అశ్వత్థ వృక్షం :
బ్రహ్మాండపురాణంలో బ్రహ్మదేవుడు నారదమార్షికి అశ్వత్థవృక్షం మహిమను
గురించి వివరించాడు. అశ్వత్థవృక్షం విష్ణుమూర్తి స్వరూపం. ఈవృక్షం మూలంలో
బ్రహ్మదేవుడు నివసిస్తుంటాడు.మధ్యలో శ్రీహరి, అగ్రభాగంలో రుద్రుడు ఉంటాడు.
అందుకే అశ్వత్థవృక్షమును త్రిమూర్తిస్వరూపమని కూడా పేర్కొంటారు. ఈ వృక్షం
కొమ్మల్లో, ఆకుల్లో కూడా త్రిమూర్తులు ఉంటారు. దక్షిణశాఖలో శూలపాణి,
పశ్చిమశాఖలో శ్రీమన్నారాయణమూర్తి , ఉత్తరశాఖలో బ్రహ్మదేవుడు ఉంటారని
శాస్త్రవచనం. ఇంద్రాది దేవతలు తూర్పువైపు కొమ్మల్లొ వుంటారు. వేరు మండలలో,
బ్రాహ్మణ, వేద, యజ్ఞ, ఇత్యాది దేవతలు, సమస్త ఋషులు నిరంతరం నివసిస్తుంటారు.
సమస్త పుణ్యనదీతీరాలు, సప్తసాగర లవణాదికాలు, క్షార (లవణం) ఇక్షు (చెరకు)
రస,సురా, నెయ్యి, పెరుగు, శుద్ధోదక క్షీరసాగరం అనే సప్తసముద్రాలు
తూర్పువైపు కొమ్మలో ఉంటాయి. అశ్వథవృక్షం మూలస్థనం ‘ఆ కార శబ్దం. చెట్టు
కాండం, శాఖలు ‘ఉ ‘ కారశబ్దం. పుష్పాలు, ఫలాలు ‘ మ ‘ కా శబ్దాన్ని
సూచిస్తాయి. అశ్వత్థ వృక్షముఖం ఆగ్నేయదిశలో ఉంటుంది. ఏకాదా రుద్రాదికులు,
అష్టవసువులు మొదలైన సమస్తదేవతలూ, త్రిమూర్తులు ఎక్కడ ఉంటారో, అక్కడే
ఉంటారు. తిమూర్తులు ఏ వౄక్షాల దగ్గర నివసిస్తారో, అట్టి వౄక్షాన్ని భక్తితొ
పూజిస్తే, కోరిన కొరికలు సిద్ధిస్తాయని నమ్మకం.
అశ్వత్థవృక్షం - పూజించే విధానం :
అశ్వత్థవృక్షమును ఆషాడాం, పుష్యమి, చైత్ర మాసాలలోనూ, గురువు, శుక్రుడు
అస్తమించి ఉన్నప్పుడూ, చంద్రబలం లేని రోజున పూజించకూడదు. పైమాసాలు తప్ప,
ఇతర మాసాలలో, మంచిరోజు చూసి శుచి శుభ్రతతో ఉపవాసం ప్రారంభించాలి. ఆది,
మంగళవారాల్లో అశ్వత్థమును తాకకూడదు. అంతే కాకుండా సంధ్య వేళల్లో ,
శుద్ధచవిత్, నవమి, చతుర్దశి తిథుల్లోనూ, పండగరోజుల్లోనూ,
సూర్యచంద్రగ్రహణాలలోనూ, దుర్దినాది వైదృతుల్లోనూ, జ్యోతిష్యంలో (27వ యోగం),
మధ్యాహ్నం, మూడవ ప్రహారంలో ఈ అశ్వత్థమును స్పర్శించకూడదు. పూజకు ముందు
ద్యూతకర్మ, అసత్య భాషణ, ఇత్యాదులను వర్జించాలి. నింద, వితండవాదాలను
వర్జించి, ఉదయంపూట మౌనంగా ఉండి పూజను చేయాలి.
