శివుడి అయిదు అవతారాలు :
శ్రీ మహావిష్ణువు అవతారాలలో దశావతారాలు ప్రధానంగా ఉన్నట్లుగానే శివ
అవతారాలలో కూడా అయిదు అవతారాలు ప్రధానంగా ఉన్నాయి. వీటిని గురించి శివ
మహాపురాణం శతరుద్రీయ సంహితలో నందీశ్వరుడు సనత్కుమారుడికి వివరించి
చెప్పాడు. ప్రతి కల్పంలోను సర్వేశ్వరుడైన సదాశివుడు బ్రహ్మదేవుడికి
ఒక్కొక్క రూపంలో సాక్షాత్కరించినవే ఈ అయిదు అవతారాలు. శ్వేతలోహితమనే
కల్పంలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి ధ్యానించి తనకు కావలసిన
జ్ఞానాన్ని ప్రసాదించమన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు గౌరీదేవితో సహా
ప్రత్యక్షమయ్యాడు. అలా అవతరించిన రూపమే సద్యోజాత శివరూపం. ఆ సద్యోజాత
శివరూపాన్ని దర్శించి బ్రహ్మ తన సృష్టికి సహకారంగా కొందరు కుమారులు
కావాలన్నాడు. వెంటనే సునందుడు, నందనుడు, విశ్వనందుడు, ఉపనందుడు అనేవారు
అవతరించారు. ఆ తరువాత రక్తకల్పం అనే కల్పంలో మళ్ళీ బ్రహ్మ తనకు తగిన
జ్ఞానప్రసాదం కోసం పరమేశ్వరుడిని ధ్యానించాడు. అప్పుడు ఎర్రటి వస్త్రాలను
ధరించి, ఎర్రటి కళ్లతోను, ఎర్రటి శరీరఛాయతోను, ఎర్రటి భూషణాలను ధరించి
శివుడు వామదేవుడు అనేపేరున అవతరించాడు. ఆ వామదేవుడి నుంచి ఎర్రని వస్త్రాలను
ధరించిన విరజుడు, వివాహుడు, విశోకుడు, విశ్వభావనుడు అనేవారు ఉదయించారు.
ఇలా వామదేవ అవతారం జరిగి ఆయన బ్రహ్మకు కావల్సిన జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ
తర్వాత పీతవాస కల్పం అనే కల్పంలో బ్రహ్మ పరమేశ్వరుడిని గురించి
ధ్యానించాడు. వెంటనే పసుపుపచ్చని వస్త్రాలను ధరించి గొప్ప భుజబలంతోను,
గొప్ప తేజస్సుతోను శివుడక్కడ అవతరించాడు. అలా అవతరించిన రూపమే
తత్పురుషావతారం. పీతవాసకల్పం తరువాత వచ్చిన కల్పం శివకల్పం. ఈ కల్పం
మొదట్లో సర్వం జలమయమై సహస్ర దివ్యవర్షాలు గడిచాయి. ఆ స్థితిలో బ్రహ్మదేవుడు
మళ్లీ సృష్టి ఎలా చేయాలో తెలియక శివుడిని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సు
ఫలితంగా నల్లటి శరీరవర్ణంతో నల్లని వస్త్రాలను, తలపాగాను ధరించి నల్లని
యజ్ఞోపవీతాన్ని, నల్లని కిరీటాన్ని ధరించి, నల్లని గంధాన్ని దేహానికి
లేపనంగా పూసుకున్న ఒక దివ్యమూర్తి అవతరించాడు. ఘోరవిక్రముడైన ఆ అవతారాన్ని
చూసి బ్రహ్మ ఆ మూర్తికి అఘోరుడు అని పేరుపెట్టి ఆయనను స్తుతించాడు. ఆ
అఘోరమూర్తికి బ్రహ్మ మరీమరీ నమస్కరిస్తూ తనకు జ్ఞానాన్ని ప్రసాదించి
సృష్టికి సహకారులుగా కొందరిని అనుగ్రహించమని అడిగాడు. వెంటనే ఆ అఘోరదేవుడు
నల్లని శిఖ, నల్లని ముఖం, నల్లని కంఠం, నల్లని దేహం కలిగిన నలుగురు
