాలకులను సర్వదా విజయం వరిస్తుంది. మానవతా విలువల్ని పెంచుతుంది. భగవదన్వేషణకు ఏకైక మార్గం సత్యమార్గమే.

తపస్సులలో సత్యపాలనను మించింది లేదు. తరచూ మనం స్వార్థపూరితమైన లాభాల కోసమేకాక, అసందర్భంగా, అకారణంగా అబద్ధమాడుతుంటాం. ఇలా అబద్ధాలకు పూనుకోవడం ద్వారా క్రమక్రమంగా భగవంతుడికి దూరమవుతున్నామన్న మాట. ఎందుకంటే సత్యమే పరమాత్మ. అసత్యమాడటమంటే నాస్తికతను ఆహ్వానించడమే. ఎవరికీ హాని జరక్కపోయినా, కాకతాళీయంగా వ్యర్థంగా అబద్ధమాడేస్తుంటాం. అది మన వ్యక్తిత్వాన్నీ, ప్రతిష్ఠనీ దెబ్బ తీసేదే! ఆధ్యాత్మిక సాధన అనే మొక్కకు అబద్ధమే చీడపురుగు. మన పూర్వీకులైన జ్ఞానులు, విద్యావేత్తలు, మహర్షులు, ధర్మవిదులు, వేదమూర్తులు, రాజులు, నేతలు సత్యం కోసం ఎంతటి మహత్తర త్యాగాలు చేశారో సర్వవిదితం.
మితభాషిత్వం సత్యవ్రతాచరణకు ఎంత గానో దోహదపడుతుంది. మౌనవ్రతమూ సత్యదీక్షకెంతో ప్రేరణ కలిగిస్తుంది. మనిషి జీవిత పర్యంతం కాపాడే ఏకైక పవిత్ర ఛత్రం 'సత్యం'! భగవంతుడితో మాట్లాడాలంటే మౌనమొకటే ప్రధాన సాధనం. ఇతరులకు అప్రియమైనదైనా సత్యమే పలకాలని మహాభారత సందేశం. 'బ్రహ్మ సత్యమ'న్న నిత్యసత్య నిర్వచనాన్ని అర్థంచేసుకోగలిగితే మానవ జీవనం నవజీవన- బృందావనమే!

మనసు :-

09 October 2015

మాతృగయ ( మాతృమూర్తులకు మోక్షధామం ) :-

సిద్దపూర్ గుజరాత్ రాష్ట్రం లో ఉత్తరాన పాటన్ (Patan)జిల్లాలో వుంది. గుజరాత్ లో వున్న సిద్ద్ పూర్ నే మాతృ గయ అంటారు. మాతృగయ చాలా విశేషవంతమైన ప్రదేశం. ఇక్కడ గంగ సరస్వతి నదుల సంగమ ప్రదేశం వుంది. సిద్ద్ పుర్ పవిత్రమైన స్థలమని శ్రీ స్థల్ అని భావిస్తారు. పురాణాల కాలం నుంచి ఈ ప్రదేశ గురించిన ప్రస్తావన వుంది. పురాణాల ప్రకారం దధీచి మహర్షి తన అస్తికలను ఇంద్రుడికి సమర్పించిన ప్రదేశంగా కూడా చెబుతారు. పాండవులు ఇక్కడికి వచ్చినట్లు చెబుతారు. ఋగ్వేదం లోను దీని ప్రస్తావన వుంది.

స్థల పురాణం :-
బ్రహ్మ మానస పుత్రుడైన కర్దమ మహర్షి కి మనువు పుత్రిక దేవహుతికి వివాహం జరిగిన చోటు ఇదే అంటారు.వీరికి తొమ్మిది మంది పుత్రికలు. వీరిని తొమ్మిదిమంది మహర్షులకి ఇచ్చి వివాహం చేశారు. వీరి పుత్రికలలో అనసూయ కూడా వుంది. అంతేకాదు ఈ దంపతులు చాలా కాలం తపస్సు చేసి విష్ణుమూర్తి చే భగవంతుడే తమ పుత్రుడిగా జన్మించాలని వరం పొందుతారు. ఆ పుత్రుడే భగవంతుడి అవతారమైన కపిల మహర్షి. పదహారేళ్ళ వయసులో కపిల మహర్షి తన తల్లికి వివరించిన సంఖ్యా శాస్త్ర సూత్రాలే కపిల గీత! గా ప్రసిద్ది చెందింది. తండ్రి కర్దమ ప్రజాపతి తన భోగ ఉపకరణాలు, సంపద అన్నీ వదిలి తపస్సు చేసుకోవడానికి వెళ్లి పోతాడు. దేవహుతి కుడా తన భర్త లేని ఈ సంపద భోగ వస్తువులు తనకి వలదనుకుని వైరాగ్యం తో కపిలుని వద్దకు వెళ్లి తను కూడా ఏమి చేస్తే మోక్షం పొంద గలనని వివరించమని అడుగుతుంది. అప్పుడు తల్లికి వివరించిన గీతోపదేశమే కపిల గీత .


