07 November 2013

దశోపనిషత్తులు :

ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి.అవి

1) సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు

2) బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.

3) అరణ్యకాలు
- వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.

4) ఉపనిషత్తులు
- ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి.

నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి.వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి.వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి.

ఒక్కోవేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది

ఋగ్వేదానికి సంబంధించినవి - 10
కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి - 32
శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి - 19
సామవేదానికి సంబంధించినవి - 16
అధర్వణ వేదానికి సంబంధించినవి - 31 (మొత్తం - 108)

వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి.వీటినే దశోపనిషత్తులు అంటారు.

వేదాంతము అని మనము పిలుచుకొనేదే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు చివరిగా ఉండడంవలన వీటిని వేదాంతముఅంటారు.శ్రీ భగవద్గీత కు మూలాలు ఉపనిషత్తులే. వేదాలలో ఎక్కువ భాగం కర్మకాండకు (అనగాయజ్ఞయాగాలు,పూజలు మొదలగునవి) ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వగా ఉపనిషత్తులలో జ్ఞానమునకే ప్రాముఖ్యతనుఇచ్చి కర్మకాండను పట్టించుకొనలేదు. "ఉపనిషత్" అను పదానికి అర్థం సమీపములో ఉండడం. సత్యాలను గురువుదగ్గర తెలుసుకోవడం లేక ఆత్మ(పరమాత్మ) కు సమీపములో ఉండడం అని అర్థం. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు మనకు తెలుసు. ఈ 108 లో 10 ఉపనిషత్తులకు ఆదిశంకరాచార్యులు భాష్యం వ్రాసారు. వీటినే దశోపనిషత్తులు అంటారు.

ఈ దశోపనిషత్తులు ఏమిటనేవి క్రింది శ్లోకం వివరిస్తుంది.

"ఈశ కేన కఠ ముండ మాండూక్య ప్రశ్న తిత్తిరి

ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ"

అవి

1.ఈశావాస్య ఉపనిషత్తు
2. కేనోపనిషత్తు
3. కఠ ఉపనిషత్తు
4.ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్య ఉపనిషత్తు
7. తైత్తిరీయ ఉపనిషత్తు
8. ఐతరేయ ఉపనిషత్తు
9.ఛాందోగ్య ఉపనిషత్తు
10. బృహదారణ్యక ఉపనిషత్తు

వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు.
దశోపనిషత్తులు :

ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి.అవి

1) సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు

2) బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.

3) అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.

4) ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి.

నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి.వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి.వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి.

ఒక్కోవేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది
ఋగ్వేదానికి సంబంధించినవి - 10
కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి - 32
శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి - 19
సామవేదానికి సంబంధించినవి - 16
అధర్వణ వేదానికి సంబంధించినవి - 31 (మొత్తం - 108)

వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి.వీటినే దశోపనిషత్తులు అంటారు.

వేదాంతము అని మనము పిలుచుకొనేదే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు చివరిగా ఉండడంవలన వీటిని వేదాంతముఅంటారు.శ్రీ భగవద్గీత కు మూలాలు ఉపనిషత్తులే. వేదాలలో ఎక్కువ భాగం కర్మకాండకు (అనగాయజ్ఞయాగాలు,పూజలు మొదలగునవి) ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వగా ఉపనిషత్తులలో జ్ఞానమునకే ప్రాముఖ్యతనుఇచ్చి కర్మకాండను పట్టించుకొనలేదు. "ఉపనిషత్" అను పదానికి అర్థం సమీపములో ఉండడం. సత్యాలను గురువుదగ్గర తెలుసుకోవడం లేక ఆత్మ(పరమాత్మ) కు సమీపములో ఉండడం అని అర్థం. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు మనకు తెలుసు. ఈ 108 లో 10 ఉపనిషత్తులకు ఆదిశంకరాచార్యులు భాష్యం వ్రాసారు. వీటినే దశోపనిషత్తులు అంటారు.

ఈ దశోపనిషత్తులు ఏమిటనేవి క్రింది శ్లోకం వివరిస్తుంది.

"ఈశ కేన కఠ ముండ మాండూక్య ప్రశ్న తిత్తిరి
ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ"

అవి
1.ఈశావాస్య ఉపనిషత్తు
2. కేనోపనిషత్తు
3. కఠ ఉపనిషత్తు
4.ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్య ఉపనిషత్తు
7. తైత్తిరీయ ఉపనిషత్తు
8. ఐతరేయ ఉపనిషత్తు
9.ఛాందోగ్య ఉపనిషత్తు
10. బృహదారణ్యక ఉపనిషత్తు

వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు.

No comments:

Post a Comment