ఏకాదశులు - మహాత్మ్యము :
హిందూ సంప్రదాయంలో పరమ పవిత్రమైన తిథి ఏకాదశి.ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకూ
ఏదోఒక విశిష్టతను ఆపాదించి హరినామస్మరణ చేస్తారు భక్తులు. ఒక్కో రోజుకూ
ఒక్కో ప్రాధాన్యత. తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి లాంటి ఏకాదశులకు ఎంతటి
పవిత్రత ఉందో అందరికీ తెలుసు. అలాంటి ప్రత్యేకతే అలాంటి పవిత్రతే
జ్యేష్ఠంమాసంలో వచ్చే మొదటి ఏకాదశి కీ ఉంది. దీనిని త్రివిక్రమైకాదశి.
అంటారు. నీరుకూడా తాగకుండా ఉపవాసం చేస్తారు కాబట్టి దీనే్న నిర్జలైకాదశి
అంటారు. ఆ రోజు నీళ్ల కుండలు, నెయ్యి, గొడుగు వంటివి దానం చేస్తారు.
జ్యేష్ఠ బహుళ ఏకాదశి.. దీన్ని యోగిన్యైకాదశి అంటారు.
ఆషాఢమాసంలో వచ్చే
శుద్ధ ఏకాదశి. దీనే్న ‘తొలి ఏకాదశి’ అంటారు. పూర్వం ఆషాఢశుద్ధ ఏకాదశినే
సంవత్సరాంరంభంగా భావించేవారు కాబట్టి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. శ్రీ
మహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పంపై శయనించే రోజు కాబట్టి ఈ రోజును
శయనైకాదశి అని కూడా అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఖగోళపరంగా చూస్తే ఈ
రోజు దాకా ఉత్తరదిశగా వాలి కనిపించే సూర్యుడు ఒకింత దక్షిణ దిశగా వాలినట్లు
కనిపిస్తాడు. సూర్యడంటే ప్రత్యక్ష నారాయణుడు. అందువల్ల కూడా మన పూర్వులు ఈ
రోజును శయనైకాదశిగా వ్యవహరించి ఉండొచ్చని పండితుల అభిప్రాయం
ఈ రోజున
ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు తొలి
ఏకాదశినాడు ‘గోపద్మవ్రతం’ చేస్తారు. అంటే గోవును పూజించడం అన్నమాట. ఈ నెల
బహుళంలో వచ్చే ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణువును
పూజించి ఏకాదశి వ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మిక.
శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదాఏకాదశి, లలితైకాదశి అంటారు. ఆ రోజున గొడుగు
దానమిస్తే మంచిదని ప్రతీతి. ఇక బహుళంలో వచ్చేది కామిక ఏకాదశి. ఈ రోజున
వెన్న దానం చేయాలంటారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ
రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియల్లో హరిని పూజిస్తే కరవు కాటకాలు
తొలగిపోతాయని పద్మపురాణంలో ఉంది. విశ్వామిత్రుడికి మాటిచ్చి అనేక కష్టాలను
అనుభవించిన హరిశ్చంద్రుడు భాద్రపద బహుళ ఏకాదశి (దీనే్న అజ ఏకాదశి అంటారు)
నాడు వ్రతం ఆచరించి వాటినిదూరం చేసుకొన్నాడని పురాణ ప్రవచనం. అలాంటిదే
కార్తీక శుద్ధ ఏకాదశి బహుళంలోని ఉత్పత్తి ఏకాదశి. విష్ణుమూర్తి శరీరం నుంచి
పుట్టిన కన్య మురాసురుని సంహరించిన దినం ఇది. తొలి ఏకాదశినాడు శయనించిన
విష్ణుమూర్తి యోగ నిద్రనుంచి మేలుకునే రోజు కాబట్టి ఈ రోజును ఉత్థాన ఏకాదశి
అని కూడా అంటారు భక్తులు. మార్గశిర శుద్ధంలో వచ్చేది మోక్షైకాదశి, సౌఖ్యదా
ఏకాదశి; అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే ఆ రోజును ‘ముక్కోటి/వైకుంఠ
ఏకాదశి’ అంటారు. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణ్వాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం
ఉంటుంది. ఆ రోజున స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నవారికి
మోక్షం లభిస్తుందని ప్రతీతి. ఇక మార్గశిర బహుళంలో వచ్చేది విమలైకాదశి.
దీనే్న సఫలైకాదశి అని కూడా అంటారు. పుష్యశుద్ధంలో వచ్చేది నంద/పుత్ర
ఏకాదశి. అదే మాసం బహుళంలో వచ్చేది కల్యాణైకాదశి. మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ
ఏకాదశిగా ఆచరిస్తారు భక్తులు. ఈ రోజునే కామదైకాదశి, జయైకాదశి అని కూడా
వ్యవహరిస్తారు. మరో పదిహేను రోజులకు వచ్చేది విజయైకాదశి. ఆ రోజున పాదరక్షలు
దానం చేయడం మంచిదంటారు. ఫాల్గుణ మాసంలో దాత్రైకాదశి, సామ్యైకాదశి వస్తాయి.
చైత్ర శుద్ధంలో వచ్చే ఏకాదశిని దమనైకాదశి అంటారు. దీనికే అవైధవ్య ఏకాదశి
అని కూడా పేరు. చైత్ర బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే వేయి ఆవులను దానం చేసిన
పుణ్యం లభిస్తుందంటారు. ఈ రోజును వరూధిన్యైకాదశి అంటారు. ఇక మిగిలింది
వైశాఖ మాసం. ఇక్కడ మొదట వచ్చే మోహినే్యకాదశి నాడు చెప్పులు, పాలు, చల్లటి
నీరు.. బహుళంలో వచ్చే సిద్ధైకాదశినాడు గొడుగు.. దానం చేస్తే మంచిదంటారు.
