12 December 2014

హనుమాన్ చాలీసా :-

ఉత్తరభారత దేశంలో క్రీ శ 16 వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసి దాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ,ఓ ప్రాంతీయబాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు.
తులసీదాస్ రచించిన "రామచరిత మానస్" సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకధ ను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండే వాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతూండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీ దాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషా కు తరచుగా ఫిర్యాదులు వచ్చేవి. కాని అక్బర్ అంతగా పట్టించుకోలేదు. 

ఇది ఇలాగ ఉండగా వారణాసి లో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు,తన ఏకైక కుమారునికి చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు. వారిద్దరు ఆనందంగా జీవితం సాగిస్తూ ఉండగా ,విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపొయిన అతని భార్య హృదయవిదారముగా విలపించసాగింది. చనిపోయిన యువకుడికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతున్న ఆమెను బంధువులంతా ఆపుతూ ఉండగా ,ఆమె అక్కడ పక్కన తులసిదాస్ ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదాల వద్ద పడి రోదించసాగింది. అప్పుడు ఆయన రామ నామ ధ్యానం లో ఉన్నారు. హఠాత్తుగా కన్నులు విప్పి ఆమెను చూసి " దీర్ఘసుమంగళీ భవ" అని దీవించారు. అప్పుడు ఆమె జరిగినది అంతా తులసీ దాస్ కు విన్నవించుకుంది. అప్పుడు తులసీ దాస్ గారు....నా నోట అసత్యం పలికించడు రాముడు....అని అంటూ..... అప్పుడు ఆయన వారి కమండలం లో జలమును తీసి ఆ యువకుని దేహం మీద చల్లగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. ఆ మరు క్షణం అతను పునర్జీవితుడయ్యాడు. 

ఈ సంఘటన ప్రత్యేకించి తులసీ దాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ అయిపో సాగింది. ఇంక ఉపేక్షించితే కుదరదు అని గ్రహించిన ఇతర మత పెద్దలంతా పాదుషా వద్దకు వెళ్ళి జరుగుతున్నవి వివరించి తగిన చర్య తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ పాదుషా వారు తులసీ దాస్ ను తన దర్బార్లోకి రప్పించారు. అప్పుడు ఆయనతో విచారణ ఇలా సాగింది. 

పాదుషా : తులసీ దాస్...మీరు రామనామం అన్నిటి కన్నా గొప్పది అని ప్రచారం చేస్తున్నారట? 

తులసీ దాస్ : అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీ రాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరం కాదు.! 

పాదుషా : సరే...మేము ఇక్కడ ఒక శవాన్ని చూపిస్తాము...దానికి ప్రాణం పోయండి ...రామ నామం తో బ్రతికించండి..అప్పుడు మీరు చెప్పినది నిజమని మేము నమ్ముతాము... 

తులసీ దాస్ : క్షమించండి ప్రభూ! ఫ్రతి జీవికి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి....మానవమాత్రులు మార్చలేరు.. 

ఫాదుషా : అయితే తులసీ దాస్ జి! ఈ మాట ను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవి అన్నీ అబధ్ధాలు అని సభాముఖముగా అందరిముందు ఒప్పుకోండి! 

తులసీ దాస్ : క్షమించండి ...నేను చెప్పేది నిజం! పాదుషాకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. "తులసి...మీకు ఆఖరి సారి అవకాశం ఇస్తున్నాను...నీవు చెప్పేవన్ని అబద్ధాలు అని ఒప్పుకో.....నీవు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి నీ ప్రాణాలు దక్కించుకో.." అని పాదుషా వారు తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు.

అప్పుడు తులసీ దాస్ కనులు మూసుకొని, ధ్యాన నిమగ్నుడై శ్రీ రామ చంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారముగా భావించిన పాదుషా తులసిని బంధించమని ఆదేశించాడు. అంటే.....ఎక్కడ నుండి వచ్చాయో ....కొన్ని వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసి దాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని ,వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్తు సంఘటనతో అందరు హడలిపోయి ఎక్కడివారు అక్కడ స్థాణువులై పోయారు. 

ఈ కలకలానికి కనులు విప్పిన తులసీ దాస్ కు సింహద్వారంపై హనుమ దర్శనము ఇచ్చారు. ఒడలు పులకించిన తులసీ దాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమ " తులసీ ! నీ స్తోత్రముతో మాకు చాలా ఆనందమైనది..ఏమి కావాలో కోరుకో...." అన్నారు..అందుకు తులసీదాస్ "తండ్రీ! నాకేమి కావాలి.! నేను చేసిన ఈ స్తోత్రము లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు,నా జన్మ చరితార్ధమవుతుంది .నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా,వారికి అభయం ప్రసాదించు తండ్రీ!" అని తులసి కోరుకున్నాడు. 

ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమ "తులసి ! ఈ స్తోత్రం తో మమ్మల్ని ఎవరు స్తుతించిన,వారి రక్షణ భారం మేమే వహిస్తాము" అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు "హనుమాన్ చాలీసా" కామధేనువు అయి భక్తులను కాపాడుతూనే ఉంది. 

అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక "హనుమాన్ చాలీసా" దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామ జ్యోతి ఎప్పటికి వెలుగుతూనే ఉన్నది... శ్రీ రామ జయ రామ జయ జయ రామ !తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా ?

హిందువులకు ఉన్న పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ప్రతి హిందువూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. తిరుమలకు చేరుకోవాలంటే కొందరు భక్తులు బస్సుల్లోనూ,టాక్సీలలోనూ, నడుచుకుంటూ వెళ్తుంటారు. అందరికీ తెలిసిన నడక దారి ఒక్కటే అదే అలిపిరి. కాని ఎంతమందికి తెలుసు తిరుమల చేరుకోవాలంటే ఇంకా కొన్ని దారులు ఉన్నాయని? మనం ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం. తిరుమల ఆలయానికి ఏడుకొండలు నలువైపులనుండి ఏడు నడకదారులు ఉన్నాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. తాళ్ళపాక అన్నమాచార్య మొదటిసారి అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కాడు. క్రీ.శ. 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు. క్రీ.శ. 1550లో విజయనగర సామంతులు అలిపిరి-గాలి గోపురం మార్గం నిర్మించారు. 

మునుపటి రోజుల్లో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి, కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదే విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడి మల్లం నీలిసాని పేట, గాజులమండ్యం, కల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణపురం, నాగాలపురానికి మరోకదారి వుండేది. ఆరోజుల్లో తిరుపతి తొండమండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాహరాజు కాలంలో రాజధాని. ఇక్కడే కళ్యాణ వేంకటేశ్వరుని గుడి ఉంది. నాగులాపురంలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. అంటే ఆ రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అనుసంధానం చేసిన దారులు ఉండేవి. అయితే అవి నేడు కనుమరుగైపోయాయి. మొదటినుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. అయితే ఈ దారికన్నా తక్కువ సమయంలో కొండకు వెళ్ళగలిగే శ్రీవారి మెట్టు దారి గుండా యాత్రికులు వెళ్ళలేక పోతున్నారు, కారణం శ్రీవారి మెట్టుకు సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమే. శ్రీవారి ఆలయం చేరుకోవడానికి దాదాపు ఏడెనిమిది నడక దారులున్నాయి. అందులో ప్రధానమైనది అలిపిరి మెట్లదారి. అలిపిరి అంటే 'ఆదిపడి' అంటే మొదటి మెట్టు అని అర్థం .. ఇదే కాలక్రమంలో అలిపిరి అయింది. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. క్రీ.శ. 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుడి గాలిగోపురం వరకు సోపాన మార్గం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. 

అలిపిరి నుండి మెట్లు దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. మాటల అనంతరాజు సోపానాలు నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు. అలిపిరి దారిలో ఉండే మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను క్రీ.శ, 1387లో ఏర్పాటు చేసినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. శాసనాల్లో కనిపించేది అలిపిరి దారి ఒక్కటే. ఈ దారి గుండా బయలుదేరుతూనే మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కన్పిస్తుంది రెండు అడుగులు వేయగానే పాదాల మండపం, లక్ష్మీనారాయనస్వామి ఆలయం వస్తుంది. పడి మెట్లు ఎక్కగానే పిడుగుపడి పునర్ నిర్మింపబడిన పెద్ద గోపురం వస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే కుమ్మరి దాసుని సారె కనిపిస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే గజేంద్ర మోక్షం, చిట్టెక్కుడు, పెద్దక్కుడు వస్తాయి. ఆ పాకి వెళ్తూనే గాలిగోపురం వస్తుంది. అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని క్రీ,..1628లో నిర్మించారు. గాలిగోపురం నుండి క్రిందకు చూస్తే తిరుపతి పరిసరాలు, గోవిందరాజు స్వామి, అలిమేలు మంగమ్మ గుళ్ళు గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయి.

గాలి గోపురంలోపలికి వెళ్తూనే మహంతులు పూజించే సీతారామలక్ష్మణుల ఆలయం వస్తుంది. అక్కడే పెద్ద ఆంజనేయస్వామి ముకుళిత హస్తాతో ఉన్న విగ్రహం ఉంది. అటునుంచి దక్షిణం వైపు అడవిలోకి వెళ్తూ ఘంటా మండపం, నామాలగవిలను చేరుకోవచ్చు. అవ్వాచారి కోననుండి వెళ్తుంటే అక్కగార్ల గుడి వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడే రామానుజాచార్యుల వారి గుడి వుంది. మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడనుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వతుంది. అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది. తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడినుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్లు ఉంది. ఈ దారినుంది మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్ల దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు. చంద్రగిరి దుర్గం నిర్మించిన తరువాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది.
చంద్రగిరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్టుంది చంద్రగిరి రాజులూ ఈ దారిలోనే తిరుమలకు వెళ్ళేవారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనంకోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవారు. ఆయన శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే దారిలో అప్పటినుంచి నేటివరకు కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకువెళ్తుంటారు. ఈ దారి స్థానికులకు తప్ప బయటి ఊర్లో వారికీ అంతగా తెలియదు. ఈ రెండు దారుల తరువాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం వైపున కాలినడకన వచ్చే మామండూరు దారికి మించిన దారి లేదు. పూర్వం కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది. ఆనాడు విజయనగర రాజుల కాలంలో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల రేనాడు వారు ఈ దారి మీదుగానే తురుమల చేరుకునేవారు. మామండూరు దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్ళతో మెట్లను ఏర్పాటు చేశారు. మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆ తర్వాత పాల సత్రం వస్తుంది. 

ఇంకొంచెం దూరం పొతే ఈతకాయల మండపం తరువాత పడమర వైపు కొంతదూరం వెళ్తే తిరిరుమలలోని గోగర్భ డ్యాం వస్తుంది. 1940లో తిరుమలకు ఘాట్ రోడ్డు నిర్మించాలనుకున్నప్పుడు మామండూరు దారే సులువైన దారి అని ఆనాటి ఇంజనీర్లు చెప్పారు. తిరుమలకు ఘాట్ రోడ్లు నిర్మించాలనుకున్నప్పుడు ఇంజనీర్లు సర్వే చేసి మూడు దారులను ఎంపిక చేశారు. అలిపిరి నుండి తూర్పు వేపుకు వెళ్ళే మదటి ఘాట్ రోడ్డు, పడమటి దిక్కు నుండి చంద్రగిరి వైపు నుండి వెళ్ళే రెండో ఘాట్ రోడ్డుతో పాటు మామండూరు దారిలో మరో ఘాట్ రోడ్డును నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆనాటి టిటిడి బోర్డు సభ్యుడు టికెటి రాఘవాచార్యులు మామండూరు ఘాట్ రోడ్డు ప్రతిపాదనను ఒప్పుకోలేదు. తిరుమల నుండి మామండూరు వెళ్ళే నడక దారిలో పాలసత్రం నుండి దక్షిణం వైపు వెళ్తే కాకుల కొండ వస్తుంది. ఈ కాకుల కొండ మీదుగా వెళ్ళినా మామండూరు చేరుకోవచ్చు.

తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాంకి అవతలి వైపున్న కొండను ఆనుకొని శ్యామల కోన ఉంది. ఇక్కడి నుండి వెళ్ళే నడకదారికి శ్యామలకోన దారి అనే పేరుంది. అదే కాకుండా దీనికి అనుంకోన దారి అనే పేరు కూడా ఉంది. కల్యాణి డ్యాం నుండి ఈ దారి గుండా తిరుమల వెళ్ళాలంటే సుమారు పదిహేను కిలోమీటర్లు నడవాలి. కల్యాణి డ్యాం నుండి పులి బోను వరకు ఉండే నడక దారిలో అటవీశాఖ వారు తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు వేశారు. ఈ రోడ్డులో సుమారు మూడు కిలోమీటర్లు దూరం వెళ్తే అనుంకోన మలుపు వస్తుంది. ఈ మలుపు నుండి తూర్పు వైపు తిరుమలకు వెళ్ళే దారి వస్తుంది. అనుంకోన మలుపు నుండి కొంత దూరం వెళితే తొలివంక తరువాక మలివంక వస్తాయి. ఆపైన ఉడ్డల చింతల మాను వస్తుంది. అటు తర్వాత వెడల్పుగా ఉండే గెద్దలబండ వస్తుంది. ఆ తరువాత చిట్టికోన వంపు వస్తుంది. అక్కడినుండి సుమారు మూడు కిలోమీటర్లు ముందుకు వెళితే తిరుమలలోని ఎత్తైన నారాయణ గిరి వస్తుంది. రంగంపేట, భీమవరం నుండి భక్తులు ఈ దారి నుండే తిరుమలకు వెళుతుంటారు. 

కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలా దొడ్డి నుండి తుంబురు తీర్థం నుండి పాపవినాశానానికి, అక్కడినుండి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు. పాపవినాశనం డ్యాం నీళ్ళు లోయలో ప్రవహిస్తూ తుంబురు తీర్థం మీదుగా కుక్కలా దొడ్డి వైపు ప్రవహిస్తాయి. కుక్కలా దొడ్డి నుండి సెలయేటి గట్టు మీద ఎగుడుదిగుడులు లేకుండా నడిచి వస్తే తుంబుర తీర్థం ఎంతో సునాయాసంగా చేరుకోవచ్చు. తుంబుర లోయను నిట్టనిలువుగా అధిరోహించి కొంత దూరం కొండపైన నడిచి వస్తే పాపవినాశనం వస్తుంది. పాపవినాశనం నుండి తుంబుర తీర్థానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అవ్వాచారి కొండ నుండి కూడా ఒక దారి ఉంది. దీన్నే అవ్వాచారి కోనదారి అని అంటారు. ఈ అవ్వాచారి కొండమీద మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడి నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వస్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది.

ఇవేకాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుండి అవ్వాచారి కోనవరకూ ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఎనుగులద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. తలకోన నుండి కూడా తిరుమలకు మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గరనుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కాబట్టే దీనికి తలకోన అని పేరు వచ్చింది. నెరభైలు, ఉదాద్య మాణిక్యం, ఎర్రావారిపాలెం భక్తులు ఈ దారిలోనే అప్పుడప్పుడు తిరుమలకు వస్తుంటారు. ఇప్పటివరకూ మనం చాలా సార్లు తిరుమలకు వెళ్ళి ఉంటాము. కానీ చూశారా మీలో ఎవరికైనా ఈ నడక దారుల గురించి తెలుసా?

11 December 2014

ఏ రోజు ఏ దేవుడికి ఉపవాసం ఆచరించాలి ?

ఉపవాసం మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి, మానసిక స్థైర్యానికి, సత్త్వసిద్ధికి ఉపకరిస్తుంది.
ఆహార శుద్ధే సత్వశుద్ధి: అని అన్నారు. అంటే ఆహార లక్షణాన్ని బట్టే మానవుని మనసు ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికపథంలో పయనిస్తున్నవారు తమ శారీరక ఆరోగ్యం కోసం మితాహారం, క్రమాహారం, సాత్వికాహారం అంటూ విభజించి తీసుకుంటుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకునే మనవాళ్ళు ''ఆత్యాహార మానాహారం నిత్యం యోగీ వవర్జయేత్'' అని అన్నారు. అతిగా తినడం, అసలు తినకుండా ఉండటం కూడా మంచిది కాదన్నారు. జీవించడానికే తినాలిగానీ తినడానికే జీవించకూడదు.

