04 November 2013

యోగసాధన :

భారతీయ షట్ దర్శనాల్లో యోగ ఒకటి. “యోగ: చిత్తవృత్తి నిరోధ:” అని అన్నారు మహర్షి పతంజలి. అనగా చంచలమైన మనో నడవడికలను, ఆలోచనలను నిరోధించి ఏకాగ్రతను సాధించేదే యోగము.
ఆధ్యాత్మికుల మాటల్లో చెప్పాలంటే ఇది ఆత్మ – పరమాత్మల సంయోగానికి మార్గం. యుజ్ అనే సంస్కృత పదానికి సమ్యోగం అని అర్ధం. ఈ యుజ్ నుంచి యోగ వచ్చింది. బయతి ప్రప్రంచంలోని అసత్య రూపాలతోను, ఆకర్షణలతోను మునిగి ఉన్న అహం కారపూరిత మనస్తత్వం కలిగి ఉన్న మానవ జీవాత్మను సర్వోపగతమైన పరమాత్మ యొక్క అనుగ్రహం పొందగల స్థితికి చేర్చు ప్రయత్నమే యోగాభ్యాసం.

యోగ శాస్త్రాన్ని క్రీస్తుపూర్వం రెండు శతాబ్దాల నాడు మహర్షి పతంజలి క్రమబద్ధం చేసి గ్రంథస్థం చేశారు. అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల నుంచే యోగ భిన్న పద్ధతులలో ఉండవచ్చన్నది చరిత్ర కారుల అభిప్రాయం.
సాంఖ్య దర్శనానికి యోగ కొనసాగింపు.
యోగలో మొత్తం ఎనిమిది దశలున్నాయి. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాథి.ఈ ఆఖరి స్థితొలోనే ఆత్మను పరమాత్మతో సమ్యోగం చేయవచ్చన్నది దార్శనికుల విశ్వాసం.

1. యమ అనగా పది ధర్మములను అబ్య్హసించటం. అవి అహింస, సత్యం, దొంగతనం చేయకుండుత, బ్రహ్మచర్యం, దయ, నీతి, క్షమ, పట్టుదల, మితాహారము తీసుకొనుట మరియు శుభ్రము.
2. నియమమనగా 8 ధర్మములను అబ్యసించటం. అవి త్రుప్తి, వేదములను నమ్మటం, దానము, దైవపూజ, వేదములను పఠించటం, అణకువ, మనియు జపము.
3. ఆసన: అయిదు ముఖ్యమైన కూర్చుండు విధములను పాటించటం. అవి ఏమనగా పద్మాసన, స్వస్తికాసన,భద్రాసన, వజ్రాసన మరియు విరాసన.
4. ప్రాణామాయం అంటే గాలిని లోనికి పీల్చి, కొంత సేపు అట్లాగే ఉంచి తరువాత వదలి వేయుట. గాలిని ముక్కు యొక్క ఎడమ రంధ్రంతో 16 మాత్రల కాలము పీల్థి, 64 మాతల కాలం లోపల ఉంచి తరువాత ముక్కు యొక్క కుడి రంధమునిండి 32 మాత్రల కాలము వదలి పెట్టాలి. ఈ ప్రాణాయామం వీలయినన్నిసార్లు ఎక్కువ కాలం అభసించాలి. ఈ ప్రణాయామ అభాసంలో శరీర మునకు మిక్కిలి చెమట పడితే అది సామాన్య ప్రాణామాయం. శరీరము కుదిపినట్లయిన మధరకమైనది. శరీరము నేలనుండి పైకి లేచిన అది సర్వోత్కృష్టమైనది.
5. ప్రత్యాహారము: జ్ఞానేంద్రియములను రూప రసగంధాది విషయాలనుండి బలవంతంగా విముఖంగానుండునట్లు అంతర్ముఖం చేయటం.
6. ధారణ: భగవంతుని తప్ప మైయొకటి ఎరుగని స్థితిలో ఉండటం.
7. ధ్యానం: ఇష్ట దైవాన్ని ఏకాగ్రతతో ప్రార్థించటం.
8. సమాధి: ఈ స్థితిలో ఆత్మను పరమాత్మతో సమ్యోగం చేయవచ్చునని దార్శనికుల విశ్వాసం.
ఆధునిక కాలంలో దాదాపు వందేళ్ళుగా ఇటు భారతదేశంలోను, అటు పశ్చిమదేశాల్లోను విస్తృతంగా ఆచరిస్తున్న యోగకు మాత్రం శారీరక, మానసిక ప్రశాంతతే లక్ష్యం అష్టాంగయోగలోని మూడు, నాలుగు దశలు ఆసన (శారీరక వ్యయామం) ప్రాణాయమ (ఉచ్చ్వాస, నిశ్వాసాల నియంత్రణ)ను ప్రప్రంచంవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఆచరిస్తున్నారు. శారీరక ఆరోగ్యానికి, శారీరక, దార్ద్యానికి తిరుగులేని మార్గంగా నమ్ముతున్నరు.

No comments:

Post a Comment