13 November 2013

హిందు సనాతన ధర్మము ... అందులోని మతాలు :

హిందు సనాతన ధర్మములోని మతాలను స్వీకరించవలసిన ఆవశ్యకత.
వాటి వివరణ.

అష్టాదశ పురాణాలు ఉన్నాయి.అందులో దేవి భాగవతం,కృష్ణ భాగవతం.ఇవి రెండు మాత్రం ముఖ్యమైనవి.
ద్వైతులు కృష్ణ భాగవతంను శ్రీ మద్భాగవతంగా పిలుస్తారు.కాని,దేవి భాగవతం ఐన శ్రీ మద్భాగవతం ఐన వివరించేది ఒకే అంశం..,
"దుష్ట సంహారం కోసం భగవద్స్వరూపం ఈ కాలానికి అనుగుణంగా మానవ స్వరూపం స్వీకరించటం జరుగుతుంది.దుష్ట సంహారం కోసం భగవంతుడు దిగి రావటం జరుగుతుంది".
ఆపదలో ఉన్నవాడిని కాపాడిన వాడు భగవంతుడు అని భాగవతం చెప్తోంది.

భగవంతుడు దుష్ట సంహారం కోసం మానవ జన్మ స్వీకరించటానికి కారణం:-
శక్తి స్వరూపంలోని భగవంతుడి కాలం లేక సమయం మరియు మానవ కాలం లేక సమయం ఒకటి కాదు.మనం ముందు చూసాము కదా ఈ వేదం యొక్క మొదటి పోస్ట్ భగవంతుడి వయస్సు ఎంతో ఆయనిప్పుడు మనకంటే ఎంత ముందు ఉన్నాడో...కాల భేదం ఉన్నందు వలన ఇక్కడి పరిస్తితులు అర్ధం చేసుకోవాలి అంటే మానవ జన్మ ఎత్తాల్సిందే.అదే రామ,కృష్ణ అవతారములకు కారణము..
మానవ స్వరూపం స్వీకరించటంలో ఇది ఒక కారణం.ఇంకా ఇచ్చిన వరాలు,ఆయన చేసిన కర్మలు కూడా ఆయన మానవ జన్మకు కారణం అవుతాయి.ఇలా చాలా కారణాల వలన దుష్ట సంహారం కోసం మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది.

భాగవతంశాలు మతంగా పిలువబడుతున్న సనాతన హిందూ ధర్మం లోని వివరించబోవు అంశాలు ఇవి.
1.అద్వైతం.
2.ద్వైతం.
3.విశిష్టాద్వైతం.
4.శాక్తేయం.
5.వైష్ణవం.
6.శైవం.

1.అద్వైతం.

అద్వైతం ఆదిశంకర నిర్మితం. ఏకత్వ భావన ముఖ్యోద్దేశంగా సర్వజన సమానత్వాన్ని పెంచటానికి ఆనాటి హిందూ ద్వేష బౌద్దాన్ని ఎదుర్కోవటానికి రూపొందించబడిన మతం అద్వైత మతం.అంటే ఆత్మ పరమాత్మా ఒక్కటే.రెండు వేరు వేరు కాదు.
ప్రపంచం లో చివరికి ఉండేది శూన్యమే.జీవితం ఆఖరున మనం పట్టుకుపోయ్యేది కుడా శూన్యమే.
మన ఆత్మాభిమానాన్ని పెంచుకుని ఎదుటి వాడి ఆత్మలోని పరమాత్మను నమస్కరించి గౌరవించటం ద్వారా మానవత్వాన్ని సర్వ ప్రాణి సమానత్వాన్ని పెంపొందించటం అద్వైతం యొక్క లక్ష్యం.బుద్దుడు ఎందుకు బౌద్దాన్ని నిర్మించాడు.అసమానత చూపుతున్న ఆనాటి సమాజాన్ని మార్చటానికి క్షత్రియుడైన తను కాషాయ వస్త్రాలు ధరించి మౌని గా మారి మహా యానం ను సమర్దం గా హిందూ సనాతన ధరంభద్దం గానే నడిపాడు.కాని హీన యానం సమయానికి బౌద్ధం హిందూ ధర్మాన్ని ద్వేషించటం ప్రారంభించి వేదాలను నాశనం చెయ్యటం ప్రారంభించింది.ఆకాలంలో వేద రక్షణకై అందరికి అర్ధం అయ్యేలా ప్రస్తానత్రయభాష్యం కోసం అవతరించిన శంకరఅంశగా ఆదిశంకరాచార్యులను భావించటం జరిగింది.అద్వైతాన్ని తర్కవిధానంలో స్తిరీకరించటం జరిగింది.నాలుగు వైపులా నాలుగు శంకర శక్తి పీటాలు స్తాపించటం జరిగింది.
దేశం నలుమూలలా మఠాలను స్థాపించి ఆయన శిష్యులైన పద్మపాదులు (తూర్పున పూరి లో), హస్తామలకులు (పడమరన ద్వారకలో), తోటకాచార్యులు (ఉత్తరాన జ్యోతిర్మఠంలో), సురేశ్వరాచార్యులు (దక్షిణంలో శృంగేరి లో) దేశం నలువైపులా మఠాలను ఏర్పరిచారు. ఆ తరువాత ఆ మఠాలలో ప్రతీ గురువు ఒక శిష్యుడికి ఉపదేశం చేసి గురుపరంపర కొనసాగిస్తున్నారు.
శివ కేశవుల ఏకత్వ భావమే అద్వైతం.
శంకర మాయా వాదం.
"బ్రహ్మ సత్యం జగన్మిధ్య
జీవొ బ్రహ్మైవ నా పరః"

బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య(శూన్యం).
ఈ జీవుడే బ్రహ్మం.
జీవుడు(ఆత్మ), బ్రహ్మము వేరు కాదు.
- ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది.

తర్క తత్వ వాద సూత్రాలు
(స్వల్పంగా "ఆత్మానాత్మ వివేకం" అను గ్రంధం నుంచి)..,
1.ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?
పూర్వ జన్మ లలోని కర్మ వలన.
2.కర్మ ఎందుకు జరుగుతుంది?
రాగం (కోరిక) వలన.
3.రాగాదులు ఎందుకు కలుగుతాయి?
అభిమానం (నాది, కావాలి అనే భావం) వలన.
4..అభిమానం ఎందుకు కలుగుతుంది?
అవివేకం వలన
5.అవివేకం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానం వలన
6.అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. జ్ఞానం లేని చోట అజ్ఞానం ఉంటుంది.అందుకుకారణం ఉండదు) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.
అనగా అజ్ఞానం వలన అవివేకం, .
అవివేకం వలన అభిమానం,
అభిమానం వలన రాగాదులు,
రాగాదుల వలన కర్మలు,
కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ),
అందువలన దుఃఖం కలుగుతున్నాయి.
నిష్కామ కర్మ విధానం యొక్క ప్రశక్తి ఇక్కడ ఉంటుంది.

2.ద్వైతం :

మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.

మధ్వ సిద్ధాంతం
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
మధ్వమతము పంచ భేదములను ప్రవచిస్తుంది. అవి
1. జీవుడు వేరు బ్రహ్మము వేరు (జీవ - దేవ భేదము)
2. ఒక జీవుడుకి, ఇతర జీవులకు భిన్నత్వం ఉంది (జీవ - జీవ భేదము)
3. జీవుడికి, జడ జగత్తుకు భేదం ఉంది (జీవ - జడ భేదము)
4. జడ జగత్తు వేరు, బ్రహ్మము వేరు (జడ - దేవ భేదము)
5. జడ జగత్తులో ఒక వస్తువుకి, ఇతర వస్తువులకు భేదం ఉంది (జడ - జడ భేదము)
ఈ భేదాలు నిత్యం, శాశ్వతం. జీవుడు ముక్తి పొందిన తర్వాత కూడా ఆ భేదాలు కొనసాగుతాయి.

జగత్తు మిథ్య కాదు. సత్యం, ఎందుకంటే అది ప్రత్యక్షంగా మన ఎదుట కనిపిస్తుంది. అది అశాశ్వతమైనంత మాత్రాన లేదా నిరంతర పరిణామం చెందుతున్నంత మాత్రాన లేకుండా పోదు. ఒక వస్తువును పోలి మరొకటి ఉండదు. అన్నింటా భేదం ఉంది. ప్రతి వస్తువులోను ఇతర వస్తువుల లక్షణాలుండటం జరుగదు.

బ్రహ్మం సర్వోత్తమం. సమస్త సద్గుణాలు బ్రహ్మంలో ఉన్నాయి. బ్రహ్మం ఆనంద స్వరూపం. ఆనందం కారణంగానే దానిచే ప్రేరణ పొంది బ్రహ్మం తన లీలానిమిత్తం ఈ జగత్తును సృష్టించింది. జగత్తు బ్రహ్మంయొక్క వ్యక్తరూపం. సృష్టికిముంది జదజగత్తు సూక్ష్మరూపంలో అవ్యక్తంగా బ్రహ్మంలో ఉంటుంది. సృష్టి సమయంలో అది స్థూలరూపం పొంది వ్యక్తమవుతుంది. బ్రహ్మం తనను తాను వ్యక్తం చేసుకునే విధానమే ఆ సమస్త జగత్తు. అయితే బ్రహ్మం జగత్తుకు అతీతం. బ్రహ్మం లేదా ఈశ్వరుడు సర్వ స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, సర్వ శక్తిశాలి, సర్వవ్యాపి.

జడజగత్తువలె జీవాత్మ కూడా స్వతంత్రుడు కాదు. కర్త కాదు. ఈశ్వరుడు మాత్రమే కర్త. జీవాత్మ తానే కర్త అనుకుంటాడు. అది భ్రాంతి. తాను కర్తను కానని, నిమిత్త మాత్రుడనని గ్రహించి ఈశ్వరునికి తనను తాను సంపూర్ణంగా అర్పించుకుని నిష్కామ కర్మ చేస్తే అది జీవునికి బంధనం కాబోదు. తాను కర్తను అని అహంకారంతోను, మమకారంతోను భ్రమ చెందడం వల్లనే జీవాత్మ సుఖదుఃఖాలకు తలవొగ్గవలసివస్తుంది.

భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. జీవాత్మ తన స్వస్వరూప జ్ఞానం పొందిన తర్వాత సర్వకర్త అయిన ఈశ్వరుడిపట్ల పెంచుకునే భక్తి మాత్రమే ముక్తికి కారణం అవుతుంది.

మరికొన్ని సూత్రాలు
మధ్వ దర్శనాన్ని ఈ క్రింది సూత్రాలు చాల చక్కగా వివరిస్తాయి.
1. హరియే సర్వోత్తముడు. మిగిలిన వారంతా తమ అర్హతను బట్టి పూజింపబడతారు.
అనగా తారతమ్య పధ్ధతి లో విలువకలిగి ఉన్నారు. ఉదాహరణకు దేవతలలో హరి తరువాత లక్ష్మి, బ్రహ్మ-సరస్వతి,వాయు మూర్తి, భవుడు-భవాని, శేష, గరుడ, ఇంద్ర, మన్మథ, గురు, చంద్ర, సూర్య, వరుణ, అగ్ని,మను, యమ, కుబేర,విఘ్నేశ్వర వరుసగా పూజార్హులు (తమ సతులతో సహా).
2. పంచ బేధములు కలిగి ఉన్నందు వల్లనే ఈ విశ్వాన్ని మనము ప్రపంచము అని పిలుస్తాము.
3. ఈ జగత్తు ప్రవాహత సత్యము. అనగా, ప్రవాహములో పాత నీటి స్థానంలో క్రొత్త నీరు నిరన్తరంగా వచ్చి చేరుతునే ఉంటుంది. ఈ క్షణం లో మనం చూసిన నీరు మరు క్షణం ఉండదు. అంత మాత్రం చేత ముందు చూసిన నీటిని మనం అసత్యమని చెప్పుటకు వీలు లేదు. మనం ఏ క్షణం లో ఆ నీటిని చూసామో (గమనించామో) ఆ సమయములొ ఆ నీరు అక్కడ ఉన్నది కాబట్టి, ఆ క్షణానికి అది సత్యం.
4. నేను జీవుడను, హరి కన్న భిన్నుడను, హరి సేవ వలననే తరించెదను (స్వ-స్వరూప-ఆనంద-సంప్రాప్తి/ ముక్తిర్నిజ సుఖానుభూతి)
5. సద్భక్తియే స్వ-స్వరూప-ఆనందానికి (ముక్తికి) సాధనం
6. ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అనే 3 ప్రమాణములు (ఈ 3 ప్రమాణముల చేత పై సూత్రములు నిర్ధారింపబడినవి)
7. అఖిల వేదముల చేత తెలియ చేయ బడినవాడు ఆ హరి ఒక్కడే.

మద్వ సిద్ధాంతం పూర్తిగా అద్వైతానికి భిన్నమైనది.హరి ఒక్కడే భగవంతుడు అనేది నిజం కాని శివుడెం చేసాడు పాపం.ఆయన్ని దూరం చేసారు.హరిహర భేదం చూపటం వివక్షత కు దారి చేస్తునట్లే కదా.శివుడిని పూజించే వాళ్లకు కంటు అయ్యే అవకాశం ఉందికదా అది తెలియక హరి ఒక్కడే దేవుడు అనటం జరిగిందా..లేక తెలిసీ ఇలా శివున్ని తక్కువ స్తానం లో ఉంచారా..
ఏదేమైనా మద్వాచార్యులు సరిగానే చెప్పారు.పాటించే వారి చేతుల్లో ఉంది.అర్హత ఉన్న గురువు సముచితం గా ఆలోచించే చెప్తారు.ఆధిపత్యం కోసం సిద్దాంతం మార్చే అవకాశాలు లేకపోలేదు.ఏదేమైనా శివుడైనా కేశవుడైనా ఒకటే అనే ఆలోచన ఉంటే ఎలా ఉన్న పర్లేదు.కాని ఆ ఆలోచన లేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారు.

హనుమంతుడు నేను రామ భక్తుడిని అని బ్రహ్మకు నమస్కారం చేసి గౌరవించకుండానే బ్రహ్మ నుంచి బ్రహ్మాస్త్ర ప్రయోగం తన మీద పనిచెయ్యకుండా వరం పొందాడా..భీముడు కృష్ణుడికి మాత్రమె నమస్కారం చేసాడా ధర్మరాజుకు భీష్మ పితామహుడు,కుంతి లాంటి పెద్ద వారైన మానవ మాత్రులకు నమస్కారం చెయ్యకుండానే గోప్పవాడయ్యాడా..మరి వీరిద్దరి అంశ గా పుట్టిన శ్రీ మద్వాచార్యుల వారు శివుడికి తక్కువ స్తానం కలిపించటానికి కారణం ఏమై ఉంటుంది..లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.కాని వారు మాత్రం శివుడిని తక్కువ సార్లు స్మరిస్తారు.మిగిలిన సమయాలలో నామమాత్రం కూడా వాడరు.

ఏదేమైనా మిగిలిన దేవతలకు సరైన స్తానం ఇవ్వకుండా హరి ఒక్కడే దేవుడు అని భావించినంత వరకు సమస్త లోకానికి ఒక అధిపతి స్తానంలో ఉండి మరియు శక్తి స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కూడా ఈ వాదాన్ని సమర్దించడు.ఆపే ప్రయత్నం చేస్తాడు.ఈ విధానం శివారాధ్యులను మరియు విష్ణుఆరాధ్యులను దూరం చెయ్యటంలో ప్రముఖ పాత్ర వహించింది.
తరువాత శైవం వైష్ణవం అనే రెండు మతాలు ఇంకా బాగా ప్రముఖ పాత్ర వహించాయి ఐకమత్యంన్ని నిర్మూలించటంలో. మతాచార్యులేప్పుడూ సరైనదే చెప్తారు పాలకుడు సమర్డుడైతే,దేశ రక్షణ బాధ్యత స్వీకరించిన వాడైతే ఐకమత్యం కోసం చర్యలు తీసుకునే వాడు.
ఐకమత్యం లేదు అంటే ఆనాటి పాలకులదే తప్పు.
ద్వైతంలోను అద్వైతం లోను రెండిటిలోనూ అయోమయం ఉంటుంది.

1.అద్వైతం లోని అయోమాయం సిద్దాంతం అర్ధం అవగానే అయోమయం తీరిపోతుంది.
"ద్వైతం లోని అయోమయం కూడా పటా పంచలవుతుంది కాని ఎప్పుడు హరి ఒక్కడే ఈ ప్రపంచంలో భగవంతుడు అని భక్తుడు నమ్మినప్పుడు మాత్రమే.శివ భక్తులకు ద్వైతం లోని మర్మం తెలుసుకోవాలి అంటే హరుడిని హరి కంటే తక్కువగా భావించాలి.మనకు ఇష్టమైన వాళ్ళను పక్కవారితో పోల్చేటప్పుడు సమానంగా అయిన పోల్చుకుంటాం కాని తక్కువగా పోల్చుకోలెం కదా ".
అదే ఇక్కడ జరిగింది.
2.కావున ద్వైతం లోని అయోమయం హరి స్మరణే తీరుస్తుంది.
అవును హరి స్మరణే అన్నిటికి సరి ఐనది..ఈ విషయం లో ఎటువంటి వ్యతిరేకతా లేదు.

3.విశిష్టాద్వైతం :

విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిరాని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు రెండు:

=>మొదటిది, ప్రబలంగా కొనాసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
=> రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతంలోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు:
1.సాంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి వాటిని మానటమో మార్చటమో చేయటం ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.
2.దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
3.మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది సరో తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యం చేయవలసిన పనిలేదు.
4.ఒక పని వల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగా మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు.

ప్రధాన సిద్ధాంతం:
విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు.
పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది.
జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం.
మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం.
మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు.
కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.

నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు.
అవి
1.అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు.
2.విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
3.వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
4.సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
5.అంతర్యామి - సకల జీవనాయకుడు.
భగవంతుడైన మహా విష్ణువే అన్నిటికి మూలం.ఇదే విశిష్టాద్వైతం.

4.శైవము :

శైవం ప్రకారం సమస్త లోకానికి అధిపతి సదాశివుడు.శివుడే సృష్టి స్తితి లయ కారుడు.నడిపించేది ఆయనే,ఆపేదీ ఆయనే.శైవం ఈ భావనతో ఉండేది.
శైవ మతం ఆ కాలం లో మన భుబాగంలోనే కాక నేపాల్,శ్రీ లంక,దక్షిణ ఆసియ భూబాగాలైన మలేసియా,ఇండోనేషియా సింగపూర్ దేశాలలో కూడా మతం గా వాడుకలో ఉండేది.
శైవం యొక్క చరిత్ర అతి పురాతనం ఐనది.
శ్వేతాశ్వతర ఉపనిషద్ (bc 400-200) లో ఆనాటి శైవ సంప్రదాయాలను వివరించటం జరిగింది.గుప్తులకాలం(ce.300 to 500 అని అంటున్నారు)లో శైవం భాగా అభివృద్ధి చెందినట్లుగా సమాచారం.
శైవం గొప్ప అక్షరాస్యతను కలిగి అనేక సిద్దాంతాలను కలిగి ఉండేది. అందులో భాగం గా మూడు సిద్దాంతాలు ఉండేవి.అవి:
1.అభేద సిద్దాంతం.
2.భేద సిద్దాంతం.
3.భేదాభేద సిద్దాంతం.
ఆనాడు భారత భూభాగంలో శైవ సంప్రదాయాలు అనేక శాఖలుగా విస్తృతి చెందాయి.వాటిని కింద వివరించటం జరుగుతుంది.

రుద్రుడిని లేక శివుడిని పూజించే దిశగా ఏర్పడిన విధానాలు రెండు శాఖలుగా విభజన చెందాయి.అందులో ఒకటి" పురాణాల ఆధారంగా శివుడిపైన భక్తిని ఏర్పరచుకుని ఆయనలో ఐక్యం చెందటానికి తపో మార్గాన్ని ఎంచుకున్న వారిది" కాగా రెండవది,"ఆనాటి వైష్ణవ సంప్రదాయం నుంచి శివుని ఉనికిని రక్షించటానికి" ఏర్పడిన శాఖ.

ఈ రెండు శాఖలలో మొదటి శాఖ శివుడి దగ్గరకు పోయే మార్గం కాబట్టి వారు ఆదిగురువైన సదాశివుని ధ్యానంలోనే ఉండేవారు.రెండవశాఖ మాత్రం శాఖోపశాఖలుగా విభజన చెంది శైవాన్ని ప్రదేశానికి అనుగుణంగా మార్చి సుస్తిర పరచాయి.
రెండవ శాఖ రెండు ఉప శాఖలుగా విభజన చెందింది.
అవి:1.అతి మార్గం.
2.మంత్ర మార్గం.
అతిమార్గంలో కొన్ని శాఖలు ఉద్భవించాయి.
అవి:1.పాశుపత శైవం.
2.లాకుల శైవం.
3.లింగాయత శైవం.
మంత్ర మార్గంలో తిరిగి రెండు శాఖలు ఏర్పడి అవి రెండు తిరిగి ఉప శాఖలుగా విభజన చెందాయి.
మంత్ర మార్గం లోని శాఖలు.
1.కాపాలిక శైవం.
2.సిద్దాంత శైవం.
1. కాపాలిక శైవంలో కౌల శైవము,త్రిక శైవము ఒక వైపు ఏర్పడితే.అఘోరీ శైవం విడిగా ఏర్పడింది.
2.సిద్దాంత శైవం తమిళనాడు లో అభివృద్ధి చెందినది.
ఈ విదం గా శైవం శాఖోపశాఖలుగా విస్తరించింది.ఇది శైవ శాఖా వర్ణన,
ఇకపోతే శైవ సంప్రదాయం ఏయే ప్రదేశాలలో ఎలా పిలువబడేదో తెలుసుకుందాము.
1.మన ఆ.ప్ర లోను,తమిళ నాడులోను మరియు శ్రీలంఖ లోను గల శైవాన్ని సిద్దాంత శైవం అంటారు.
2.నేపాల్,ఖష్మీర్,గుజరాత రాష్ట్రాలలో గల శైవాన్ని పాశుపత శైవం అంటారు.
3.ఒక్క కాశ్మీర్ లో గల ప్రత్యకమైన శైవాన్ని ఖష్మీర శైవం అంటారు.
4.నేపాల్,ఉత్తర ప్రదేశ్,భీహర్ మరియు పశ్చిమ భెంగాల్ రాష్ట్రాలలో భేదాభేద శైవం ఉండేది.
5.కర్నాటక లో లింగాయత్ శైవం అద్వైత శైవం ఉండేది.
శైవం మాత్రమె ఆ రోజులలో ఉంది అని చెప్పట్లేదు.ఆ రోజులలో వైష్ణవం కూడా ఉంది.వైష్ణవము మరియు శైవం సంప్రదాయాల మద్య విభేదం ఉండేది.ఇది శైవ చరిత్ర.

5.వైష్ణవం :

హిందూ ధర్మం లో వైష్ణవం ఒక ముఖ్యమైన శాఖ.విష్ణువు యొక్క గొప్పతనాన్ని,ప్రశస్తిని ఆదారం చేసుకుని అభివృద్ధి చెందిన మత శాఖ.
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ హరే ఈ సమస్త జగతికి మూలాధారం.దశావతారాలను విష్ణువు యొక్క అంశలుగా వివరిస్తూ దుష్ట సంహారం కోసం విష్ణు శక్తి మానవ రూపం లో ఇక్కడికి వస్తుంది కావునా ఆయననే రక్షకుడుగా,భగవంతుడిగా పూజించటం అనేది వైష్ణవ సంప్రదాయం.
ఈ విధంగా విష్ణువును ఒకే ఒక్క భగవంతుడిగా పూజిస్తూ మిగిలిన వారికి కూడా తగు స్తానాన్ని కల్పించటం వైష్ణవం యొక్క లక్షణం.
ఋగ్వేదం ప్రకారం విష్ణువు యొక్క మానవ రూపాలు 93 ఉన్నాయి.మిగిలినవి ఇంద్రుడు,సూర్యుడు,రుద్రుడు,మారుత,వాయు,అగ్ని మనువులవి అని శ్లోకాల ద్వారా ఋగ్వేదం లో వివరించబడినవి అని సమాచారం.
వైష్ణవ ఆగమాలు విష్ణువుని ఏకైక శక్తి స్వరూపం గాను,సృష్టి స్థితి లయ కార్యాలు ఆయన చేతులలోనే ఉన్నాయి అని పేర్కొంటున్నాయి.
(బ్రహ్మ విష్ణువు కుమారుడు కనుక సృష్టి అయన చేసినట్లే,విష్ణువు పని స్థితి అనగా నడిపించటం కనుక అయన చేస్తూనే ఉంటాడు.మరి అంతం చెయ్యటం శివుని పని కదా ఈయన ఎందుకు తీసుకుంటున్నాడు..??అంతం చేసే సమయంలో శివుడే విష్ణువవుతాడు అనగా శివుని భాద్యత విష్ణువు తీసుకుంటాడు.ఆ విధంగా దుష్ట సంహారం చేస్తాడు).
కావున సృష్టి స్థితి లయ కార్యాలు మూడు విష్ణువు చేతిలో ఉన్నాయి అనటం సరి ఐనదే.
కాని శివుడు కూడా స్వయంగా ఈ మూడు కార్యాలు చెయ్యగలడు.ఉదాహరణగా గణపతి ఆవిర్భావం
(గణపతి అంటే ప్రకృతి అని కుడా అర్ధం.ఈ వివరణ అంతా శివుడిని తక్కువగా అనుకుంటున్నారేమో అనే కాని విష్ణువుని శివుడికంటే తక్కువ అని చూపించటం మాత్రం కాదు.ఇద్దరు సమానులే.ఇద్దరి పని దుష్ట సంహారమే.అందులో విష్ణువు ఎక్కువ పాలుపంచుకుంటున్నాడు.నాకు శివ కేశవులు ఇద్దరు ఇష్టమే.ఇద్దరిలో ఎవ్వరిని తక్కువ చెయ్యలేను,చెయ్యను).
వైష్ణవసాంప్రదాయం పాటించేవారిని వైష్ణవులు.ఈ మద్య కాలంలో హిందూ ధర్మ ప్రచారంలో భాగా ప్రాచుర్యాన్ని తీసుకునివచ్చిన సంప్రదాయక వైష్ణవ సంస్థ "హరే కృష్ణ" సంస్థ చైతన్య వైష్ణవం యొక్క రూపకర్త శ్రీమాన్ శ్రీ చైతన్య ప్రభు..ఈ వైష్ణవాన్నే గౌడీయ వైష్ణవం అని కూడా అంటారు.అంతర్జాతీయంగా వైష్ణవ ధర్మాన్ని ప్రపంచానికి తెలియచెయ్యటం లో చైతన్య ప్రభువుల వారి" హరే కృష్ణ సంస్థ" ప్రముఖ పాత్ర వహిస్తోంది.శ్రీ హరి కృప వలన సఫలీకృతమూ అవుతోంది.ఇది సంతోషించదగిన విషయము.
విష్ణు ఆరాధనలో లో భాగంగా అయన అవతారములైన శ్రీ రామచంద్రమూర్తి ని ,కృష్ణ పరమాత్ముడిని ప్రముఖంగా పూజిస్తారు.అయన అన్నిఅవతారములనూ పూజించటం జరుగుతుంది.దుష్టసంహారం ఆయన కర్తవ్యం కనుక ఆయనకు ప్రదమ స్థానం కల్పించారు వైష్ణవులు.ఇలా ఆయనను పూజించే వారు వివిధ శాఖలుగా ఏర్పడినా.ఆ అంశలు అన్ని శ్రీహరి స్వరూపం గానే భావించటం ద్వారా వైష్ణవులు ఐకమత్యంగా ఉండేవారు.కాని శివుడుని వేరే దేవత మూర్తిగా చూస్తూ ఉండటం వలన ఆ కాలం లోని శైవులకు వారి నమ్మకాలకు విభేదన చూపుతూ ఉండేవారు.ఇందువలన వారి మద్య సఖ్యత లోఫించేది.

వైష్ణవ సాంప్రదాయాలలో భాగంగా కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
లక్ష్మి సంప్రదాయం:
1.విశిష్టాద్వైత సంప్రదాయం.
2.శ్రీ వైష్ణవం.
3.వైఖానసం.
4.స్వామీ నారాయణం.

బ్రహ్మ సంప్రదాయం:
1.ద్వైత సంప్రదాయం.
2.అచింత్య భేదాభేద వైష్ణవం.

3.రుద్రా సంప్రదాయం:
1.శుద్దాద్వైత సంప్రదాయం(విష్ణుస్వామీ మరియు వల్లభాచార్యులు రూపకర్తలు).