తల్లి మరణానంతరం కపిలుడు తల్లి శ్రాద్ధ కర్మలు ఇక్కడే నిర్వహించాడు. అందుకే ఇది మాతృగయ గా ప్రసిద్ది చెందింది. ఇక్కడే పరశురాముడు కుడా తన తల్లి శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు. తల్లికి పెట్టే పిండ ప్రదానాలలో దాదాపు 20 చిన్న చిన్న పిండాలు పెడతారు.ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత వరకు, జీవితాన్ని ఇచ్చిన తమ తల్లికి కృతజ్ఞతగా ఇన్ని పిండాలు పెట్టిస్తారు. కొంతమంది 27 పిండాలు పెట్టిస్తారు. తెలిసి తెలియక తమ తల్లిని బాధ పెట్టినందుకు అంటే నవమాసాలు మోసినందుకు, కన్నందుకు, అన్నం తిననని మారం చేసినపుడు చదువు కునేటప్పుడు, ఇంకా అనేక విధాలుగా తాను చేసిన తప్పులు క్షమించినందుకు, కృతఙ్ఞతలు చెబుతూ పిండాలు సమర్పిస్తారు. తల్లికి మాత్రమె నిర్వహించే శ్రాద్ధకర్మలు నిర్వహించే ప్రదేశం ఇది ఒక్కటే! తమ తల్లికి పిండ ప్రదానం ఇక్కడ చేస్తే తల్లికి మోక్షం కలుగుతుందని అందరు నమ్ముతారు. మన సంప్రదాయం ప్రకారం పుత్రులు మాత్రమే తల్లికి కర్మకాండలు నిర్వహిస్తారు. చుట్టూ పక్కల కాని ఇక్కడ కొంతమంది స్త్రీలు కూడా తమ తల్లికి పిండ ప్రదానాలు చేస్తుంటారు.

బిందు సరోవరం :-
మన భారత దేశం లో వున్న 5 పవిత్రమైన సరోవరాల్లో గుజరాత్ లోని బిందు సరోవరం ఒకటి. మిగిలిన నాలుగు సరోవరాలు టిబెట్ లోని మానస సరోవరం , రాజస్తాన్ లోని పుష్కర్ సరోవరం, కచ్ (గుజరాత్)లోని నారాయణ సరోవరం, కర్ణాటక లోని పద్మ సరోవరం. భగవంతుడు ప్రత్యక్షమైనపుడు దేవహుతి కనుల వెంట జారిన ఆనందాశ్రవులే బిందు సరోవరం గా మారింది అని, మరి కొంతమంది కపిలుడు బోధించిన గీత వల్ల ఆనందంతో రాలిన బిందువులే బిందు సరోవరం అని అంటారు. ప్రస్తుతం అక్కడి నీరు అపరిశుభ్రం గా వుంది. ఈ ఆలయాల కి పక్కనే అదే ప్రాంగణం లో గుప్త సరోవర్ అని పెద్దది వుంది. విశాలమైన ఆ తటాకం లో నీరు కూడా ఆకుపచ్చగా వుంది. అక్కడే వున్న అశ్వద్ద వృక్షంలో శ్రాద్ధ కర్మలు చేసిన వారిచే మంత్రాలూ చెబుతూ ఒక చెంబుతో నీళ్ళు పోయించారు అక్కడి బ్రాహ్మలు. దీని significance తెలీదు కాని అందరు తమకి తోచిన దక్షిణ సమర్పించారు.


ముక్తి ధామ్ :-
ముక్తి ధామ్ గా పిలిచే ఈ సిద్దాపూర్ గ్రామానికి చుట్టుపక్కల 85 గ్రామాల ప్రజలలో ఎవరు మరణించినా ఇక్కడికి వచ్చి వారికి అగ్ని సంస్కారాలు చేస్తారు. ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. మరణించిన వారి అస్తికలను సరస్వతి నదిలో కలుపుతారు. అలాగే చివరి కర్మకాండలు నిర్వహించి మరణించిన వారికి ముక్తి ప్రసాదించమని వేడుకుంటారు. ప్రతి ఏటా వేలాదిమంది తమ మాతృ మూర్తులకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. గంధర్వ స్మశానం అని కుడా పిలుస్తారు ఇక్కడి స్మశానాన్ని. ఉజ్జయిన్, కాశీ, ప్రయాగ లలో కూడా ఇటువంటి ముక్తి ధామ్ వుంది.


