04 November 2013

తులసి ఆకును చెవుల వెనుక ఎందుకు ధరించాలి ?

సంప్రదాయం ప్రకారం మన పూర్వులు పూజా సమయంలో మరియు ఇతర సమయాలలో కుడా తులసీ దళాలను చేవులపై వెనుక భాగంలో ధరించేవారు. దానిలో ఎంతో శాస్త్రీయత ఉందన్న విషయం ఈ రోజు మనం గ్రహించాలి.
శరీరంలో తీవ్రంగా గ్రహించు (పీల్చు) గుణం చెవుల వెనుక భాగానికి ఉంది. తులసిలోని ఔషాదీయ గుణం మనందరికి తెలిసినదే. తులసిని చెవి వెనుక ఔషద గుణాలను గ్రహిస్తుంది. కావుననే ఈ విధానాన్ని ప్రాచీన ఋషులు సూచించారు. ఇంటి ముందు తులసి మొక్కను జాగ్రత్తగా పెంచుతారు. ఇతర తులసుల కన్నా కృష్ణ తులసిని ఎక్కువగా ఆమోదించడం జరిగింది. తులసి మొక్కను పవిత్రమైనదిగా భావించడం వాళ్ళ దానిని మలినముగా ఉన్నప్పుడు ముత్తరాదన్నారు. తులసి మొక్క చుట్టూ తిరుగుతూ ప్రత్యేకమైన శ్లోకాలను పఠిస్తారు. తులసీ దళాలను తెంపుతున్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేక శ్లోకాలు పఠించుట జరుగును.
ఏకాదశి బుధవారం మరియు శుక్రవారం రోజుల్లో అలాగే సాయంకాలం సమయంలో తులసిని తెంపరాదని తెలుపడం జరిగింది.

No comments:

Post a Comment