మితాహారం: కడుపులో సగభాగం అన్నం తదితర ఆహార పదార్థాల చేత, పాతికభాగం నీటి చేత నింపి, మిగిలిన పాతికభాగం గాలికోసం ఖాళీగా ఉంచాలి. ఈ విధంగా ఆహారాన్ని స్వీకరించడమే మితాహార పద్ధతి. ఇలా ఐందుకు చెప్పరంటే, అధికంగా తింటే భగవధ్యానం కుదరదు. అధిక మైన ఆహారం వలన శరీరం బరువెక్కి, మత్తుగా మారి పూజ, ధ్యానం వంటి విషయాలపై ఆసక్తిని నిలుపలేము. అందుకే మితంగా తినడం, మితంగా నిద్రించడం అత్యంతావశ్యకం అని అన్నారు.

క్రమాహారం: ఈ ఆహార విధానాన్ని మరలా సాత్త్విక, రాజసిక, తామసిక ఆహార విధానాలంటూ మూడు విధాలుగా విభజించారు. క్రమాహారం అంటే ప్రతిరోజు దాదాపు ఒకే సమయానికి, పరిమితంగా సమతులమైన ఆహారాన్ని తీసుకోవడం. ఇలా తినడం వల్ల మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. 


సాత్త్వికాహారం : సాత్త్వికాహారం వలన మానసిక ఉద్రేకం తగ్గుతుంది. క్రమమైన సాత్త్వికాహారం అనేక శారీరకరోగాలను నిరోధించి ఆయు: ప్రమాణాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ ఆహార నియమాలకు తోడుగా ఉపవాసదీక్షను ఏర్పరిచారు. ఇందులోకూడ ఆరోగ్యరహస్యాలు ఇమిడి ఉన్నాయి.

వారంలో ఉన్న ఏడురోజులకు ఏడుగురు అధిపతులున్నారు. ఏమి ఆశించి ఉపవాసం చేస్తారనేదాన్ని బట్టి వారు వారంలో ఏరోజు ఉపవాసం చేయాలనేది ఆధారపడి వుంటుంది. ప్రతిరోజుకు ఒక్కో గ్రహం అధిపతి. ఒక్కో గ్రహాదిపతి కృప పొందేందుకు ఒక్కోవిధమైన ఉపవాసం పాటించాల్సి ఉంటుంది.

సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. సూర్యునికోసం ఉపవాసముండేవారు సూర్యాస్తమయం లోపల రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఏమీ తీసుకోరు. తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు. సూర్యుడికి ప్రార్థనలుచేసి సూర్యునికి సబంధించిన కథను చదవడంగానీ, వినడంగానీ చేస్తారు. అలా చదివిన తరువాతే ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి.గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి ఆభరణాల్లో కెంపు దానమివ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం.

సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేస్తారు. ఆనందకరమైన వివాహజీవితం కావాలనుకునేవారు సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజలు చేసి ఉపవాసం ఉంటారు. సోమవారం మూడురకాల ఉపవాసాలుంటారు. ఈరోజు ఉండే ఉపవాసాన్ని సౌమ్యప్రదోష మంటారు. ఏదైనా పొరపాటు జరిగితే, ఆ తప్పును ఒప్పుకుంటూ 16 సోమవారాలు ఉపవాసదీక్ష వహిస్తారు. ఉపవాసం చేసేవిధానం ఒకటే కానీ ఆరోజు చదువుకోవాల్సిన కథలు మాత్రం వేరుగా ఉంటాయి. భోజనం రోజుకి ఒకసారే చేస్తారు. తృణధాన్యాలు తీసుకోవచ్చు. శివపార్వతులకు ప్రార్థనలు చేసిన తర్వాత తగిన కథ చదువుకోవాలి. చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి. బియ్యం తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి.

మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. దుస్తులు, పూలు ఎర్రటివి ధరించడం శ్రేయస్కరం. గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమకు పూజ చేసిన పిదప కథ చదువు కోవాలి.

బుధవారానికి అధిపతి బుధుడు. బుధవారం ఉపవాసం ఉండదల్చుకున్నవారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి. విష్ణుమూర్తికి పూజచేసుకుని కథ చదువుకోవాలి. బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు బంగారంతో పొదిగిన పచ్చని (ఎమరాల్డ్) ధరించాలి. పెసలు, కస్తూరి, నీలపు దుస్తులు, బంగారం, రాగి వంటి వాటిని దానమివ్వాలి.

గురువారానికి అధిపతి బృహస్పతి. జ్ఞానసముపార్జనకు, సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం. పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి. రోజుకి ఒకసారే భోజనం చేయాలి. బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని ధరించాలి. పసుపు, ఉప్పు, పసుపచ్చని దుస్తులు, బియ్యం వంటివాటిని దానమివ్వాలి.

శుక్రవారానికి అధిపతి శుక్రుడు. రోజుకి ఒకపూటే భోజనం చేయాలి. భోజనంలో పాయసం ఉండాలి. శుక్రుడి అనుగ్రహం పొందాలనుకునేవారు వజ్రాన్ని ధరించాలి. బియ్యం, తెల్లటి దుస్తులు, ఆవు, నెయ్యి, వజ్రాలు, బంగారం దానమివ్వలి. శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకోవాలి. అమ్మవారికి హారతివ్వాలి. కటిక ఉపవాసముండాలి. పుల్లటి పదార్థాలు తినకపోవడమేకాదు, ఎవరికీ శుక్రవారం దానమివ్వకూడదు. ఇలా 16 శుక్రవారాలు ఉపవాసముండాలి. చివరి శుక్రవారం మగపిల్లలకు భోజనం పెట్టాలి.

శనివారానికి అధిపతి శని. శనికి నల్లటి వస్తువులు, నల్లని దుస్తులు, నల్లని నువ్వులు, ఇనుము, నూనె లాంటి పదార్థలు ఇష్టం. శనిదేవతకు పూజచేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. శని ప్రీతికోసం నీలం రాయిని ధరించాలి. నూనేతో నిండిన ఇనుపపాత్ర, నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి దుస్తులు, నల్లనువ్వులు మొదలైన వాటిని దానమివ్వాలి. ఇలా మన ఉపవాసంలో ఆరోగ్యరహస్యాలతో పాటు కుటుంబ క్షేమమూ దాగుంది.

హనుమంతుడు :-

హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు. హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే.. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.

సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు ... ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు.

దేవతారాధన :-

దేవతారాధన పూజలకు నిర్దుష్టమైన సమయం ఉంటుంది. ఈ పూజలను వేళాపాళా లేకుండా చేయరాదు. అందుకే మన పెద్దలు ఒక రోజులో ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలు ఉంటాయని చెప్పారు. ఈ కాలాల్లోనే ప్రశాంతమైన చిత్తంతో శుచిగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు. ఇది లోనికి మళ్లితే మానసిక పూజగా మారుతుంది. దానికి సమయాలుండవు.

చివరకు "యద్యత్ కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్" అన్నట్లు ఏ పని చేసినా పూజయన్న భావం స్థిరపడాలి. అట్లే జపం కూడా. ప్రారంభంలో ఈ జపం మూల కూర్చుని, మాలపట్టుకుని జపం చేస్తూచేస్తూ చివరకు మాలలు వదిలి మనలో నిరంతరమూ జపం కొనసాగే స్థితికి చేరుకోవాలి. దానినే "అజపాజపస్థితి" అని పిలుస్తారు.

అలాగే భగవంతునికి మనము అర్పించవలసినవి పదార్థాలు కావు. మనలోని అహంకారాలు, కామనలు వంటివే. అలాగే హారతులంటే కేవలం కర్పూరం వెలిగించడమే కాదు. మనలోని అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి, పరమాత్మకు సమర్పించడం. పుష్పం సమర్పయామి అని పువ్వులకు మనలోని దుర్వాసనలను పట్టించి స్వామి పాదాల మీద సమర్పిస్తే ఆ పాదాలు ఆ దుర్వాసనలను శుద్ధం చేసి మళ్లీ మనకిస్తే వాటిని శిరస్సున ధరిస్తామని పురోహితులు చెబుతున్నారు.

దేవుడికి దీపం ఎలా వెలిగించాలి ?

దేవుడి విగ్రహానికి లేదా పటానికి ధూపధీప నైవేద్యాలు సమర్పించటం మన ఆరాధనా పద్ధతి. ఉదయము వెలిగించు దీపము కన్నా ప్రదోష కాలమందు వెలిగించు దీపం అత్యంత మంగళకరమైనదిగా పెద్దల మాట. పూజలో అత్యంత ముఖ్యమైన దీపం ఆ తర్వాత ధూపం, పుష్పాలు, పసుపు కుంకుమలు, గంధచందన విభూతులు, కొబ్బరికాయ, అరటిపండ్లు వక్క, తమలపాకులు, మంగళ హారతి మొదలగునవి క్రమానుగతిలో ప్రాధాన్యము కలిగినటువంటివి. కావున పూజ చేయువారిపై వీటి అనుకూల శక్తి, ప్రభావము వెంటనే పడుతుంది. అష్టోత్తరములు మరియు శ్లోకములు మనలో దాగి ఉన్న దైవీశక్తులను మేల్కొలిపి మనకు మానసిక, శారీరక శుభాలను కలిగిస్తాయి. ఇలా మనం దేవుడిని ప్రసన్నము చేసుకొని అతని దీవెనలను పొందునట్లు చేయునదే కాక పూజకై మనము చేయు క్రియలన్నియూ మనకు శుభమును చేకూర్చును.

దీపమును నేలపై ఏమీ వేయకుండా సరాసరి నేలపై పెట్టి వెలిగించరాదు. అరటి ఆకును గానీ, తమలపాకును గానీ, పళ్లెమును కానీ, నీటితో శుభ్రం చేసి, ముగ్గువేసిన నేలపై ఉంచి దీపం కుంది పెట్టాలి. ఇక ఇంటియందు దేవతారాధనకై మనమొక ప్రత్యేక స్థానమును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ స్థానం నేలకు కాస్త పై భాగంలో ఉండునట్లు చూసుకొనవలెను. నేలను తాకునట్లు పూజా ద్రవ్యములు మరియు పవిత్ర గ్రంధములు ఉంచరాదు.

దీపములోని చమురుకై ఆవునెయ్యిని కాని నల్ల నువ్వుల నూనెను వాడుట శ్రేష్టము. ఎట్టి పరిస్థితిలోనూ గేదె నెయ్యితో దీపారాధన చెయ్యరాదు. ఉదయము పూజ చేయునపుడు దీపము యొక్క ముఖము తూర్పు దిక్కుగా ఉంచవలెను. సాయంత్రం పూజలో ఒక వత్తి తూర్పుదిక్కుగా మరొకటి పడమర దిక్కుగా ఉంచి దీపము వెలిగించవలెను. మూడు వత్తులను వాడినచో తూర్పు, పడమర మరియు ఉత్తరము దిక్కుగా వెలిగించాలి. ఇక ఐదు వత్తులను వెలిగించదలచిన తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మరియు ఈశాన్య దిక్కుగా వత్తుల నుంచి వెలిగించాలి.

ఇలా వెలిగించిన దీపాన్ని ఆర్పేయాల్సి వస్తే నోటితో ఊదరాదు. వత్తిని చమురులోకి జార్చినచో అది ఆరిపొతుంది. లేదా వెలుగుతున్న వత్తిపై కొద్దిగా నూనె పోస్తే ఆరిపోతుంది.

దీపారాధన సమయంలో చదవవలసిన శ్లోకం.

దీపం జ్యోతి పరంబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే!


అరటి ఆకులో భోజనం :-

అయిన వాళ్లకి ఆకుల్లోను కన్న వాళ్లకి కంచాల్లోను అనే సామెత మీరు వినే ఉంటారు. ఇదే వాడుక భాషలో అయిన వాళ్లకి ఆకుల్లోను కాని వాళ్లకి కంచాల్లోను అని రూపాంతరం చెందింది. ఇది విన్నప్పుడల్లా రకరకాల సందేహాలు నన్ను వెంటాడేవి. ఇక్కడ నాకు వచ్చిన చిక్కల్లా అయిన వాళ్లకి ఆకుల్లో పెట్టడం, కన్న వాళ్లకి కంచాల్లో పెట్టడం ఏమిటా? అని. అయిన వాళ్లకి చక్కగా కంచంలో పెట్టాలి కన్న వాళ్ళలాగా కాని చవకగా దొరికే ఆకులో పెట్టడం ఏమిటా అని ఎన్నో సార్లు అనిపించింది నాకు. అసలు ఈ పెద్దవాళ్ళు ఏది పెట్టినా మన మంచి కోసమే కదా అని ఎంతో లోతుగా ఆలోచించి చూస్తే, అరటి ఆకులో భోజనం పెట్టడం వెనుక ఉన్న కారణాలను గమనిస్తే అప్పుడర్ధమయ్యింది అసలు విషయం.

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి. 

శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.

వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.

ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.
ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.

వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.


అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను.

ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో అని వాడడం జరిగినదని నా అభిప్రాయం. ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్ని హరిస్తుంది. అటువంటి పనిని చేసేది కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము. బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో!

అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు.

సుబ్రహ్మణ్య షష్ఠి :-

సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. కుమార స్వామి అనుగ్రహం కారణంగా గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 

అలాంటి సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి 'సుబ్రహ్మణ్య షష్ఠి' గా చెప్పబడుతోంది. ఆ రోజున సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన, ఆయన అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. 

ఆ రోజు ఉదయాన్నే లేచి శుచిగా తలస్నానం చేసి, ఉపవాస దీక్షను చేపట్టి, నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పూజా మందిరంలో గల సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. 

పాయసం, కందిపప్పుతో కూడిన వివిధ రకాల పదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. దానిమ్మ, అరటిపండ్లను కూడా స్వామివారికి నివేదన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

అరిషడ్వర్గాలు :-

దుఃఖాలకు మూలమైన అరిషడ్వర్గాలు :-

1.కామము - ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.

2. క్రోధము - కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.

3. లోభము - కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.

4. మోహము - తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.

5. మదము - తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.

6. మాత్సర్యము - తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.

ఈ అరిషడ్వర్గాలు శరీరములో చేరి మంచితనాన్ని దొంగిలించి చెడు కర్మలను కలిగించడానికి కారకులగుచున్నారు. అరిషడ్వర్గాలనే దొంగలనుండి జాగ్రత్త వహించితే ముక్తికి మార్గము సులభమవుతుంది.

దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు ?

గుడిలో దేవునికి అనేకమార్లు గంట కొడుతూఉంటారు.

హారతిని ఇచ్చేటప్పుడు కొట్టే గంటకు అర్ధం దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని, ఏ దేవునికి హారతిని ఇస్తున్నామో, ఆ దేవుడు మహా దైవాంశతో విగ్రహంలో చేరాలని, ఆ మహోత్తరమైన అంశ విగ్రహంలో చేరేటప్పుడు భక్తులు కనులారా ఆ రూపాన్ని వీక్షించేలా హారతి వెలుగులో దేవుని చూపడమే పరమార్ధం.


కాబట్టి హారతి వేళ ఆ దైవాన్ని మనం ప్రత్యక్షంగా చూసినట్టే.

10 December 2014

రావిచెట్టు విష్ణు స్వరూపం - వేపచెట్టు లక్ష్మీ స్వరూపం :-

రావిచెట్టును పురుషుడుగాను, వేపచెట్టును స్త్రీగాను భావించి పూజించే ఆచారం అనాదిగా వస్తోంది. సాధారణంగా ఈ రెండు వృక్షాలు కలిసి గానీ ... విడివిడిగా గానీ దేవాలయ ప్రాంగణంలో కనిపిస్తుంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగాను ... వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఈ విధంగా చేయడం వలన దాంపత్య పరమైన దోషాలు నివారించబడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 'పద్మపురాణం'... 'స్కంద పురాణం' కూడా రావిచెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమని చెబుతున్నాయి. ఇక రావిచెట్టు కింద సేద దీరడం వలన శని కారణంగా సంక్రమించిన దోషాలు తొలగిపోతాయి. 