రవాణా సౌకర్యాలు :-
సిద్ద్ పుర్ అహ్మదాబాద్ కి 114 కి.మీ, దూరం లో వుంది. ముంబై నుంచి ఆరావళి ఎక్స్ ప్రెస్, ఇతర ప్రదేశాలు ఓకా , డెహ్రాడున్, బెంగళూరు, మొదలైన ప్రధాన నగరాల నుంచి కూడా రైళ్ళు వున్నాయి. విశేషమైన చరిత్ర కలిగిన సిద్దపూర్ లో అక్కడ వున్నఉత్తరాధి మఠ్ లో అందరు (మగవారు మాత్రమే) తమ మాతృమూర్తులకి పిండ ప్రదానాలు చేశాక అక్కడే భోజనాలు ముగిస్తారు. బిందు సరోవరానికి చుట్టూ కపిల, దేవహుతి, కర్దమ మహర్షి శివ, పార్వతి, గణపతి మొదలైన ఆలయాలు వున్నాయి. ఈ ఆలయాలు కాక దగ్గరలోనే సత్యనారాయణ మందిరం, శ్రీకృష్ణ ఆలయం, బాలాజీ మందిరం, ఇంకా ఎన్నో చిన్న చిన్న ఆలయాలు వున్నాయి !!


శ్రీ గురు రాఘవేంద్రస్వామి :-

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైనగురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్నిఅవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు(పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.

విజయనగర సామ్రాజ్యము లోని ఒక పండిత కుటుంబానికి చెందినవారు రాఘవేంద్రులు . విజయనరగర సామ్రాజ్య పతనము తరువాత వీరి పూర్వీకులు కావేరీ తీరములోని కుంభకోణానికి చేరారు. అక్కడి మఠాధిపతి " సురేంద్రతీర్ధులు" వీరి కుటుంబ గురువులు. తిమ్మణ్ణ భట్ట,గొపికాంబలకు 1519లో మన్మధనామ సంవత్సరం పాల్గుణశుద్ద సప్తిమి గురువారం నాడు తమిళనాడు రాష్ట్రంలోని భువనగిరి గ్రామంలో ''వెంకన్నభట్టు''గా జన్మించారు. శ్రీ వెంకటేశ్వరుని కృపతో జన్మించినవాడు . బాల్యములోనే ప్రతిభ కలవాడుగా గుర్తింపు పొందారు. వ్యాకరణము , సాహిత్య , తర్క , వేదాంతాలనన్నింటినీ అధ్యయనం చేశారు. సంగీత శాత్రము అభ్యసించి స్వయముగా కృతులను కన్నడ భాషలో రచించారు. చిన్నతనంలోనే సరస్వతి అనే యువతితో వివాహం జరిగింది. వివాహం అనంతరం కూడా ఉన్నత విధ్యను అభ్యసించడానికి కుంబకోణానికి వెళ్ళి అక్కడ శ్రీ సుదీంద్రతీర్ధుల వద్ద విధ్యను అభ్యసించారు. అక్కడే శ్రీ మాన్‌ న్యాయసుధ, పరిమళ అనే గ్రంధాలను రచించారు. మహభాష్య వెంకటనాధచార్య, పరిమళచార్య అనే బిరుదులను పొందారు. తంజావురిలో యజ్‌క్షానారాయణ దీక్షీతులకు ఆయనకు మధ్వద్వైత సిద్దాంతలపై జరిగిన వాదానలో వెంకటనాధుడే విజయం పొంది భట్టచార్యులు అనే బిరుదును కైవసం చేసుకున్నారు. ద్వైత మధ్వ మహాపీఠానికి అస్ధాన విద్వాంసులుగా నియమితులయ్యారు. దేశ సంచారం ముగించుకొని స్వగ్రామానికి చేరిన ఆయనకు లక్ష్మీనారాయణ అనే కుమారుడు జన్మించారు. సుధీంద్రతీర్ధస్వామి మఠం ప్రతిష్టను వెంకన్నభట్టు నిలిపేవారు. సుధీంద్రతీర్ధస్వాములకు వయసు పైబడింది. ఆయన వారసుడుగా మఠం కీర్తిని నిలిపే ఉత్తరాధికారిగానియమించే ఆలోచన మొదలైంక్ది. సుధీంద్రతీర్ధస్వామి వారి దృష్టి వెంకణ్ణభట్టు మీద ఉండేది. కానిఆయన సంసారి. సన్యాస దీక్షకు సిద్ధము గాలేడు . అయినా తగిన వారసుడు వెంకన్నభట్టు అనే నిర్ణయానికి వచ్చి తంజావూరు తీసుకువెళ్ళి భార్యకు తెలియకుండా వెంకన్నభట్టుకు సన్యాసదీక్ష ఉప్పించి " రాఘవేంద్రతీర్ధులు " గా నామకరణము చేశారు. భర్త సన్యాసదీక్ష తీసుకున్న వార్త విన్న భార్య సరస్వతి ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఎన్నో కష్టాలను అనుభవించి బావిలో దూకి బలవన్మరణము చెందింది.

