04 November 2013

బిల్వ పత్రాన్ని శివారాధనలో ఎందుకు వాడతారు?

బిల్వ వృక్షము లేదా మారేడు చెట్టు అంటే శివుడికి ఎంతో ప్రీతికరము అని చెప్పబడుతోంది. కావున శివాలయాలలో బిల్వ పత్ర పూజకు ఉన్నత స్థానం ఉంది. ఈ వృక్షము యొక్క ముళ్ళు శక్తి (అమ్మవారు) ని, కొమ్మలు వేదాలను, వేర్లు రుద్రుడిని అంటే శివుడిని సూచిస్తాయి. భక్తులు ఈ మూడు రెమ్మలను స్వామి వారి త్రినేత్రాలుగా భావిస్తారు. బిల్వ వృక్షము ఎంతో పవిత్రమైనదిగా వాటి స్పర్శ మరియు వాటి పత్రాలతో శివారాధన జీవితంలోని పాపాలాన్నింటిని హరిస్తాయని భక్తులు తలంచుతారు.
ఓ విశ్వాసం ప్రకారం చంద్రదర్శనం మరియు పౌర్ణమి రోజులలో బిల్వపత్రాలను తెంపకూడదు. ఈ రోజులలో వచ్చే ప్రకృతి సంబంధమైన మార్పులు బిల్వ వృక్షంపై తమ ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఇలాంటి నిషేధం ఉంది. బిల్వ వృక్షం యొక్క అన్ని భాగాలు ఎంతో ప్రభావంతమైన ఔషదీయ గుణాలు కలిగి వున్నాయని ఆయుర్వేద వైధ్యశాస్త్రం తెలుపుతోంది.
‘సైన్స్ టుడే’ పత్రిక అందించిన సమాచారం ప్రకారం వ్యవసాయానికి సంబంధించిన అనేక విశ్వవిధ్యాలయాలు బిల్వ వృక్షలను వాటి యొక్క వైద్య గుణాలను గుర్తించి పెంచుతున్నాయి. వాతరోగం, మరియు కీళ్ళవాతం, వాంతులు, విరోచనాలు, క్షయ మొదలైన రోగాలను బిల్వ వృక్షల ఔషదాలతో నయం చేయవచ్చు. మధుమేహ వ్యాధి చికిత్సలో బిల్వం ఉన్నత పాత్రను పోషిస్తుంది. బిల్వపత్ర రసంలో నూనెను కాచి వాడినట్లయితే చెవినొప్పి, చెవిలో చీము మొదలైన సమస్యలు తొలగుతాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment