16 November 2013

ప్రాచీనా భారతంలో విద్యారంగం :

న చోరహార్యం నచ రాజ హార్యం
న భ్రాతృభాజ్యం నచ బారకారి
వ్యయేకృతే వర్థత ఏవనిత్యంవిద్యాదానం సర్వ ధన ప్రదానం

చోరులు దొంగలిచలేనిది, ప్రభువులు స్వాదీనం చేసుకోలేనిది, సోదరులు పంచుకోలేనిది, ఖర్చు చేసిన కొద్దీ దిడిన ప్రవర్ధమానమయ్యేది అయిన విద్యాసంపద, అన్ని సంపదలలోకెల్లా ప్రధానమైనది.

భౌతిక సంపదలన్నింటికంటే, ఉత్తమోత్తమైనదిగా విద్యాసంపదను ప్రాచిఇన భారత సమాజం గుర్తించింది. ప్రస్తుత సమాజంలో సామాజిక ప్రజానికం విద్యనూ కేవలం లఔకిక విద్య గానే పరిగణిస్తున్నారు. ప్రాచీనా భారతదేశంలోవిద్యకు మానవుని సంపూర్నవ్యక్తిత్వంగల ఉన్నతునిగా తీర్చిదిద్దే విధానంగా గుర్తింపు ఉండేది. కానీ, పాశ్చాత్యులు విద్యనూ లఔకిక జీవనయాత్రకు సిద్ధం చేసే శిక్షణగా భావించారు. అయితే, భారతీయులు డానికి పైసోపానమైన ఉత్త్రజన్మకు కూడా అనుకూలమార్గమైన పద్ధతినిఅవలంబించారు. ఈ రెండింటిని సమన్వయాన్ని మన ప్రాచీనులు సాధించారు. మానవాభ్యుదయానికి ప్రధానమైన విద్యారంగం, ప్రాచీనభారతంలో అత్యున్నత ప్రమాణాలతో పరిడవిల్లింది. ప్రాచీన భారత సాహిత్యాన్నీ, శాసనాలను, తదితర స్మృతిచిహ్నాలను పరశీలించినట్లయితే, ఆనాటి విద్యావిదానపు విశిష్టత, విద్యాసంపద, అందులోని శాస్రీయ దృక్పధం, మానవతా విలువలు ద్యోతకమవుతాయి.

వేదవిదులైన నాటిరాజులు, కర్మిష్టులైన అగ్రహారాలను దానంగా ఇచ్చేవారు. ఆ అగ్రహారాలలో అన్ని వసతులతో కూడిన గ్రుహాలుండేవి. ఆ గృహాలే విధ్యాపీఠాలుగా విరాజిల్లేవి. అలాగే దేవాలయాలు, మాఠాలు, అరణ్యకళాశాలలో కూడా విద్యాబోధన జరుగుతుండేది. వేదాధ్యయనం, వ్యాకరణం, స్వరశాస్త్రం, దర్శనములు, ధర్మశాస్త్రములు, పురాణాలు, చంధోలంకారాలను విప్రులు నేర్చుకోగా, మిగిలినవారు వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం, సైనికశిక్షణ తదితరాలను అభ్యసించేవారు. శ్రమవిభజ ఆధారంగా సమాజంలో వివిధ వర్గాలకు ఉపయుక్తాలైన విద్యను నేర్చేవారు.

ఆరోజులలో విద్యాలయాలను నిర్మంచేందుకు కొన్ని ప్రామాణికమైన నియమాలుండేవి. ఊరికి దూరంగా, విశాలమైన ప్రదేశంలో ప్రకృతి శోభల మధ్య, ఫలవృక్షాలతో, పుష్పలతాదులతో, ఒషదీలతలతో, కూరగాయల పాడులతో నిండిన ప్రదేశాన్ని ఎంచుకునేవారు. గురువు నివాసానికై ఒక మందిరాన్ని, విద్యార్థుల్ వసతి గ్రుహానికై ఒక మందిరాన్ని నిర్మించేవారు. అక్కడి ప్రకృతి శో, ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్నికలుగజెస్తూ విద్యపై ఏకాగ్రతను దోహదం చేసేవి. ప్రతిదినం విద్యాబోధన ఓ పెద్ద పందిరి క్రింద జరుగుతుండేది. ప్రస్తుతం నగరాలలో కిక్కిరిసిన జనావాసాల మధ్య బహుళ అంతస్తుల భవనాలలో పాఠశాలలను నిర్వహిస్తుండటాన్ని చూస్తోంటే, మన విద్యావిధానం ఎంతో లోపభూయిష్టంగా ఉందో తెలుస్తోంది. విద్యార్థులకు కనీస అవసరమైన ఆటస్థలం కూడ ఈనాటి చాలా విద్యాలయాలలో కరువైంది. విద్యార్థులు స్వయంగా తయారుచేసుకున్న కొబ్బరి ఆకుల చాపలపై కూర్చునేవారు. గురువు విద్యార్ధుల నడుమ క్రుష్ణాజినంపై కూర్చుని జ్ఞానముద్ర ధరించిన వెంటనే విద్యార్ధులందరూ ఏకకంఠముతో ప్రార్ధన చేసేవారు.