హిందూ సంప్రదాయంలో పరమ పవిత్రమైన తిథి ఏకాదశి.ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకూ ఏదోఒక విశిష్టతను ఆపాదించి హరినామస్మరణ చేస్తారు భక్తులు. ఒక్కో రోజుకూ ఒక్కో ప్రాధాన్యత. తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి లాంటి ఏకాదశులకు ఎంతటి పవిత్రత ఉందో అందరికీ తెలుసు. అలాంటి ప్రత్యేకతే అలాంటి పవిత్రతే జ్యేష్ఠంమాసంలో వచ్చే మొదటి ఏకాదశి కీ ఉంది. దీనిని త్రివిక్రమైకాదశి. అంటారు. నీరుకూడా తాగకుండా ఉపవాసం చేస్తారు కాబట్టి దీనే్న నిర్జలైకాదశి అంటారు. ఆ రోజు నీళ్ల కుండలు, నెయ్యి, గొడుగు వంటివి దానం చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశి.. దీన్ని యోగిన్యైకాదశి అంటారు.
ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. దీనే్న ‘తొలి ఏకాదశి’ అంటారు. పూర్వం ఆషాఢశుద్ధ ఏకాదశినే సంవత్సరాంరంభంగా భావించేవారు కాబట్టి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పంపై శయనించే రోజు కాబట్టి ఈ రోజును శయనైకాదశి అని కూడా అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఖగోళపరంగా చూస్తే ఈ రోజు దాకా ఉత్తరదిశగా వాలి కనిపించే సూర్యుడు ఒకింత దక్షిణ దిశగా వాలినట్లు కనిపిస్తాడు. సూర్యడంటే ప్రత్యక్ష నారాయణుడు. అందువల్ల కూడా మన పూర్వులు ఈ రోజును శయనైకాదశిగా వ్యవహరించి ఉండొచ్చని పండితుల అభిప్రాయం
ఈ రోజున ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు తొలి ఏకాదశినాడు ‘గోపద్మవ్రతం’ చేస్తారు. అంటే గోవును పూజించడం అన్నమాట. ఈ నెల బహుళంలో వచ్చే ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణువును పూజించి ఏకాదశి వ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మిక.
శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదాఏకాదశి, లలితైకాదశి అంటారు. ఆ రోజున గొడుగు దానమిస్తే మంచిదని ప్రతీతి. ఇక బహుళంలో వచ్చేది కామిక ఏకాదశి. ఈ రోజున వెన్న దానం చేయాలంటారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియల్లో హరిని పూజిస్తే కరవు కాటకాలు తొలగిపోతాయని పద్మపురాణంలో ఉంది. విశ్వామిత్రుడికి మాటిచ్చి అనేక కష్టాలను అనుభవించిన హరిశ్చంద్రుడు భాద్రపద బహుళ ఏకాదశి (దీనే్న అజ ఏకాదశి అంటారు) నాడు వ్రతం ఆచరించి వాటినిదూరం చేసుకొన్నాడని పురాణ ప్రవచనం. అలాంటిదే కార్తీక శుద్ధ ఏకాదశి బహుళంలోని ఉత్పత్తి ఏకాదశి. విష్ణుమూర్తి శరీరం నుంచి పుట్టిన కన్య మురాసురుని సంహరించిన దినం ఇది. తొలి ఏకాదశినాడు శయనించిన విష్ణుమూర్తి యోగ నిద్రనుంచి మేలుకునే రోజు కాబట్టి ఈ రోజును ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు భక్తులు. మార్గశిర శుద్ధంలో వచ్చేది మోక్షైకాదశి, సౌఖ్యదా ఏకాదశి; అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే ఆ రోజును ‘ముక్కోటి/వైకుంఠ ఏకాదశి’ అంటారు. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణ్వాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ రోజున స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నవారికి మోక్షం లభిస్తుందని ప్రతీతి. ఇక మార్గశిర బహుళంలో వచ్చేది విమలైకాదశి. దీనే్న సఫలైకాదశి అని కూడా అంటారు. పుష్యశుద్ధంలో వచ్చేది నంద/పుత్ర ఏకాదశి. అదే మాసం బహుళంలో వచ్చేది కల్యాణైకాదశి. మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ఆచరిస్తారు భక్తులు. ఈ రోజునే కామదైకాదశి, జయైకాదశి అని కూడా వ్యవహరిస్తారు. మరో పదిహేను రోజులకు వచ్చేది విజయైకాదశి. ఆ రోజున పాదరక్షలు దానం చేయడం మంచిదంటారు. ఫాల్గుణ మాసంలో దాత్రైకాదశి, సామ్యైకాదశి వస్తాయి. చైత్ర శుద్ధంలో వచ్చే ఏకాదశిని దమనైకాదశి అంటారు. దీనికే అవైధవ్య ఏకాదశి అని కూడా పేరు. చైత్ర బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందంటారు. ఈ రోజును వరూధిన్యైకాదశి అంటారు. ఇక మిగిలింది వైశాఖ మాసం. ఇక్కడ మొదట వచ్చే మోహినే్యకాదశి నాడు చెప్పులు, పాలు, చల్లటి నీరు.. బహుళంలో వచ్చే సిద్ధైకాదశినాడు గొడుగు.. దానం చేస్తే మంచిదంటారు.
No comments:
Post a Comment