అంతేకాకుండా మనసుకి ప్రశాంతత కలిగి రక్తపోటుకి సంబంధించిన వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది. గౌతమబుద్ధుడు జ్ఞానాన్ని పొందినది ... శ్రీ కృష్ణుడు తన అవతారాన్ని చాలించినది ఈ చెట్టుకిందనేనని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. 

ఇక రావిచెట్టుతో కలిసి పూజలందుకునే వేపచెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగివుంటుంది. వేప ఆకులను నీళ్లలో వేసి కాచి ... ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మసంబంధమైన వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. 

ఇక వేపచెట్టు పైనుంచి వచ్చేగాలి కూడా క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఇలా ఈ రెండు వృక్షాలు ఇటు ఆధ్యాత్మిక పరంగాను... అటు ఆరోగ్యపరంగాను మానవ మనుగడకు ఎంతో మేలుచేస్తున్నాయి కనుకనే దేవాలయ వృక్షాలుగా పూజలు అందుకుంటున్నాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

శ్వేతార్క గణపతి :-

దేవతల ప్రార్థనలు దశదిశలా ప్రతి ధ్వనిస్తుండగా క్షీరసాగరపు అలపై నున్న విషం `తెల్లటి నురుగు' సెగలు విరజిమ్ముతూ సముద్రజలాలపై తేలుతూ తీరానికి చేరి, వాయు ప్రభంజనంచే విరగబడి ఒడ్డును భూభాగంపైన `విత్తనం' లా పడింది. దేవతలూ,మహర్షులూ ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని తిలకించసాగారు. అప్పుడు విత్తనం రూపంలో నున్న ఆ `విషం' భూగర్భంలోకి ప్రవేశించి, ఫలించి రెప్పపాటులో `మొక్క కాండం' భోగర్భంలోంచి మొలకెత్తింది. ఆ కాండం `శ్వేతవర్ణం' లో అంటే తెల్లగా `పాల నురుగు రంగు'లో వుంది. (పాము కాటికి లేదా విషప్రయోగానికి గురైన మానవులు లేదా యితర జీవుల నోళ్లలోంచి తెల్లరంగు నురుగలు వస్తాయి) అందరూ విభ్రాంతితో చూస్తుండగా ఆ మొక్క నుంచి `శ్వేత ఆర్కములు' అనగా `తెల్లటి ఆకులు' మొలిచాయి. ఆ గరళము `విత్తనము'గా మారి దాని నుంచి `శ్వేతార్కము' ఉద్భవించింది. 

ఆ విచిత్ర దృశ్యాన్ని మహేంద్రాది దేవతలూ, మహర్షులూ విన్మయంతో వీక్షించసాగారు.
అంతట ఆ `శ్వేతార్క' మొక్క కాండము దిగువ భాగాన `వేరు' మీద `అదృశ్యరూపం లో నున్న శిల్పాచార్యుడు' చెక్కుతున్నట్లు దేవతా రూపము ఆవిర్భవిస్తూ క్రమక్రమంగా ఆ రూపము చతుర్భుజుడూ, మొదకహస్తుడైన విఘ్నేశ్వరుడుగా అవతరించింది. అది మామూలు విఘ్నేశ్వరుడు కాదు. శ్వేతార్క విఘ్నేశ్వరుడు. శ్వేతార్కము వేరు మీద అదే తెల్లటి వర్ణముతో స్వయంభువై అవతరించాడు శ్వేతార్కగణపతి.


విషము, హాలాహలము, గరళము పేరేదైనా ఏ రూపంలో నున్నా అది మృత్యువుకు చిహ్న ము. దాని వర్ణము శ్యామవర్ణము అనగా చీకటిని బలు నలుపు. జీవము, ప్రాణము, భవిష్యత్తు పేరేదైనా అది జీవితమునకు గల ప్రకాశమునకు చిహ్నము. ప్రకాశము యెక్క వర్ణము స్వర్ణకాంతులతో సమ్మిళితమైన శ్వేతము. అనగా తెలుపు. పవిత్రతకి చిహ్నము తెలుపు. అందుకే పరబ్రహ్మ స్వరూపుడైన విఘ్నేశ్వరుడు, హాలాహల మందలి శేషభాగాన్ని విత్తనముగా మార్చి, దాని నుంచి పవిత్రమైన శ్వేతా ర్కమును భ్రవింపజేసి, దానిపై తాను స్వయ ముగా, స్వయంభువై శ్వేతార్కగణపతిగా అవతరిం చాడు. కాలకూట విషాన్ని కూడా తన అవ తారంతో పూజనీయం గావించాడు. పరమేశ్వరు గరళాన్ని కంఠమందు ధరించి గరళ కంఠుడు అన్న పేరిట పూజలందుకుం టున్నాడు. పరమేశ్వర ప్రసాదితమైన గరళ భాగాన్ని తమ కోరల యందు ధరించిన సర్ప జాతి - నాగరాజు, నాగేంద్రుడు, నాగదేవత, సుబ్ర హ్మణ్యము, నాగమ్మ వంటి పేర్లతో పూజలందుకుంటోంది.


నాగజాతితో పాటు కాసింత విషాన్ని స్వీకరించి తన కొండెములో నిలుపుకున్న `వృశ్చి కము' అంటే `తేలు' జ్యోతిష శాస్త్ర ప్రధానమై న ద్వాదశ రాశులలో ఒకటిగా `వృశ్చిక రాశి' గా స్థానము పొంది తన రాశియందు జన్మిం చిన మానవులకు వృద్ధి, లాభ, క్షేమ యోగా లను ప్రసాదిస్తోంది.

ఇక విషోత్పత్తికి కారకములైన సర్పములను శివు డు ఆభరణములుగా ధరించగా - విష్ణువు పాన్పు గా స్వీకరించగా - శక్తి స్వరూపిణి యైన అమ్మవా రు తన శిరోజములుగా ధరించి - సృష్టిలో విషము - అమృతము, సుఖము - దుఃఖము, మంచి చెడు సమాన ముగా స్వీకరించాలనే సందే శాన్ని జగత్తుకి అందించారు (అమ్మవారు శిరోజ ములుగా మొట్టమొదటి ధరించినది సర్పములనే. ఆ సర్పములు తమ కోరికతో అమ్మవారి కేశరహి తమైన శిరోభాగాన్ని కరచి పట్టుకుని వుండే వట. అయితే అమ్మవారి దర్శనార్థం వచ్చే దేవ మానవ దానవులు ఆ సర్పములను చూసి భీతి చెందుతుండేవారట. అది గ్రహించిన అమ్మవారు ఆ సర్పములను తన మహిమతో శిరోజములుగా మార్చి వేశారు).

ఇలా దేవతలందరూ అనేక విధాలుగా విషాన్ని తమ తమ ఆదీనముల యందు వుంచుకొని లోకాలను కాపాడుతుండగా - నేడు లోకోద్ధరణ కోసం విషాన్ని విత్తనంగా మార్చి మొక్కను సృష్టించి దానిపై తాను స్వ యంభువుడై అవతరించాడు శ్వేతార్కగణపతి.


శ్వేతార్కమును మాములు పరిభాషలో జిల్లేడు అంటారు. జిల్లేడు ఆకును తృంచినా, కొమ్మను తృంచినా తెల్లటి పాలు ఉద్భవిస్తాయి. ఆ తెల్లటి పాలు క్షీరసాగరమునకు ప్రతిచిహ్నము.


జిల్లేడు పాలు విషపూరితం. ఆ పాలు కంటికి తగిలితే చూపుపోతుంది. నాలికకు ఆ పాలు తగిలితే ప్రాణమే పోతుంది. మనుషులే కాక పశువులు కూడా ఆ జిల్లేడు ఆకులను తినవు. వాటిని తింటే ప్రాణం పోతుందని మనుషు లకే కాక పశువులకు కూడా తెలుసు.

ఆ జిల్లేడు ఆకులతో, జిల్లేడు పూలతో వినాయక చవితినాడు వినాయకుడిని పూజిస్తాం. రథ సప్తమినాడు జిల్లేడు ఆకులను శిరస్సు, భుజాలు, వక్షస్థలం, చెవులు, చేతులు, పాదా లపైన వుంచుకొని స్నానాలు చేస్తాం. ఎందు కు? ఎందుకో చాలా మందికి తెలియదు.

జిల్లేడు అంటే హాలాహలమును తనలో యిముడ్చుకు న్న పరబ్రహ్మ ప్రతిరూప ము. అట్టి జిల్లేడు ఆకును దేహముపై వుంచు కొని స్నానం చేస్తే మానవుడి శరీరంలో వున్న విషతుల్య ప దార్థాల్లో విష ప్రభావాన్ని జిల్లేడు ఆకర్షించి స్వీకరిస్తుంది. అందుచేత మానవుడు తనకు తెలిసీతెలియకుండా తన దేహంలో చేరు కున్న విషపదార్థాల ప్రభావం నుంచి రక్షించబడ తాడు. అంతే కాదు విషపూ రితమైన దుష్ర్పభా వాలు కూడా తొలగిపోయి ఉద్ధరించబడతాడు. రథసప్తమినాడు యీ స్నానం చేయడం వలన - విషప్రభావం నుంచి రక్షించబడ్డ మానవ శరీరం ఆనాటి పవిత్ర సూర్యకిరణాల ప్రభావం చేత మరల పరిపుష్టమూ, తేజోవంతమూ అవుతుం ది. అలాగే వినాయక చవితి నాడు - వినాయకు డికి, యిష్టమనే పేరిట ఆ గణేశ్వరుడి ప్రతి రూ పమైన జిల్లేడుతో పూజిస్తారు. ఆ పూజా సమ యంలో జిల్లేడులోని విషాకర్షక శక్తి మనిషి దేహంలోని విషాన్ని అకర్షించి, ఆ దేహాన్ని ఆరో గ్యవంతం చేస్తుంది. కేవలం స్పర్శ లేదా ఆ గాలి పీల్చడం వల్ల కూడా మానవుడు ఉద్ధరించబడ తాడనడానికి యిది నిదర్శనం. అలాగే జిల్లేడు మొక్క ఆకులు వాతావరణం లో విషాన్ని ఆకర్షించి లోకానికెంతో మేలు చేస్తున్నాయి. జిల్లేడు మొక్క పాలల్లోంచి ఉద్భవించే విషం - ఆ ఆకుల్లోంచి వచ్చే విషం - లోకంలోని జీవరాశులన్నింటిలోంచి ఆకర్షించబడిన విషమే. ఆ విధంగా జిల్లేడును లోకసంరక్షణార్థం సృష్టించిన భగవంతుడు దాని పవిత్రతను లోకానికి చాటడానికే తాను స్వయంగా జిల్లేడు వేరు మీద శ్వేతార్కగణపతిగా అవతరించాడు. ఆ విధంగా స్వయంభువై అవతరించిన శ్వేతార్కగణపతిని దర్శించు కుంటూ దేవతలూ, మానవులూ జయ జయ ధ్వానాలు చేశారు.

శ్వేతార్కగణపతి ప్రసన్న దరహాస వదనంతో, వరద హస్తంతో ఆశీర్వదిస్తూ ``వత్సలారా... పుట్టుకను నేనే... మృత్యువును నేనే... వృద్ధి నేనే... క్షయమును నేనే... హాలహలము నేనే... అమృతము నేనే... అందుకే జగత్తు లోని సర్వజీవులకూ ఇదే నా అభయం...

ఏ జీవియైనా నా ప్రతి రూపమైన శ్వేతార్కగణప తిని పూజించినంతనే ఆ జీవి కాలకూటాది ఘోరవిష ప్రయోగాల బారి నుండి విముక్తమై అకాల మృత్యువు నుండి తప్పించుకోగలదు. దేవ దానవ మానవులలో ఎవరు శ్వేతార్కగణ పతి ప్రతిమను తమ గృహము నందుంచి పవి త్రముగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు సకలార్థిని పొంది, సర్వత్రా విజయవంతులవు తారు'' అని ఆశీర్వదించాడు శ్వేతార్కగణపతి.


// విఘ్నవినాయకా... జగదోద్ధారకా...
శ్వేతార్క గణనాధా... జయహో... జయ జయహో //


అంటూ జయ జయ ధ్వనులతో శ్వేతార్క గణపతిని కీర్తించారు దేవతలూ, మహర్షులు, మానవులు.


శంఖం :-

శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి !!


శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. దీని పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ అయివున్నది. శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజలు వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధికల్గేది. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నింటిని గృహ కృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు. 

శంఖాలలో చాలా రకాలు వున్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలువు. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానససరోవర్‌, లక్షద్వీప్‌, కోరమండల్‌, శ్రీలంక, భారతదేశంలోను లభిస్తున్నాయి. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు ముఖ్యంగా 3 రకాలు 1. దక్షిణావృత శంఖం, 2. మధ్యావృత శంఖం, 3. ఉత్తరావృతవ శంఖం. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు. ఈ శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నవి. 1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం.

భారత యుద్ధ సమయంలో అనేక రకాల శంఖాలు పూరించారు. ఉదా:- శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌంఢ్ర శంఖాన్ని యుధిష్ఠరుడు అనంత విజయ శంఖాన్ని, నకులుడు సుఘోష శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని, కాశీరాజు శిఖండి శంఖాన్ని దుష్ఠ ద్యుమ్నుడు, విరాటుడు స్వాతిక శంఖాన్ని అలాగే ఇతర రాజులు అనేక రకాల శంఖాలు పూరించారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన ఖర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి. విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నాసహోదరి అని చెప్పిన సందర్భాలు కలవు. దేవి యొక్క పాదాలు వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్తాపించాలి. గణసు శంకాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖ మాలలను ధరించి కూడా అనేక సిద్ధులను పొందుచున్నారు. శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖ బస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవి. ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. ఈ శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. శంఖము పాపనాశిని ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము. కొన్ని శంఖాల వివరణ: దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. పాంచజన్యం పురుష శంఖం ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది పొట్ట చిన్నది. రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువుగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు, విశాఖపట్నం కలకత్తా, బొంబాయి మరియు పూరీలో ఎక్కువుగా దొరుకుచున్నవి. 

సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్‌.

