04 November 2013

సుందరకాండ :

రామయణంలో సుందరకాండ అతిప్రశస్థమైనది. ఇందులో హనుమపాత్ర చాల విశిష్టమైనది. హనుమని వాల్మీకి రామాయణంలో “రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం” అని అన్నారు. అంటే ఒక మాలలో మణి, మధ్యలోఉంటుందికదా , అట్లే హనుమ కూడామధ్యలోవస్తాడు. అది కిష్కిందకాండ. రామాయణం ఉత్తరకాండతో కలిపి ఏడు కాండలనుకొంటే, కిష్కింధ మధ్యలోఉన్నట్లేకదా! ఇచట కనిపించిన హనుమ హారంలో మణి వంటివాడేకదా!
అట్లే హనుమ శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించెను అని వాల్మీకి వర్ణించేడు. ఇచట చెప్పిన శత సంఖ్యను పరిశీలించుదాం. శతమంటే 100 కదా ఇందులోఒకటి భగవంతునికి సంకేతం, రెండు సున్నలు ప్రకృతి, జీవులకు సంకేతం . ఒకటిలేకుంటే రెండు సున్నాలకి విలువలేదు.పరమాత్మపక్కన ఉంటేనేప్రకృతి,జీవులకు విలువ ఉంటుంది అని తెల్ప డానికే వాల్మీకిశ త యోజన సంఖ్యను తెల్పేడు. అట్లే రమాయణం లోని 24వేల శ్లోకాలు 24 అక్షరాల గాయత్రి మంత్రానికి ప్రతిరూపంగా చెప్తారు.కానివాల్మీకికి ముందు రామాయణం "చరితం రఘు నాధస్య శతకోటి ప్రవిస్తరం"అని శతకోటిసంఖ్యగ విస్తరించిఉంది అనితెలుస్తోంది. శతకోటికి, ఇరువదినాలుగు వేలకి పొంతన కుదరదు. దానికి పెద్దలు ఇలావివరణ ఇచ్చేరు. సంఖ్యా స్ధానాలలో శతసంఖ్య 3వ స్ధానంలో వస్తుంది.కోటి సంఖ్య 8వ స్థానంలో వస్తుంది.ఇప్పుడు మూడుచేత ఎనిమిదిని గుణిస్తే 3*8=24. వస్తుంది.24 వేల శ్లోక సంఖ్య సరిపోతుంది.శత కోటీ అనేది విస్తారమైనది అని చెప్పటానికి మాత్రమే అని,అనుకోవచ్చు.

No comments:

Post a Comment