4.కుమార సంప్రదాయం:
1.ద్వైతాద్వైత వైష్ణవం.

ఆనాడు మన దక్షిణ భారత దేశం లో వైష్ణవ సాంప్రదాయం లో రెండు శాఖలు ఉండేవి.
అవి.1.బ్రాహ్మణ వర్గ వైష్ణవం.
అయ్యంగారు(శ్రీ వైష్ణవం) లు ముఖ్యమైన వారు.
అయ్యంగారు లు రెండు ఉప శాఖలుగా ఉన్నారు.
వేదగలై శాఖ మరియు తెంగలై శాఖ.వీరందరూ వైష్ణవ పూజను,విష్ణుసేవను పంచారాత్రఆగమాల ప్రకారం చేసేవారు.ఈ రెండు భాగాలు ఒకే గురు పరంపరను కలిగి ఉన్నాయి.
=>వైఖానసులు భగవద్మార్గమునకు వారదిగా ఉంటూ సామాన్యుల కోసము,గ్రామ,పుర పట్టణ,నగర ప్రజల హితం కోసము ఆలయ అయ్యవార్లుగా ఉండేవారు.

2.బ్రాహ్మణ వర్గం కాని వారినుంచి గల వైష్ణవులు.
కమ్మవార్'లు(కమ్మ,కాపు),రెడ్డి వంశస్తులు,శెట్టి వంశీకులు,రాజులు,ముఖ్యంగా హరిసేవలో బ్రాహ్మణులకు ఏమాత్రము తీసిపోని హరిదాసులు వీరందరూ బ్రాహ్మణ వర్గం కాని వైష్ణవులు..
పైన పేర్కున్నవారందరూ వైష్ణవ సాంప్రదాయానికి వారసులే.వీరందరూ వైష్ణవ సాంప్రదాయానికి సంబందించినవారు..

కింద పేర్కొంటున్న దేవాలయాలు వైష్ణవ సంప్రదాయాన్ని భారతదేశంలో నిలిపిఉంచటంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.
1.వైఖానశ దేవాలయం-తిరుపతి.
2.మద్వ దేవాలయం-ఉడిపి.
3.తెంగలై దేవాలయం-కంచి పురం.
4.వేదంగలై దేవాలయం-అహోబిలం..
ఈ నాలుగు దేవాలయాలు భక్తుల కోర్కెలు తీర్చటానికి కొలువై ఉన్న శ్రీహరిని వివిధ అవతారరూపాలలో తమయందు ఉంచుకుని వైష్ణవ సంప్రదాయాన్ని,మరియు హిందూ సనాతన ధర్మాన్ని రక్షిస్తూ,ధర్మాన్ని,వైష్ణవాన్ని విస్తరింప చేస్తున్నాయి.
విష్ణువును పూజించండి,దుష్ట సంహరణకు అవతరించ వలసిన భాద్యత ఆయనదే.ధర్మ రక్షకుడు శ్రీహరి.ఆయన పాదాలు పరమ పవిత్రమైనవి.శరణు వేడుదాం.తరిద్దాం. ఓం నమో నారాయణాయ.

6.శాక్తేయం.
హరి ఓం.
సనాతన హిందూ ధర్మంలోని మత అంశమైన భాగాలలో మిగిలిన చివరి భాగం అయిన శాక్తేయం గురించి.
సనాతన హిందూధర్మంలో స్త్రీకి ప్రధమ స్తానాన్ని కల్పించారు అని చెప్పటానికి ఈ మత శాఖ మంచి ఉదాహరణ.ఈ మతంలో గాయత్రి దేవిని లేక అఖిలాండేశ్వరీ దేవిని జగన్మాతగా భావిస్తూ త్రిమూర్తులకు తల్లిగా పేర్కొనటం జరిగింది.
జగన్మాత మరియు సదాశివుల అభేద రూపాన్ని కలిగిన జగన్మాత ముందుగా త్రిమూర్తులను సృష్టించి,వారి ద్వారా సృష్టి,స్థితి,లయ కార్య భాద్యతను నిర్వర్తించటం జరిగింది అని దేవీ భాగవత సారాంశం.
సింధు నాగరకతలో శాక్తేయం బాగా ప్రాచుర్యంలో ఉండేది అని పురాతన అవశేషాలు చెప్తున్నాయి.
పల్లెలలో అమ్మవారిని పూజించే వారు జగన్మాతను గ్రామదేవతలుగా భావిస్తూ పంచభూతాలను నియంత్రించే శక్తి మూర్తి గాను,గ్రామానికి అమ్మగాను పూజిస్తారు.
రోగాలనుంచి కాపాడే శక్తి గా భావించే వారు రోగ నివారణ కోసం అమ్మవారి పేరు రోగానికి పెట్టి అమ్మవారికి ఇష్టమైన వేప,రావి మున్నగు లేపనములతో ఆయుర్వేద విధానంలో రోగ నివారణ జరుపుకుంటారు.

గ్రామ దేవతలుగా గల జగన్మాత మనుష్య రూపం లోని తన గణములతో గ్రామ రక్షకురాలై ప్రజలను.పంటలను రక్షిస్తుంది అని గ్రామ ప్రజలు నమ్ముతారు.ఈ ఈ విధంగా శాక్తేయం గ్రామాలలో ఇప్పటికి ఉంది.
ముఖ్యమైన గ్రామ దేవత మూర్తులు.
1. సాదారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది 'మావుళ్ళమ్మ' అయింది.
2.బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.
3.ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట(అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది
4.అలాగే పుల్ల(వికసించిన కళ్ళున్న)అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్దగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
5.ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.
6.భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల(భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= బోనాలమ్మ
ఈ విధంగా గ్రామ దేవతలు గ్రామాలలో కొలువై జగన్మాత అంశలుగా ప్రజలతో పూజలు అందుకుంటున్నారు.
అమ్మవారు ప్రాంతీయంగా అమ్మోరుగా మారి భక్తి మార్గంలో ప్రధమ భూమికను వహిస్తున్నారు.
ఇంతవరకు చెప్పింది గ్రామ దేవతల వివరణ.

ఇప్పుడు శాక్తేయ శాఖను,శాక్తేయ లక్షణాలను దేశవ్యాప్తం గా నిలిపిఉంచుతున్న అష్టాదశ శక్తి పీటాల గురించి తెలుసుకుందాము.

శక్తి పీఠములు 18 :
దీనికి సంభందించి ఒక పురాణ గాధ ప్రాచుర్యం లో ఉన్నది.
శివుని మీద ఆక్రోశం తో నిరీశ్వర యాగం తలపెట్టిన దక్షుని ఇంటికి పుట్టింట జరిగే శుభకార్యానికి ఆహ్వానం అవసరం లేదని ప్రమద గణాలతో వెళ్ళిన సతిని దక్షుడు శివ నిందచేసిఅవమాన పరుస్తాడు.అవమానాన్ని భరించలేని సతి దేవి యోగాగ్ని ని సృష్టించి అందులో దూకి తనువుని వదిలిపెట్టింది.కోపోద్రిక్తుడైన రుద్రుడు నిరీశ్వర యాగాన్ని వీరభద్ర రూపం లో ద్వంసం చేసాడు.

కాని సతీ వియోగ దుఖం తీరని రుద్రుడు ఆమె శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండటం వలన సృష్టి ప్రక్రియ అంతరాయానికి గురి అవ్వటం గమనించిన దేవతలు మహా విష్ణువును వేడుకున్నారు అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రం తో ఆమె శరీరాన్ని ముక్కలు చేసి భూమి మీద పడేలా చేసి రుద్రుడిని కార్యోన్ముక్తుడిని చేసాడు.
అలా భూమి మీద పడిన సతీ దేవి అవయవ భాగాలే ఈనాటి శక్తి పీఠాలు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

18 శక్తిపీఠాలు
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:
శ్లో.
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
వివరణ:
1. శాంకరి-ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును-శ్రీ లంఖ (ఈ ఆలయ ఆనవాలులు పోర్చగీసులదాడి కారణంగా కనిపించుటలేదు,17c)
2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు
3.శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
4.చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక .
5.జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు .
6.భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ .
7.మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర .
8.ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర .
9మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ .
10.పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ .
11.గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా.
12.మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ .
13.కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో.
14.మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో.
15.వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
16.మంగళ గౌరి - గయ, బీహారు.
17.విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్..
18.సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉన్నది.
ఇవే కాక ఇంకా 51 శక్తిపీఠాలు శాక్తేయంను భారత దేశంలో నిలబడేలా చేస్తున్నాయి.
హిందు సనాతన ధర్మము ... అందులోని మతాలు :

హిందు సనాతన ధర్మములోని మతాలను స్వీకరించవలసిన ఆవశ్యకత.
వాటి వివరణ.

అష్టాదశ పురాణాలు ఉన్నాయి.అందులో దేవి భాగవతం,కృష్ణ భాగవతం.ఇవి రెండు మాత్రం ముఖ్యమైనవి.
ద్వైతులు కృష్ణ భాగవతంను శ్రీ మద్భాగవతంగా పిలుస్తారు.కాని,దేవి భాగవతం ఐన శ్రీ మద్భాగవతం ఐన వివరించేది ఒకే అంశం..,
"దుష్ట సంహారం కోసం భగవద్స్వరూపం ఈ కాలానికి అనుగుణంగా మానవ స్వరూపం స్వీకరించటం జరుగుతుంది.దుష్ట సంహారం కోసం భగవంతుడు దిగి రావటం జరుగుతుంది".
ఆపదలో ఉన్నవాడిని కాపాడిన వాడు భగవంతుడు అని భాగవతం చెప్తోంది.