ఓం సహానావవాతు సహనఔ భువక్తు
నహ వీర్యం కరవావహై: తేజస్వి
నావదీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి: శాంతి: శాంతి:
 
ఆ పరమాత్మ మనతో పాటూ ఉండి మనలను రక్షించుగాక. ఆ పరమాత్మ మన కూడ ఉండి మనకు సుఖమును కలిగించుగాక. మన విద్యకు బలం కలుగునట్లుగా మనం ప్రయత్నింతుము. మన అధ్యయనం ఆచరణ ప్రభావం కలుగునది అగుకాక. మనం ద్వేశారహితులమై ఉందుముగాక. ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:

పాఠ్యాంశాన్ని ఒక విద్యార్ధి చదువగా, ఆచార్యుడు అర్ధాన్ని వివరిస్తాడు. వెంటనే మరొక విద్యార్థి తిరిగి వివరింగా చెబుతాడు. మిగిలిన విద్యార్థులందరికీ అప్పటికే విషయం పూర్తిగా అర్ధమయ్యేది. కఠినమైన అంశాలను సైతం గురువు సరళంగా బోదించేవాడు. ప్రతిదినం విద్యార్ధులను సునిశితంగా గమనిస్తూ, వారి గ్రహణశక్తిని, బుడ్డి బలాన్ని పరీక్షిస్తూ పాఠ్యాంశాన్ని పూర్తిగా నేర్పేవారు. ప్రతి విద్యార్థి పాఠ్యాంశాన్ని నూటికి నూరుపళ్ళు అవగతం చేసుకున్న పిదపే, తరువాతి అంశం బోధింపబడేది. సంశయాన్ని మనసులో ఉంచుకుని పాఠాన్ని ముగించే విద్యార్థులు ఉందేవారు కాదు. ఆరోజు పరీక్షలలో నూటికి నూరు గుణములు వచ్చిన విద్యార్ధే ఉత్తీర్ణుడైనట్లు లెక్క. నిరంతర మననం, నిరంతర పఠనం, ఏకాగ్రత ముఖ్య సూత్రాలుగా ఉండేవి.శబ్దార్ధములుగానీ, తాత్పర్యములుగానీ వ్రాసుకోవడం ఉండేదికాదు. సహాధ్యాయులతో కలసి చర్చించడం ద్వారా మేధాశక్తిని పదును పెట్టుకునేవారు. కొంతమంది విద్యార్దులే దిగువ తరగతి వారికి పాఠం చెప్పే సంప్రదాయం ఉండేది. గురువు ఎదుటనే శిష్యుడు పాఠాన్ని బోధించే పద్దతి భారతీయ విద్యా రంగంలో విశిష్టమైనదిగా గుర్తింపు ఉండేది. ఈ పద్దతి వలన విద్యార్థులకు తమ జ్ఞానాన్ని పెంపోందిచుకొనడమేకాక, చక్కని బోధనాశక్తి అలవడేది.
 