శంఖం శుభ సూచకం, శుభ శకునం. ఉదయం లేవగానే శంఖాన్ని చూడాలి అని కూడా శకున శాస్త్రం చెప్తోంది. మనం సాధారణంగా చూసే శంఖాలన్నీ కూడా ఉత్తరం వైపువి లభిస్తూ వుంటాయి. దక్షిణావృతం దొరికితే మరింత విశేషం. వేదికపై స్వామిని ముందుగా పరిశుభ్ర జలంతో కడిగి మెత్తని పొడిబట్టతో మృదువుగా అద్దాలి. దేవతా స్వరూపాలన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు కుడివైపున దక్షిణావృత శంఖాన్ని తూర్పు అగ్రం వుండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. శంఖంలో నీరుని కలశంతో కానీ/గ్లాసుతోకానీ/ఉద్ధరిణెతో గానీ/ నింపాలి. శంఖాన్ని తీసుకొని చెంబులో ముంచి పెట్టకూడదు. శంఖంలో మొదలు భాగము అస్పృశ్యము, తాకరాదు. తరువాత దానితో అర్చన చేయాలి. శంఖంలో నీరు పోసే సమయంలో "శంఖపీఠే బ్రహ్మణే నమః" - శంఖ పీఠంలో బ్రహ్మదేవుడు వున్నాడు. ’శంఖాగ్రే సోమాయ నమః"; "మధ్యే గంగా సరస్వతేభ్యో నమః" ఇలా శంఖ పూజ చేయాలి. "ప్రణవేన శంఖం ద్వాదశవారం పూరయ్తిత్వా". మంత్రాలన్నీ రాకపోయినా శంఖంలో నీరు పోసే సమయంలో ప్రణవేన - ఓంకారంతో పన్నెండు మార్లు నింపాలి. అప్పుడు ఆ శంఖంలో ఉండే నీరు పవిత్రమవుతుంది. తీర్థమవుతుంది. దానిచేత ఆ పరమాత్మను అభిషేకం చేసి తిరిగి యథాస్థానంలో వుంచి తిరిగి నీళ్ళునింపాలి. శంఖాన్ని ఎప్పుడూ ఖాళీగా పెట్టకూడదు. మొదటగా పీఠాన్ని, తరువాత శంఖాన్ని, ఆ పిమ్మట పరమాత్మను అర్చించాలి. పరమాత్మను వుంచే పాత్ర బయట పళ్ళానికి ఎడమ వైపున శంఖాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

దక్షిణావృత శంఖం సముద్రంలో దొరికే శంఖం జాతికి చెందినది.శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరుడుగా పూజిస్తారు.దక్షిణావృతశంఖాన్ని తూర్పు ముఖంగా ఉండి అభిషేకం చేసినప్పుడు కుడి ప్రక్కన అనగా దక్షిణం వైపు కడుపు (ఆవృతం) ఉంటంది కాబట్టి ఈ శంఖానికి దక్షిణావృతశంఖం అంటారు.దక్షిణావృత శంఖాలలో తెలుపు రంగులో ఉన్నవి శ్రేష్టం.ఎరుపు రంగు గీతలతో ఉన్న శంఖాలను కూడ పూజిస్తారు.
దక్షిణావృత శంఖాన్ని దీపావళి,అక్షయ తృతియ మరియు శుక్రవారం రోజు పూజిస్తే ఉత్తమ ఫలితాలు సాదించవచ్చు.దక్షిణావృత శంఖాన్ని పూజామందిరంలో ఎర్రని వస్త్రంపైనగాని,బియ్యం పైనగాని,కుంకుమ పైన గాని,కూర్మ స్టాండ్ పైనగాని ఉంచి లలిత సహస్త్రనామంగాని,లక్ష్మీ అష్టోత్తరం గాని చదువుతు పూజచేయాలి.ఇంకా శంఖంతో విగ్రహాలను అభిషేకించవచ్చును.


ఉపయోగాలు :-
1)దక్షిణావృతశంఖం ప్రత్యేకంగా జాతకచక్రంలో గల శుక్రగ్రహాదోషాలు పోగొడుతుంది.
2)దక్షిణావృతశంఖంలో నీటిని ఉంచి త్రాగటం వలన దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి.
3)దక్షిణావృతశంఖంతో పూజచేసెవారికి సరియైన సమయంలో వివాహం జరుగుతుంది.అంతేకాక వివాహ అనంతరం దాంపత్య జీవితంలో ఎటువంటి కలతలు ఉండవు.
4)దక్షిణావృతశంఖం ఇంటిలో ఉన్నవారికి ధనాభివృద్ది ఉంటుంది.
5)దక్షిణావృతశంఖం వ్యాపారస్ధలంలో ఉంచిన వ్యాపారాభివృద్ధితో పాటు ధనాభివృద్ధి కలుగుతుంది.
6)శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది.


రుద్రాక్ష ధారణ :-

స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయవచ్చా ? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. స్త్రీలు రుద్రాక్షలు ధరించకూడదని ఎక్కడా చెప్పలేదు. స్త్రీలకు ఋతుస్రావం ఆగేవరకూ ధరించడం మంచిది కాదు అంటారు కాని శివునికి ఏ విధమైన అంటు ముట్టు ఉండదు అసలు శివుడే శ్మశానవాసి సృష్టిలలో స్మశానం కంటే మరొక ప్రదేశం ఉండదు. ప్రపంచంలోనే హైందవ దేవాలయాలు ఏదేశంలోనైనా గర్భాలయంలో ప్రవేశం ఉన్నా ? లేకపోయినా శివాలయంలోనికి వెళ్ళవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగా నైనా నేరుగా చేతితో తాకవచ్చు.(ఎవ్వరైనా, ఏపరిస్థితిలో ఉన్నా) ఉదాహరణకి శ్రీశైలంలో శివలింగాన్ని ఎవరైనా స్వయంగా తాకవచ్చు అలాగే కాశిలో శివలింగాన్ని సైతం ఎవరైనా స్వయంగా తాకవచ్చు. ఇది అందరికి తెలిసిన సత్యమే శివునికే అంటులేనప్పుడు ఆయన స్వరూపములైన రుద్రాక్షలకు దోషమేముంటుంది. అయితే వీటన్నింటికి మించి మన మనస్సుకు మించినది ఏదీ లేదు. రుద్రాక్షలు ధరించి ఉన్నప్పుడు చెడు పనులకు మనస్సు అంగీకరించదు.

ఉదాహణకు మాంసాహారాన్ని తినేటప్పుడు వాటిని తీసి పక్కనపెట్టి తరువాత ధరిస్తే మంచిది ఎందుకంటే ఇందాక మనం చెప్పుకొన్నట్లు మన మనస్సు ఈ విషయంలో అంగీకరించదు కారణం రుద్రాక్షలంటే పవిత్రమైనవి, శివునకు ఇష్టమైనవి, శక్తి వంతమైనవి అని మన మనస్సుకు తెలుసుకాబట్టి ఆవిధంగా తిరిగి మళ్ళీ ధరించడం మంచిది అప్పుడు ఏవిధమైన దోషములు ఉండవు స్త్రీలు కూడ ఆ మూడు రోజులు పక్కన పెట్టి తదుపరి ధరించడం మంచిది ధరించేముందు కొంచం నీళ్ళు చల్లి సుద్ధిపరిస్తే ఇంకా మంచిది. సన్యసించిన వారు యోగినులు రుద్రాక్షలు ధరించడం మనం చూస్తూ ఉంటాము మన పురాణగ్రంధాలలో పిల్లలకు ఆరు సంవత్సరములు వచ్చే వరకూ అయినా రుద్రాక్షలు ధరింపజేయడం వలన వారి భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ధన, కనక, వాస్తువాహనములతో మంచి కీర్తి కలిగి ఉంటారని చెప్పారు.

చదువుకొనే ఆడపిల్లలు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వారి విద్యలో బాగా రాణిస్తారు. రుద్రాక్షలు దైవ స్వరూపాలు, క్షుద్రాలు గాదు దైవానికి సంబంధించిన విషయంలో దోషాలు ఉండవు. దేవుని గుడిలోకి వెళ్ళేటప్పుడు పాదరక్షలు బయట విడిచి వెళతాము అలాగే ఏదైనా వెళ్ళకూడని పనికి రుద్రాక్షలు ధరించి (చనిపోయిన చోటికి) వెళ్ళిన లేక ఋతుస్రావం సమయంలో రుద్రాక్ష ధరించి ఉన్నా ఆ తరువాత నీళ్ళతో కడిగి తర్వాత పాలతో శుద్ధిచేసి, మళ్ళీ నీళ్ళతో కడిగి ధారణ చేయాలి మనం తెలియక చేసిన దానికి దోషం లేదు అంటే ఒక ఆసుపత్రికి వెళ్ళామంటే అక్కడ చనిపోయిన వారు ఉండవచ్చు బయటకి వెళితే ఎదురురావచ్చు ఇవి దోషాలు కాదు. మనం తెలిసి వెళ్ళినప్పుడు రుద్రాక్షలు ఇంట విడిచి వెళ్ళాలి యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేసినట్లు.

ఆంజనేయ స్వామి :-

ఆంజనేయ స్వామిని కొలిచే వారికి సకల దోషాలు పరిష్కారమవుతాయని పండితులు అంటున్నారు. శనిగ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. ప్రతి శనివారం తొమ్మిది సార్లు ఆంజనేయ స్వామిని ప్రదక్షణలు చేస్తేనే ఫలితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అలాంటి ఆంజనేయస్వామికి తమలపాకుల మాల, వెన్నంటే ప్రీతికరం. ఇంకా అభిషేకం అంటే ఈ వాయు కుమారునికి ఇష్టమెక్కువ. అందుచేత మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయం కావాలంటే.. ఆంజనేయ స్వామిని రామమంత్రముతో పూజిస్తే సరిపోతుంది.

అభిషేకాలతో ఆ బహుబలిని పూజించాలనుకుంటున్నారా.. అయితే ఆంజనేయునికి ఏయే అభిషేకాలు చేస్తే ఏ ఫలితముంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారా... ఇంకా చదవండి.

తేనె - తేజస్సువృధ్ధి చెందుతుంది
ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలు చేకూరుతాయి.
ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి చేకూరుతుంది.
ఆవునెయ్యి -ఐశ్వర్యం
విబూధితో - సర్వపాపాలు నశిస్తాయి
పుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుంది
బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి
పంచదార - దు:ఖాలు నశిస్తాయి
చెరకురసం - ధనం వృధ్ధి చెందుతుంది
కొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి.

గరికనీటితో - పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహనాదులను తిరిగి పొందగలుగుతారు.
అన్నంతో అభిషేకంతో - సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది.
నవరత్నజలాభిషేకం - ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది
మామిడిపండ్లరసంతో - చర్మ వ్యాధులు నశిస్తాయి.
పసుపునీటితో - సకలశుభాలు, సౌభాగ్యదాయకం
నువ్వులనూనెతో అభిషేకిస్తే - అపమృత్యు నివారణ.
సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం
ద్రాక్షారసంతో - జయం కలుగుతుంది
కస్తూరిజలాభిషేకంచేస్తే - చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు.


09 December 2014

భగవద్గీత :-

దేవుణ్ణి పొందేందుకు అంటే పరమాత్మలో ఐక్యమయ్యేందుకు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కొన్ని మార్గాలను తెలిపాడు అవి :

1. కర్మ యోగం :-
మొదటగా ఈ కర్మలు మనం ఎందుకు చేయాలి. ఇవి అన్నియు మనకు ఏమి సంబంధం? అంటే మనం ఎన్నో జన్మలనుండి అజ్ఞానంతో నేను అనే భావనతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు. వీటిని అన్నిటిని జ్ఞానంతో చేస్తే మనము వీటి నుండి సంపూర్ణంగా విముక్తి పొందుతాము. అదేలాగు అంటే కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మ అని అంటాము. అది ఏదైనా కావచ్చు. చేసే ప్రతి పనిని మనం ఈ శరీర భావనతో అజ్ఞానంలో వున్నప్పుడు చేస్తూ నేను చెస్తున్నాను అనుకుంటూ వుంటాము. ఆ విధంగా చేయడం వలన మనం మరల కర్మ బంధనాలను ప్రోగు చేసుకుంటున్నాము.కావున ఇక్కడ మనం గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే నీవు అన్నది ఎవరు? అని ఆలోచిస్తే నీవు అన్నది ఆత్మ మాత్రమే, నీవు అన్నది ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఏవి కావు. మరి ఆత్మ ఎప్పటికి ఏమి చేయదు అది అంతరంలో సాక్షి భూతంగా మాత్రం వుంటుంది తప్ప అది అంటూ ఏమి చేయదు. కావున దీనిని గ్రహించి చేసే ప్రతి పనిని నీవు భగవంతార్పణ బుద్దితో, ఫలాపేక్ష రహితుడవై, నిష్కల్మషంగా కర్మలను ఆచరించి వీటి అన్నిటి నుండి నీవు సంపూర్ణంగా విముక్తిని పొందడమే “ముక్తి” .ముక్తి అంటే పరమాత్మ సాగరంలో ఆత్మ ఐక్యం కావడం.ముక్తి పొందడం అంటే నీవు మరల ఈ కర్మ భూమికి రాకుండా (అంటే జన్మ లేకుండా) ఆ దేవదేవుడైన పరంధాముని లో విలీనం అవడం. ఈ విధంగా జ్ఞానంతో కర్మలను ఆచరించడాన్నే “కర్మయోగం” అంటారు.

2. జ్ఞాన యోగం:-
అసలు జ్ఞానం అంటే ఏమిటి ? జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు అయన పైన వుండి మనం అడిగినవన్నీ తీరుస్తాడు అనుకోవడం కూడ అజ్ఞానమే. మొదట తెలుసుకోవలసింది ఏమిటంటే నీవు ఏది కోరితే అది ఇస్తాడు. అది తీరుతుంది కాని దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు. అన్నది తెలుసుకోవడమే జ్ఞానం.ఈ విధంగా అత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరించడమే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం గ్రహించి నీ మనస్సులో నిర్మలంగా తెలుసుకుంటూ అవలంబిస్తే నీవు అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించి తెలుసుకోవడం మరియు తెలుసుకున్న దానిని అమలుపరచే దేనినే జ్ఞానయోగం అంటారు.

3. భక్తి యోగం :-
భక్తి అంటే భగవంతునిని మనస్సులో నిరంతరం స్మరించడమే భక్తి. కాని మనం ఎదో ఎప్పుడైనా కస్టాలు వచ్చినపుడు లేకపోతె ఏదైనా భయం అయినపుడు మాత్రం స్వామి ఆంజనేయ అనో లేక మరో వేరే దేవున్నో తలచుకోవం మనకు పరిపాటి. కాని ఇలా కాదు భక్తీ అంటే సంపూర్ణంగా, పరిపూర్ణంగా నీ మనస్సును ఆ పర్మమత్ముని యందే లగ్నం చేయడం. అప్పుడు అందరికి ఒక సందేహం అదేంటి ఎప్పుడు అయన యందే మనస్సును లగ్నం చేస్తే నేను చేయవలసిన పనులు ఎవరు చేస్తారు అనే సందేహం కదా.నీవు చేసే ఏ పనైనా సరే అది ఆయనే చేస్తున్నాడు అని భావించు ఎందుకంటే ఈ ప్రక్రుతి అంతా తానే అయి ఉన్నాడు ఆ విధంగా భావిస్తూ నీ మనస్సు అంతఃకరణాన్ని సుద్దపరచు. ఆ విధంగా నీవు నిరంతర స్మరణతో భక్తితో అన్ని పనులను ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నీ మనస్సుకు ఒక సంపూర్ణత భావం ఏర్పడి అది పరిశుద్దమవుతుంది. ఈ విధంగా ఎల్లవేళలా ఆయనను స్మరిస్తూ వుండడం వలన నీవు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఆయననే పొందుతావు ఆయనలోనే విలీనం అవుతావు. అదియే మోక్షం.

4. ధ్యాన యోగం :-
ధ్యాన యోగం అన్ని యోగాలకంటే చాల చాల ఉన్నతమైనది ఎందుకంటే శరీరముతో వున్నపుడు ఈ శరీరపు అంతరములో వున్న ఆ పరమాత్మునిని, ఆ దేవదేవుడిని పరిపూర్ణంగా దర్శించే భాగ్యం ఈ ఒక్క ధ్యాన యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే దీనిని రాజ యోగం అని కూడ అంటారు. ఎందుకంటే ధ్యాన యోగం అన్నది నిజంగా రాజు (king of the yoga’s) అందుకే దీనిని “రాజయోగం” అని కూడ అంటారు. ధ్యానం అంటే సాధన. సాధన అంటే ప్రతి రోజు ధ్యానం చేసుకోవడం. చాల మందికి అమ్మో ధ్యానం అంటే ఇది చాల కష్టం అని అనుకుంటారు ఎందుకంటే కూర్చుంటే చాలు అంతవరకూ లేని ఆలోచనలు కూడ వెన్ను తట్టి నిద్ర లేచినట్లుగా ఒక్కొక్కటి మన మనస్సులో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యం కాదులే వేరే యోగం అవలంబిస్తాం అనుకుంటారు. కాని అన్నిటికన్నా ధ్యానయోగం మాత్రం చాల శక్తివంతమైనది. ఇది అవలంబించిన వాళ్ళు అంతా మహానుభావులు అయ్యారు. ఎవరైనా సరే ఈ యోగాన్ని ప్రారంబిస్తే చాలు, నిదానంగా తన మనస్సు, బుద్ధి అన్నియు అతని అధీనంలోకి ఖచ్చితంగా వస్తాయి. కాని కొద్దిగా సమయం పడుతుంది.అయితే ప్రతిరోజూ ఖచ్చితంగా అవలంబిస్తే అవి తొందరగా అన్నియు అధీనంలోకి వచ్చి సమాధి స్తితి లోకి వెళ్ళవచ్చు. సమాధి స్తితికి వెళ్తే నీ మనస్సు దాదాపు 70% నీ అధీనంలో వుంటుంది.మనస్సును ఎలా అదుపు చేయాలి ధ్యానంలో? ఇది అందరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న.అవును నిజమే ఈ మనస్సు అంటే సముద్రంలో అలలమాదిరి, అయిన అటువంటి మనస్సును అదుపు చేయొచ్చు. ఎలా అంటే మొదట నీ మనస్సుకు ఒకే ఒకటి చెప్పు అదే, ఈ సమస్త లోకానికి కారణభూతుడైన ఆ దేవదేవుని దర్శనార్థం, ఆ భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించడం కోసం, ఈ సృష్టికి కారణమైన ఆ దేవదేవుడు ఈ శారేరంలోనే అంతరంలో ఉన్నాడు అది జ్యోతిర్లింగస్వరుపుడు అని దానికి చెప్పి నీ శరీరపు హృదయ స్పందన మీదకు నీ మనస్సును మరలుస్తూ అదే విదంగా ఒక దివ్య జ్యోతిని మాత్రమే నీ మనస్సులో ఊహించుకొని ప్రతి దినము చేస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు నీ చెప్పు చేతల్లోకి వస్తుంది.ఈ విధంగా జ్ఞాన మరియు వైరాగ్యాలతో నీ మనస్సును నీ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఆ విధంగా అవలంబించడాన్నే ధ్యాన యోగం అంటారు.ఎందఱో మహానుభావులు ఈ ధ్యాన యోగం ద్వార ఈ సమాజానికి జ్ఞాన బోధ చేశారు. ఎస్తుక్రీస్తు, బుద్దుడు, వివేకానంద స్వామి, రామక్రిష్ణ పరమహంస, రమణ మహర్షి ఇలా ఎందఱో ఎందెందరో అలా వారి స్తాయికి చేరే సంపూర్ణ అవకాశాలు నీకు వున్నాయి. కావున ఈ రోజే ప్రారంబించు . శాశ్వతమైన పరిశుద్దమైన ఆ పరమాత్మను నీ అంతరంలో దర్శించుకొని శరీరం ఉండగానే ముక్తుడవై నీ జన్మకు సార్ధకతను మరియు నీ జన్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చు.

ఓం నమో పరమాత్మయే నమ :-
దేవున్ని పొందేందుకు మార్గాలు : దేవుణ్ణి పొందేందుకు అంటే పరమాత్మలో ఐక్యమయ్యేందుకు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కొన్ని మార్గాలను తెలిపాడు అవి : 1. కర్మ యోగం : మొదటగా ఈ కర్మలు మనం ఎందుకు చేయాలి. ఇవి అన్నియు మనకు ఏమి సంబంధం? అంటే మనం ఎన్నో జన్మలనుండి అజ్ఞానంతో నేను అనే భావనతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు. వీటిని అన్నిటిని జ్ఞానంతో చేస్తే మనము వీటి నుండి సంపూర్ణంగా విముక్తి పొందుతాము. అదేలాగు అంటే కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మ అని అంటాము. అది ఏదైనా కావచ్చు. చేసే ప్రతి పనిని మనం ఈ శరీర భావనతో అజ్ఞానంలో వున్నప్పుడు చేస్తూ నేను చెస్తున్నాను అనుకుంటూ వుంటాము. ఆ విధంగా చేయడం వలన మనం మరల కర్మ బంధనాలను ప్రోగు చేసుకుంటున్నాము.కావున ఇక్కడ మనం గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే నీవు అన్నది ఎవరు? అని ఆలోచిస్తే నీవు అన్నది ఆత్మ మాత్రమే, నీవు అన్నది ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఏవి కావు. మరి ఆత్మ ఎప్పటికి ఏమి చేయదు అది అంతరంలో సాక్షి భూతంగా మాత్రం వుంటుంది తప్ప అది అంటూ ఏమి చేయదు. కావున దీనిని గ్రహించి చేసే ప్రతి పనిని నీవు భగవంతార్పణ బుద్దితో, ఫలాపేక్ష రహితుడవై, నిష్కల్మషంగా కర్మలను ఆచరించి వీటి అన్నిటి నుండి నీవు సంపూర్ణంగా విముక్తిని పొందడమే “ముక్తి” .ముక్తి అంటే పరమాత్మ సాగరంలో ఆత్మ ఐక్యం కావడం.ముక్తి పొందడం అంటే నీవు మరల ఈ కర్మ భూమికి రాకుండా (అంటే జన్మ లేకుండా) ఆ దేవదేవుడైన పరంధాముని లో విలీనం అవడం. ఈ విధంగా జ్ఞానంతో కర్మలను ఆచరించడాన్నే “కర్మయోగం” అంటారు. 2. జ్ఞాన యోగం: అసలు జ్ఞానం అంటే ఏమిటి ? జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు అయన పైన వుండి మనం అడిగినవన్నీ తీరుస్తాడు అనుకోవడం కూడ అజ్ఞానమే. మొదట తెలుసుకోవలసింది ఏమిటంటే నీవు ఏది కోరితే అది ఇస్తాడు. అది తీరుతుంది కాని దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు. అన్నది తెలుసుకోవడమే జ్ఞానం.ఈ విధంగా అత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరించడమే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం గ్రహించి నీ మనస్సులో నిర్మలంగా తెలుసుకుంటూ అవలంబిస్తే నీవు అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించి తెలుసుకోవడం మరియు తెలుసుకున్న దానిని అమలుపరచే దేనినే జ్ఞానయోగం అంటారు. 3. భక్తి యోగం : భక్తి అంటే భగవంతునిని మనస్సులో నిరంతరం స్మరించడమే భక్తి. కాని మనం ఎదో ఎప్పుడైనా కస్టాలు వచ్చినపుడు లేకపోతె ఏదైనా భయం అయినపుడు మాత్రం స్వామి ఆంజనేయ అనో లేక మరో వేరే దేవున్నో తలచుకోవం మనకు పరిపాటి. కాని ఇలా కాదు భక్తీ అంటే సంపూర్ణంగా, పరిపూర్ణంగా నీ మనస్సును ఆ పర్మమత్ముని యందే లగ్నం చేయడం. అప్పుడు అందరికి ఒక సందేహం అదేంటి ఎప్పుడు అయన యందే మనస్సును లగ్నం చేస్తే నేను చేయవలసిన పనులు ఎవరు చేస్తారు అనే సందేహం కదా.నీవు చేసే ఏ పనైనా సరే అది ఆయనే చేస్తున్నాడు అని భావించు ఎందుకంటే ఈ ప్రక్రుతి అంతా తానే అయి ఉన్నాడు ఆ విధంగా భావిస్తూ నీ మనస్సు అంతఃకరణాన్ని సుద్దపరచు. ఆ విధంగా నీవు నిరంతర స్మరణతో భక్తితో అన్ని పనులను ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నీ మనస్సుకు ఒక సంపూర్ణత భావం ఏర్పడి అది పరిశుద్దమవుతుంది. ఈ విధంగా ఎల్లవేళలా ఆయనను స్మరిస్తూ వుండడం వలన నీవు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఆయననే పొందుతావు ఆయనలోనే విలీనం అవుతావు. అదియే మోక్షం. 4. ధ్యాన యోగం : ధ్యాన యోగం అన్ని యోగాలకంటే చాల చాల ఉన్నతమైనది ఎందుకంటే శరీరముతో వున్నపుడు ఈ శరీరపు అంతరములో వున్న ఆ పరమాత్మునిని, ఆ దేవదేవుడిని పరిపూర్ణంగా దర్శించే భాగ్యం ఈ ఒక్క ధ్యాన యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే దీనిని రాజ యోగం అని కూడ అంటారు. ఎందుకంటే ధ్యాన యోగం అన్నది నిజంగా రాజు (king of the yoga’s) అందుకే దీనిని “రాజయోగం” అని కూడ అంటారు. ధ్యానం అంటే సాధన. సాధన అంటే ప్రతి రోజు ధ్యానం చేసుకోవడం. చాల మందికి అమ్మో ధ్యానం అంటే ఇది చాల కష్టం అని అనుకుంటారు ఎందుకంటే కూర్చుంటే చాలు అంతవరకూ లేని ఆలోచనలు కూడ వెన్ను తట్టి నిద్ర లేచినట్లుగా ఒక్కొక్కటి మన మనస్సులో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యం కాదులే వేరే యోగం అవలంబిస్తాం అనుకుంటారు. కాని అన్నిటికన్నా ధ్యానయోగం మాత్రం చాల శక్తివంతమైనది. ఇది అవలంబించిన వాళ్ళు అంతా మహానుభావులు అయ్యారు. ఎవరైనా సరే ఈ యోగాన్ని ప్రారంబిస్తే చాలు, నిదానంగా తన మనస్సు, బుద్ధి అన్నియు అతని అధీనంలోకి ఖచ్చితంగా వస్తాయి. కాని కొద్దిగా సమయం పడుతుంది.అయితే ప్రతిరోజూ ఖచ్చితంగా అవలంబిస్తే అవి తొందరగా అన్నియు అధీనంలోకి వచ్చి సమాధి స్తితి లోకి వెళ్ళవచ్చు. సమాధి స్తితికి వెళ్తే నీ మనస్సు దాదాపు 70% నీ అధీనంలో వుంటుంది.మనస్సును ఎలా అదుపు చేయాలి ధ్యానంలో? ఇది అందరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న.అవును నిజమే ఈ మనస్సు అంటే సముద్రంలో అలలమాదిరి, అయిన అటువంటి మనస్సును అదుపు చేయొచ్చు. ఎలా అంటే మొదట నీ మనస్సుకు ఒకే ఒకటి చెప్పు అదే, ఈ సమస్త లోకానికి కారణభూతుడైన ఆ దేవదేవుని దర్శనార్థం, ఆ భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించడం కోసం, ఈ సృష్టికి కారణమైన ఆ దేవదేవుడు ఈ శారేరంలోనే అంతరంలో ఉన్నాడు అది జ్యోతిర్లింగస్వరుపుడు అని దానికి చెప్పి నీ శరీరపు హృదయ స్పందన మీదకు నీ మనస్సును మరలుస్తూ అదే విదంగా ఒక దివ్య జ్యోతిని మాత్రమే నీ మనస్సులో ఊహించుకొని ప్రతి దినము చేస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు నీ చెప్పు చేతల్లోకి వస్తుంది.ఈ విధంగా జ్ఞాన మరియు వైరాగ్యాలతో నీ మనస్సును నీ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఆ విధంగా అవలంబించడాన్నే ధ్యాన యోగం అంటారు.ఎందఱో మహానుభావులు ఈ ధ్యాన యోగం ద్వార ఈ సమాజానికి జ్ఞాన బోధ చేశారు. ఎస్తుక్రీస్తు, బుద్దుడు, వివేకానంద స్వామి, రామక్రిష్ణ పరమహంస, రమణ మహర్షి ఇలా ఎందఱో ఎందెందరో అలా వారి స్తాయికి చేరే సంపూర్ణ అవకాశాలు నీకు వున్నాయి. కావున ఈ రోజే ప్రారంబించు . శాశ్వతమైన పరిశుద్దమైన ఆ పరమాత్మను నీ అంతరంలో దర్శించుకొని శరీరం ఉండగానే ముక్తుడవై నీ జన్మకు సార్ధకతను మరియు నీ జన్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చు. ఓం నమో పరమాత్మయే నమః

మనసు :-
మనసుతో వచ్చిన చిక్కు ఇదే. ఏది లభించదో అదే కావాలి!
ఏదో కోల్పోతున్నానన్న భావోద్రేకం !
మనసెంత నిద్రపోతే మనిషింత సుఖపడతాడు !

భగవద్గీత :-
భగవద్గీత ఒక ఇంటితో సమానం. గీత తన పరమపవిత్ర మందిరమని శ్రీ కృష్ణ భగవానుడే చెప్పాడు. అలా చూసినప్పుడు మూడంతస్తులతో కూడిన ఆ ''గీత'' భవనంలో.

మొదటి అంతస్తులో 1వ అధ్యాయము నుండి6వ అధ్యాయం వరకు ఉన్నాయి. (అర్జున విషాదయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మసన్న్యాస యోగము, ఆత్మ సంయమన యోగము) ఈ ఆరు అధ్యాయాలను కర్మషట్కం అని అంటారు. 

రెండవ అంతస్తులో 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్నాయి. (విజ్ఞానయోగము, అక్షరపరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము) ఈ ఆరు అధ్యాయాలను భక్తిష్కటము అని అంటారు. 

మూడవ అంతస్తులో 13వ అధ్యాయము నుంచి 18వ అధ్యాయం వరకు ఉన్నాయి. (క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం, గుణత్రయవిభాగయోగం, పురుషోత్తమప్రాప్తి యోగము, దైవాసుర సంపద్విభాగయోగము, శ్రద్ధాత్రయ విభాగయోగం, మోక్షసన్యాస యోగం). ఈ ఆరు అధ్యాయాలు జ్ఞాన ష్కటం.
అందుకే గీతాభవనం సువిశాలమై, అత్యంత సుందరమై విరాజిల్లుతుంటుంది. అందులో అమూల్యమైన వస్తు సముదాయములుంటాయి.

ఆలయ దర్శనం :-


08 December 2014

గురువు :-
గురు లేదా గురువు విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో గు అనగా చీకటి/అంధకారం మరియు రు అనగా వెలుతురు/ప్రకాశం అని అర్ధం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు. మతపరంగా గురువు అనేది మార్గదర్శి అన్న అర్ధం వచ్చే విధంగా సిక్కు, బౌద్ధ, హిందూ మతాలలో మరియు కొన్ని ఆధునిక మత చైతన్యాలలో ఉపయోగంలో ఉన్నాయి. గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ. అన్ని జంతువులకు, మనుషులకు తల్లి తొలి గురువు.
గురుకుల విద్యా విధానం లో గురువు పాత్ర అత్యంత కీలకమైనది.


ఆధునిక కాలంలో ఉపాధ్యాయులు మరియు ఉపన్యాసకులు .
వివిధ దశల్లో విద్యాబోధన చేస్తున్నారు.


శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్
శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్
ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.


అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.

భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వడం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉంది. నిత్య ప్రార్ధనలలో గురువును, గురుపరంపరను స్తుతించడం ఒక ఆచారం.

భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉన్నది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడ గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు, వీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్య, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజివులైనారు. దత్తాత్రేయుని, సాయిబాబాను "గురువు" అని ప్రస్తావించడం సాధారణం.

గురువును స్మరించే కొన్ని ప్రసిద్ధ శ్లోకాలు :-

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః


గురువుపట్ల ఎలా మెలగాలో ఈ పద్యం చెబుతుంది:-

గురుమూర్తి వచ్చుచో గూర్చుండరాదు గురుశిష్యులొకశయ్య గూర్కరాదు
ముందుగా దనయంత భుజియింపగారాదు పోరి దొంగత్రోవల బోవరాదు
గురునింద వినరాదు కూడి సేయగరాదు గురునికప్రియమును గూర్చరాదు
సద్గురువిడిన శాసనము మీరగరాదు హెచ్చిదా గురుని శాసింపరాదు
గురుడు బోధింపనెంచిన నురుగరాదు అతడు బోధింపకుండిన నడుగరాదు
శ్రీగురుమూర్తి చేరినంతనె నమస్కారము ముందుగా సలుపవలయు
లజ్జాభిమాన కులంబు వీడి పాదచారియై సద్భక్తి చేరవలయు
సుతుడైన హితుడైన సోదరుడైనను గులహీనుడైన కొలువవలయును
గురునాజ్ఞ వర్తించి గురుడిచ్చు తృణమైన మేరువుగా నెంచి మెలగవలయును
గురుని ప్రభువంచు స్వామి దేవర యటంచు బిలుచుచు లోభ గుణముల దొలచవలయును


గురువులలో రకాలు సాయిబాబా జీవిత చరిత్రలో తన గురువుగురించి వ్రాసిన విషయాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి - "ఆయన నాకేమియు బోధించలేదు. కేవలం నన్ను ప్రేమతో చూసేవాడు. ఆ చూపునకే నాకు సకల విషయాలు అవగతమయ్యేవి"


"శ్రీకైవల్యసారథి" అనే పుస్తకంలో డాక్టర్ క్రోవి సారధి ఇలా వ్రాశాడు :-
"ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,
ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,
ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,
ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,
ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,
ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ...
ఆ మహనీయుడే నీకు గురువు"


ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు :-
సూచక గురువు - చదువు చెప్పేవాడు
వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాళు నేర్పేవాడు
విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.


గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు -
(1) స్పర్శదీక్ష (2) ధ్యాన దీక్ష (3) దృగ్దీక్ష (4) మంత్రదీక్ష.

అష్ట విధ గురువులు :-

1. బోధక గురువు - అనుభవ జ్ఞానము అవంతయును లేక, గ్రంధములలో ఉన్న విషయాన్ని మాత్రమే బోధించేవారు. వీరు బోధక గురువులుగా వ్యవహరింపబడతారు.
2. వైదిక గురువు - వేదాలలోని, వేదాంత భావములను వివరించువారు వైదిక గురువులుగా ప్రఖ్యాతి కెక్కుతారు.
3. ప్రసిద్ధ దేశికులు - ప్రతిఫలాన్ని ఏమీ ఆశించకుండానే, ఆధ్యాత్మిక బోధనను చేసేవారు ప్రసిద్ధ దేశిక గురువులనబడతారు.
4. కామ్యక గురువు - పాపపుణ్య క్రియల వల్ల సంభవించే, పాపపుణ్యముల ఫలితాల గురించి చెప్పేవారు కామ్యక గురువులు.
5. వాచక గురువు - అన్ని అంటి అంటకుండా ఉండే మార్గమనే వైరాగ్యమును తెలుపువారు వాచక గురువు అనబడతారు.
6. సూచక గురువు - ఏకాగ్రతతొ చూపు నిలిపి, కన్నులలో దర్శించే, విశ్వములోని కళలన్నీ ఏవిధంగా సాధ్యమవుతాయో తెలుపు గురువులు సూచక గురువులు అనబడతారు.
7. కారణ గురువు - ఇహలోక, సంపద సుఃఖాలపై, మోహమును పోగొట్టి, ముక్తి అనే సంపదను కైవసము చేయించగల గురువులు కారణ గురువులు అనబడతారు.
8. విహితోపదేష్ట - అంతు చిక్కని, అతి నిగూఢమైన , సృష్టి తత్వాన్ని బోధించి, విశ్వరూపుని దర్శించు మార్గమును చూపించే గురువులు విహితోపదేష్ట గురువులు అనబడతారు.
ప్రదక్షిణ :-

ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్యానించుకోవలసిన స్తోత్రం!!!
శ్రీ పరాశర మహర్షి' వారు పెట్టిన నియమము ప్రకారం, మనము ఎన్ని ప్రదక్షిణలు చేయదలుచుకున్నను, ప్రతి ప్రదక్షిణము తరువాత ఒక చోట ఆగి ఈ క్రింది శ్లోకం చెప్పుకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను. వేరే ఏ శ్లొకములు చెప్పు కొరాదట.

!! ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం
అరుణార్కం ప్రభుం శమథం రామదూతం నమామ్యహం !!


ఏ గుడిలొనైనను ప్రదక్షిణలు చేసేటప్పుడు, ఒక తొమ్మిది నెలల గర్భిణి స్త్రీ ఎంత నిధానముగ నడుస్తుందో అంత నిధానముగ చేయాలి కాని, అంతకు మించిన వేగముతొ చేయరాదు.

ఎన్ని ప్రదక్షిణలు చేసామో లెక్కపెట్టుకోడానికి, వక్కలు, పసుపు కొమ్ములు లేక బియ్యము కాని వినియోగించుకోవాలి తప్ప వేళ్ళతో లెక్కపెట్టొకొవడము, పేపర్ మీద గళ్ళు వేసుకుని పెన్సిల్తో గుర్తు పెట్టుకోడము లాంటివి కూడదు.
నమస్కారం :-

భగవంతుని ముందు తలవంచి చేతులు జోడించడమంటే - చేతులు క్రియాశక్తికి, తల బుద్ధిశక్తికి ప్రతీక. బుద్ధి, క్రియాశక్తులను భగవంతునికి అర్పించడమే నమస్కారం.

సాధన :-
అంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం అలవడితేనే ఆత్మసాక్షత్కారం అవుతుంది. ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే ప్రయత్నమే "సాధన".
ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, అనంతుడుని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రారంభమయ్యాక ఎన్నో సంఘర్షణలు, సందేహాలు. ఎలా పయనించాలి, ఏం చేయాలి, ఎలా సాధించగలను, ఎవర్ని ఆశ్రయించాలి.......ఓహో.... ఎన్నో ప్రశ్నలు.

అయితే తమ తమ సంసారధర్మాలను, గృహధర్మాలను, లౌకిక భాధ్యతలన్నింటిని నిర్వర్తిస్తూ, పరమగమ్యంను చేరగోరు గృహస్థభక్తులుకు తమ దైనందికకార్యంలలో ఆధ్యాత్మిక సాధన ఓ అంతర్భాగమై ఉండాలి.

సాధనకు కావాల్సింది మొదటిగా మనో నియంత్రణ. వ్యవహారికంలో పూర్తి భావజాగృతిలో ఉంటూ, ప్రతీక్షణం ప్రతీ చిన్నపనిలో కూడా నాచే ఇది భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో ఎరుకలో ఉండగలిగినప్పుడే మనోరహితస్థితి కల్గుతుంది.

అటుపై కావాల్సింది అంతఃకరణశుద్ధి. ఇది అలవడాలంటే అందుకు కావాల్సింది వివేకం (బ్రహ్మ సత్యం, జగత్తు మిధ్య అను సత్య దృఢ నిశ్చయజ్ఞానమే వివేకం. అనిత్యమైన ప్రపంచవిషయాలను విడిచిపెట్టి నిత్యమైన ఆత్మగురించి ఆలోచించడమే వివేకం), వైరాగ్యం (ఇహపర భోగాలపట్ల అభిలాష లేకపోవడం), శమం (మనోనిగ్రహం), దమం (చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహం), ఉపరతి (స్వధర్మానుష్టానం), తితిక్ష (శీతోష్ణ సుఖదుఃఖంలను సహించుట), శ్రద్ధ (దేనిచేత సద్వస్తువు తెలియబడునో అట్టి శాస్త్రంనందును, గురువాక్యంలందును సంపూర్ణ విశ్వాసం), సమాధానం (చిత్తంను ఏకాగ్రతలో ఉంచుట), ముముక్షత్వం (మోక్షం కావాలనే తీవ్ర కోరిక) భక్తి (స్వ స్వరూప అనుసంధానం అంటే నిదిధ్యాస), ధ్యానం (సత్యమైన ఏకవస్తువును చింతించడం), సేవ (పరోపకారజీవనం), సమత్వం (శత్రుమిత్రులయందు, మానావమానములయందు, సుఖదుఃఖంలయందు, సర్వ పరిస్థితులయందు సమభావంతో ఉండుట), శౌచం (జ్ఞానవైరాగ్యంలనెడి మృత్తిక చేత మదిని క్షాళ నం కావించి, వాసనాత్రయంను నశింపచేసుకోవడం), దయ (దుఃఖితులయందు కృప), సజ్జనసాంగత్యం (భగవత్తత్త్వాన్ని గ్రహించే వారితో సాంగత్యం), ఋజువర్తనం (చక్కటి నడవడిక) ఏకాత్మభావన (అందరూ ఆత్మస్వరూపులే అన్న భావం) అభ్యాసం చేయాలి. ఈ అభ్యాస సమయంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, ఆవేదనలు, సమస్యలు, సంఘర్షణలు, అనుభవాలు, అయోమయాలు..... అన్నీ ప్రాపంచిక జీవితానికి అన్వయింపబడి అగమ్యగోచరంగా, అలజడిగా అన్పించిన, ఎంతో అంతర్మధనం జరుగుతున్నా, ఇవన్నీ పారమార్ధిక జీవనంలో వైరాగ్యాన్ని, వివేకాన్ని, భక్తిని, పరమాత్మునిపై పరమప్రేమను పరిక్షించడానికి ఈశ్వరుడు పెట్టే పరిక్షలుగా భావించి సంకల్పమును చెదరనీయక, క్రుంగక, ప్రయత్నం వీడక ఫలితం ఆశించక, పయనం ఆపక, మరింత శ్రద్ధతో, పట్టుదలతో, సంయమనంతో, సమర్ధవంతంగా, ధీశాలిగా ముందుకు పోవడమే సరైన సాధన. బంగారానికి పుటం పెడితేగానీ ఆభరణం తయారుకాదు. పాత్రశుద్ధి ఉంటేగానీ పాలు కాచలేం. ఉలిదెబ్బలు పడితేగానీ విగ్రహం చేయడం కుదరదు. అలానే అనేక పరీక్షలు నెగ్గి సాధన చేస్తేగానీ అంతఃకరణ శుద్ధి కాదు. ఎవరికి వారే వారివారి సంస్కారముల ఆధారంగా సాధనామార్గంలను అనుష్టించి ఆత్మసాక్షాత్కారం కలిగేంతవరకు నిర్విరామ సాధన చేయాలి. అప్పుడే భవం నుండి భవ్యం వైపు వెళ్ళగలరు.

సాధకులు :-
త్రికరణశుద్ధిగా పై సాధనను ఆచరించినవారే సాధకులు. సదా సర్వప్రాణులను స్వాత్మ(తన ఆత్మ) యందు చూచునో, సర్వప్రాణులయందు ఆత్మను చూచునో వారే సాధకులు. అనంతుని స్మరణ, ఆధ్యాత్మికతత్వ అవగాహన, అన్యవిషయ విస్మరణ, అనన్య చింతన, ఆత్మ విచారణ, అంతా ఆత్మయేనన్నఅచంచల భావనలను అలవర్చుకొని, అవరోధాలను అధిగమిస్తూ ఆజన్మ సాధన అహర్నిశలు చేసేవారే నిజమైన సాధకులు. సత్కర్మలు, సదాచారణములు, సత్ శీలం , సత్ప్రవర్తన, సత్ వాక్కు, సన్మార్గం, సాత్వికాహారం, సమదృష్టి, సంయమనం, సందేహరహిత సాధన సాధకునికి అవసరం.
సత్ సంకల్పంతో, సద్గ్రంధంలు పఠనం శ్రవణం మననం చేస్తూ, సదా సత్యవస్తువుస్మరణ తోడుగా సద్గురువు సన్నిధిలో సాధన సక్రమంగా సాగించే సాధకునికి ఆత్మసాక్షాత్కారము సంప్రాప్తిస్తుంది.

Spiritual Frequencies Generated From Namaskar :-

Namaskar, also known as namaste, is a form of greeting practiced most in the Indian Subcontinent. It is used both while greeting and upon parting company. When a person greets another with namaskar, the greeting is accompanied by a slight bow made with hands pressed together, palms touching and fingers pointed upwards and closely positioned in front of the chest. Along with this, the word ‘namaskar’ or ‘namaste’ is said to the person who is being greeted. The hand position is known as the Namaskar Mudra. (Mudra means a particular hand gesture or position.)

The Drawing based on subtle-knowledge below shows the spiritual frequencies generated when two people greet each other with namaskar.

1 . When a person greets another with the feeling that “I am paying obeisance to the soul in the other” then a ring of spiritual emotion is created within him.

1A . Where there is spiritual emotion there is Communion with God and one is better able to access God’s thoughts.

1B . As a result there is a ring of spiritual emotion that is created around the person who is being greeted.

2 . This in turn attracts a flow of the Divine Principle or God’s power.

2A . A ring of the Divine Principle is created and activated.

3 . Wherever there is Divine Principle,a flow of Bliss (Ānand) is attracted. Bliss is a type of subtle-energy that brings about supreme happiness which is not dependent on any stimulus.

3A . This creates and activates a ring of Bliss around the person greeting.

3B . The person being greeted also imbibes this flow of Bliss.

3C . As a result there is a creation and activation of a ring of Bliss around the person being greeted.

3D . There is an activation and emission of particles of Bliss into the environment.

4 . A flow of Divine consciousness is also attracted to the person who initiates the greeting.

4A . Thereby creating and activating of a ring of Divine consciousness around him .

4B . The Divine consciousness is emitted into the environment.

4B2 . The person being greeted too imbibes the flow of Divine consciousness from the person greeting him.

4C. A flow of Divine consciousness is also attracted directly to the person being greeted.

4D . There is creation and activation of a ring of Divine consciousness around the person being greeted.

4E . There is activation and emission of particles of Divine consciousness and the environment is benefited spiritually.

Out of all Greetings, the Namaskar (Namaste) as the most sattvik form of greeting and should be adopted as far as possible.

అయ్యప్ప దీక్ష ( ఆధ్యాత్మికం / ఆరోగ్యం ) :-

"స్వామియే శరణం అయ్యప్ప" అంటూ... ఆంధ్రదేశం మారుమ్రోగుతోంది. ఏటేటా అయ్యప్ప దీక్షాదారుల సంఖ్య పెరుగుతూ... కార్తీక మాసారంభంలో జోరందుకున్నాయి. "శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం" అంటూ భక్తులు అచంచల భక్తితో... అత్యంత కఠినమైన నియమనిష్ఠలతో దైవంపై సంపూర్ణ విశ్వాసంతో ఈ దీక్షను చేపడుతున్నారు. ఆ మణికంఠుడు భక్తుల పాలిట కల్పతరువుగా కోరిన కోర్కెలు తీరుస్తూనే ఉన్నాడు. దానికి ఏటేటా పెరుగుతున్న కన్నెస్వాములే ప్రత్యక్ష నిదర్శనం.

అయ్యప్ప దీక్ష మతసామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్న, పెద్దా తేడా లేకుం డా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడ మే దీక్ష పరమార్థం. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై, సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది. కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్ష నేడు దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. అన్ని ప్రాంతాల కంటే మన రాష్ర్టంలోనే అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు కఠిన నియమాలు ఆచ రిస్తూ దీక్షా కాలాన్ని పరిపూర్ణం గావిస్తారనే మంచి పేరుంది.

ఏటేటా అయ్యప్ప దీక్ష తీసు కునే స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ దీక్షలు సాధారణంగా కార్తీక మాసంతో ప్రా రంభమై మకర సంక్రాంతి పర్వదినం వరకు కొనసాగుతాయి. అయ్యప్ప దీక్షా పరులు నలు పు/కాషాయం రంగుల్లో దుస్తులు ధరించి 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో ఉద యం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్విహస్తూ తరిస్తున్నారు. దీక్ష తీసుకున్న స్వా ములు ప్రతి ఒక్కరిని దేవుడి ప్రతి రూపంగా భావిస్తూ ‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’ నామాన్ని జపిస్తుంటారు. దీక్ష వల్ల మనఃశ్శాం తి, క్రమశిక్షణ ధార్మిక భావాలు పెంపొందుతా యంటారు గురుస్వాములు.

దీక్ష నియమాలు :-
అయ్యప్ప దీక్ష తీసుకోవాలనుకునే స్వాములు ముందుగా 108 తులసి లేదా రుద్రాక్షలతో అయ్యప్ప స్వామి ప్రతిమను కలిగిన మాలను అల్లించుకోవాలి. నల్ల బట్టలు, మాల తీసుకుని సమీపంలోని అయ్యప్ప దేవాలయాల్లో గురు స్వామితో కానీ ఆలయ అర్చకులతో కానీ మాలధారణ చేయించుకోవాలి. మాల మెడలో పడిన క్షణం నుంచి దీక్ష ప్రారంభమవుతుంది. నల్ల బట్టలు, నుదుట గంధం బొట్టు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి. ప్రతివారి ని అయ్యప్ప స్వామి ప్రతి రూపంగా భావించి ‘స్వామి’ అని సంబోధించాలి.

