12 November 2013

మాసం :
1. .చైత్రమాసం . పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటే దానిని చైత్రమాసం అంటారు .

2. వైశాఖమాసం . పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రం ఉంటే దానిని వైశాఖ మాసం అవుతుంది.

3. జ్యేష్ట మాసం . పౌర్ణమి నాడు జ్యేష్ట నక్షత్రం ఉంటే అది జ్యేష్ట మాసం .

4. ఆషాఢ మాసం .పౌర్ణమి నాడు పూర్వాషాఢ గానీ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటే ఆ మాసం ఆషాఢ మాసం .

5. .శ్రావణ మాసం . పౌర్ణమి నాడు శ్రవణం అనే నక్షత్రం ఉంటుంది కనుక అది శ్రావణ మాసం .

6. భాద్రపదం . పౌర్ణమి నాడు పూర్వాభాద్ర గాని ఉత్తరాభాద్ర నక్షత్రాలలో ఏది ఉన్న అది భాద్రపదమాసం .

7. ఆశ్వయుజ మాసం . పౌర్ణమి నాడు అశ్వని నక్షత్రం ఉన్నది ఆశ్వయుజం .

8. కార్తీక మాసం .కృత్తిక నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది కార్తీకమాసం .

9. మార్గశిర మాసం . మృగశిర నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది మార్గశిరం .

10. పుష్యమాసం .పౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రం ఉన్నది పుష్య మాసం .

11. మాఘ మాసం . మఘ నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది మాఘమాసం .

12. ఫాల్గుణ మాసం . ఫల్గుణి నక్షత్రం అనగా పుబ్బ .ఉత్తర నక్షత్రాలను పూర్వ ఫల్గుణి అని ఉత్తర ఫల్గుణి అని అంటారు .వీటిలో ఏ నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నా గాని అది ఫాల్గుణ మాసం .

No comments:

Post a Comment