దేహం మీదున్న వస్త్రంతో
సహా స్నానంచేసి, తర్వాత వేరే వస్త్రం ధరించి, వృక్షం క్రింద గోమయంతో
అలకాలి. సస్తికాది శంఖపద్మాల రంగువల్లులను వేసి, పంచరంగుల పొడులతో వాటిని
నింపాలి. తర్వాత స్నాం చేసి, తెల్లని వస్త్రాలను ధరించాలి. రెండు కలశాలను
తీసుకొని వచ్చి, గంగాయమునలను అందు ఆహ్వానించి, వాటిని – రంగ వల్లుల
పద్మములపై ఉంచాలి. కలశాలను పూజించి, పుణ్యాహవచన కర్మలను విధి పూర్వకంగా
సంకల్పించి, కోరుకున్న దానిని ఉచ్చరించాలి. తర్వాత కలశాలను తీసుకొని,
ఏడుసార్లు నీరు తీసుకొచ్చి, అశ్వత్థముకు స్నానం చేయించాలి. మరల స్నానం
చేసి, అశ్వత్థముకు స్నానం చేయించాలి. మరల స్నానం చేసి, అశ్వత్థమును
పూజించాలి. ఈపుజను పురుషసూక్తంతో, షోశోపచారాలతో పూజించాలి. అష్టభుజాల్లో
శంఖ, చక్రాలు, వరదహస్తం, అభయహస్తాలతో ఉండే శ్రీవిష్ణుమూర్తిని మనసులో
ధ్యానించాలి. ఖడ్గం, డాలు ఒక చేతిలోనూ, మరొక చేతిలో ధనుర్భాణాలను ధరించిన
విష్ణుమూర్తిని ధ్యానించాలి. పీతాంబరం ధరించి, నిరంతరం లక్ష్మీదేవి
సన్నిధానంలో ఉండె శ్రీహరీ ధ్యానిస్తూ అశ్వత్థమును పూజించాలి. త్రిమూర్తుల
స్వరూపమైన అశ్వత్థము శివశక్తులు లేకుండా ఉండదు. అందరి దేవతలను అవాహము చేసి
షోడశోపచారములతోపూజించాలి. వస్త్రాలు లేదా దారంతో అశ్వత్థము చుట్టు, మరల
సంకల్పం చేసి, ప్రదక్షిణ చేయాలి. విష్ణు సహస్రనామం పఠిస్తూ ప్రదక్షిణ కూడా
చేయాలి. మౌనంగా ప్రదిక్షణ చేస్తే అమితమైన ఫలితం లభిస్తుంది. ఉదకకుంభం
తీసుకుని గర్భణీ స్త్రీలా మందగతితో మంచి మనస్సుతో ప్రదక్షిణ చేయాలి. అలా
చేసేప్రదక్షిణ అడుగుకి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం, పుణ్యం లభిస్తుంది.
మొదటి ప్రదక్షిణ అయ్యాక, రెండవ ప్రదక్షిణ ఆరంభించేముందు “ప్రదక్షిణ సమాప్తి
మధ్యే” అంటూ నమస్కారము చేయాలి. పూజ ముగియగానే ఉద్యాపనం చేయాలి.
బ్రహ్మాండపురాణంలో బ్రహ్మదేవుడు నారదమార్షికి అశ్వత్థవృక్షం మహిమను గురించి వివరించాడు. అశ్వత్థవృక్షం విష్ణుమూర్తి స్వరూపం. ఈవృక్షం మూలంలో బ్రహ్మదేవుడు నివసిస్తుంటాడు.మధ్యలో శ్రీహరి, అగ్రభాగంలో రుద్రుడు ఉంటాడు. అందుకే అశ్వత్థవృక్షమును త్రిమూర్తిస్వరూపమని కూడా పేర్కొంటారు. ఈ వృక్షం కొమ్మల్లో, ఆకుల్లో కూడా త్రిమూర్తులు ఉంటారు. దక్షిణశాఖలో శూలపాణి, పశ్చిమశాఖలో శ్రీమన్నారాయణమూర్తి , ఉత్తరశాఖలో బ్రహ్మదేవుడు ఉంటారని శాస్త్రవచనం. ఇంద్రాది దేవతలు తూర్పువైపు కొమ్మల్లొ వుంటారు. వేరు మండలలో, బ్రాహ్మణ, వేద, యజ్ఞ, ఇత్యాది దేవతలు, సమస్త ఋషులు నిరంతరం నివసిస్తుంటారు. సమస్త పుణ్యనదీతీరాలు, సప్తసాగర లవణాదికాలు, క్షార (లవణం) ఇక్షు (చెరకు) రస,సురా, నెయ్యి, పెరుగు, శుద్ధోదక క్షీరసాగరం అనే సప్తసముద్రాలు తూర్పువైపు కొమ్మలో ఉంటాయి. అశ్వథవృక్షం మూలస్థనం ‘ఆ కార శబ్దం. చెట్టు కాండం, శాఖలు ‘ఉ ‘ కారశబ్దం. పుష్పాలు, ఫలాలు ‘ మ ‘ కా శబ్దాన్ని సూచిస్తాయి. అశ్వత్థ వృక్షముఖం ఆగ్నేయదిశలో ఉంటుంది. ఏకాదా రుద్రాదికులు, అష్టవసువులు మొదలైన సమస్తదేవతలూ, త్రిమూర్తులు ఎక్కడ ఉంటారో, అక్కడే ఉంటారు. తిమూర్తులు ఏ వౄక్షాల దగ్గర నివసిస్తారో, అట్టి వౄక్షాన్ని భక్తితొ పూజిస్తే, కోరిన కొరికలు సిద్ధిస్తాయని నమ్మకం.
