04 November 2013

చతుర్వేదములు :

పూర్వము ౠషులు యజ్ఞయాగాదులు నిర్వహించినపుడు ఈ వేదములందలి మంత్రములు వినియోగించి నారు. వేదములు దైవవాక్కులు, పరమేశ్వర విశ్వాసములు. వేదములు నాలుగు. అవి ౠగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము.

ఋగ్వేదము :

పాదబద్దములగు మంత్రమును ‘ఋక్కూ’ అని అందురు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుట వలన దీనికి ‘ౠగ్వేదమూ అని పేరు. ఈ వేదమునకు 21 శాఖలు కలవు. ఆ 21 శాఖలలో శాకలశాఖ, బాష్కలశాఖ అనే రెండు శాఖలు మాత్రం ప్రస్తుతం లభించుచున్నవి. ఇందు వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు తయారుచేయువిధానం, టెలిగ్రాం, వైరలెస్ వంటి అనేక ఆధునిక శాస్త్రములు ఈ ౠగ్వేదమునందు గలవు. యజ్ఞ సమయమునందు హవిర్భాగముల గ్రహించు నిమిత్తం హెతయను ౠత్విక్కు ఈ వేదమత్రంములతో దేవతలను ఆహ్వనించును. అందుచే ఈ వేదమునకు ‘హౌత్రవేదా మనిపేరు. ఈ ౠగ్వేదముని 10 మండలములుగ విభజించిరి. ఒక శాఖవారు 8 అష్టకములుగా విభజించారు.

యజుర్వేదము :
ఇందు కౄష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము అనియు రెండు విధములు కలవు. ‘తెత్తిరీ అనుపేరు గజ ఆచార్Yఉడు శిష్యప్రశిష్యులకు బొధించెను. అందుచే ‘తైత్తిరీయా మని పేరు వచ్చింది. ఈ తైత్తిరీయవేదమునకు సమ్హిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అను మూడు భాగములు ఉన్నవి. ఈ సమ్హితయందు 7 అష్టకములు (కాండములు), 44 ప్రశ్నలు (ప్రపాఠకములు), 651 అనువాకములు, 2196 పంచాశత్తులు (పనసలు) ఉన్నవి.
ఇందులో కర్మలను తెలుపు శాస్త్రము, బ్రహ్మవిద్య, సౄష్టివిద్య, గణిత విద్య, శారీరిక శాస్త్రవిద్య, అంతరిక్ష విద్య మొదలగునవి గలవు.
పనస: ప్రతి పనసయందు ఏభయి పదములు ఉన్నవి. అనివాకాంతమునందున్న పనసలకును, అనువాకము నందున్న పనసలకును పదములు కొంచెము హెచ్చుతగ్గులు ఉండును. సంస్కౄత భాషలొ దినిని ‘పంచాశత్తూ అని అందురు.


శుక్లయజుర్వేదము :


వాజలనేయ సమ్హిత అని దీనికి మరొక పేరు. ప్రస్తుతం ఈ వేదమునందు మాధ్యందిన శాఖ, కాణ్వశాఖ అని రెండు శాఖలు కలవు. ఈ రెండు శాఖల వారిని తెలుగునాట ‘ప్రధమశాఖా అంటారు. శుక్లయజుర్వేదము లో 40 అధ్యాయములు కలవు. ఈ వేదమునకు ‘శతపధ బ్రాహ్మణమూ అని పేరు. ఈ వేదమంత్రములతో ‘అధ్వర్యుడూ అను ౠత్విక్కు యజ్ఞమునందు హెమాది ప్రధాన కౄత్యములను అచరించును. సకల కర్మలు ఆపస్తంబ మహర్షి చేసిన కల్ప సూత్రమును అనుసరించి జరిపించుకుంటారు.
సామవేదము :

ఇది ఈశ్వరభక్తి ప్రభోధించు శాస్త్రము. సామము అనగా గానము. గానము చేయదగిన మంత్రములు గల వేదము కావున ‘సామవేదమూ అని పేరు వచ్చింది. ఈ వేదమునకు 1000 శాఖలు కలవని సంప్రదాయం. ఆయితే ఇప్పుడు ఒకే శాఖ మాత్రమే లభించుచున్నది. యజ్ఞ కాలమునందు ‘ఉద్గాతా అను ౠత్విక్కు ఈ వేదమంత్రములతో గానము చేయుచూ దేవతలను స్తుతించును. అందుచేతనే ఈ వేదమునకు ‘ఉద్గాతౄవేదమూ అని మరొక పేరు ఉంది. ఈ వేదమునకు తాండ్యబ్రాహ్మణము మున్నగు బ్రాహ్మణ గ్రంధములు ఎనిమిది కలవు.

అధర్వవేదము :

భౌతిక విజ్ఞానము తెలుపు శాస్త్రం ఇది. ఇందు కూడ బ్రహ్మవిద్య, సౄష్టి విద్యా, ఉపాసనాది విధి భగవత్ర్పార్ధన, బ్రహ్మచర్యవిధి, పంచయజ్ఞవిధి వంటి విషయములు గలవు. ఈ వేదమును 20 కాండములుగా విభజించిరి. ఒకప్పుడు ఈ వేదమునకు తొమ్మిది శాఖలు ఉండేవి. ఇప్పుడు ఒక శాఖ మాత్రమే లభించుచున్నది. ౠత్విక్కు (బ్రహ్మ) అవశ్యము తెలుసుకొనవలసిన విధి ఈ వేదము నందు కలదు. అందుచేత దీనిని బ్రహ్మవేదము అని కూడా అందురు. ఇతర వేదములకంటె శాంతికి, పౌష్టిక కర్మలు ఈ వేదమునందు అధికముగా ఉన్నవి. దీనికి ‘గోపధ బ్రాహ్మణమూ అని మరొక పేరు కలదు.
వేదమునందు సమ్హిత అనియు, బ్రాహ్మణము అనియు ప్రధాన భాగములు కలవు. సమ్హిత అనగ మంత్రములు మాత్రము గల భాగము. బ్రాహ్మణము అనగా అర్ధగాంభీర్యం గల మంత్రముల అర్ధములను వివరించునట్టి గాని తెలియజేయునట్టి గ్రంధము.

No comments:

Post a Comment