పిల్లలకు ఐదు సంవత్సరాలు నిండిన వెంటనే అక్షర స్వీకారం చేసేవారు. నాటి విద్యాసంవత్సర శ్రావణ పూర్ణిమ నాటి ఉపకర్మతో ఆరంభమై పుష్యశుద్ద పూర్ణిమ నాటి ఉత్సర్జన వ్రతంతో అంతమయ్యేది. ఇది వేదాధ్యయనానికి సంబంధించినది. అష్టమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అనాధ్యాయ దినాలుగా పాటింబడేవి. అతివృష్టి, అనావృష్టి, భూకంపం, గ్రహణము మరియు ప్రకృతి వైపరీత్య సమయాలలో కూడ సెలవులుండేవి. ఇవిగాక పండుగలకు, యుద్దములు, దండయాత్రలకు కూడా సెలవులిచ్చేవారు. ఉన్నతవిద్య అంతా సంస్కృతభాషలో ఉండేది. వైదికవిద్యకు ఉపనయనం తోలి విధిగా ఉండేది. ఉపనయనానంతరం బాలుడు బ్రహ్మచర్య దీక్ష వహించి గురు శుశ్రూషతో విద్యార్జన సాగించేవారు. బ్రహ్మచారి పాటించవలసిన క్రమశిక్షణ చాలా కఠినంగా ఉండేది. బ్రహ్మచారి ఆశ్రమంలో నివశిస్తూ, అగ్నికార్యానికి ఇంధన సేకరణ, పశుపాలన, భిక్షాటనం చేయాలి. భూశయనం, త్రికాలశేతజల స్నాం, సంధ్యావందనం, అగ్నికార్యం విధిగా ఆచరించాలి. సాత్వికాహారం తప్పనిసరి. విధేయత, జితేంద్రియత్వం, శ్రద్దబుద్ధులు, జిజ్ఞాస, సాంఘీకసేవ, ప్రకృతి సౌందర్యోపాసన, నియమబద్ద జీవనం ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. సహాధ్యాయులతో బ్రహ్మచర్య దీక్షలోని భాగమే.

నాటి గురువులకు కూడ చక్కని నియామవళి ఉండేది. కఠిన శిక్షలు విధంపరాదు. శిక్ష అవసరమని తోస్తే చీల్చిన వెదురు బద్దతో వీపుపై వడ్డింపవల్నేగానీ, కర్కశంగా, విచక్షణారహితంగా శిక్షింపరాదు. దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే, అట్టి గురువు రాజుచే శిక్షితుడవుతాడు. భయపెట్టడం, ఉపవాసం, అకాల శీత జల స్నానం, ఆస్రమబహిష్కరణం వంటి శిక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. గురువు శాంతికాముడై సహనంతో విద్యార్థిని సంపూర్నవ్యక్తిగా తీర్చిదిద్దు శక్తిమంతుడై ఉండేవాడు. ప్రతి విద్యార్థిని ప్రత్యెక శ్రద్దతో విజ్ఞాననిధిగా, సుశీల సంపన్నునిగా తీర్చిదిద్ది ప్రజ్ఞామూర్తులుగా గురువులు ఉండేవారు. నాటి గురుశిష్య సంబంధం ఒక అపూర్వమైన విషయం. గురువు పిత్రుసమానుడు. శిష్యుడు పుత్ర సమానుడు. శిష్యులకు భక్తి గౌరవాలు, ఉర్వులకు వాత్స్ల్య ఆదాములు సమస్థాయిలో ఉండేవి. విద్యార్జనాటో పాటు ఆశ్రమ నిర్వహణ భారాన్ని విద్యార్దులే చూసేవారు. ఫలితంగా లోకజ్ఞత మెండుగా ఉండేది. నేటి అధ్యాపకులు తమ వృత్తిని ఎంతో ఉన్నతమైనడిగా గుర్తించి, శాస్త్రజ్ఞానంతో పాటు అధ్యాపకులుగా తమ అర్హతలు సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. నేటి వార్తాపత్రికలలోని కొన్ని కధనాలను పరశీలించినట్లయితే కొంత మంది అధ్యాపకుల విపరీత ధోరణులు మనకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మేధావులు, విద్యావేత్తలు ఈ దొరనిపట్ల దృష్టి సారించి జాగరూకత వహించాల్సి ఉంది.

విద్య పూర్తయిన పిమ్మట బ్రహ్మచారి సమావర్తన, స్నాతక కర్మలను ఆచరించి గురుదక్షిణ సమర్పించాలి. జీవనభ్రుతికై ఆచార్యుడు గురుకులంనుండి కదలవలసిన అవసరమే ఉండేది కాదు. రాజులు, సంపన్న గృహస్థులు వార్శికములను ఇవ్వడం, భూదానాలను చేయడం జరుగుతుండేది. ఆ విధంగా పరిపాలకులు, ప్రజలు విద్యారంగాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. మహాభారతంలో ప్రఖ్యాతి చెందిన ఆశ్రమాల గురించిన ప్రస్తావన ఉంది. ఈ ఆస్రమాలలోగల వివిధ స్థానములు ఒక్కొకటి ఒక్కొక్క ప్రత్యెక విద్యకు ప్రసిద్ధి చెంది ఉన్నాయి.

