01 November 2013

ఆలయ దర్శనం :

దైవదర్శనానికి వెళ్లే సమయంలో మనం ధరించిన దుస్తులతో పాటు శరీరమూ, మనస్సూ కూడా పరిశుభ్రంగా, నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి. నుదుటన చక్కగా విభూతి లేదా కుంకుమ ధరించాలి. అలాగే, ఆలయప్రవేశం చేసేముందు తప్పనిసరిగా కాళ్లూ, చేతులూ కడుక్కునే లోపలికి వెళ్లాలి.

మనతో ఎవరైనా వస్తుంటే వారితో గట్టిగా మాట్లాడు కుంటూ ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఆలయానికి వస్తున్నామంటే మన మనస్సంతా ఆ దైవంమీదనేలగ్నం చెయ్యాలి. మనసులో ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఆలయానికి వెళ్లాలి. లేదా ఏ దేవతను సందర్శించేందుకు వెడుతున్నామో ఆ దేవత నామాన్ని స్మరిస్తూ లోపలికి వెళ్లాలి.

ఆలయంలోకి ప్రవేశింపచేసే రాజగోపుర ద్వారాన్ని దర్శించి రెండుచేతులూ జోడించి స్వామి దర్శనం తనివి తీరా చేయించమని గోపురాన్ని వేడుకోవాలి. లోపలికి వెళ్లగానే ఆకాశాన్ని అంటుకుంటున్నట్టుగా ఉండే నిలు వెత్తు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభమంటే నిజమైన భక్తునికి నిదర్శనం. ఎప్పుడూ స్వామి సన్నిధిలో నిశ్చలమైన ధ్యానముద్రలో ఉండే ఈ స్తంభానిదే అసలు పుణ్యమంతా. అందుకే చాలా పవిత్రంగా ఈ స్తంభానికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసుకుని నమస్కరించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసినా ఉత్తమ ఫలితం వస్తుంది.

అనంతరం బలిపీఠా (సాధారణంగా అమ్మవారి, శివాలయాల్లో ఇది ఉంటుంది)న్ని సందర్శించి మనలో పేరుకున్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను బలి చేస్తున్నట్టు భావించి, వీటి స్థానంలో ప్రేమ, త్యాగం, దాతృత్వంఇత్యాది గుణాలను అలవడేలా చెయ్యమని ప్రార్థించుకోవాలి.

అనంతరం ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసుకుని అనంతరం ఆలయంలోని తొలిపూజల వేల్పు గణనాథుణ్నిదర్శించి మొక్కాలి. ఈ స్వామికి గుంజీళ్లంటే ఇష్టం. 'దండాలయ్యా ఉండ్రాలయ్యా' అంటూ భక్తితో మూడునుంచీ అయిదుకు మించకుండా శక్తిమేరకు గుంజీళ్లు తీసి స్వామి అనుగ్రహాన్ని అర్థించాలి. భక్తితో నమస్కరిస్తే చాలు పరవశించి వరాలననుగ్రహిస్తాడీ కరి ముఖ వరదుడు.

అనంతరం ఆలయ ప్రధాన మూల విరాట్టును దర్శించే ముందు ఇంకా ఈ ఆలయంలో ఇతర దేవతా మూర్తులు కొలువై ఉంటే వారిని దర్శించుకోవాలి. ఉపాలయాల్లోని ఆ మూర్తులను దర్శినంచిన అనంతరం ప్రధాన మూర్తి దర్శనానికి రావాలి. వైష్ణ్వాలయమైతే ఈ స్వామి గర్భాలయానికి ఎదురుగా వుండే గరుడాళ్వారునూ, గర్భగుడి సింహ ద్వారానికి ఇరువైపులా ఉన్న ద్వారపాలకులనూ సేవించుకుని, స్వామివారి దర్శనాన్ని అనుగ్రహించమని వారిని కోరుకుని స్వామివారి కంటే ముందుగా వారి దేవేరి అయిన అలమేలు మంగమ్మను, శివాలయంలోనైతే పార్వతీదేవిని దర్శించాలి. ఆ తరువాత ప్రశాంత చిత్తంతో ప్రధానమూలవిరాట్టు అనుగ్రహం కోసం ప్రార్థించుకుంటూ ఆయన్ను దర్శించాలి.

