02 November 2013

అష్ట :

అష్ట అంటే ఎనిమిది కదా! అష్ట అంకెతో అష్టదిగ్గజాలు, అష్ట దిక్కులు, అష్ట గణపతులు, అష్టగురువులు ఇలా ఎన్నో ఉన్నాయి.

అష్ట గణపతులు: లక్ష్మీగణపతి, క్షిప్ర గణపతి, సిద్ధి గణపతి, చింతామణి గణపతి, శక్తి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, ఏకాక్షర గణపతి, కుమార గణపతి.


అష్టకష్టములు: దాస్యము, దారిద్య్రము, భార్యావియోగము, స్వయం కృషి, యాచనము, యాచకులకు లేదనుట, అప్పుపడుట, సంచారం.


అష్టగురువులు: అక్షరాభాస్యం చేసిన వారు, గాయత్రిని ఉపదేశించినవారు, వేదం అధ్యయనం చేసిన వారు, శాస్త్రం చెప్పినవారు, పురాణం చెప్పిన వారు, శైవ, వైష్ణవ ధర్మం ప్రవచనం చేసినవారు, ఇంద్రజాలాదులు చెప్పినవారు, బ్రహ్మోపదేశం చేసిన వారు.


అష్ట దిక్కులు: తూర్పు, ఆగ్రేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం.


అష్టదిక్పాలకులు: ఇంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, నిఋతి, వరుణుడు, కుబేరుడు, ఈశాన్యుడు.


అష్ట్భార్యలు: శుచి, స్వాహా, శ్యామలా, దుర్గా, కాలికా, అంజనా, చిత్రరేఖ, పార్వతి.

అష్ట పట్నములు: అమరావతి, తేజోవతి, సంయమని, కృష్టాంగన, శ్రద్ధావతి, గంధవతి, అలక.


అష్టవాహనములు: ఐరావతము, తగరు, మసిషము, గుఱ్ఱము, మొసలి, లేడి, నరుడు, వృషభము.


అష్టదిగ్గజాలు: అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాచయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళ సూరన, తెనాలి రామకృష్ణుడు, రామరాజ భూషణుడు


అష్టసిద్ధులు: అణిమ, మహిమ, గరిమ, లఘిలమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం.


అష్ట్భైరవులు: రురుడు, చండుడు, కుండుడు, ఉన్మత్తుడు, కాపాలి, భీషణుడు, కులుడు, ఆనందుడు


అష్ట్భోగములు: అన్నము, వస్తమ్రు, గంధము, పుష్పము, శయ్య, తాంబూలము, స్ర్తి, గానము.


అష్టమదములు: అన్నమదం, అర్థమదం, స్ర్తిమదం, విద్యామదం, కులమదం, రూపమదం, ఉద్యోగమదం, నవదం.


అష్టమహిషులు: రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్రనుదంతి, కాళింది, లక్షణ, వీరంతా కృష్ణుని భార్యలు.


అష్టవసువులు: అవుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు.


అష్ట గృహస్థ ధర్మములు: స్నానం, సంధ్య, జపం, హోమం, స్వాధ్యాయం, దేవతార్చన, అతిథి సత్కారం, వైశ్యదేవం.


అష్టవిధ భక్తులు: భాగవతవత్సల్యం, భగవత్పూజానుమోదం, భగవద్ధర్మ, భగవద్విషయ, అధంబము, భగవత్క్థాశ్రవణేచ్ఛ, సర్వనేత్రాంగ విచారము, సంతతభగవత్ స్మరణము, అమాంస భక్షణము.


అష్టవిధ వివాహాలు: బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రజా పత్యము, అసురము, గాందర్వము, రాక్షసము, పైశాచము.


అష్టవిధ శ్రాద్ధాలు: దైవము, ఆర్షము, దివ్యము, పిత్య్రము, మాతృకము, మానుషము, భౌతికము, ఆత్మశ్రాద్ధము.


అష్టాక్షరి: ‘ఓం నమో నారాయణాయ’

No comments:

Post a Comment