02 November 2013


ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు :

" ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణియం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ "

ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు. ఇంతటి మహోన్నతమైన మంత్రములో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి దాగి ఉంటుందని పురాణ వచనం. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ 24మంది దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు సిద్ధిస్తాయి. ఈ 24 అక్షరాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లను తెలుసుకుందామా...

1. తత్ – గణేశ్వరుడు 2. స - నృసింహ భగవానుడు 3. వి – విష్ణుదేవుడు
4. తుః – శివదేవుడు 5. వ - కృష్ణ భగవానుడు 6. దే - రాథా దేవి
7. ణ్యం – లక్ష్మీదేవి 8. భ – అగ్నిదేవుడు 9. ర్గః – ఇంద్రదేవుడు
10. దే – సరస్వతి 11. వ – దుర్గాదేవి 12. స్య – హనుమంతుడు
13. ధీ – పృధ్వీదేవి 14. మ – సూర్యదేవుడు 15. హి - శ్రీరాముడు
16. ధి – సీతామాత 17. యో – చంద్రదేవుడు 18. యో – యమదేవుడు
19. నః – బ్రహ్మదేవుడు 20. ప్ర – వరుణదేవుడు 21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు 23. యా – హంసదేవత 24. త్ - తులసీదేవి


మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, సుఖసంతోషాలు వనగూరుతాయి. ప్రపంచ మానవాళి గాయత్రీ మంత్రాన్ని జపించి తరిస్తోంది.

No comments:

Post a Comment