భగవంతుడు దుష్ట సంహారం కోసం మానవ జన్మ స్వీకరించటానికి కారణం:-
శక్తి స్వరూపంలోని భగవంతుడి కాలం లేక సమయం మరియు మానవ కాలం లేక సమయం ఒకటి కాదు.మనం ముందు చూసాము కదా ఈ వేదం యొక్క మొదటి పోస్ట్ భగవంతుడి వయస్సు ఎంతో ఆయనిప్పుడు మనకంటే ఎంత ముందు ఉన్నాడో...కాల భేదం ఉన్నందు వలన ఇక్కడి పరిస్తితులు అర్ధం చేసుకోవాలి అంటే మానవ జన్మ ఎత్తాల్సిందే.అదే రామ,కృష్ణ అవతారములకు కారణము..
మానవ స్వరూపం స్వీకరించటంలో ఇది ఒక కారణం.
ఇంకా ఇచ్చిన వరాలు,ఆయన చేసిన కర్మలు కూడా ఆయన మానవ జన్మకు కారణం అవుతాయి.ఇలా చాలా కారణాల వలన దుష్ట సంహారం కోసం మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది.
భాగవతం లోని ముఖ్యమైన అంశాలు మీ దగ్గర ప్రస్తావిస్తాము.వాటికంటే ముందుగా మనం ఈ రోజులలో మతంగా పిలుస్తున్న హిందూ అను పదం మతం కాదు అని హిందూ అనేది ఒక సనాతన ధర్మం అని నమ్మకంగా చెప్పే ధైర్యాన్ని కలిగించే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను.
అందులో భాగంగా
అద్వైతం,ద్వైతం.విశిష్టాద్వైతం.శాక్తేయం.వైష్ణవం.శైవం.
వీటిని మతాలూ అంటారని మీకు తెలుసు అనుకుంటున్నాము.ఇస్లాం మరియు బ్రిటీష్ దురాక్రమణల తరువాత ఇప్పుడు నాస్తికవాదం ప్రభలింది కాని వాటికి ముందు ఉన్న మతాలు ఇవే.ఎవరు దేనిని నమ్మితే వారు ఆ మతం అయ్యేవారు.అన్ని ఒకే అంశాన్ని వివరించేవి.పరమార్ధం ఒకటే ఉండేది.కాని ఒకదానితో ఒకటి విభేదించి పోటీ పడి అన్ని కోణాల్లోనూ ఐకమత్యాన్ని చెడగోట్టేవి.ఈ ఐకమత్య లోఫమే శత్రు సైన్యాలకు అవకాశంగా మారింది.అప్పటి సంగతి పక్కన పెడదాం ఇప్పుడైనా వీళ్ళ మద్య ఐకమత్యం ఉందా???లేదు విభేదిస్తునే ఉంటారు.కాని వీటిలో ఒకటి అన్నింటిని అంగీకరిస్తుంది.దానినే మేము నమ్ముతున్నాము.దానిని మేము మీకు చెప్పము.మా వివరణ ఐపొయ్యక మీరే ఇందులో ఒకదానిని స్వీకరించండి.(బాప్తిసం లాగ బ్రతికుండగానే,చావకుండానే పునర్జన్మ ఎత్తండి జన్మరాహిత్యులవుతారు ఎన్ని తప్పులైనా చేసుకోండి అని అనట్లేదు,ఇది బాప్తిసం కాన్సెప్ట్ కాదు).మతం మారటానికి అవి వేరే మతాలూ కాదు.మతంగా పిలవబడుతున్న ధర్మంలోని మత భాగాలు.
భాగవతంశాలు మతంగా పిలువబడుతున్న సనాతన హిందూ ధర్మం లోని మత వివరణ తరువాత వివరించటం జరుగుతుంది.
వివరించబోవు అంశాలు ఇవి.
1.అద్వైతం.
2.ద్వైతం.
3.విశిష్టాద్వైతం.
4.శాక్తేయం.
5.వైష్ణవం.
6.శైవం.

1.అద్వైతం.

అద్వైతం ఆదిశంకర నిర్మితం. ఏకత్వ భావన ముఖ్యోద్దేశంగా సర్వజన సమానత్వాన్ని పెంచటానికి ఆనాటి హిందూ ద్వేష బౌద్దాన్ని ఎదుర్కోవటానికి రూపొందించబడిన మతం అద్వైత మతం.అంటే ఆత్మ పరమాత్మా ఒక్కటే.రెండు వేరు వేరు కాదు.
ప్రపంచం లో చివరికి ఉండేది శూన్యమే.జీవితం ఆఖరున మనం పట్టుకుపోయ్యేది కుడా శూన్యమే.
మన ఆత్మాభిమానాన్ని పెంచుకుని ఎదుటి వాడి ఆత్మలోని పరమాత్మను నమస్కరించి గౌరవించటం ద్వారా మానవత్వాన్ని సర్వ ప్రాణి సమానత్వాన్ని పెంపొందించటం అద్వైతం యొక్క లక్ష్యం.బుద్దుడు ఎందుకు బౌద్దాన్ని నిర్మించాడు.అసమానత చూపుతున్న ఆనాటి సమాజాన్ని మార్చటానికి క్షత్రియుడైన తను కాషాయ వస్త్రాలు ధరించి మౌని గా మారి మహా యానం ను సమర్దం గా హిందూ సనాతన ధరంభద్దం గానే నడిపాడు.కాని హీన యానం సమయానికి బౌద్ధం హిందూ ధర్మాన్ని ద్వేషించటం ప్రారంభించి వేదాలను నాశనం చెయ్యటం ప్రారంభించింది.ఆకాలంలో వేద రక్షణకై అందరికి అర్ధం అయ్యేలా ప్రస్తానత్రయభాష్యం కోసం అవతరించిన శంకరఅంశగా ఆదిశంకరాచార్యులను భావించటం జరిగింది.అద్వైతాన్ని తర్కవిధానంలో స్తిరీకరించటం జరిగింది.నాలుగు వైపులా నాలుగు శంకర శక్తి పీటాలు స్తాపించటం జరిగింది.
దేశం నలుమూలలా మఠాలను స్థాపించి ఆయన శిష్యులైన పద్మపాదులు (తూర్పున పూరి లో), హస్తామలకులు (పడమరన ద్వారకలో), తోటకాచార్యులు (ఉత్తరాన జ్యోతిర్మఠంలో), సురేశ్వరాచార్యులు (దక్షిణంలో శృంగేరి లో) దేశం నలువైపులా మఠాలను ఏర్పరిచారు. ఆ తరువాత ఆ మఠాలలో ప్రతీ గురువు ఒక శిష్యుడికి ఉపదేశం చేసి గురుపరంపర కొనసాగిస్తున్నారు.
శివ కేశవుల ఏకత్వ భావమే అద్వైతం.
శంకర మాయా వాదం.
"బ్రహ్మ సత్యం జగన్మిధ్య
జీవొ బ్రహ్మైవ నా పరః"

బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య(శూన్యం).
ఈ జీవుడే బ్రహ్మం.
జీవుడు(ఆత్మ), బ్రహ్మము వేరు కాదు.
- ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది.

తర్క తత్వ వాద సూత్రాలు
(స్వల్పంగా "ఆత్మానాత్మ వివేకం" అను గ్రంధం నుంచి)..,
1.ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?
పూర్వ జన్మ లలోని కర్మ వలన.
2.కర్మ ఎందుకు జరుగుతుంది?
రాగం (కోరిక) వలన.
3.రాగాదులు ఎందుకు కలుగుతాయి?
అభిమానం (నాది, కావాలి అనే భావం) వలన.
4..అభిమానం ఎందుకు కలుగుతుంది?
అవివేకం వలన
5.అవివేకం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానం వలన
6.అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. జ్ఞానం లేని చోట అజ్ఞానం ఉంటుంది.అందుకుకారణం ఉండదు) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.
అనగా అజ్ఞానం వలన అవివేకం, .
అవివేకం వలన అభిమానం,
అభిమానం వలన రాగాదులు,
రాగాదుల వలన కర్మలు,
కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ),
అందువలన దుఃఖం కలుగుతున్నాయి.
నిష్కామ కర్మ విధానం యొక్క ప్రశక్తి ఇక్కడ ఉంటుంది.

2.ద్వైతం :

మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.

మధ్వ సిద్ధాంతం
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
మధ్వమతము పంచ భేదములను ప్రవచిస్తుంది. అవి
1. జీవుడు వేరు బ్రహ్మము వేరు (జీవ - దేవ భేదము)
2. ఒక జీవుడుకి, ఇతర జీవులకు భిన్నత్వం ఉంది (జీవ - జీవ భేదము)
3. జీవుడికి, జడ జగత్తుకు భేదం ఉంది (జీవ - జడ భేదము)
4. జడ జగత్తు వేరు, బ్రహ్మము వేరు (జడ - దేవ భేదము)
5. జడ జగత్తులో ఒక వస్తువుకి, ఇతర వస్తువులకు భేదం ఉంది (జడ - జడ భేదము)
ఈ భేదాలు నిత్యం, శాశ్వతం. జీవుడు ముక్తి పొందిన తర్వాత కూడా ఆ భేదాలు కొనసాగుతాయి.

జగత్తు మిథ్య కాదు. సత్యం, ఎందుకంటే అది ప్రత్యక్షంగా మన ఎదుట కనిపిస్తుంది. అది అశాశ్వతమైనంత మాత్రాన లేదా నిరంతర పరిణామం చెందుతున్నంత మాత్రాన లేకుండా పోదు. ఒక వస్తువును పోలి మరొకటి ఉండదు. అన్నింటా భేదం ఉంది. ప్రతి వస్తువులోను ఇతర వస్తువుల లక్షణాలుండటం జరుగదు.

