02 November 2013


హనుమంతుని తొమ్మిది అవతారాలు:

ఏ దైవమైనా ముఖ్యంగా రెండు ప్రయోజనాల కోసం అవతారా లెత్తడం జరుగుతుంది. అదే విషయం భగవద్గీతలో కృష్ణ భగవానుడు

‘పరిత్రాణాయ సాధూనాం – వినాశాయ చ దుష్కృతాం |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ||’


అని చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా ఆ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే రెండు ముఖ్య ప్రయోజనాలకోసమే తొమ్మిది అవతారాలెత్తాడు. వానినే హనుమన్నవావతారాలంటారు. వానిని పరాశరమహర్షి 1.ప్రసన్నాంజనేయస్వామి అవతారం, 2.వీరాంజనేయస్వామి, 3.వింశతి భుజానేంజనేయస్వామి, 4.పంచముఖాంజనేయస్వామి, 5.అష్టాదశభుజాంజనేయస్వామి, 6.సువర్చలాంజనేయస్వామి, 7.చతుర్భుజాంజనేయస్వామి, 8.ద్వాత్రింశద్భుజాంజనేయస్వామి, 9.వానరాకార ఆంజనేయస్వామిఅవతారం.
అలాగే హనుమంతునకు సంబంధించిన పుణ్య స్థావరాలు కూడా పదమూడు ఉన్నాయి. వాటినే హనుమత్పీఠాలంటారు. అవి 1. కుండినగరం, 2. శ్రీ భద్రము, 3. కుశతర్పణము, 4. పంపాతీరం, 5. చంద్రకోణం, 6. కాంభోజం, 7. గంధమాదనం, 8. బ్రహ్మావర్తపురం, 9. బార్హస్పత్యపురం, 10. మాహిష్మతీపురం, 11. నైమిశారణ్యం, 12. సుందరీనగరం, 13. శ్రీ హనుమత్పురము – అనేవి.

No comments:

Post a Comment