అగ్నిస్ధానం: ఇందు అగ్నికార్యములు, ఔపాసనాది కార్యములు జరుగ్తుండేవి.
బ్రహ్మస్ధానం: ఇందు కేవలం వేదాధ్యయనం జరుగుతుండేది.
విష్ణుస్థానం: ఇచ్చట రాజనీతి, అర్ధశాస్త్రాన్ని బోధించే వారు.
మహేంద్రస్థానం: సైనిక శిక్షణకు సంబందించినది.
వైవస్వత స్థానం: ఖగోళ విజ్ఞాన భాగం.
సోమ స్థానం: వృక్ష శాస్త్ర భాగం.
గరుడ స్థానము: ఇది రవాణా, వర్తక, వ్యాపారాలకు సంబందించినది.
కార్తికేయ స్థానము: సైన్య సమీకరణం, యుద్ధ సన్నాహము, పర్యవేక్షణ వంటి వ్యూహాత్మక విద్యలలో శిక్షణ జరుగుతుండేది.

ఇలా ప్రఖ్యాతి చెందిన ఆశ్రమాలలో ప్రముఖమైనది నైమిశారణ్యక విశ్వవిద్యాలయం. ఈ ఆశ్రమ నిర్వాహకుడైన శౌనకునకు కులపతి అనే బిరుదు ఉండేది. ఇక్కడ వేదాంతం, శాస్త్ర విజ్ఞానం, మతం తదితర విషయాలపై గోష్ఠులు జరుగుతుండేవి. మరోక ప్రసిద్ధి చెందిన ఆశ్రమం కణ్వమహర్షి నిర్వహాణలో మాలినీ నదీతీరలో ఉండేది. మాలినీనది సరయూనదికి ఉపనది. ఈ ఆశ్రమ సమీపంలో అనేక ఆశ్రమాలుండేవి. వేదఘోషలతో, పవిత్ర త్రేతాగ్నులతో ఈ ప్రాంతమంతా పునీతమై ఉండేది. ఈ ఆశ్రమాలలో చంధస్సు, వ్యాకరణం, తర్కం, న్యాయశాస్త్రం, క్షేత్రగణితం, ద్రవ్యగుణశాస్త్రం, జీవశాస్త్రం అభిమాన విద్యలుగా అభ్యసించిన పండితులుండేవారని ప్రతీతి.

ప్రయాగలో భరద్వాజుని ఆశ్రమం, చిత్రకూటంలో అత్రి ఆశ్రమం కూడ పేరెన్నికగలవి. వ్యాసుని ఆశ్రమంలొ సుమంతుడు, వైశంపాయనుడు, జైమినివంటి మహర్షులు పాండిత్యంలో చరిత్ర ప్రసిద్ధులై ఉండేవారు.సైలుడు బ్రహ్మవిద్యలో విఖ్యాతి గాంచాడు. విదేహరాజైన జనకుని ఆస్థానం శాస్త్రచర్చలకు, సిద్దాంత స్థపనమునకు పేరెన్నికగన్నది. అష్టావక్రుడు తన వాదనాపటిమతో సర్వసభ్యులను ఓడించి జనకునిచే ప్రశంసింపబడెను. ప్రతికళాపరిషత్తుకు అనుబంధంగా ఆచార్యశాఖలుండేవి. ఈ పరిషత్తులలోని పండితులు వివాదాంశలపై తీర్పును ఇచ్చేవారు. వారి తీర్పులు శిరోధార్యంగా ఉండేవి.
ప్రపంచమ్ళో ప్రపథమంగా ఖగోళశాస్త్రం, రేఖాగణితం, వ్యాకరణం, వేదాంతం మనదేసంలోనే అభ్యసింపబడ్డాయన్నది విదితమే. వైద్యశాస్త్రం, శస్త్రచికిత్సావిధానం అత్యున్నత ప్రమాణాలతో అభ్యసింపబడినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వైద్యాలయాలను స్థాపించిన మొదటిదేశంగా భారతదేశం ప్రసిద్ధి చెందింది. ఇచ్చటి వైద్యుల నిపుణతను చూసిన అలెగ్జాండర్ ఆశ్చర్యచకితుడయ్యాడట! పాటలీపుత్రములోని ఒక వైద్యాలయాన్ని సందర్శించిన ఫాహియన్ ఇలా వ్రాసాడు. “ఇచ్చట బీదలు, అనేక దీర్ఘరోగ పీడితులు చికిత్సకై వచ్చి పూర్తి స్వస్థతతో వెళ్ళేవారు. ఇచ్చటి వైద్యులు అంకిత భావంతో చేసే సేవలు నిరుపమానమైనవి”
.

