01 November 2013


వేదాలలో సైన్సు :

సూర్యాచక్ర ధ్యానం,యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ,ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో ప్రస్తావన ఉంది. అగస్త్య మహముని బోధిస్తాడూ. ఈ శ్లొకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి.
యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సమన్విత నమస్తస్యై నమస్తస్యై నమో నమః ”
“కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జి ” భగవంతుని “సర్వాంతర్యామి” గుణాన్ని ప్రబోధిస్తుంది
సైన్సు గొప్పా మీ వేదాలు గొప్పా అనే అసంబద్ధమైన ప్రశ్నకి “నిజానికి వేదాలలో సైన్సు లేకపోయినా నాకు నష్టం లేదు. వేదాల స్థాయి, దృక్పధం వేరు. సైన్సు సంగతి వేరు”.. ద్వే విద్యే వేదితవ్యే…పరా చైవాపరా చ…అతః పరా యయా తద్ అక్షరం అధిగమ్యతే అంటుంది మూండకోపనిషత్తు.(రెందు విద్యలు ఉన్నాయి…’అపరా’ అనే సామాన్యమైన విద్య మరియు ‘పరా’ అనే శ్రేష్టమైన విద్య…అక్షరమైన బ్రహ్మతత్వాన్ని గ్రహింపచేసేది ఉన్నతమైన పరా విద్య; మిగతావి సామాన్యమైన అపరా విద్యలు) ,యజ్ఞాలు, వ్యాకరణం, నిరుక్తం వంటివి అశాశ్వతమైన స్వర్గ సుఖాలని మాత్రమే ఇవ్వగలవు కాబట్టి అవి సామాన్యమైన అపరా విద్యలు అని అంటుంది మూండకం.

 
భవసాగరంలో ముణిగిపోతున్న మనకి సైన్సు వంటి శాస్త్రాలు ఇచ్చే చేయూత తప్పక అవసరమే. కానీ వాటి కంటే పరమైనది ఇంకేమీ లేదు అనుకుంటే మనము కూపస్థ మండూకాలమే. ‘కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి ‘ అని పరిశోధించి ‘సర్వం ఖల్విదం బ్రహ్మ ‘ అని నిర్ధారించిన వేదానికీ ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష ‘ అనే మాటలకీ మధ్య స్వానుభవం అనే వ్యత్యాసం ఉంది.చెప్పాల్సిన పరమార్ధాన్ని వేదం నిష్కర్షగా చెప్పింది. ఎంత చెట్టుకి అంత గాలి అన్న చందంగా గ్రహించే వారి సామర్ధ్యాన్ని పట్టి ఆ తత్వగాంభీర్యం గ్రాహ్యం అవుతుంది. అందుకే అన్నమయ్య అన్నాడు ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమె నీవు అని. పరమాత్మ ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అన్నాడు. స్వార్ధంతో, కులమత జాఢ్యంతో రగిలిపోతున్న ప్రపంచానికి ‘సహనా వవతు సహనౌ భునక్తు…’ అన్న వేదమే శరణం ఉపశమనం.
సహనా వవతు సహనౌ భునక్తు;సహవీర్యం కరవావహైః
తేజశ్వినావధీతమస్తు మావిద్విషావహైః ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః


ఎప్పుడూ కూడా వాది దోషమేకానీ వాదనలో దోషం ఉండదని ఒక సూక్తి ఉంది సంస్కృతంలో. వాదించే వాడి సమర్ధతని బట్టి తిమ్మి బమ్మి ఔతుంది. బ్రహ్మము మాత్రమే సత్యం. మిగిలినదంతా మాయే. అందుకే మన మన సమర్ధతని బట్టి సత్యమనీ అసత్యమనీ ఋజువు చేసెయ్యచ్చు.

No comments:

Post a Comment