బ్రహ్మం సర్వోత్తమం. సమస్త సద్గుణాలు బ్రహ్మంలో ఉన్నాయి. బ్రహ్మం ఆనంద స్వరూపం. ఆనందం కారణంగానే దానిచే ప్రేరణ పొంది బ్రహ్మం తన లీలానిమిత్తం ఈ జగత్తును సృష్టించింది. జగత్తు బ్రహ్మంయొక్క వ్యక్తరూపం. సృష్టికిముంది జదజగత్తు సూక్ష్మరూపంలో అవ్యక్తంగా బ్రహ్మంలో ఉంటుంది. సృష్టి సమయంలో అది స్థూలరూపం పొంది వ్యక్తమవుతుంది. బ్రహ్మం తనను తాను వ్యక్తం చేసుకునే విధానమే ఆ సమస్త జగత్తు. అయితే బ్రహ్మం జగత్తుకు అతీతం. బ్రహ్మం లేదా ఈశ్వరుడు సర్వ స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, సర్వ శక్తిశాలి, సర్వవ్యాపి.

జడజగత్తువలె జీవాత్మ కూడా స్వతంత్రుడు కాదు. కర్త కాదు. ఈశ్వరుడు మాత్రమే కర్త. జీవాత్మ తానే కర్త అనుకుంటాడు. అది భ్రాంతి. తాను కర్తను కానని, నిమిత్త మాత్రుడనని గ్రహించి ఈశ్వరునికి తనను తాను సంపూర్ణంగా అర్పించుకుని నిష్కామ కర్మ చేస్తే అది జీవునికి బంధనం కాబోదు. తాను కర్తను అని అహంకారంతోను, మమకారంతోను భ్రమ చెందడం వల్లనే జీవాత్మ సుఖదుఃఖాలకు తలవొగ్గవలసివస్తుంది.

భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. జీవాత్మ తన స్వస్వరూప జ్ఞానం పొందిన తర్వాత సర్వకర్త అయిన ఈశ్వరుడిపట్ల పెంచుకునే భక్తి మాత్రమే ముక్తికి కారణం అవుతుంది.

మరికొన్ని సూత్రాలు
మధ్వ దర్శనాన్ని ఈ క్రింది సూత్రాలు చాల చక్కగా వివరిస్తాయి.
1. హరియే సర్వోత్తముడు. మిగిలిన వారంతా తమ అర్హతను బట్టి పూజింపబడతారు.
అనగా తారతమ్య పధ్ధతి లో విలువకలిగి ఉన్నారు. ఉదాహరణకు దేవతలలో హరి తరువాత లక్ష్మి, బ్రహ్మ-సరస్వతి,వాయు మూర్తి, భవుడు-భవాని, శేష, గరుడ, ఇంద్ర, మన్మథ, గురు, చంద్ర, సూర్య, వరుణ, అగ్ని,మను, యమ, కుబేర,విఘ్నేశ్వర వరుసగా పూజార్హులు (తమ సతులతో సహా).
2. పంచ బేధములు కలిగి ఉన్నందు వల్లనే ఈ విశ్వాన్ని మనము ప్రపంచము అని పిలుస్తాము.
3. ఈ జగత్తు ప్రవాహత సత్యము. అనగా, ప్రవాహములో పాత నీటి స్థానంలో క్రొత్త నీరు నిరన్తరంగా వచ్చి చేరుతునే ఉంటుంది. ఈ క్షణం లో మనం చూసిన నీరు మరు క్షణం ఉండదు. అంత మాత్రం చేత ముందు చూసిన నీటిని మనం అసత్యమని చెప్పుటకు వీలు లేదు. మనం ఏ క్షణం లో ఆ నీటిని చూసామో (గమనించామో) ఆ సమయములొ ఆ నీరు అక్కడ ఉన్నది కాబట్టి, ఆ క్షణానికి అది సత్యం.
4. నేను జీవుడను, హరి కన్న భిన్నుడను, హరి సేవ వలననే తరించెదను (స్వ-స్వరూప-ఆనంద-సంప్రాప్తి/ ముక్తిర్నిజ సుఖానుభూతి)
5. సద్భక్తియే స్వ-స్వరూప-ఆనందానికి (ముక్తికి) సాధనం
6. ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అనే 3 ప్రమాణములు (ఈ 3 ప్రమాణముల చేత పై సూత్రములు నిర్ధారింపబడినవి)
7. అఖిల వేదముల చేత తెలియ చేయ బడినవాడు ఆ హరి ఒక్కడే.

మద్వ సిద్ధాంతం పూర్తిగా అద్వైతానికి భిన్నమైనది.హరి ఒక్కడే భగవంతుడు అనేది నిజం కాని శివుడెం చేసాడు పాపం.ఆయన్ని దూరం చేసారు.హరిహర భేదం చూపటం వివక్షత కు దారి చేస్తునట్లే కదా.శివుడిని పూజించే వాళ్లకు కంటు అయ్యే అవకాశం ఉందికదా అది తెలియక హరి ఒక్కడే దేవుడు అనటం జరిగిందా..లేక తెలిసీ ఇలా శివున్ని తక్కువ స్తానం లో ఉంచారా..
ఏదేమైనా మద్వాచార్యులు సరిగానే చెప్పారు.పాటించే వారి చేతుల్లో ఉంది.అర్హత ఉన్న గురువు సముచితం గా ఆలోచించే చెప్తారు.ఆధిపత్యం కోసం సిద్దాంతం మార్చే అవకాశాలు లేకపోలేదు.ఏదేమైనా శివుడైనా కేశవుడైనా ఒకటే అనే ఆలోచన ఉంటే ఎలా ఉన్న పర్లేదు.కాని ఆ ఆలోచన లేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారు.

హనుమంతుడు నేను రామ భక్తుడిని అని బ్రహ్మకు నమస్కారం చేసి గౌరవించకుండానే బ్రహ్మ నుంచి బ్రహ్మాస్త్ర ప్రయోగం తన మీద పనిచెయ్యకుండా వరం పొందాడా..భీముడు కృష్ణుడికి మాత్రమె నమస్కారం చేసాడా ధర్మరాజుకు భీష్మ పితామహుడు,కుంతి లాంటి పెద్ద వారైన మానవ మాత్రులకు నమస్కారం చెయ్యకుండానే గోప్పవాడయ్యాడా..మరి వీరిద్దరి అంశ గా పుట్టిన శ్రీ మద్వాచార్యుల వారు శివుడికి తక్కువ స్తానం కలిపించటానికి కారణం ఏమై ఉంటుంది..లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.కాని వారు మాత్రం శివుడిని తక్కువ సార్లు స్మరిస్తారు.మిగిలిన సమయాలలో నామమాత్రం కూడా వాడరు.

ఏదేమైనా మిగిలిన దేవతలకు సరైన స్తానం ఇవ్వకుండా హరి ఒక్కడే దేవుడు అని భావించినంత వరకు సమస్త లోకానికి ఒక అధిపతి స్తానంలో ఉండి మరియు శక్తి స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కూడా ఈ వాదాన్ని సమర్దించడు.ఆపే ప్రయత్నం చేస్తాడు.ఈ విధానం శివారాధ్యులను మరియు విష్ణుఆరాధ్యులను దూరం చెయ్యటంలో ప్రముఖ పాత్ర వహించింది.
తరువాత శైవం వైష్ణవం అనే రెండు మతాలు ఇంకా బాగా ప్రముఖ పాత్ర వహించాయి ఐకమత్యంన్ని నిర్మూలించటంలో. మతాచార్యులేప్పుడూ సరైనదే చెప్తారు పాలకుడు సమర్డుడైతే,దేశ రక్షణ బాధ్యత స్వీకరించిన వాడైతే ఐకమత్యం కోసం చర్యలు తీసుకునే వాడు.
ఐకమత్యం లేదు అంటే ఆనాటి పాలకులదే తప్పు.
ద్వైతంలోను అద్వైతం లోను రెండిటిలోనూ అయోమయం ఉంటుంది.

1.అద్వైతం లోని అయోమాయం సిద్దాంతం అర్ధం అవగానే అయోమయం తీరిపోతుంది.
"ద్వైతం లోని అయోమయం కూడా పటా పంచలవుతుంది కాని ఎప్పుడు హరి ఒక్కడే ఈ ప్రపంచంలో భగవంతుడు అని భక్తుడు నమ్మినప్పుడు మాత్రమే.శివ భక్తులకు ద్వైతం లోని మర్మం తెలుసుకోవాలి అంటే హరుడిని హరి కంటే తక్కువగా భావించాలి.మనకు ఇష్టమైన వాళ్ళను పక్కవారితో పోల్చేటప్పుడు సమానంగా అయిన పోల్చుకుంటాం కాని తక్కువగా పోల్చుకోలెం కదా ".
అదే ఇక్కడ జరిగింది.
2.కావున ద్వైతం లోని అయోమయం హరి స్మరణే తీరుస్తుంది.
అవును హరి స్మరణే అన్నిటికి సరి ఐనది..ఈ విషయం లో ఎటువంటి వ్యతిరేకతా లేదు.

3.విశిష్టాద్వైతం :

విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిరాని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు రెండు:

=>మొదటిది, ప్రబలంగా కొనాసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
=> రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతంలోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు:
1.సాంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి వాటిని మానటమో మార్చటమో చేయటం ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.
2.దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
3.మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది సరో తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యం చేయవలసిన పనిలేదు.
4.ఒక పని వల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగా మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు.

ప్రధాన సిద్ధాంతం:
విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు.
పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది.
జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం.
మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం.
మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు.
కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.

నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు.
అవి
1.అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు.
2.విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
3.వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
4.సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
5.అంతర్యామి - సకల జీవనాయకుడు.
భగవంతుడైన మహా విష్ణువే అన్నిటికి మూలం.ఇదే విశిష్టాద్వైతం.