స్వామిని దర్శించే సమయంలో ఒక్క క్షణాన్ని వృథా పోనీయకుండా తనివితీరా దర్శించాలి. అంతేకానీ, కళ్లు మూసుకుని ప్రార్థించకూడదు. (అయితే, ఇక్కడో విషయం ఉంది. నిజమైన భక్తులకు ఆ భక్తిపారవశ్యంలో కళ్లు మూసుకున్నా కూడా ఆయనమూర్తి కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి భక్తులకిది మినహాయింపే మరి!) స్వామిని ఆపాద మస్తకం దర్శించాలి. అంటే- ముందుగా పాదాలనే చూడాలి. ఆ చరణాలే మనకు శరణాన్ని ప్రసాదిస్తాయన్న మాట. తరువాత, అభయాన్ని ప్రసాదించే హస్తాలు, ఆపై, కరుణను చిలకరించే నేత్రాలు, చిరునవ్వు చిందించే వదనం, ఇలా స్వామిని తిలకించి పులకించాలి.

అమ్మవారినైతే ముందుగా దయను వర్షించే నేత్రాలను, సౌభాగ్యసిద్ధి కలిగించే మాంగల్యాన్ని, అభయాన్నందించే హస్తాలు, ఆపై ఆప్యాయతగా మనవద్దకు వచ్చే ఆ శ్రీ చరణాలనూ దర్శించాలి.కిందికి చూస్తూ, తల్లిని చూసే చిన్నపిల్లల్లా మనసంతా ఆమెనే నింపుకుంటూ దర్శించుకోవాలి.

తరువాత ఆలయంలో ఎక్కడైనా కాసేపు కూర్చుని ప్రశాంతంగా స్వామిని ప్రార్థించుకోవాలి. తరువాత, ద్వారపాలకులను మనసులోనే దర్శించుకుని, వారి అనుమతిని కోరుకుంటూ, బయలుదేరాలి.

తరువాత మళ్లీ ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసుకుని తిరిగి వెళ్లాలి.

శివాలయాల్లో మామూలుగా ధ్వజస్తంభం వద్దే నందీశ్వరుణ్ని ప్రతిష్ఠించి వుంటారు. ఇట్లాంటి చోట్ల నంది తోకను భక్తిశ్రద్ధలతో తాకి కళ్లకద్దుకోవాలి.

తరువాత నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి వంగి చూస్తూ, ఎదుట వున్న పరమేశ్వరుణ్ని దర్శించుకోవాలి. ఆ తరువాతే ఆలయప్రవేశం చేసి వినాయకుణ్ణి దర్శించుకోవాలి.

నందీశ్వరుడూ, ధ్వజస్తంభమూ లేని ఆలయాల్లో వినాయకుణ్ణి ముందుగా దర్శించుకుని, స్తుతించుకుంటూ ముందుకు పోవాలి.

శివాలయాల్లో చిట్టచివర దర్శించుకోవలసిన దైవం చండికేశ్వరుడు. ఆయన నిరంతరమూ ధ్యానంలో వుంటాడు కనుక, ఆయన ముందు నిలబడి, మెల్లగా మూడు సార్లు చప్పట్లు చరిచి, ఆయనను మేల్కొలిపి, దర్శించుకుని, దర్శనఫలాన్ని అనుగ్రహించమని వేడుకోవాలి.

