శ్రీవారి నిజరూపదర్శనం గురించి మీకు తెలుసా ?
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన
తర్వాత మూలమూర్తి ఎలాంటి అలంకారాలూ లేకుండా దర్శనమిస్తారు. నొసటన పెద్దగా
ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు.
దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది. ఆ
రోజు ఆభరణాలకు బదులు పట్టుధోవతిని ధరింపజేస్తారు. కిరీటాన్ని తీసి పట్టు
వస్త్రాన్ని తలపాగాలా చుడతారు.
గురువారం ఆలయంలోనే కాదు, తిరుమలలో
కూడా చిన్న తప్పు చేయడానిక్కూడా సిబ్బంది భయపడతారు. ఎందుకంటే పాప కార్యాలు
చేసినవారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం. గురువారం నాటి
దర్శనాన్నే నేత్రదర్శనం అని కూడా అంటారు.
No comments:
Post a Comment