4.శైవము :

శైవం ప్రకారం సమస్త లోకానికి అధిపతి సదాశివుడు.శివుడే సృష్టి స్తితి లయ కారుడు.నడిపించేది ఆయనే,ఆపేదీ ఆయనే.శైవం ఈ భావనతో ఉండేది.
శైవ మతం ఆ కాలం లో మన భుబాగంలోనే కాక నేపాల్,శ్రీ లంక,దక్షిణ ఆసియ భూబాగాలైన మలేసియా,ఇండోనేషియా సింగపూర్ దేశాలలో కూడా మతం గా వాడుకలో ఉండేది.
శైవం యొక్క చరిత్ర అతి పురాతనం ఐనది.
శ్వేతాశ్వతర ఉపనిషద్ (bc 400-200) లో ఆనాటి శైవ సంప్రదాయాలను వివరించటం జరిగింది.గుప్తులకాలం(ce.300 to 500 అని అంటున్నారు)లో శైవం భాగా అభివృద్ధి చెందినట్లుగా సమాచారం.
శైవం గొప్ప అక్షరాస్యతను కలిగి అనేక సిద్దాంతాలను కలిగి ఉండేది. అందులో భాగం గా మూడు సిద్దాంతాలు ఉండేవి.అవి:
1.అభేద సిద్దాంతం.
2.భేద సిద్దాంతం.
3.భేదాభేద సిద్దాంతం.
ఆనాడు భారత భూభాగంలో శైవ సంప్రదాయాలు అనేక శాఖలుగా విస్తృతి చెందాయి.వాటిని కింద వివరించటం జరుగుతుంది.

రుద్రుడిని లేక శివుడిని పూజించే దిశగా ఏర్పడిన విధానాలు రెండు శాఖలుగా విభజన చెందాయి.అందులో ఒకటి" పురాణాల ఆధారంగా శివుడిపైన భక్తిని ఏర్పరచుకుని ఆయనలో ఐక్యం చెందటానికి తపో మార్గాన్ని ఎంచుకున్న వారిది" కాగా రెండవది,"ఆనాటి వైష్ణవ సంప్రదాయం నుంచి శివుని ఉనికిని రక్షించటానికి" ఏర్పడిన శాఖ.

ఈ రెండు శాఖలలో మొదటి శాఖ శివుడి దగ్గరకు పోయే మార్గం కాబట్టి వారు ఆదిగురువైన సదాశివుని ధ్యానంలోనే ఉండేవారు.రెండవశాఖ మాత్రం శాఖోపశాఖలుగా విభజన చెంది శైవాన్ని ప్రదేశానికి అనుగుణంగా మార్చి సుస్తిర పరచాయి.
రెండవ శాఖ రెండు ఉప శాఖలుగా విభజన చెందింది.
అవి:1.అతి మార్గం.
2.మంత్ర మార్గం.
అతిమార్గంలో కొన్ని శాఖలు ఉద్భవించాయి.
అవి:1.పాశుపత శైవం.
2.లాకుల శైవం.
3.లింగాయత శైవం.
మంత్ర మార్గంలో తిరిగి రెండు శాఖలు ఏర్పడి అవి రెండు తిరిగి ఉప శాఖలుగా విభజన చెందాయి.
మంత్ర మార్గం లోని శాఖలు.
1.కాపాలిక శైవం.
2.సిద్దాంత శైవం.
1. కాపాలిక శైవంలో కౌల శైవము,త్రిక శైవము ఒక వైపు ఏర్పడితే.అఘోరీ శైవం విడిగా ఏర్పడింది.
2.సిద్దాంత శైవం తమిళనాడు లో అభివృద్ధి చెందినది.
ఈ విదం గా శైవం శాఖోపశాఖలుగా విస్తరించింది.ఇది శైవ శాఖా వర్ణన,
ఇకపోతే శైవ సంప్రదాయం ఏయే ప్రదేశాలలో ఎలా పిలువబడేదో తెలుసుకుందాము.
1.మన ఆ.ప్ర లోను,తమిళ నాడులోను మరియు శ్రీలంఖ లోను గల శైవాన్ని సిద్దాంత శైవం అంటారు.
2.నేపాల్,ఖష్మీర్,గుజరాత రాష్ట్రాలలో గల శైవాన్ని పాశుపత శైవం అంటారు.
3.ఒక్క కాశ్మీర్ లో గల ప్రత్యకమైన శైవాన్ని ఖష్మీర శైవం అంటారు.
4.నేపాల్,ఉత్తర ప్రదేశ్,భీహర్ మరియు పశ్చిమ భెంగాల్ రాష్ట్రాలలో భేదాభేద శైవం ఉండేది.
5.కర్నాటక లో లింగాయత్ శైవం అద్వైత శైవం ఉండేది.
శైవం మాత్రమె ఆ రోజులలో ఉంది అని చెప్పట్లేదు.ఆ రోజులలో వైష్ణవం కూడా ఉంది.వైష్ణవము మరియు శైవం సంప్రదాయాల మద్య విభేదం ఉండేది.ఇది శైవ చరిత్ర.

5.వైష్ణవం :

హిందూ ధర్మం లో వైష్ణవం ఒక ముఖ్యమైన శాఖ.విష్ణువు యొక్క గొప్పతనాన్ని,ప్రశస్తిని ఆదారం చేసుకుని అభివృద్ధి చెందిన మత శాఖ.
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ హరే ఈ సమస్త జగతికి మూలాధారం.దశావతారాలను విష్ణువు యొక్క అంశలుగా వివరిస్తూ దుష్ట సంహారం కోసం విష్ణు శక్తి మానవ రూపం లో ఇక్కడికి వస్తుంది కావునా ఆయననే రక్షకుడుగా,భగవంతుడిగా పూజించటం అనేది వైష్ణవ సంప్రదాయం.
ఈ విధంగా విష్ణువును ఒకే ఒక్క భగవంతుడిగా పూజిస్తూ మిగిలిన వారికి కూడా తగు స్తానాన్ని కల్పించటం వైష్ణవం యొక్క లక్షణం.
ఋగ్వేదం ప్రకారం విష్ణువు యొక్క మానవ రూపాలు 93 ఉన్నాయి.మిగిలినవి ఇంద్రుడు,సూర్యుడు,రుద్రుడు,మారుత,వాయు,అగ్ని మనువులవి అని శ్లోకాల ద్వారా ఋగ్వేదం లో వివరించబడినవి అని సమాచారం.
వైష్ణవ ఆగమాలు విష్ణువుని ఏకైక శక్తి స్వరూపం గాను,సృష్టి స్థితి లయ కార్యాలు ఆయన చేతులలోనే ఉన్నాయి అని పేర్కొంటున్నాయి.
(బ్రహ్మ విష్ణువు కుమారుడు కనుక సృష్టి అయన చేసినట్లే,విష్ణువు పని స్థితి అనగా నడిపించటం కనుక అయన చేస్తూనే ఉంటాడు.మరి అంతం చెయ్యటం శివుని పని కదా ఈయన ఎందుకు తీసుకుంటున్నాడు..??అంతం చేసే సమయంలో శివుడే విష్ణువవుతాడు అనగా శివుని భాద్యత విష్ణువు తీసుకుంటాడు.ఆ విధంగా దుష్ట సంహారం చేస్తాడు).
కావున సృష్టి స్థితి లయ కార్యాలు మూడు విష్ణువు చేతిలో ఉన్నాయి అనటం సరి ఐనదే.
కాని శివుడు కూడా స్వయంగా ఈ మూడు కార్యాలు చెయ్యగలడు.ఉదాహరణగా గణపతి ఆవిర్భావం
(గణపతి అంటే ప్రకృతి అని కుడా అర్ధం.ఈ వివరణ అంతా శివుడిని తక్కువగా అనుకుంటున్నారేమో అనే కాని విష్ణువుని శివుడికంటే తక్కువ అని చూపించటం మాత్రం కాదు.ఇద్దరు సమానులే.ఇద్దరి పని దుష్ట సంహారమే.అందులో విష్ణువు ఎక్కువ పాలుపంచుకుంటున్నాడు.నాకు శివ కేశవులు ఇద్దరు ఇష్టమే.ఇద్దరిలో ఎవ్వరిని తక్కువ చెయ్యలేను,చెయ్యను).
వైష్ణవసాంప్రదాయం పాటించేవారిని వైష్ణవులు.ఈ మద్య కాలంలో హిందూ ధర్మ ప్రచారంలో భాగా ప్రాచుర్యాన్ని తీసుకునివచ్చిన సంప్రదాయక వైష్ణవ సంస్థ "హరే కృష్ణ" సంస్థ చైతన్య వైష్ణవం యొక్క రూపకర్త శ్రీమాన్ శ్రీ చైతన్య ప్రభు..ఈ వైష్ణవాన్నే గౌడీయ వైష్ణవం అని కూడా అంటారు.అంతర్జాతీయంగా వైష్ణవ ధర్మాన్ని ప్రపంచానికి తెలియచెయ్యటం లో చైతన్య ప్రభువుల వారి" హరే కృష్ణ సంస్థ" ప్రముఖ పాత్ర వహిస్తోంది.శ్రీ హరి కృప వలన సఫలీకృతమూ అవుతోంది.ఇది సంతోషించదగిన విషయము.
విష్ణు ఆరాధనలో లో భాగంగా అయన అవతారములైన శ్రీ రామచంద్రమూర్తి ని ,కృష్ణ పరమాత్ముడిని ప్రముఖంగా పూజిస్తారు.అయన అన్నిఅవతారములనూ పూజించటం జరుగుతుంది.దుష్టసంహారం ఆయన కర్తవ్యం కనుక ఆయనకు ప్రదమ స్థానం కల్పించారు వైష్ణవులు.ఇలా ఆయనను పూజించే వారు వివిధ శాఖలుగా ఏర్పడినా.ఆ అంశలు అన్ని శ్రీహరి స్వరూపం గానే భావించటం ద్వారా వైష్ణవులు ఐకమత్యంగా ఉండేవారు.కాని శివుడుని వేరే దేవత మూర్తిగా చూస్తూ ఉండటం వలన ఆ కాలం లోని శైవులకు వారి నమ్మకాలకు విభేదన చూపుతూ ఉండేవారు.ఇందువలన వారి మద్య సఖ్యత లోఫించేది.