ప్రదక్షిణలు చేయాల్సిన విధానం :

ప్రదక్షిణలను పెద్దలు చెప్పిన పద్ధతిలో చేయాలి. కుడి వైపును దక్షిణం అంటారు. 'ప్ర' అంటే ఆ వైపుగా అని అర్థం. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, ఏ దైవాన్ని ఉద్దేశిస్తున్నామో, ఆ దైవం వైపుగా మన కుడి భాగం వుండాలి. అంటే గడియారపు ముళ్లు తిరుగుతున్నట్లుగా తిరగాలి. ఏ దైవానికీ అప్రదక్షిణంగా తిరగకూడదు. అభిషేకాలు చేస్తున్న సమయంలో ప్రదక్షిణలు చేయకూడదు. మధ్యాహ్నసమయం తరువాత రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయకూడదు.

విఘ్నేశ్వరునికి ఒక ప్రదక్షిణ, శివలింగం, అమ్మవారు, దక్షిణామార్తి వంటి దైవాలకు ముమ్మారూ, శ్రీమహావిష్ణువుకూ, తాయారుకూ నాలుగు ప్రదక్షిణలూ చేయాలి. అలా తిరిగి వచ్చేటప్పుడు, బలిపీఠాన్ని కూడా కలుపుకుంటూ, దానికి బయటి వైపుగా రావాలి.

ఇట్లా చేసే ప్రదక్షిణలకూ తగిన ఫలాలున్నాయి. ఉదయం చేసే ప్రదక్షిణలు వ్యాధులను నివారిస్తాయి. మధ్యాహ్నప్రదక్షిణలు కోరికలు తీరుస్తాయి. సాయంకాలప్రదక్షిణలు పాపాలను హరిస్తాయి. రాత్రి చేసే ప్రదక్షిణలు మోక్షాన్ని అనుగ్రహిస్తాయి.

దైవానికి చేసే షోడశోపచారాల్లోనూ అత్యంతమూ ఉత్తమం దీపారాధన. ఈ దీపారాధన సమయాల్లో, ముక్కోటి దేవతలూ ఆ దీపాల్లోకి వేంచేసి, దైవదర్శనం చేసుకుంటారని ఐతిహ్యం వుంది.

దీపారాధన వైశిష్ట్యం :

భగవంతుడు జ్యోతిస్వరూపుడు. అందువల్ల, ఆయనకు దీపారాధన చేయటం వల్ల కష్టాలు నివృత్తి అవుతాయి. ముఖ్యంగా, ఆలయాల్లో ఉదయమూ, సాయంకాలం ప్రమిదెల్లో కాస్త నూనె పోసినా, వత్తులను పైకి ఎగదోసినా, ఐశ్వర్యవృద్ధి.

తొమ్మిది దీపాలు నవగ్రహాలనూ, ఏడు దీపాలు సప్తకన్యలనూ, ఐదు దీపాలు పంచకళలనూ, మూడు దీపాలు సూర్యచంద్రాగ్నులనూ, ఒక దీపం అఖిలాండేశ్వరి అయిన ఆదిపరాశక్తినీ సూచిస్తాయి. పూజల చివరలో చూపించే కుంభదీపం, ఈ ప్రపంచతత్వమైన, సదాశివతత్వాన్ని తెలుపుతుంది.

దీపాలను హారతి ఇస్తూ మూడుసార్లు దేవుని ముందు తిప్పుతారు. తొలి చుట్టు ఈ చరాచరజగత్తును కాపాడమనీ, రెండో చుట్టు జగత్తులోని సకలజీవరాసులనూ కాపాడమనీ, మూడో చుట్టు పంచభూతాలనూ రక్షించమనీ కోరుతూ తిప్పుతారు.

ఆలయాల్లోని పుష్కరిణుల్లో, సాక్షాత్తుగా గంగానదిలో స్నానం చేస్తున్నంత భక్తితో, దేవాలయగోపురాన్ని దర్శించుకుంటూ స్నానం చేయాలి. అక్కడ నూనె, సబ్బు, షాంపూలను వాడకుండా ముమ్మారు నీట మునిగి స్నానం చేయాలి. ఆ తరువాత తడిబట్టలు మార్చుకుని, పరిశుభ్రమైన వస్త్రాలతో ఆలయప్రవేశం చేయాలి.