ప్రతి రోజు సూ ర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చన్నీళ్లతో శిరస్నానం చేయాలి. ఉద యం, సాయంత్రం వేళల్లో స్వామి వారికి పూజలు నిర్వహించాలి. ఒక పూట భోజనం చేసి రాత్రి పూట అల్పాహారం లేదా పాలు, పళ్లు మాత్రమే తీసుకోవాలి. కటిక నేల మీద నిద్రించాలి. దీక్షా కాలంలో క్షుర కర్మలు చేయడంగాని, వేలి గోర్లను తీయడంగాని చేయకూడదు. ఆడవారిని తోబుట్టువులుగా, తల్లిగా భావించాలి. కోపతాపాలకు, అశుభ కార్యాలకు దూరంగా ఉండాలి. ప్రతి రోజూ దైవరాధన చేస్తూ ప్రశాంత జీవనం గడపాలి. 41 రోజుల పాటు దీక్షను కొనసాగించిన అనంతరం ఇరుముడి ధరించి శబరిమల యాత్రను పూర్తి చేయాలి. శబరియాత్ర పూర్తి చేసి ఇంటికి చేరిన తర్వాత తల్లితో కానీ, భార్యతో కానీ లేదా దేవాలయ అర్చకుల చేత మాల విరమణ చేయించుకోవాలి.

పడి పూజ :-
అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు తమ దీక్షా కాలంలో మెట్ల పూజ (పడిపూజ) నిర్వ హించి కనీసం ఐదుగురు స్వాములకు భిక్ష (భోజనం) లేదా అల్పాహారం పెట్టడం ఆనవా యితీ. పడిపూజ నిర్వహించాలనుకున్న వారు అరటి బోదెలతో మండపం నిర్మిస్తారు. అందు లో అయ్యప్ప స్వామి చిత్ర పటాన్ని ఏర్పాటు చేస్తారు. శబరిమల దేవాలయం వద్ద ఉన్నట్లు గా 18 మెట్లను తయారు చేసి, ఒక్కో మెట్టు ను ఒక్కో దేవుడి ప్రతి రూపంగా భావించి మె ట్ల పూజ నిర్విహస్తారు. మెట్ల పూజలో భాగం గా అయ్యప్ప స్వామికి వివిధ రకాల అభిషేకా లు నిర్వహిస్తారు. పడిపూజలో స్వాములు పాల్గొని భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.


దీక్షతో ఆరోగ్యం :-
అయ్యప్ప మండల దీక్షతో ఆధ్యాత్మిక చింతన తో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శాస్ర్తీ య పద్ధతుల ప్రకారం పురాతన కాలం నుంచి కొన్ని రకాలైన వ్యాధులకు ఆయుర్వేద చికిత్స చేయడానికి, యోగ సాధనకు మండల కాలం (41 రోజులు) ప్రామాణికంగా వాడుతున్నారు. చన్నీటి స్నానం, ఒక్క పూట భోజనం, దేవతా రాధన వంటి అలవాట్లు మనిషి జీవితంపై చక్క టి ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఉద యం, సాయంత్రాలలో చన్నీటి శిర స్నానాలు చేయడం వల్ల మెదడులోని సున్నిత నరాలు స్పందించి సునిశిత శక్తి, ఏకాగ్రత, ఉత్తేజం కలగడమే కాకుండా శరీరంలోని వేడి కూడా సమతుల్యమవుతుంది. నుదుటిపై చందనం, కుంకుమ, విభూతి ధరించడం వల్ల భృగు మధ్య భాగంలోని అతి సున్నిత నరాలకు చల్ల దనాన్ని ఇవ్వడమే గాక గంధం సువానస మానసిక ప్రశాంతతనిస్తుంది.


వనమూలికల తో తయారయ్యే విభూతి యాంటీబాక్టీరియల్‌ గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుం ది. దీక్షా కాలంలో ధరించే నలుపు రంగు బట ్టలు వేడిని గ్రహించి దేహానికి వెచ్చదనాన్ని ఇస్తా యి. కాళ్లకు చెప్పులు ధరించకుండా నవడవ డం వల్ల భూమిపై ఉండే చిన్న చిన్న రాళ్లు, మ ట్టి గడ్డలు పాదాలకు సున్నితంగా గుచ్చుకుని ఓ రకంగా ఆక్యూపంక్చర్‌ చర్య జరిగి నరాల కు స్పందన కలుగుతుంది. దాంతో శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఒం టి పూట భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుంది. అయ్యప్ప దీక్షతో మానసిక, శారీరక ఉత్తేజం కలిగి అత్మస్థైర్యం, ఏకాగ్రత పెంపొందుతాయి.

అయ్యప్పకు కన్నెస్వామి అంటే ప్రీతి :-
అయ్యప్ప దీక్షను పురుషులు ఏ వయసు లో ఉన్నా కుల, మత భేదం లేకుండా తీసు కోవచ్చు. అమ్మాయిలైతే పదేళ్ల లోపు వారు, మహిళలైతే 55 ఏళ్ల పైబడ్డ వారు మాత్రమే దీక్ష తీసుకునేందుకు అర్హులు. మొదటిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకునే వారిని కన్నె స్వాములుగా, రెండవ సారి తీసుకున్న వారిని కత్తి స్వాములుగా, మూ డవ సారి గంట స్వాములుగా, నాల్గవ సారి గద స్వాములుగా, ఐదవ సారికి గురుస్వా ములుగా పిలుస్తారు. వీరందరిలో కన్నె స్వాములకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కొన్ని సంవత్సరాల పాటు దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి ఏటా ఒకరిద్దరు కొత్త వ్య క్తులతో దీక్ష చేపట్టించి తమ వెంట శబరి మలకు తీసుకెళ్తారు. అయ్యప్ప స్వామికి కన్నె స్వాములంటే మహా ఇష్టమని ప్రతీతి.

యాత్ర  అంత కష్టమా ?
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి చాలా మంది జంకుతారు. ఎందువల్ల? ఈ ప్రశ్న కు చాలామందికి తెలిసిన జవాబు అది అ త్యంత కఠినతరమని. ఇదొక్కటి మాత్రమే కాదు, వారు శబరిమల యాత్ర తప్పనిసరి గా చేయాలి. నలబై ఒక్క రోజులకు బదులు ఏదో కొద్ది రోజులు మాల వేసుకొని, శబరి మల వరకు వెళ్ళకుండా, మరెక్కడో ఒక అయ్యప్పస్వామి ఊరువెళ్ళి దీక్షను ముగించే వారి గురించి కూడా వింటున్నాం. నిబంధన ప్రకారమైతే దీక్ష ఎంత కఠినమో శబరిమల యాత్ర కూడా అంతే సాహసోపేతం. చాలా మందిని భయపెడుతున్న అంశాలలో ఇదీ ప్రధానమైంది.

నిజానికి శబరిమలయాత్ర అంత కష్టమా? అంటే కాదనే చెప్పాలి. దైవం పై పరిపూర్ణ విశ్వాసం, ప్రేమతో ముందుకు వస్తే అలాం టి భయాలేవీ ఉండవు. పిల్లలు, వృద్ధ స్ర్తీలు, వృద్దులు, వికలాంగుల సైతం అనేక కష్టాల కు ఓర్చుకుంటూ అడవి మార్గంలో కాలినడ కన వెళ్ళగా లేనిది అన్నీ ఉన్న అనేకమంది అందుకు ముందుకు రాకపోవడానికి అసలై న కారణం సంకల్ప లోపం. వారికి నిజంగా దైవం మీద భక్తి ఉంటే ఎవరికీ తెలియని ఆ ధ్యాత్మిక శక్తి స్వయంగా వారిని నడిపించు కుంటూ వెళుతుంది.

దీక్ష తీసుకున్న వారికి అడుగడుగునా కష్టాలు కలగడం సహజం. అవి కేవలం స్వామి పరీక్షలే తప్ప మరోటి కాదనుకోవాలి. చివరకు ఆ భగవంతుడి మీ దే సమస్త భారాలు వేసి అన్నింటినీ, అందరి నీ వదిలి అడవి మార్గంలో బయలు దేరుతా రు. నియమాలు, నిష్ఠల విషయంలో ఏ మే రకు క్రమశిక్షణను పాటిస్తామన్న దాని పైనే వారి భక్తి నాణ్యత ఆధారపడి ఉంటుందన్న ది గుర్తుంచుకోవాలి. 

మొట్టమొదటిసారి దీక్ష తీసుకొనే వారు విధిగా పెద పాదం గుండా నే వెళ్ళాలన్న నియమం ఒకటి ఉంది. భయ పడే వారు భయపడుతున్నా, ప్రగాఢ భక్తి తత్పరతతో ఆ మార్గం గుండానే వెళుతున్న వారు లక్షల సంఖ్యలో కనిపిస్తారు.

పదునెట్టాంబడి విశిష్టత :-
శ్రీ అయ్యప్ప సన్నిధానంలోని పదునెట్టాం బడి (పదునెనిమిది మెట్లు) ఎక్కడాన్ని భక్తు లు అదృష్టంగా భావిస్తారు. మెట్లను దేవ తలకు ప్రతి రూపాలుగా భావిస్తారు. 18 మెట్లకు 18 విశిష్టతలు ఉన్నాయి.
1వ మెట్టు అణిమ
2వ మెట్టు లఘిమ
3వ మెట్టు మహిమ
4వ మెట్టు ఈశత్వ
5వ మెట్టు వశత్వ
6వ మెట్టు ప్రాకామ్య
7వ మెట్టు బుద్ధి
8వ మెట్టు ఇచ్ఛ
9వ మెట్టు ప్రాప్తి
10వ మెట్టు సర్వకామ
11వ మెట్టు సర్వ సంవత్కర
12వ మెట్టు సర్వ ప్రియాకార
13వ మెట్టు సర్వ మంగళాకార
14వ మెట్టు సర్వ దుఃఖ విమోచన
15వ మెట్టు సర్వ మృత్యువశ్యమణ
16వ మెట్టు సత్యవిఘ్న నివారణ
17వ మెట్టు సర్వాంగ సుందర
18వ మెట్టు సర్వ సౌభాగ్యదాయక


ఇరుముడి :-
అయ్యప్ప దీక్షలో ప్రాచుర్యం, పవిత్రత కలిగి ఉండేది ఇరుముడి. ఇరుముడి రెండు భాగా లను కలిగి ఉండి యాత్ర కోసం తలపై ధరిం చేందుకు వీలుగా ఉంటుంది. ఇరుముడిలో ఒ భాగంలో పూజా ద్రవ్యాలు, మరో భాగం లో ఆహార ధాన్యాలు, ఆవు నెయ్యితో నింపిన కొబ్బరి కాయను ఉంచుతారు. శబరిమల అయ్యప్ప దేవాలయం ముందు ఉన్న పదు నెట్టాంబడి ఎక్కాలంటే తలపై ఇరుముడి ఉన్న వారినే అనుమతిస్తారు. దేవాలయానికి చేరు కున్న భక్తులు ఇరుముడిలోని కొబ్బరి కాయ లో నింపిన నెయ్యితో మూల విరాట్టుకు అభిషే కం జరిపిస్తారు. కొబ్బరి ముక్కలను ఆలయ ప్రాంగణంలోని హోమ గుండంలో వేస్తారు. ఇరుముడిలోని ఆహార ధాన్యాలతో భోజనం వండుకుని తింటారు. దేహాన్ని కొబ్బరికాయ గా, నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మను పరమాత్మకు అర్చన చేసే పవిత్ర ప్రక్రియగా ఈ ఇరుముడికి ప్రత్యేకత ఉంది.


శబరిమలై యాత్రలో దర్శనీయ స్థలాలు :-
అయ్యప్ప భక్తులు వీలును బట్టి అచ్చన్‌ కోవిల్‌, అరయంగావు, కుళుత్తుపులలో ఉండే అయ్యప్ప దేవస్థానాన్ని దర్శించి పందళ రాజ నివాస స్థలం చూసి ఎరుమేలి చేరుతారు.


ఎరుమేలి :-
శ్రీ అయ్యప్ప స్వామి ఆప్తమిత్రుడు, సేవకుడైన వావరుస్వామి వెలసి ఉన్న దివ్య స్థలం ఇది. దీ నినే ‘కొట్టైప్పడి’ అని కూడా పిలుస్తారు. మణి కంఠునిచే సంహరింపబడ్డ మహిషి... తల మొండెం నుండి వేరు చేయబడి ఇక్కడకు విసి రివేయబడింది కాబట్టి ఈ ప్రాంతానికి ‘ఎరు మ’ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఎరుమ ‘ఎరుమేలి’గా మారింది.


ఎరుమేలి చేరిన భక్తులు వయోభేదాన్ని లెక్కించకుండా ఎంతో సంతోషంగా తమ శరీరాలను ఆకులు, కూరగాయలు, పళ్లు, రంగు రంగుల కుంకుమలు, బుడగలతో అలంకరించుకుంటారు. చెక్కతో చేయబడిన చాకు, బాకు, బాణం, గద మొదలైన ఆయుధాలను ధరించి బాజాభజంత్రీలతో ఊరేగింపుగా ‘స్వామి దింతకతోమ్‌... అయ్య ప్ప దింతకతోమ్‌’ అంటూ నాట్యం చేస్తారు. ఈ నాట్యాన్ని ‘పేటైతులాలు’ నాట్యం అంటా రు. యుద్ధ సమయంలో స్వామి మహిషిపైకి ఎక్కి ఈ నాట్యం చేశాడని భక్తుల నమ్మకం. దానికి గుర్తుగా భక్తులు ఈ న్యాటాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. నాట్యం చేసుకుంటూ స్వామి వారి భక్తుడైన వావరు స్వామిని మొదటగా దర్శించుకుని అక్కడ విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు.

వావరు స్వామి ముస్లిం భక్తుడైనా అయ్యప్ప స్వాములు తమ యాత్రలో కుల, మత భేదాన్ని పాటించరు. వావరు స్వామి ఆలయం నుంచి ఎదురుగా ఉన్న శ్రీ అయ్యప్ప (పేటశాస్తా) ఆలయాన్ని దర్శించుకుని తావళం చేరుకుంటారు. అక్కడి స్నాన ఘట్టాల్లో స్నాన మాచరిస్తారు. పెరియా పాదం (పెద్ద పాదం) నడిచే అయ్యప్ప స్వాములు ఇక్కడి నుంచే తల పై ఇరుముడిని ఎత్తుకుని శరణాలు పలుకు తూ పెరియా పాదయాత్రను ప్రారంభిస్తారు. చిన్న పాదం నడిచే భక్తులు వాహనాల ద్వారా పంబాకు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన సన్నిధానానికి చేరుకుంటారు.

పెరూర్‌తోడు :-
ఎరుమలై నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించి ‘పెరూర్‌ తోడు’ చేరతారు. ఇక్కడ చిన్నవాగు దారికి అడ్డంగా ప్రవహిస్తుంది. వీర మణికంఠుడు పులి పాల కోసం వనవాసం చేసే సమయంలో ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకున్నట్లు భక్తులు నమ్ముతారు. పెరూర్‌ తోడు నుంచి ముందుకు ఉన్న అడవి ప్రదే శాన్ని ‘పూంగా’ వనమని అంటారు. పూంగా వనమంటే పూలతోట అని అర్థం.


కాళైకట్టి :-
భక్తులు పెరూర్‌తోడు దాటి 12 కిలోమీటర్లు అడవి ద్వారా కొండలెక్కి నడిచి కాళైకట్టి చేరుతారు. మణికంఠుడు మహిషి పైకి ఎక్కి చేసిన నృత్యాన్ని చూడటానికి వచ్చి ఈశ్వరుడు తన వాహనమైన నందిని ఇక్కడ కట్టాడని అందుచేత ఈ స్థలానికి ‘కాళైకట్టి’ అనే పేరు వచ్చిందని చెప్పుకుంటారు.