తంజావురు రాజు రాఘునాధ్‌ నాయకుడి ఆధ్వర్యంలో 1623 పాల్గుణ శుద్ద విదియనాడు మద్వపీఠ సంప్రదాయ ప్రకారం సన్యాస ఆశ్రమం స్వీకరించారు. గురుప్రణవ మంత్రం భోదించి శ్రీ సుదీంద్ర తిర్తులవారు ఆయనకు 1621 ధుర్మతినామ సంవత్సరంలో శ్రీ రాఘవేంద్ర యోగి దీక్షా నామాన్ని ఇచ్చారు. నాటి నుండి వెంకటనాధుడు శ్రీ రాఘవేంద్ర స్వామిగా మారారు. ఆ తరువాత మఠ సంప్రదాయల ప్రకారం ఉత్తరదేశ యాత్రకు వెళ్ళి ఎన్నో మహిమలను చూపారు. పలువురిని పాపవిముక్తులను చేశారు. కొన్నేళ్ళ తరువాత శ్రీ రాఘవేంద్రులు పవిత్ర తుంగభద్ర నది తీరాన కీ.శ.1671 విరోధినామ సంవత్సరం శ్రావణ బహుళవిధియ గురువారం సూర్యోదయంకు ముందు మూల రాముణ్ణ ఆద్భుత గాణంతో పూజించి మంత్రాలయం బృందవనంలో సజీవ సమాది అయ్యారు. ఆ గానానికి ఆలయంలోని వేణుగోపాల స్వామి విగ్రహాలు సైతం నాట్య చేశాయి. అప్పటి నుండి స్వామి బృందవనం నుండి అనేక మహిమలను చాటుతూ కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా ,కొరికలు తీర్చే గురు సార్వభౌముడిగా దేశవ్యాప్తంగా పేరుపోందారు.
భక్తిశ్రద్ధలతో స్వామి వారిని కొలుస్తే సకల సంపదలు ఫలిస్తాయని భక్తులు నమ్మకంతో ఎందరో కొలుస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుందం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము. మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారిపుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. మంత్రాలయం అసలు పేరు 'మాంచాలే'. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్ధుల దేవాలయం. ఆయన శ్రీ హరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్దాపించడానికి వసంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని కలుగజేస్తుంది.