తక్షశిల విశ్వవిద్యాలయం వైద్యవిద్యకు ప్రసిద్ధి గాంచి ఉందేది. చరకుడు, శుశ్రుతుడు, వైద్యవిద్యాపండితులు. వీరి వద్ద కనీసం ఏడు సంవస్తరాలు కఠన విద్యను అభ్యసించి నిష్ణాతులైన వైద్యులెందరో మెసపతోమియా, అరేబియా దేశాలకు పంపబడేవారని తెలుస్తోంది. సంస్కృత భాషలోగల శుశ్రుతుని వైద్యవిద్యా గ్రంథాలు అరబిక్ భాషలోకి అనువదించబడ్డయి. పశు వైద్యవిజ్ఞానం కూడ భారదేసంలోనే బాగా అభివృద్ధి చెందింది. నేటి వైద్యవిద్యారంగాన్ని నాటి వైద్య విద్యతో పోల్చినపుడు ఎంతటి వ్యాపరధోరణి వ్యాప్తి చెందిందన్న విషయాన్ని తెలుసుకోగలం.

క్రీ.పూ.7వ శతాబ్దం వరకు మనదేశం అక్షరాస్యత విషయంలో అగ్రగామిగా ఉండటమేగాక, అనేక విజ్ఞాన రంగాలలో ప్రతిభావంతుల సంఖ్య ఎక్కువగ ఉన్నట్లు తెలుస్తోంది. క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు భారతాన్ని సందర్శించిన విదేశీపండితులెందరో భారతీయ విద్యాప్రాభవాలను ప్రముఖంగా ప్రశంసించారు. తక్షశిల, నలంద, వల్లభి, విక్రమశిల, నవద్వీపము, జగదల, ఓదంతపురి వంటి జగద్విఖ్యాత విశ్వ విద్యాలయాలయములకు భారతదేశం పుట్తినిల్లు. ఇలాంటి విద్యాలయలన్నీ మహమ్మదీయుల దండయాత్రలలో నేలమట్ట మయ్యాయి. బ్రిటిష్ వారు మనదేశంలో ప్రవేశించే నాటికి, ఆయా గ్రామాలలోని ప్రజలే సమాజాలుగా ఏర్పడి విద్యాలయాలను నిర్వహించే పద్ధతి ఉండేది. ఆ విద్యాలయాలు భారతీయ సంస్కృతి ఔన్నిత్యాన్ని కాపాడుతూ ఉత్తమస్థాయిలో విద్యాభోధనను గావించేవి. ఈస్టిండియా కంపెనీ ఏజెంట్లు ఈ విద్యాసంస్థలలో ఇంగ్లీషు విద్యను పాశ్చత్యపద్ధతిని ప్రవేశపెట్టారు.

సమకాలిన విద్యారంగంలో భారతీయ సంస్కృతి, విలువలు, ఔన్నత్యం మృగ్యం కావడానికి ఆనాటి బిటిష్ పాలకులు నాటిన విషబీజాలే కారణం. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి, తల్లిదండ్రుల అందోళనలు, నైతికవిలువల్ పతనం, వ్యాపారధోరణులువంటి అనర్థాలతో నేటి విద్యారంగం సతమతమవుతోంది. విజ్ఞుడైన ప్రతి భారతీయ పౌరుడు మేల్కొని మన మహోన్నత ప్రాభవాన్ని పరిరక్షంచుకోవలసిన సమయమిది. అందుకై అందరూ నడుం బిగించక తప్పదు.

