08 December 2014

శ్రీ, శ్రీమతే, శ్రీమాన్, శ్రీమతి :-

ఈ పదాలన్నీ "శ్రీ" అనే విశిష్ట పదానికి సంబంధించినవి. శ్రీ అని లక్ష్మికి, సంపదకు పేరు. పేర్లకు ముందు శ్రీ అని పెడితే గౌరవవాచకం అవుతుంది. శ్రీమతి అంటే భాగ్యవతి, లక్ష్మి విశిష్టురాలు. శ్రీవైష్ణవుల పేర్ల ముందు శ్రీమాన్ అని వాడతారు. శ్రీరామాయణంలొ "శ్రీమాన్" అనే సంబొధన విశేషణంగా కూడా వాడతారు. శ్రీమాన్ అంటే భాగ్యవంతుడు అని అర్ధం. వాల్మీకి చెప్పినదానిప్రకారం భగవంతుని సన్నిధిలో , సేవలో ఉన్నవారందరూ భాగ్యవంతులే. లక్ష్మి, గోదాదేవి వంటి దేవేరుల పేర్ల ముందు గౌరవవాచకంగా శ్రీ వాడబడుతుంది. శ్రీమత్ + మహాభారతం = శ్రీమన్మాహాభారతం, శ్రీమత్ + రామాయణం = శ్రీమద్రామాయణం సంపత్కరమైన గ్రంధాలు. శ్రీమతే నారాయణాయనమః అని భగవత్ కైంకర్య సమర్పణంగా కల రామనుజుల వారికి నమస్కారం అని అర్ధం . శ్రీమత్ + నారాయణుడు = శ్రీమన్నారాయణుడు అనగా శ్రీ విశిష్టమైన శ్రీతో కూడిన నారాయణుడు అని అర్ధం. శ్రీమతే అంటే శ్రీకల నారాయణుని కొరకే అని అర్ధం . సందర్భాన్ని బట్టి ఆయా పదాల వాడకం జరుగుతుంది.


No comments:

Post a Comment