06 October 2015

నడక :-
ఛాలామంది యోగాసనాలు వేయడమంటే అదో బ్రహ్మవిద్య అనుకుంటారు. పోనీ ఇతర వ్యాయామాలు, తేలిక ఎక్సర్ సైజులు చేస్తారా అంటే దానికీ ముందుకు రారు. అవి చేస్తున్నప్పుడు శారీరకంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయం. ఇక చేస్తున్న పనిరీత్యా వాళ్ళకు శారీరక పరిశ్రమ లేకపోతే మరి వారి ఆరోగ్య పరిస్థితేమిటి? ఐనా వాళ్ళకు ఫిట్ నెస్ ను కాపాడుకోవాలానే కోరిక మాత్రం బలంగా ఉంటుంది. ఇక వాళ్ళకు ఏకైక తేలిక మార్గం నడక ఒక్కటే!

రోజుకు కనీసం పదిహేను నిమిషాలైనా వేగంగా నడవగలిగితే, వాళ్ళ ఆయుష్షు మూడు సంవత్సరాలైనా పెరిగే అవకాశం ఉంటుందని ఇటీవల తైవాన్ లో జరిగిన ఓ అద్యయనంలో వెల్లడైంది. సుమారు నాలుగు లక్షల మంది వివిధ తరహా వ్యక్తులపై జరిగిన ఆరోగ్య పరిశోధనల అనంతరం ఈ అంశాన్ని వైద్యపరిశోధకులు నిర్ధారించారు. రోజుకు 15 నిమిసాల చొప్పున వారంలో సుమారు 105 నిమిషాలు నడిచిన వారిలో క్యాన్సర్ మరణాలు ఒక శాతం తగ్గినట్లు రుజువైంది. అంతేకాకుండా ఇతర కారణాలతో మరణించేవారి సంఖ్య నాలుగు శాతం తగ్గిందట. దీన్ని బట్టి రోజుకు 30 నిమిషాలు వేగంగా నడిచే వారిలో 4 నుంచి 6 సంవత్సరాల ఆయుష్షు పెరిగే అవకాశం ఉందని వైద్యపరిశోధకులు అంటున్నారు. నడక వలన కలిగే ప్రయోజనాలు అన్ని వయసుల వారిలోదాదాపు ఒకే విధంగా ఉన్నాయని వారంటున్నారు.
గంటకు ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు రోజూ నడవగలిగేవారికైతే ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రాకపోవచ్చని అంటున్నారు. రోజూ ఏ సమయంలోనైనా నడవొచ్చు కానీ ఉదయం అదీ సూర్యోదయానికి ముందు నడవడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయని అంటున్నారు.

వ్యాయామాలంటే ఆసక్తి లేనివారు కనీసం ఈ నడకైనా రోజూ కొనసాగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


No comments:

Post a Comment