కుమారులను ఉద్భవింపచేశాడు. వారంతా బ్రహ్మసృష్టికి సహకరించారు. అలా అఘోర
అవతారం జరిగింది. ఆ తర్వాత విశ్వరూప కల్పం అనే కల్పం ఏర్పడింది. మళ్ళీ
బ్రహ్మ తనకు జ్ఞానప్రసాదం చేయమని శివుడినే ధ్యానించాడు. అయితే ఈసారి
పూర్వంకన్నా ఓ విచిత్రం జరిగింది. అదేమంటే బ్రహ్మ శివుడిని గురించి
ధ్యానించగానే బ్రహ్మ శరీరం నుంచే సరస్వతి రూపమైన మహానాదం ఒకటి
ఆవిర్భవించింది. శివుడే అలా అవతరించాడు. ఈ రూపాన్నే బ్రహ్మదేవుడు ఈశాన
అవతారంగా గుర్తించాడు. ఈ ఈశాన అవతారం మిగిలిన అవతారాలకన్నా ఎంతో
విశిష్టమైనది. అలాగే ఈ ఈశాన దేవుడి కృపచేతనే బ్రహ్మకు సహాయకులుగా జటి,
ముండి, శిఖండి, అర్ధముండి అనే కుమారులు జన్మించారు. ఇలా శివుడి అవతారాలలో
ప్రధానమైన అయిదురకాల అవతారాలు బ్రహ్మను అనుగ్రహించేందుకు అవతరించినట్లు
ఇక్కడ పేర్కొనడం కనిపిస్తుంది. ఈ అవతారాలన్నీ ముల్లోకాల హితం కోసమే
అవతరించాయని ఈ కథాసందర్భం పేర్కొంటోంది. మాములుగా ఈశ్వరుడు అనగానే
త్రిలోచనుడు, త్రిశూలి, తెల్లటి శరీరఛాయ కలిగినవాడు, గజచర్మాంబరధారి అనే
రూపాలు కళ్లముందు మెదులుతాయి. కానీ బ్రహ్మ కోరిక మేరకు ఇలా అనేక శరీర
ఛాయలతో, రూపాలతో శివుడు అవతరించినట్లు శివపురాణం శతరుద్రీయ సంహిత
వివరిస్తోంది.
శివుడి అయిదు అవతారాలు :
శ్రీ మహావిష్ణువు అవతారాలలో దశావతారాలు ప్రధానంగా ఉన్నట్లుగానే శివ అవతారాలలో కూడా అయిదు అవతారాలు ప్రధానంగా ఉన్నాయి. వీటిని గురించి శివ మహాపురాణం శతరుద్రీయ సంహితలో నందీశ్వరుడు సనత్కుమారుడికి వివరించి చెప్పాడు. ప్రతి కల్పంలోను సర్వేశ్వరుడైన సదాశివుడు బ్రహ్మదేవుడికి ఒక్కొక్క రూపంలో సాక్షాత్కరించినవే ఈ అయిదు అవతారాలు. శ్వేతలోహితమనే కల్పంలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి ధ్యానించి తనకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు గౌరీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. అలా అవతరించిన రూపమే సద్యోజాత శివరూపం. ఆ సద్యోజాత శివరూపాన్ని దర్శించి బ్రహ్మ తన సృష్టికి సహకారంగా కొందరు కుమారులు కావాలన్నాడు. వెంటనే సునందుడు, నందనుడు, విశ్వనందుడు, ఉపనందుడు అనేవారు అవతరించారు. ఆ తరువాత రక్తకల్పం అనే కల్పంలో మళ్ళీ బ్రహ్మ తనకు తగిన జ్ఞానప్రసాదం కోసం పరమేశ్వరుడిని ధ్యానించాడు. అప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి, ఎర్రటి కళ్లతోను, ఎర్రటి శరీరఛాయతోను, ఎర్రటి భూషణాలను ధరించి శివుడు వామదేవుడు అనేపేరున అవతరించాడు. ఆ వామదేవుడి నుంచి ఎర్రని వస్త్రాలను ధరించిన విరజుడు, వివాహుడు, విశోకుడు, విశ్వభావనుడు