1)యజ్ఞోపవీతము
నందు 9 పోగులేమిటి? యజ్ఞోపవీతము తొమ్మిది పోగుల్లో తొమ్మిది దేవతలు
ఉంటారు. బ్రహ్మ , అగ్ని, అనంతుడు, చంద్రుడు, పిత్రు దేవతలు, ప్రజా పతి
వాయువు, సూర్యుడు , సర్వ దేవతలు నివశిస్తారు.
2)సంధ్యా వందనము ఏ
సమయంలో చేయాలి? సూర్యోదయానికి అరగంట ముందు అంటే ఒకట్టిన్నర గడియల ముందు
నక్షత్రములు సమాప్తమవుతాయి. కాబట్టి సూర్యోదయానికి అరగంట ముందు కాలం లోనే
సంద్యోపాసనం చేయాలి.మధ్యాహ్న సంధ్య - సూర్యుడు లంబంగా ప్రకాశిస్తున్నప్పుడు
& సాయంసంధ్య - సూర్యాస్తమయానికి పూర్వం
3)పంచామృతము ఎలా
తయారు చేయాలి? పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచాదారాలని జత చేర్చి కొబ్బరి
నీరు కావలసినంత కలిపి చేసేది పంచామృతము.పాలు,పెరుగు, నెయ్యి,ఈ మూడు ఒక్కటి
గానే లెక్కిన్చుకోవాలి.
4)ఏడుగురు చిరంజీవులు ఏవరు? అశ్వద్ధామ,
బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, క్రుపాచార్యులు, పరుషు
రాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా
వందేళ్ళు జీవిస్తారు. ఎనిమిదో వానిగా మార్కండేయున్ని స్మరించడం ద్వారా
మృత్యు భయం వీడిపోతుంది .
5)తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు.
ఎందుకు? తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ
ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.” అకాల
మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం, సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం “.
6)ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది?
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు
ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం
వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో, దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు
వస్తుంది. శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద
కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం
చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి.
నేల మీద కూర్చొని చేస్తే దుఖము,గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.
7.శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తాడు? సృష్టి లో సంభోగం
చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీ కృష్ణుని పదహారువేలమంది గోపికలు.
అన్నివేల మంది భామలతో శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి
చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి
పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే
శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర
స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర
మయినది కనుకే మన జాతీయపక్షి అయింది.
8.మహాభారాతాన్ని వినాయకుడు
ఎక్కడ వ్రాశాడు? వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన
భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో. హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. భదిరినాత్
వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. “జయ” కావ్యమనే
మహాభారతాన్ని వినాయకుడు వ్యాసును పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన
ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల,ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని
మౌనం వహించి ప్రవహిస్తుంది. ఈ అధ్బుతాన్ని మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు. ఆ
ప్రదేశాన్ని దాటగానే మల్లి గలగలలు
9.హనుమంతునకు, సువర్చాలకు
వివాహం జరిగిందా? కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు.
హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద
విద్యాబ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన
సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను
వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు.ఆ తర్వాత వివాహం
చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే
వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ
ప్రకారం.
10.అయిదో తనమంటే ?ముత్తయిదువ అని అర్థం. పసుపు, కుంకుమ,
గాజులు, మెట్టెలు, మాంగల్యం. స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి.
స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి
No comments:
Post a Comment