వైష్ణవ సాంప్రదాయాలలో భాగంగా కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
లక్ష్మి సంప్రదాయం:
1.విశిష్టాద్వైత సంప్రదాయం.
2.శ్రీ వైష్ణవం.
3.వైఖానసం.
4.స్వామీ నారాయణం.

బ్రహ్మ సంప్రదాయం:
1.ద్వైత సంప్రదాయం.
2.అచింత్య భేదాభేద వైష్ణవం.

3.రుద్రా సంప్రదాయం:
1.శుద్దాద్వైత సంప్రదాయం(విష్ణుస్వామీ మరియు వల్లభాచార్యులు రూపకర్తలు).

4.కుమార సంప్రదాయం:
1.ద్వైతాద్వైత వైష్ణవం.

ఆనాడు మన దక్షిణ భారత దేశం లో వైష్ణవ సాంప్రదాయం లో రెండు శాఖలు ఉండేవి.
అవి.1.బ్రాహ్మణ వర్గ వైష్ణవం.
అయ్యంగారు(శ్రీ వైష్ణవం) లు ముఖ్యమైన వారు.
అయ్యంగారు లు రెండు ఉప శాఖలుగా ఉన్నారు.
వేదగలై శాఖ మరియు తెంగలై శాఖ.వీరందరూ వైష్ణవ పూజను,విష్ణుసేవను పంచారాత్రఆగమాల ప్రకారం చేసేవారు.ఈ రెండు భాగాలు ఒకే గురు పరంపరను కలిగి ఉన్నాయి.
=>వైఖానసులు భగవద్మార్గమునకు వారదిగా ఉంటూ సామాన్యుల కోసము,గ్రామ,పుర పట్టణ,నగర ప్రజల హితం కోసము ఆలయ అయ్యవార్లుగా ఉండేవారు.

2.బ్రాహ్మణ వర్గం కాని వారినుంచి గల వైష్ణవులు.
కమ్మవార్'లు(కమ్మ,కాపు),రెడ్డి వంశస్తులు,శెట్టి వంశీకులు,రాజులు,ముఖ్యంగా హరిసేవలో బ్రాహ్మణులకు ఏమాత్రము తీసిపోని హరిదాసులు వీరందరూ బ్రాహ్మణ వర్గం కాని వైష్ణవులు..
పైన పేర్కున్నవారందరూ వైష్ణవ సాంప్రదాయానికి వారసులే.వీరందరూ వైష్ణవ సాంప్రదాయానికి సంబందించినవారు..

కింద పేర్కొంటున్న దేవాలయాలు వైష్ణవ సంప్రదాయాన్ని భారతదేశంలో నిలిపిఉంచటంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.
1.వైఖానశ దేవాలయం-తిరుపతి.
2.మద్వ దేవాలయం-ఉడిపి.
3.తెంగలై దేవాలయం-కంచి పురం.
4.వేదంగలై దేవాలయం-అహోబిలం..
ఈ నాలుగు దేవాలయాలు భక్తుల కోర్కెలు తీర్చటానికి కొలువై ఉన్న శ్రీహరిని వివిధ అవతారరూపాలలో తమయందు ఉంచుకుని వైష్ణవ సంప్రదాయాన్ని,మరియు హిందూ సనాతన ధర్మాన్ని రక్షిస్తూ,ధర్మాన్ని,వైష్ణవాన్ని విస్తరింప చేస్తున్నాయి.
విష్ణువును పూజించండి,దుష్ట సంహరణకు అవతరించ వలసిన భాద్యత ఆయనదే.ధర్మ రక్షకుడు శ్రీహరి.ఆయన పాదాలు పరమ పవిత్రమైనవి.శరణు వేడుదాం.తరిద్దాం. ఓం నమో నారాయణాయ.

6.శాక్తేయం.
హరి ఓం.
సనాతన హిందూ ధర్మంలోని మత అంశమైన భాగాలలో మిగిలిన చివరి భాగం అయిన శాక్తేయం గురించి.
సనాతన హిందూధర్మంలో స్త్రీకి ప్రధమ స్తానాన్ని కల్పించారు అని చెప్పటానికి ఈ మత శాఖ మంచి ఉదాహరణ.ఈ మతంలో గాయత్రి దేవిని లేక అఖిలాండేశ్వరీ దేవిని జగన్మాతగా భావిస్తూ త్రిమూర్తులకు తల్లిగా పేర్కొనటం జరిగింది.
జగన్మాత మరియు సదాశివుల అభేద రూపాన్ని కలిగిన జగన్మాత ముందుగా త్రిమూర్తులను సృష్టించి,వారి ద్వారా సృష్టి,స్థితి,లయ కార్య భాద్యతను నిర్వర్తించటం జరిగింది అని దేవీ భాగవత సారాంశం.
సింధు నాగరకతలో శాక్తేయం బాగా ప్రాచుర్యంలో ఉండేది అని పురాతన అవశేషాలు చెప్తున్నాయి.
పల్లెలలో అమ్మవారిని పూజించే వారు జగన్మాతను గ్రామదేవతలుగా భావిస్తూ పంచభూతాలను నియంత్రించే శక్తి మూర్తి గాను,గ్రామానికి అమ్మగాను పూజిస్తారు.
రోగాలనుంచి కాపాడే శక్తి గా భావించే వారు రోగ నివారణ కోసం అమ్మవారి పేరు రోగానికి పెట్టి అమ్మవారికి ఇష్టమైన వేప,రావి మున్నగు లేపనములతో ఆయుర్వేద విధానంలో రోగ నివారణ జరుపుకుంటారు.

గ్రామ దేవతలుగా గల జగన్మాత మనుష్య రూపం లోని తన గణములతో గ్రామ రక్షకురాలై ప్రజలను.పంటలను రక్షిస్తుంది అని గ్రామ ప్రజలు నమ్ముతారు.ఈ ఈ విధంగా శాక్తేయం గ్రామాలలో ఇప్పటికి ఉంది.
ముఖ్యమైన గ్రామ దేవత మూర్తులు.
1. సాదారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది 'మావుళ్ళమ్మ' అయింది.
2.బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.
3.ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట(అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది
4.అలాగే పుల్ల(వికసించిన కళ్ళున్న)అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్దగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
5.ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.
6.భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల(భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= బోనాలమ్మ
ఈ విధంగా గ్రామ దేవతలు గ్రామాలలో కొలువై జగన్మాత అంశలుగా ప్రజలతో పూజలు అందుకుంటున్నారు.
అమ్మవారు ప్రాంతీయంగా అమ్మోరుగా మారి భక్తి మార్గంలో ప్రధమ భూమికను వహిస్తున్నారు.
ఇంతవరకు చెప్పింది గ్రామ దేవతల వివరణ.

ఇప్పుడు శాక్తేయ శాఖను,శాక్తేయ లక్షణాలను దేశవ్యాప్తం గా నిలిపిఉంచుతున్న అష్టాదశ శక్తి పీటాల గురించి తెలుసుకుందాము..
శక్తి పీఠములు 18.
దీనికి సంభందించి ఒక పురాణ గాధ ప్రాచుర్యం లో ఉన్నది.
శివుని మీద ఆక్రోశం తో నిరీశ్వర యాగం తలపెట్టిన దక్షుని ఇంటికి పుట్టింట జరిగే శుభకార్యానికి ఆహ్వానం అవసరం లేదని ప్రమద గణాలతో వెళ్ళిన సతిని దక్షుడు శివ నిందచేసిఅవమాన పరుస్తాడు.అవమానాన్ని భరించలేని సతి దేవి యోగాగ్ని ని సృష్టించి అందులో దూకి తనువుని వదిలిపెట్టింది.కోపోద్రిక్తుడైన రుద్రుడు నిరీశ్వర యాగాన్ని వీరభద్ర రూపం లో ద్వంసం చేసాడు.

కాని సతీ వియోగ దుఖం తీరని రుద్రుడు ఆమె శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండటం వలన సృష్టి ప్రక్రియ అంతరాయానికి గురి అవ్వటం గమనించిన దేవతలు మహా విష్ణువును వేడుకున్నారు అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రం తో ఆమె శరీరాన్ని ముక్కలు చేసి భూమి మీద పడేలా చేసి రుద్రుడిని కార్యోన్ముక్తుడిని చేసాడు.
అలా భూమి మీద పడిన సతీ దేవి అవయవ భాగాలే ఈనాటి శక్తి పీఠాలు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

18 శక్తిపీఠాలు
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:
శ్లో.
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
వివరణ:
1. శాంకరి-ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును-శ్రీ లంఖ (ఈ ఆలయ ఆనవాలులు పోర్చగీసులదాడి కారణంగా కనిపించుటలేదు,17c)
2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు
3.శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
4.చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక .
5.జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు .
6.భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ .
7.మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర .
8.ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర .
9మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ .
10.పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ .
11.గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా.
12.మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ .
13.కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో.
14.మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో.
15.వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
16.మంగళ గౌరి - గయ, బీహారు.
17.విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్..
18.సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉన్నది.
ఇవే కాక ఇంకా 51 శక్తిపీఠాలు శాక్తేయంను భారత దేశంలో నిలబడేలా చేస్తున్నాయి.

No comments:

Post a Comment