అనేవారు ఉదయించారు. ఇలా వామదేవ అవతారం జరిగి ఆయన బ్రహ్మకు కావల్సిన జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత పీతవాస కల్పం అనే కల్పంలో బ్రహ్మ పరమేశ్వరుడిని గురించి ధ్యానించాడు. వెంటనే పసుపుపచ్చని వస్త్రాలను ధరించి గొప్ప భుజబలంతోను, గొప్ప తేజస్సుతోను శివుడక్కడ అవతరించాడు. అలా అవతరించిన రూపమే తత్పురుషావతారం. పీతవాసకల్పం తరువాత వచ్చిన కల్పం శివకల్పం. ఈ కల్పం మొదట్లో సర్వం జలమయమై సహస్ర దివ్యవర్షాలు గడిచాయి. ఆ స్థితిలో బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టి ఎలా చేయాలో తెలియక శివుడిని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా నల్లటి శరీరవర్ణంతో నల్లని వస్త్రాలను, తలపాగాను ధరించి నల్లని యజ్ఞోపవీతాన్ని, నల్లని కిరీటాన్ని ధరించి, నల్లని గంధాన్ని దేహానికి లేపనంగా పూసుకున్న ఒక దివ్యమూర్తి అవతరించాడు. ఘోరవిక్రముడైన ఆ అవతారాన్ని చూసి బ్రహ్మ ఆ మూర్తికి అఘోరుడు అని పేరుపెట్టి ఆయనను స్తుతించాడు. ఆ అఘోరమూర్తికి బ్రహ్మ మరీమరీ నమస్కరిస్తూ తనకు జ్ఞానాన్ని ప్రసాదించి సృష్టికి సహకారులుగా కొందరిని అనుగ్రహించమని అడిగాడు. వెంటనే ఆ అఘోరదేవుడు నల్లని శిఖ, నల్లని ముఖం, నల్లని కంఠం, నల్లని దేహం కలిగిన నలుగురు కుమారులను ఉద్భవింపచేశాడు. వారంతా బ్రహ్మసృష్టికి సహకరించారు. అలా అఘోర అవతారం జరిగింది. ఆ తర్వాత విశ్వరూప కల్పం అనే కల్పం ఏర్పడింది. మళ్ళీ బ్రహ్మ తనకు జ్ఞానప్రసాదం చేయమని శివుడినే ధ్యానించాడు. అయితే ఈసారి పూర్వంకన్నా ఓ విచిత్రం జరిగింది. అదేమంటే బ్రహ్మ శివుడిని గురించి ధ్యానించగానే బ్రహ్మ శరీరం నుంచే సరస్వతి రూపమైన మహానాదం ఒకటి ఆవిర్భవించింది. శివుడే అలా అవతరించాడు. ఈ రూపాన్నే బ్రహ్మదేవుడు ఈశాన అవతారంగా గుర్తించాడు. ఈ ఈశాన అవతారం మిగిలిన అవతారాలకన్నా ఎంతో విశిష్టమైనది. అలాగే ఈ ఈశాన దేవుడి కృపచేతనే బ్రహ్మకు సహాయకులుగా జటి, ముండి, శిఖండి, అర్ధముండి అనే కుమారులు జన్మించారు. ఇలా శివుడి అవతారాలలో ప్రధానమైన అయిదురకాల అవతారాలు బ్రహ్మను అనుగ్రహించేందుకు అవతరించినట్లు ఇక్కడ పేర్కొనడం కనిపిస్తుంది. ఈ అవతారాలన్నీ ముల్లోకాల హితం కోసమే అవతరించాయని ఈ కథాసందర్భం పేర్కొంటోంది. మాములుగా ఈశ్వరుడు అనగానే త్రిలోచనుడు, త్రిశూలి, తెల్లటి శరీరఛాయ కలిగినవాడు, గజచర్మాంబరధారి అనే రూపాలు కళ్లముందు మెదులుతాయి. కానీ బ్రహ్మ కోరిక మేరకు ఇలా అనేక శరీర ఛాయలతో, రూపాలతో శివుడు అవతరించినట్లు శివపురాణం శతరుద్రీయ సంహిత వివరిస్తోంది.

No comments:
Post a Comment