రాఘవేంద్ర స్వామి జీవిత విశేషాలు :-
పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి అసలు పేరు వెంకటనాథుడు. ఆయన ఒక గృహస్తుడు. ఆయన భార్య పేరు సరస్వతి, కుమారుడు లక్ష్మీనారాయణ. 'గురు సుధీంద్ర తీర్థ' వెంకటనాదుని గురువు. అత్యంత ప్రతిభావంతుడైన వెంకటనాధుని తన తదనంతరం పీఠం భాధ్యతలు స్వీకరించమని సుధీంద్ర తీర్ద ఆదేశించాడు. గురు స్దానాన్ని చేపట్టాలంటే గృహస్ద జీవితాన్ని వదులు కోవాలి. గృహస్ధు గా తన భాధ్యతలకు పూర్తి న్యాయం చెయ్యలేననే కారణంతో గురు ఆఙ్ఞను వెంకటనాధుడు వినయంగా తిరస్కరించారు. కానీ కాలక్రమంలో దైవ సంకల్పం వల్ల వెంకటనాధుడు సన్యాసాన్ని స్వీకరించి, పీఠం గురు స్దానాన్ని అలంకరించడం జరిగింది. అప్పడినుండి ఆయన గురు రాఘవేంద్రుడుగా ప్రసిద్దుడయ్యారు. ఆయన తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీ హరి మహాత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశాడు. శ్రీ హరి కృప వల్ల ఆయన నయం కాని రోగాలను నయం చేయడం, మరణించిన వారిని బ్రతికించడం, నిరక్షరాస్యుడైన వెంకన్నను పండితునిగా చేయడం వంటి ఎన్నో మహిమలను ప్రదర్ళించారు. అలాంటి వాటిలో బాగా చెప్పుకోదగింది ఆదోని రాజు సిద్ది మసూద్ ఖాన్ గర్వాన్ని అణచడం. స్వామిని అవమానించాలనే ఉద్దేశ్యంతో సిద్ది మసూద్ ఖాన్ పంపిన మాంసం తో కూడిన తినుబండారాలను స్వామి పళ్ళు గా మార్చడంతో ఖాన్ రాఘవేంద్ర స్వామి శరణు వేడి వెంటనే ఒక అత్యంత సస్యశ్యామలమైన జాగీరుని స్వామికి సమర్పించాడు. స్వామి నవ్వుతూ జాగీరుని తిరస్కరించి తను తుంగభద్రా నదికి తల్లిగా భావించే మంత్రాలయాన్ని మాత్రం స్వీకరించారు. ఆంధ్ర ప్రధేశ్ లోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున మంత్రాలయం ఉంది. మద్రాసు, ముంబై, బెంగుళూరు, హైదరాబాదు మొదలుకొని పలు ప్రాంతాలనుండి మంత్రాలయానికి బస్సు సౌకర్యం ఉంది. మద్రాసు నుండి 595 కిలోమీటర్లు, ముంబై నుండి 690 కిలో మీటర్లు, హైదరాబాదునుండి 360 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయం ఉంది. ఇక్కడ యాత్రికులు బస చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ముంబై- మద్రాస్, డిల్లీ-బెంగుళూరు, హైదరాబాదు-తిరుపతి వెళ్ళే రైలు మార్గంలో మంత్రాలయం ఉంది. ఆ స్టేషన్ పేరు "మంత్రాలయం రోడ్డు". రైల్వే స్టేషన్ నుండి మంత్రాలయం 16కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడినుండి ప్రైవేటు జీపులు, ఆటోల లాంటి ప్రైవేటు వాహనాల సాయంతో మంత్రాలయానికి సులువుగా చేరుకోవచ్చు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6గంటలనుండి మద్యాహ్నం 2గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య దేవాలయాన్ని దర్శించవచ్చు. ఇటీవలి కాలంలో దేవాలయానికి లభించిన "బంగారు రథం" ప్రత్యేక ఆకర్షణ. వెండి, మామూలు రథాలు దేవాలయంలో ఉన్నా బంగారు రథం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కన్నుల పండువగా ఉంటుంది. దేశం లోని పలు ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. యూత్రికులను ఇంతగా ఆకర్షిస్తున్న ఈ దేవాలయం మూడువందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది.


ఈ మఠాన్ని ప్రీతికా సన్నిధి అని కూడా అంటారు. ఇక్కడ సాధారణంగా చూసే బృందావనమే కాక రాఘవేంద్ర స్వాముల విగ్రహం కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో రాఘవేంద్రులవారి విగ్రహం ఇది ఒక్కటే. మిగిలిన ప్రదేశాలలో ఆయనను బృందావనంగానే చూస్తారు. 1836 నుండి 1861 కాలంలో దీనిని శ్రీమదాచార్య పరంపరలో శ్రీ సుజనానేంద్ర తీర్ధరు స్ధాపించారు. పర్యాటకులు ఇక్కడి పంచ బ్రిందావనం కూడా చూడవచ్చు. దీనిలో అయిదుగురు రుషులు అంటే శ్రీ సుజనేంద్ర తీర్ధ, శ్రీ శుబోధేంద్ర తీర్ధ, శ్రీ సుప్రజనేంద్ర తీర్ధ, శ్రీ సుజనానేంద్ర తీర్ధ మరియు శ్రీ శుక్రుతీంద్ర దీర్ధల అవశేషాలుంటాయి.
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మీద దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న భక్తి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన మంత్రాలయా రాఘవేంద్ర పీఠానికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించినట్లు మఠం అధికారి సుయమీంద్ర చార్ ఈ విషయం తెలిపారు. ఈ విరాళంతో సర్వజ్ఞ మందిరం వద్ద 125 కొత్త గదులు నిర్మిస్తారు. అందులో 25 ఏసీ గదులు ఉంటాయి. సంస్కృత విద్యాలయం మైదానంలో ఉద్యానవనం కూడా ఏర్పాటు చేయనున్నారు. గతంలో రజనీకాంత్ రాఘవేంద్ర స్వామిగా కూడా నటించారు. దాన, ధర్మాలు చేయడంలో రజనీ మొదటి నుండి ముందుంటారు. తాజాగా ఏకంగా రూ.10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించడం కూడా సంచలనమే.

మనస్తత్వం :-

టిప్స్ :-