02 November 2013


అనంత శక్తికి సంకేతం శివలింగం :

పరమాత్మ అనంతశక్తి సంపన్నుడు. ఆది అంతము లేని ఆయనను లింగాకారములో ప్రతీకగా చేసుకుని పూజించటం లో ఆంతర్యమిదే. ఆకాశము అనంతమైనది ఆకాశాన్ని గమనిస్తే అర్ధగోళాకారములో విశ్వాన్ని మొత్తాన్ని ఆవరించినట్లు కనిపిస్తుఁది. కనుకనే.


శివలింగం ఊర్ధ్వభాగం అదేరూపములో ఉంటుంది. తద్వారా విశ్వరూపుడైన పరమాత్మ సంకేతరూపమయినది శివలింగము. అలాగే జ్యోతియొక్క ప్రజ్వలనము కూడా ఊర్ధ్వ దిశగానుంటుంది. జ్ఞానస్వరూపయిన పరమాత్మ ను లింగరూపం లో పూజించటం జ్ఞానశక్తిని ఆరాధించటానికి సంకేతమే.
అంతేకాక అంతమయిన శక్తిని నిలువజేసే ఆకారము కూడా లింగరూపము లోనే సాధ్యమవుతుంది. ప్రపంచములో ఎక్కడయినా చూడండి మహాశక్తియైన అణుశక్తి నినిల్వచేసే అణుకేంద్రాలలో రియాక్టర్లు ఎప్పుడూ లింగాకారమ్లోనే నిర్మిస్తారు.కారణమేమిటి? ఆ ఆకారములోనే అంతశక్తిని నిలువచేయటం సాధ్యమవుతుంది. మరొక ఆకారంలో కుదరదు. పరమాత్మలోని అనంతశక్తిని లింగరూపములో స్థాపించి ఆరాధించటంఈ లో వైజ్ఞానిక రహస్యం దాగున్నది. ఆది అంతము లేని వాడయిన అనంతుడయిన పరమేశ్వరుని అదేభావనకలిగించే చిహ్నముగా ఏర్పరచారు ఋషులు. ప్రకృతి సహితం కొండలను ,పర్వతాలను ఆశక్తికి సంకేతంగా చూపుతుంది.

ఇంతవిజ్ఞానదృష్టి లేని అల్పులు ,తమకు తోచిన తమ మనసు కనుగుణమయిన చరిత్రగ్రంధాలను వ్రాసినవారు ముఖ్యముగా ఈ కలియుగములో కలిపురుషుని ప్రభావితులు కుహన మేధావులు తమశక్త్యాను సారంగా వక్రభాష్యాలు వ్రాశారు.
ఈసంకేతము ప్రతిమతములోనూ కనపడుతుంది. ఏనుగులు కదిలించలేనంత పెద్దశివలింగాన్ని కాబా స్టోన్ గా ముస్లిములు ఆరాధిస్తారు. భవిష్య పురాణములో మక్కేశ్వర మహాలింగముగా వర్ణించబడ్ద శివస్వరూపము ఇదే. మామూదుడు అను శివకింకరుడు కలిలో జన్మించి అనంత శక్తిశ్వరూపుడైన పరమేశ్వరుని వైపు ప్రజలను మల్లిస్తాడని వ్రాసివున్నది చదవాలి మనం . ఏరూపం లేని వానిగా అనంతానికి ప్రతీకగా పరమేశ్వరుని అల్లాగా ముస్లింసోదరులు కొలుస్తారు. ఆయన తప్ప మరొకరు లేరని గాఢంగా నమ్ముతారు. అందువలనె ఆ ముక్కంటి తలలోని నెలవంక ఆర్ధానక్షత్రము నకు[ఈశ్వరునికిష్టమయిన నక్ష్త్రము] దగ్గరగా వున్న రోజులలో పవిత్రమయిన రంజాన్ ఉపవాసాలతో ఆ అనంతగుణగనుని ప్రార్ధిస్తారు. నెలవంకను పవిత్ర చిహ్నంగా భావిస్తారు. అని పెద్దలు వివరిస్తుంటారు.

No comments:

Post a Comment