13 November 2013

రక్త దానం చేయడం వల్ల కలిగే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు :

రక్త దానం అనేది దాదాపు ప్రాణ దానం లాంటిది.. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. అన్ని దానాల్లోకెల్లా మిన్న రక్తదానం. ఎందుకంటే... ప్రాణాపాయస్థితిలో వున్న వ్యక్తికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడడమంటే... అంతకన్నా పరోపకారం ఏముంటుంది? అన్నదానం, విద్యాదానం మొ ఏ దానం చేయాలన్నా ప్రాణమున్న మనిషికే చేస్తాం. అలాంటి ప్రాణాలనే నిలబెట్టే మహత్తర దానం రక్తదానం. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి. సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేస్తే మానవత్వమే మీకు పాదాభివందనం చేస్తుంది... ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడయినా సరే ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటె ఎక్కువ రక్త చందురం(hemoglobin) ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే లీటరు ఒక్కంటికి 60 గ్రాముల కంటె తక్కువ రక్తచందురం ఉంటే అది రక్తం ఎక్కించవలసిన పరిస్థితి. అంతే కాని ఆపరేషను చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పని లేదు. ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో కూడ కొంత రక్త స్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం పది, పన్నెండు యూనిట్లు (ఒక యూనిట్ = ఆర్ధ లీటరు) దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే ఉరమరగా 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి సందర్భంలో ఎన్నో కారణాల వల్ల దానం స్వీకరించినవాడి రక్తం సులభంగా గడ్డకట్టదు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులు ఎదురయినప్పుడు రోగి స్వంత రక్తాన్నే ఎంత వీలయితే అంత గొట్టాల ద్వారా పట్టి, కూడగట్టి, శుద్ధి చేసి, తిరిగి వాడతారు. మరి రక్త దానం చేయడం ఆ వ్యక్తికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

ఐరన్ నిల్వలను సమతుల్యం చేస్తుంది: రక్త దానం చేయడం వల్ల కలిగే ఓ మంచి ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒకటి. అనేక పరిశోధనలు, అద్యయనాల ప్రకారం చాలా మందిలో వారు తీసుకొనే ఆహారాన్ని బట్టే ఐరన్ నిల్వలు ఉంటాయి అని కనుగొన్నారు. కాబట్టి శరీరంలో ఇనుము స్థాయిని సమతుల్యం కోసం రక్తం దానం చేయడం చాలా మంచిది. రక్తంలో ఎక్కువగా ఐరన్ ఉంటే గుండెకు హాని చేస్తుంది. కార్డియో వాస్కులర్ వ్యాధులను నివారించేందుకు రక్తదానం చేయడం మంచిది. రక్తం దానం చేయడం వల్ల మహిళల్లో రుతుస్రావం ద్వారా ఇనుము స్థాయిల్లో సమతుల్యత జరుగుతుంది. మహిళల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత రుతస్రావం పూర్తి నిలిచిపోయినప్పుడు వారి శరీరంలో నిల్వఉండే ఐరన్ స్థాయిని సమతుల్యం చేసుకోవాడానికి రక్తదానం చేయడం చాలా ఆరోగ్యకరం.

హెల్త్ చెకప్: రక్తం దానం చేయడానికి ముందు, దాత యొక్క చరిత్ర తెలుసుకుంటారు. అంతే కాదు, ఆవ్యక్తి రక్తం దానం చేయడానికి అర్హుడా కాడా అన్ని విషయ నిర్ధారణ కోసం డాక్టర్లు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి మీరు రక్తదానం చేయడానికి ముందు డాక్టర్ సలహా ప్రకారం చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. దాంతో మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు.

క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది: శరీరంలో ఐరన్ నిల్వల స్థాయి తగ్గడం వల్ల(తక్కువగా)ఉండటం వల్ల క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ తో బాధపడుతున్న అవకాశాలు ప్రత్యేకంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ లు రాకుండా అడ్డుకుంటుంది.

అధిక రక్త పోటును నియంత్రిస్తుంది: మీరు రక్త దానం చేసినప్పుడు, రక్త పరిమాణం సమతుల్యం చేంది, రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన గుండె, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: శరీరంలోని రక్త కణాల్లో కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు మరియు మంచి కొలెస్ట్రాల్ ను ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం.

రక్తం నష్టం అధిగమించడానికి సహాయం చేస్తుంది: మీరు రక్తదానం చేసినప్పుడు, తిరిగి మీ శరీరంలో ఏర్పడిని రక్త నష్టాన్ని భర్తీ చేయడం కోసం 4-8సమయం పడుతుంది. ఆ సమయంలో ఎర్రరక్తకణాల్లో ఉన్నరక్తం శరీరం మొత్త పునరుద్దరణ సరిచేస్తుంది. మరికొన్ని ప్రయోజనాలేంటంటే పురుషులు ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయొచ్చు. మహిళలు ప్రతి నాలుగు నెలలకొకసారి డొనేట్ చేయవచ్చు. అయితే మీరు రక్తదానం చేసేటప్పుడు మీరు డాక్టర్ ను తప్పనిసరిగా సంప్రదించాలి.

No comments:

Post a Comment