అశ్వత్థవృక్షం - పూజించే విధానం :
అశ్వత్థవృక్షమును ఆషాడాం, పుష్యమి, చైత్ర మాసాలలోనూ, గురువు, శుక్రుడు అస్తమించి ఉన్నప్పుడూ, చంద్రబలం లేని రోజున పూజించకూడదు. పైమాసాలు తప్ప, ఇతర మాసాలలో, మంచిరోజు చూసి శుచి శుభ్రతతో ఉపవాసం ప్రారంభించాలి. ఆది, మంగళవారాల్లో అశ్వత్థమును తాకకూడదు. అంతే కాకుండా సంధ్య వేళల్లో , శుద్ధచవిత్, నవమి, చతుర్దశి తిథుల్లోనూ, పండగరోజుల్లోనూ, సూర్యచంద్రగ్రహణాలలోనూ, దుర్దినాది వైదృతుల్లోనూ, జ్యోతిష్యంలో (27వ యోగం), మధ్యాహ్నం, మూడవ ప్రహారంలో ఈ అశ్వత్థమును స్పర్శించకూడదు. పూజకు ముందు ద్యూతకర్మ, అసత్య భాషణ, ఇత్యాదులను వర్జించాలి. నింద, వితండవాదాలను వర్జించి, ఉదయంపూట మౌనంగా ఉండి పూజను చేయాలి.
దేహం మీదున్న వస్త్రంతో సహా స్నానంచేసి, తర్వాత వేరే వస్త్రం ధరించి, వృక్షం క్రింద గోమయంతో అలకాలి. సస్తికాది శంఖపద్మాల రంగువల్లులను వేసి, పంచరంగుల పొడులతో వాటిని నింపాలి. తర్వాత స్నాం చేసి, తెల్లని వస్త్రాలను ధరించాలి. రెండు కలశాలను తీసుకొని వచ్చి, గంగాయమునలను అందు ఆహ్వానించి, వాటిని – రంగ వల్లుల పద్మములపై ఉంచాలి. కలశాలను పూజించి, పుణ్యాహవచన కర్మలను విధి పూర్వకంగా సంకల్పించి, కోరుకున్న దానిని ఉచ్చరించాలి. తర్వాత కలశాలను తీసుకొని, ఏడుసార్లు నీరు తీసుకొచ్చి, అశ్వత్థముకు స్నానం చేయించాలి. మరల స్నానం చేసి, అశ్వత్థముకు స్నానం చేయించాలి. మరల స్నానం చేసి, అశ్వత్థమును పూజించాలి. ఈపుజను పురుషసూక్తంతో, షోశోపచారాలతో పూజించాలి. అష్టభుజాల్లో శంఖ, చక్రాలు, వరదహస్తం, అభయహస్తాలతో ఉండే శ్రీవిష్ణుమూర్తిని మనసులో ధ్యానించాలి. ఖడ్గం, డాలు ఒక చేతిలోనూ, మరొక చేతిలో ధనుర్భాణాలను ధరించిన విష్ణుమూర్తిని ధ్యానించాలి. పీతాంబరం ధరించి, నిరంతరం లక్ష్మీదేవి సన్నిధానంలో ఉండె శ్రీహరీ ధ్యానిస్తూ అశ్వత్థమును పూజించాలి. త్రిమూర్తుల స్వరూపమైన అశ్వత్థము శివశక్తులు లేకుండా ఉండదు. అందరి దేవతలను అవాహము చేసి షోడశోపచారములతోపూజించాలి. వస్త్రాలు లేదా దారంతో అశ్వత్థము చుట్టు, మరల సంకల్పం చేసి, ప్రదక్షిణ చేయాలి. విష్ణు సహస్రనామం పఠిస్తూ ప్రదక్షిణ కూడా చేయాలి. మౌనంగా ప్రదిక్షణ చేస్తే అమితమైన ఫలితం లభిస్తుంది. ఉదకకుంభం తీసుకుని గర్భణీ స్త్రీలా మందగతితో మంచి మనస్సుతో ప్రదక్షిణ చేయాలి. అలా చేసేప్రదక్షిణ అడుగుకి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం, పుణ్యం లభిస్తుంది. మొదటి ప్రదక్షిణ అయ్యాక, రెండవ ప్రదక్షిణ ఆరంభించేముందు “ప్రదక్షిణ సమాప్తి మధ్యే” అంటూ నమస్కారము చేయాలి. పూజ ముగియగానే ఉద్యాపనం చేయాలి.
No comments:
Post a Comment