ఆళుదా నది :-
కాళైకట్టి దాటి 5 కిలో మీటర్లు నడిచి ఆళుదా నది చేరుతారు. ఇది పంపానదికి సమానమైన పుణ్య నది. చక్కని ప్రకృతి, సంతోషం కలిగిం చే పరిసరాలు, గలగలమని సాగే నిర్మల నీటి ప్రవాహంతో యాత్రికులకు మనోహరం కలి గించే ప్రదేశం. భక్తులు తొలి మజిలీగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం ఆళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో చిన్న రాయిని తీసుకుని ప్రయాణం ముందుకు సాగిస్తారు.

ఆళుదామేడు :-
ఆళుదానది నుంచి ప్రారంభమైన కొండను ఆళుదామేడు అంటారు. ఇది చాలా ఎతె్తైన ఏట
వాలు కొండ. ఈ కొండను ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. కాలు జారితే పాతాళమే. చుట్టూ దట్టమైన అడవిలో తిరిగే మృగాలను చూడవచ్చు. భక్తులు శరణాలు ప లుకుతూ, ఆ స్వామి అండతో ఈ కొండను ఎ క్కుతారు. ఆళుదామేడు శిఖరం సముద్ర మ ట్టం నుంచి 4 వేల అడుగుల ఎత్తులో ఉండ టం చేత వాతావరణం చల్లగా ఉంటుంది.


కరిమలై :-
కరిమలై తూడు దాటిన భక్తులు కరిమల కొం డ ఎక్కడం ప్రారంభిస్తారు. కరిమల ఎక్కడం కష్టం.. కష్టం అని మనం అయ్యప్ప భక్తి గీతా లలో వింటూ వుంటాం. దానిని బట్టి కరిమల ఎక్కడం ఎంత శ్రమతో కూడుకున్నదో ఊహిం చవచ్చు. అయ్యప్ప స్వాములు 41 రోజులు కఠోర దీక్ష చేయడం వల్ల సంపాదించిన శక్తి ఈ కొండ ఎక్కడానికి ఉపయోగపడుతుంది. శ్రీ అయ్యప్ప కృప ఉంటే తప్ప ఈ కొండను దాటడం అసాధ్యం. కరిమలై అంటే కరి (ఏను గుల) కొండ అని అర్థం. మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా సూర్య కిరణాలు భూమిపై పడనంత దట్టమైన అటవీ ప్రాంతం.

ఇక్కడ శ్రీ గంధం, ఎర్ర చందనం చెట్లు విస్తారంగా ఉం టాయి. ఇక్కడ ఏనుగు, పులి, చిరుతపులి మొ దలైన అడవి జంతువులు కనిపిస్తాయి. కరిమ లై కొండ మీద ఒక బావి ఉంది. శ్రీ అయ్యప్ప స్వామి తన భక్తుల నీటి అవసరాన్ని తీర్చడానికి బాణం వేసి ఈ బావిని నిర్మించాడని ప్రతీతి. ఈ బావి ఎప్పుడూ నీటితో కళకళలాడుతుంది. కరిమలై వంకర టింకరలతో కూడిన కాలిబా టలో ఏడు భాగాలుగా పైకి ఎక్కాలి. కరిమలై లో కరిమల నాథస్వామి, కరిమలై అమ్మన్‌ పేర్లతో ఆలయాలు ఉన్నాయి. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష సరిగా చేయకున్నా, భక్తితో శరణా లు పలుకకున్నా ఈ అమ్మవారు భక్తులను దం డిస్తుందంటారు.

సిరియాన వట్టమ్‌ / పెరియాన వట్టమ్‌ :-
భక్తులు కరిమల దిగిన తర్వాత సిరియాన వట్టమ్‌ (చిన్న ఏనుగు పాదం) పెరియాన వట్ట మ్‌ (పెద్ద ఏనుగుల పాదం) ద్వారా తమ యా త్రను ముందుకు సాగిస్తారు. ఇక్కడ ఏనుగు లు తిరుగుతూ వుంటాయి కనుక ఈ ప్రదేశాని కి ఆ పేర్లు వచ్చాయి. ఇక్కడ నుంచి 3 కి.మీ. పయనిస్తే పంబానదికి చేరుకుంటారు.

పంబానది :-
పంబానది గంగానదితో సమానమైన పరమ పవిత్రమైన స్నాన ఘట్టం. పంబానదికి ఎడమ పక్క వాలి చేత తరుమబడ్డ సుగ్రీవుడు తన అ నుచరులతో తల దాచుకున్న పురాణ ప్రసిద్ధ మైన ముకాచలం ఉంది. రామభక్తుడైన హను మంతుడు పుట్టినది, భక్త శబరి రామ దర్శనా నికి వేచి ఉన్నది ఇక్కడే. సీతాన్వేషణ చేస్తున్న శ్రీరామ లక్ష్మణులను హనుమంతుడు మొదటి సారిగా కలుసుకున్న ప్రాంతమిది. సీతను ఎ త్తుకుపోతున్న రావణుడితో శక్తి ఉన్నంత వర కు పోరాడిన జటాయువుకు శ్రీరాముడు అగ్ని సంస్కారాలు చేసి తర్పణాలు వదిలింది ఇక్కడే.

మాతంగ మహాముని ఆశ్రమం ఉండేది ఇక్కడ నే. అందుచేతనే గంగానదితో సమానంగా పం బా నదిని భావిస్తూ తమ పితృ దేవతలకు అక్క డ తర్పణాలు విడిచి పెడతారు. చాలామంది భక్తులు పంబానదిలో దీపాలను వెలిగించి దీపోత్సవం చేస్తారు. పంబానదిలో స్నానం చేసిన భక్తులకు అనిర్వచనీయమైన అనందం కలిగి యాత్రలో అంతసేపు తాము పడ్డ శ్రమ ను మరిచిపోతారు. ఇది అయ్యప్ప భక్తులందరి కీ అనుభవపూర్వకమైనది. ఇరుముడి వెనుక ముడిలోని ఆహార పదార్థాలను ఉపయోగించి భక్తులు ఇక్కడ వంట చేసుకుంటారు. దీనినే ‘పంబాసద్దె’ అని అంటారు. పంబా తీరాన బస చేసి ఆహారం తయారు చేసి ఆర్పబడిన 108 పొయ్యిలలోని బూడిదను సేకరించి దానికి వస్తక్రాయం చేసి ఇరుముడిలో తాము తెచ్చిన విభూతితో కలిపి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయిస్తారు.

గణపతి సన్నిధానం :-
పంబా నదిలో స్నానం చేసిన భక్తులు తమ ఇరుముడులను తలపైనెత్తుకుని పంబానది తీ రం నుంచి మెట్ట మీదుగా గణపతి సన్నిధానం చేరుతారు. అక్కడ మెట్లు ఎక్కే భక్తులను ఆ జ న ప్రవాహాన్ని చూస్తుంటే హృదయం పులకి స్తుంది. కడలి తరంగాల వలే కదిలేటి జనులు అనే అయ్యప్ప భక్తి గీతం జ్ఞప్తికి వస్తుంది. గణ పతి పాదం చేరిన భక్తులు గణపతికి కొబ్బరికా య కొట్టి గణపతిని, శ్రీరాముడు, హను మంతుడు, దేవీ ఆలయాలను దర్శిస్తారు.

శబరి పీఠం :-
అప్పాచ్చిమేడు దాటి ప్రయాణిస్తే చిన్న గుడి కనబడుతుంది. ఇది శ్రీరాముడు శబరిని కలి సిన చోటు. శ్రీ రాముడిని సమగుణుడుగా ప్రీ తించిన కారణంగా శబరికి ఆ జన్మలో మోక్షం కలగలేదు. ఇంకో జన్మలో తపస్వినిగా పుట్టిన అమెకు శ్రీ ధర్మశాస్తా మోక్షాన్ని కలుగజేశాడు. శబరి జ్ఞాపకార్థం ఇప్పుడొక రాయి మాత్రమే ఇక్కడ ఉంది. శబరిని తలచుకుని భక్తులిక్కడ కొబ్బరికాయ కొడతారు. శరణాలు చెబుతారు.

శరంగుత్తి :-
శబరిపీఠం నుండి కొంచెం ముందుకు వెళితే శరంగుత్తి చేరవచ్చు. శ్రీ అయ్యప్ప స్వామి, ఆ యన పరివారం ఇక్కడ గల శరంగ చెట్టు (మ ర్రిచెట్టు)కు తమ ధనుర్భాణాలను గుచ్చినట్లు పురాణగాథ. కన్నె స్వాములు తాము ఎరుమేలి లో కొన్న బాణాలను ఇక్కడ గుచ్చుతారు. అ ప్పుడే వారు పదునెట్టాంబడి ఎక్కడానికి అర్హులు.

పదునెట్టాంబడి :-
పరిసరాలను చూస్తూ వరుసలో నిల్చున్న భ క్తులు మొదట దేవస్థానం వారు కట్టించిన విరి క్యూలైన్లలో నడిచిన తర్వాత పదునెట్టాంబడి చేరతారు. మెట్ట మార్గంలో కింద నున్న వెలి యకడుత్త స్వామి, కరూపమ్మ కరూత్త స్వాము లకు నమస్కరించి పక్కగానున్న గోడకు కొబ్బ రి కాయ కొట్టి శరణాలు పలుకుతూ మెట్టకు మొక్కుతూ ఆనందోత్సాహలతో పదునెట్టాంబ డి ఎక్కుతారు. భక్తులు ఈ పదునెట్టాంబడిని దేవతలకు ప్రతి రూపాలుగా భావిస్తారు.

ధ్వజ స్తంభం :-
పదునెట్టాంబడి దాటగానే ఎదురుగా ధ్వజస్తం భం కనబడుతుంది. ఇది పూర్తిగా బంగారు రే కులతో అతికించబడి ఉంది. ధ్వజ స్తంభం చి వరన బాణం గుర్తు ఉంటుంది. మణికంఠుడు పందళరాజుకు యోగ దృష్టితో ఆలయ నిర్మా ణానికి స్థలం చూపించిన బాణానికి గుర్తుగా భ క్తులు నమ్ముతారు. సూర్య కిరణాలు ఈ ధ్వజ స్తంభంపై పడి స్వర్ణ కాంతులు విరజిమ్ముతాయి.

సన్నిధానం :-
ధ్వజ స్తంభం దాటిన తర్వాత స్వామి దర్శనా నికి కాంక్రీటు డాబాపై చుట్టూ క్యూ లో ఒక ప్రదక్షిణ చేయాలి. అప్పుడు స్వామి సన్నిధానంలో నిలిచే అదృ ష్టం కలుగుతుంది. పున్నమి నాటి చం ద్రుని ముఖారవిందంతో, యోగాసన ధారియై తపస్సు చేస్తున్న భంగి మలో ఉన్న శ్రీ ధర్మశాస్తా దర్శనం చేసుకున్న భక్తుల ఆనందం వర్ణణాతీతం.

శబరిమలైలో ముఖ్య సేవలు :-
స్వామి సన్నిధానంలో నవంబర్‌ 16 లేక 17 తేదీలలో ప్రారంభమై 41 రోజులు డి సెంబర్‌ 26 లేక 27 తేదీల వరకు మండల ఉత్సవం జరుగుతుంది. దీనికి మొదలు పదు నెట్టాంబడికి పూజలు చేస్తారు. పడి పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. మకర సంక్ర మణ ఉత్సవం జనవరి 1 నుంచి 20 వరకు జరు గుతుంది. ఆగస్టు - సెప్టెంబర్‌ మాసంలో వచ్చే ఓనమ్‌ ఉత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహి స్తారు. ఏప్రిల్‌లో విషు పూజ జరుపుతారు.

స్వామి వారి తిరువాభరణాలు :-
మకర జ్యోతి కనిపించే ముందు స్వామి వారి కి తిరువాభరణాలు అలంకరించడం సంప్రదా యంగా వస్తోంది. మూడు అలంకృతమైన పెట్టెలలో వజ్ర కిరీటం, బంగారు కడియాలు, స్వామి ఖడ్గంతో పాటు అనేక వజ్ర వైఢూర్యా లు ఉంటాయి. పందళ రాజవంశం వారి ఆధీ నంలోనే ఈ అమూల్యమైన అభరణాలు ఉం టాయి. మకర సంక్రాంతికి రెండు రోజుల ముందుగా పందళ రాజ వంశీయులు దేవ స్థానం బోర్డు అధికారులకు తిరువాభరణాలు అప్పగిస్తారు. ఈ అభరణాలు మొదట శబరి మలైకి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంద ళలోని వెలియ కోయికెల్‌ ధర్మశాస్తా ఆలయం లో ఉంచి పూజలు చేస్తారు.

మకర విళక్కు ఉత్సవం :-
మకర జ్యోతి కనిపించిన రాత్రి సన్నిధానంలో మకర విళక్కు ఉత్సవం జరుగుతుంది. ఈ ఉ త్సవం ప్రారంభం నుంచి ఏడు రోజుల పాటు చేస్తారు. మణి మండపంలో పులి స్వారీ చేస్తు న్న శ్రీ స్వామి అయ్యప్ప తైల వర్ణ చిత్రాన్ని ఉంచుతారు. ఇక్కడ నుంచి మాళిగ పురత్తమ్మ ను ఏనుగుపై కూర్చోబెట్టి పదునెట్టాంబడి వర కు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ ఊరేగిం పు పొడవునా దీపాల బారు, తాళ వాద్యాల హోరు చూసే వారికి చూడ ముచ్చటగా ఉం టుంది. పురాతన కాలం నుంచి సంప్రదాయ బద్దంగా వస్తున్న మకరవిళక్కు ఉత్సవాన్ని చూసిన తర్వాతే సన్నిధానాన్ని భక్తులు వదలాలనే నియమం ఉంది.

శబరి యాత్ర - ముఖ్యమైన రోజులు :-
సాధారణంగా శబరి యాత్రికులు 3 ముఖ్య రోజులలో శ్రీ అయ్యప్ప స్వామిని దర్శింకునేం దుకు ఇష్టపడతారు.

విషుపూజ:-

ఇది శ్రీ స్వామి వారి పుట్టిన రోజు. ఇది మళయాళ సంవత్సరాది రోజున, సాధార ణంగా ఏప్రిల్‌ నెలలో వస్తుంది. విషు పూజకు స్థానికులైన మళయాళీలే ఎక్కువగా వెళ్తారు.

మండల పూజ:-
ఇది శబరిమలై యాత్రలో ము ఖ్యమైనది. ఈ యాత్ర చేసేవారు కార్తీక మా సం, మొదటి రోజున మాలధారణ చేస్తారు. 41 రోజులు మండల దీక్షను భక్తిశ్రద్ధలతో ఆచరించి మార్గశిర మాసం 15 రోజు నాటికి శబరిగిరిని చేరతారు. అప్పటికి శబరిమలైలో దేవస్థానం వారు పదునెట్టాంబడి పూజ చేసి భక్తులు 18 మెట్లను సిద్ధం చేసి ఉంచుతారు. మండల పూజకు సాధారణంగా నవంబర్‌ 16 లేక 17 తేదీల్లో దేవస్థానం తెరిచి 41 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుపుతారు.

మకర జ్యోతి :-
మకర సంక్రాంతి పర్వదినాన లక్షలాది అయ్య ప్ప భక్తులు తమ ఇష్టదైవాన్ని, జ్యోతి స్వరూపు నిగా కనులారగాంచి, పులకించి, పరవశించే రోజు. ఆ రోజు సాయంకాలం పందళ రాజ వం శీయులు తెచ్చిన తిరువాభరణాలను స్వామి వారికి అలంకరించి దీపారాధన చేసిన వెంటనే భక్తులు సన్నిధానం ముందు ఉన్న కాంతి మలై (పొన్నంబల మేడు) వైపుకు చూస్తుంటారు. సాయంకాలం సుమారు 6.45 గంటలకు భక్తుల కు 3 సార్లు జ్యోతి దర్శనం కలుగుతుంది.