ప్రపంచమ్ళో ప్రపథమంగా ఖగోళశాస్త్రం, రేఖాగణితం, వ్యాకరణం, వేదాంతం మనదేసంలోనే అభ్యసింపబడ్డాయన్నది విదితమే. వైద్యశాస్త్రం, శస్త్రచికిత్సావిధానం అత్యున్నత ప్రమాణాలతో అభ్యసింపబడినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వైద్యాలయాలను స్థాపించిన మొదటిదేశంగా భారతదేశం ప్రసిద్ధి చెందింది. ఇచ్చటి వైద్యుల నిపుణతను చూసిన అలెగ్జాండర్ ఆశ్చర్యచకితుడయ్యాడట! పాటలీపుత్రములోని ఒక వైద్యాలయాన్ని సందర్శించిన ఫాహియన్ ఇలా వ్రాసాడు. “ఇచ్చట బీదలు, అనేక దీర్ఘరోగ పీడితులు చికిత్సకై వచ్చి పూర్తి స్వస్థతతో వెళ్ళేవారు. ఇచ్చటి వైద్యులు అంకిత భావంతో చేసే సేవలు నిరుపమానమైనవి”.
తక్షశిల విశ్వవిద్యాలయం వైద్యవిద్యకు ప్రసిద్ధి గాంచి ఉందేది. చరకుడు, శుశ్రుతుడు, వైద్యవిద్యాపండితులు. వీరి వద్ద కనీసం ఏడు సంవస్తరాలు కఠన విద్యను అభ్యసించి నిష్ణాతులైన వైద్యులెందరో మెసపతోమియా, అరేబియా దేశాలకు పంపబడేవారని తెలుస్తోంది. సంస్కృత భాషలోగల శుశ్రుతుని వైద్యవిద్యా గ్రంథాలు అరబిక్ భాషలోకి అనువదించబడ్డయి. పశు వైద్యవిజ్ఞానం కూడ భారదేసంలోనే బాగా అభివృద్ధి చెందింది. నేటి వైద్యవిద్యారంగాన్ని నాటి వైద్య విద్యతో పోల్చినపుడు ఎంతటి వ్యాపరధోరణి వ్యాప్తి చెందిందన్న విషయాన్ని తెలుసుకోగలం.
క్రీ.పూ.7వ శతాబ్దం వరకు మనదేశం అక్షరాస్యత విషయంలో అగ్రగామిగా ఉండటమేగాక, అనేక విజ్ఞాన రంగాలలో ప్రతిభావంతుల సంఖ్య ఎక్కువగ ఉన్నట్లు తెలుస్తోంది. క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు భారతాన్ని సందర్శించిన విదేశీపండితులెందరో భారతీయ విద్యాప్రాభవాలను ప్రముఖంగా ప్రశంసించారు. తక్షశిల, నలంద, వల్లభి, విక్రమశిల, నవద్వీపము, జగదల, ఓదంతపురి వంటి జగద్విఖ్యాత విశ్వ విద్యాలయాలయములకు భారతదేశం పుట్తినిల్లు. ఇలాంటి విద్యాలయలన్నీ మహమ్మదీయుల దండయాత్రలలో నేలమట్ట మయ్యాయి. బ్రిటిష్ వారు మనదేశంలో ప్రవేశించే నాటికి, ఆయా గ్రామాలలోని ప్రజలే సమాజాలుగా ఏర్పడి విద్యాలయాలను నిర్వహించే పద్ధతి ఉండేది. ఆ విద్యాలయాలు భారతీయ సంస్కృతి ఔన్నిత్యాన్ని కాపాడుతూ ఉత్తమస్థాయిలో విద్యాభోధనను గావించేవి. ఈస్టిండియా కంపెనీ ఏజెంట్లు ఈ విద్యాసంస్థలలో ఇంగ్లీషు విద్యను పాశ్చత్యపద్ధతిని ప్రవేశపెట్టారు.
సమకాలిన విద్యారంగంలో భారతీయ సంస్కృతి, విలువలు, ఔన్నత్యం మృగ్యం కావడానికి ఆనాటి బిటిష్ పాలకులు నాటిన విషబీజాలే కారణం. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి, తల్లిదండ్రుల అందోళనలు, నైతికవిలువల్ పతనం, వ్యాపారధోరణులువంటి అనర్థాలతో నేటి విద్యారంగం సతమతమవుతోంది. విజ్ఞుడైన ప్రతి భారతీయ పౌరుడు మేల్కొని మన మహోన్నత ప్రాభవాన్ని పరిరక్షంచుకోవలసిన సమయమిది. అందుకై అందరూ నడుం బిగించక తప్పదు.

No comments:

Post a Comment