వైష్ణవాలయాల్లో నవగ్రహాలుండవు. నారాయణుడు, తన చేతిలో వుండే సుదర్శనచక్రానికి నవగ్రహాలకు వున్న శక్తులనూ, అనుగ్రహాలనూ ప్రసాదించాడు. అందుకని శ్రీచక్రత్తాళ్వారును సందర్శించుకుంటే, నవగ్రహాలనూ దర్శించి ప్రార్థనలూ, పూజలూ చేసుకున్న ఫలాలు దక్కుతాయి.

వినాయకుని సన్నిధిలో కొబ్బరికాయను స్త్రీలు సమర్పించకూడదు. ముఖ్యంగా అక్కడ గర్భిణులు వుంటే, వారిని పక్కకు తొలగమని చెప్పాకే కొబ్బరి కాయ కొట్టాలి.

కొన్ని శివాలయాల్లో కాలభైరవస్వామి సన్నిధి వుంటుంది. పెరుగులో కలిపిన ఆవాలను ఆయనకు సమర్పిస్తూ, ''ఓం కాలభైరవాయ నమ:'' అంటూ ఆయనకు నమస్కరించాలి.

ప్రదోషసమయం - ప్రదక్షిణలు :

శుక్లపక్షంలోనూ, కృష్ణపక్షంలోనూ త్రయోదశి తిథి రోజున సూర్యుడు అస్తమించే ముందు అంటే 04.30 నుంచి 06.00 గంటల వరకూ వుండే సమయాన్ని 'ప్రదోషసమయం' అంటారు. మహాదేవుడు హాలాహలవిషాన్ని సేవించిన రోజు శనివారం. ఈ కారణం చేతనే, శనివారం వచ్చే ప్రదోషసమయానికి, 'శనిప్రదోషసమయం' అనే ప్రత్యేకత చేకూరుతుంది.

మామూలు రోజుల్లో కుడివైపు నుంచి ప్రదక్షిణలు చేస్తారు. కానీ, ఈ ప్రదోషసమయాల్లో మాత్రం కుడిఎడమలు రెండు వైపులా ప్రదక్షిణలు చేయాలి. క్షీరసాగరమథనసమయంలో, హాలాహలం పుట్టి, దేవతలను బెంబేలెత్తించగా, వారందరూ స్వామికి కుడిఎడమలుగా పరుగులు తీశారట. అందుచేతనే ప్రదోషసమయంలో స్వామికి కుడిఎడమలుగా ప్రదక్షిణలు చేసి సేవించుకోవాలి.

ప్రదోషసమయంలో ముందుగా నందిని దర్శించుకుని, ఆయన కొమ్ముల మధ్య నుండి శివలింగాన్నీ, ఆ తరువాత చండికేశ్వరుణ్నీ దర్శించుకుని, మళ్లీ వచ్చి నందినీ, మహాదేవుణ్నీ దర్శించుకోవాలి. అభిషేకతీర్థం వెలికి వచ్చే దారి వరకూ వెళ్లి, తిరిగి వచ్చి, మళ్లీ నందిశివదేవులను దర్శించుకోవాలి. ప్రదోషసమయంలో నందీశ్వరునికి పుష్పమాలలు సమర్పించి, ఎర్రని బియ్యాన్ని అర్పించాలి. నంది కొమ్ముల మధ్యన పిడికెడు గరికను వుంచి నమస్కరించుకోవాలి. ప్రదోషసమయంలో మహాదేవునికి బిల్వమాలలు సమర్పించుకుంటే అత్యుత్తమఫలాలు దక్కుతాయి.

నవగ్రహప్రదక్షిణలు :

శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.

''ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:'' అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.

మొదటి ప్రదక్షిణలో... జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!

రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు!

మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చికమేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు!

నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యామిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!

ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!

ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు!

ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభమృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!

ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు!

తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!

అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహదోషాలు గలవారు, ఆయా గ్రహాలకు నిర్ణయించిన ధాన్యాలను సమర్పించుకుంటూ పూజలు చేయాలి. సూర్యునికి గోధుమలు, చంద్రునికి బియ్యం, అంగారకునికి కందిపప్పు, బుధునికి పెసలు, గురువుకు సెనగలు, శుక్రునికి చిక్కుడుగింజలు, శనికి నువ్వులు, రాహువుకు మినపపప్పు, కేతువుకు ఉలవలు-ఇదీ పద్ధతి.
ఆలయ దర్శనం :

దైవదర్శనానికి వెళ్లే సమయంలో మనం ధరించిన దుస్తులతో పాటు శరీరమూ, మనస్సూ కూడా పరిశుభ్రంగా, నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి. నుదుటన చక్కగా విభూతి లేదా కుంకుమ ధరించాలి. అలాగే, ఆలయప్రవేశం చేసేముందు తప్పనిసరిగా కాళ్లూ, చేతులూ కడుక్కునే లోపలికి వెళ్లాలి.

మనతో ఎవరైనా వస్తుంటే వారితో గట్టిగా మాట్లాడు కుంటూ ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఆలయానికి వస్తున్నామంటే మన మనస్సంతా ఆ దైవంమీదనేలగ్నం చెయ్యాలి. మనసులో ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఆలయానికి వెళ్లాలి. లేదా ఏ దేవతను సందర్శించేందుకు వెడుతున్నామో ఆ దేవత నామాన్ని స్మరిస్తూ లోపలికి వెళ్లాలి.

ఆలయంలోకి ప్రవేశింపచేసే రాజగోపుర ద్వారాన్ని దర్శించి రెండుచేతులూ జోడించి స్వామి దర్శనం తనివి తీరా చేయించమని గోపురాన్ని వేడుకోవాలి. లోపలికి వెళ్లగానే ఆకాశాన్ని అంటుకుంటున్నట్టుగా ఉండే నిలు వెత్తు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభమంటే నిజమైన భక్తునికి నిదర్శనం. ఎప్పుడూ స్వామి సన్నిధిలో నిశ్చలమైన ధ్యానముద్రలో ఉండే ఈ స్తంభానిదే అసలు పుణ్యమంతా. అందుకే చాలా పవిత్రంగా ఈ స్తంభానికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసుకుని నమస్కరించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసినా ఉత్తమ ఫలితం వస్తుంది.

అనంతరం బలిపీఠా (సాధారణంగా అమ్మవారి, శివాలయాల్లో ఇది ఉంటుంది)న్ని సందర్శించి మనలో పేరుకున్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను బలి చేస్తున్నట్టు భావించి, వీటి స్థానంలో ప్రేమ, త్యాగం, దాతృత్వంఇత్యాది గుణాలను అలవడేలా చెయ్యమని ప్రార్థించుకోవాలి.

అనంతరం ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసుకుని అనంతరం ఆలయంలోని తొలిపూజల వేల్పు గణనాథుణ్నిదర్శించి మొక్కాలి. ఈ స్వామికి గుంజీళ్లంటే ఇష్టం. 'దండాలయ్యా ఉండ్రాలయ్యా' అంటూ భక్తితో మూడునుంచీ అయిదుకు మించకుండా శక్తిమేరకు గుంజీళ్లు తీసి స్వామి అనుగ్రహాన్ని అర్థించాలి. భక్తితో నమస్కరిస్తే చాలు పరవశించి వరాలననుగ్రహిస్తాడీ కరి ముఖ వరదుడు.

