02 November 2013

గృహంలో పూజగది అమరిక ఎలా ఉండాలి ?

గృహంలో భగవంతుని పూజించేందుకు ఎలాంటి చోటులో దేవుడి గది ఉండాలో వాస్తు శాస్త్రం చెబుతోంది. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి. పూజ గది వల్ల ఈశాన్యం మూతపడకూడదు. అదే విధంగా పూజ గదిలో సిమెంటు మెట్లు పెట్టకూడదు. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి.

పూజగది నిర్మాణం అనేది ఆ ఇంటి వైశాల్యంపైన ఆధారపడి ఉంటుంది. ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదిగా ఉండి పూజగదిని నిర్మించటానకి వీలులేనప్పుడు గోడలో అలమరా చేయించి పెట్టుకునే వీలుంది. ఒకే ఒక్క గదిలో నివాసం ఉన్నవారైతే గదికి ఈశాన్యంలో దేవుని పటం పెట్టుకుని కర్టెన్ వంటిది ఏర్పాటు చేయాలి.


పూజ చేసే గదిలో పెద్ద సైజు రాతి విగ్రహాలు, లోహపు విగ్రహాలకు చోటు ఇవ్వద్దు. ఒకవేళ అలాంటి విగ్రహాలను పూజలో పెట్టినట్లయితే నిష్టగా పూజచేయాల్సి ఉంటుంది. అలా చేయలేని వారు వాటిని పూజ గది నుంచి తొలగించాలి.

పూజలు సరిపోని విగ్రహాలు కొంతకాలానికి రుణదృవ శక్తి నిలయాలుగా మారిపోయి ఆ ఇంటివారికి హాని చేస్తాయి. ఇక భగవంతునికి చేసే ప్రార్థన విషయానికి వస్తే... తూర్పుకు తిరిగి ప్రార్థన చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. ఒకవేళ తూర్పుకు తిరిగి ప్రార్థన చేయటం కుదరకపోతే ఉత్తరంవైపు తిరిగి చేసుకోవచ్చు.

No comments:

Post a Comment