18 November 2013

బిల్వ వృక్షం :

మారేడు లేదా బిల్వము.ఇది వెలగ అనే వ్యావహారికనామంతోనూ ప్రసిద్ధి.మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు.


హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. దీని గురించి వేదకాలంనాటి నుంచీ తెలుసు. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కన్పిస్తుంది. శివునికి ఇదంటే బహుప్రీతి. మారేడు అకులు మూడు కలిపి శివుని మూడు కళ్ళలా ఉంటాయి. శివుడు ఈ మారేడు చిట్టు క్రింద నివాసం ఉంటాడని ప్రతీతి.


మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. * శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు బావించెదరు. శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉన్నది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మముని పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించినాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి వుంచగలనని విన్నవించాడు. అంత శివుడు మారునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివశించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిని పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వశించినారు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి నాయందే నీవు వశించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. * బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సుర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.


మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంద్యాసమయము, రాత్రి వేళలందు, శిరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు కనుక ఈ దళాలను ముందు రోజు కోసి బభద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.


మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే శివుడికి అతి ప్రీతికరమైన పత్రము.

1 comment:

  1. maaredu pandu veru , velaga pandu veru . maaredu pandu suvasana kaligi ,pagulagottinappudu tenelaga paakamkaruthoo , untundhi ee gujju nu neetilo kalipi kalipi taagithe chaluva chesi chemata pattinappudu aa maaredu pandu yokka parimalam manishi sareeram nundi vasthundhi adhi oka vidanga gandhapu vasanalagevuntundhi .; kani velaga pandu eanuguku istamaina pandu idhi vagaru ,pulupu kalasinattu vuntundhi .;velagapandu tellaga maaredu pandu pachhagaanu vuntaie rendu veruveru phalamulu....

    ReplyDelete