అనంతరం ఆలయ ప్రధాన మూల విరాట్టును దర్శించే ముందు ఇంకా ఈ ఆలయంలో ఇతర దేవతా మూర్తులు కొలువై ఉంటే వారిని దర్శించుకోవాలి. ఉపాలయాల్లోని ఆ మూర్తులను దర్శినంచిన అనంతరం ప్రధాన మూర్తి దర్శనానికి రావాలి. వైష్ణ్వాలయమైతే ఈ స్వామి గర్భాలయానికి ఎదురుగా వుండే గరుడాళ్వారునూ, గర్భగుడి సింహ ద్వారానికి ఇరువైపులా ఉన్న ద్వారపాలకులనూ సేవించుకుని, స్వామివారి దర్శనాన్ని అనుగ్రహించమని వారిని కోరుకుని స్వామివారి కంటే ముందుగా వారి దేవేరి అయిన అలమేలు మంగమ్మను, శివాలయంలోనైతే పార్వతీదేవిని దర్శించాలి. ఆ తరువాత ప్రశాంత చిత్తంతో ప్రధానమూలవిరాట్టు అనుగ్రహం కోసం ప్రార్థించుకుంటూ ఆయన్ను దర్శించాలి.

స్వామిని దర్శించే సమయంలో ఒక్క క్షణాన్ని వృథా పోనీయకుండా తనివితీరా దర్శించాలి. అంతేకానీ, కళ్లు మూసుకుని ప్రార్థించకూడదు. (అయితే, ఇక్కడో విషయం ఉంది. నిజమైన భక్తులకు ఆ భక్తిపారవశ్యంలో కళ్లు మూసుకున్నా కూడా ఆయనమూర్తి కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి భక్తులకిది మినహాయింపే మరి!) స్వామిని ఆపాద మస్తకం దర్శించాలి. అంటే- ముందుగా పాదాలనే చూడాలి. ఆ చరణాలే మనకు శరణాన్ని ప్రసాదిస్తాయన్న మాట. తరువాత, అభయాన్ని ప్రసాదించే హస్తాలు, ఆపై, కరుణను చిలకరించే నేత్రాలు, చిరునవ్వు చిందించే వదనం, ఇలా స్వామిని తిలకించి పులకించాలి.

అమ్మవారినైతే ముందుగా దయను వర్షించే నేత్రాలను, సౌభాగ్యసిద్ధి కలిగించే మాంగల్యాన్ని, అభయాన్నందించే హస్తాలు, ఆపై ఆప్యాయతగా మనవద్దకు వచ్చే ఆ శ్రీ చరణాలనూ దర్శించాలి.కిందికి చూస్తూ, తల్లిని చూసే చిన్నపిల్లల్లా మనసంతా ఆమెనే నింపుకుంటూ దర్శించుకోవాలి.

తరువాత ఆలయంలో ఎక్కడైనా కాసేపు కూర్చుని ప్రశాంతంగా స్వామిని ప్రార్థించుకోవాలి. తరువాత, ద్వారపాలకులను మనసులోనే దర్శించుకుని, వారి అనుమతిని కోరుకుంటూ, బయలుదేరాలి.

తరువాత మళ్లీ ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసుకుని తిరిగి వెళ్లాలి.

శివాలయాల్లో మామూలుగా ధ్వజస్తంభం వద్దే నందీశ్వరుణ్ని ప్రతిష్ఠించి వుంటారు. ఇట్లాంటి చోట్ల నంది తోకను భక్తిశ్రద్ధలతో తాకి కళ్లకద్దుకోవాలి.

తరువాత నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి వంగి చూస్తూ, ఎదుట వున్న పరమేశ్వరుణ్ని దర్శించుకోవాలి. ఆ తరువాతే ఆలయప్రవేశం చేసి వినాయకుణ్ణి దర్శించుకోవాలి.

నందీశ్వరుడూ, ధ్వజస్తంభమూ లేని ఆలయాల్లో వినాయకుణ్ణి ముందుగా దర్శించుకుని, స్తుతించుకుంటూ ముందుకు పోవాలి.

శివాలయాల్లో చిట్టచివర దర్శించుకోవలసిన దైవం చండికేశ్వరుడు. ఆయన నిరంతరమూ ధ్యానంలో వుంటాడు కనుక, ఆయ

No comments:

Post a Comment