03 November 2013

బ్రహ్మ ముహూర్తం :

బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి?

కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు.ఒక ఘడియకు మన ప్రస్తుత కాల మాన ప్రకారంగా ఇరవై నాలుగు నిమిషములు.ఒక ముహూర్తము అనగా రెండు ఘడియల కాలము అని అర్ధం.అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు.ఒక పగలు,ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రము"అంటారు.
ఒక "అహోరాత్రము"నకు ఇలాంటివి ముప్పైముహూర్తాలు ఉంటాయి.

అంటే!ఒక రోజులో ముప్పై ముహూర్తాలు జరుగుతాయన్నమాట!.
సూర్యోదయమునకు పూర్వమున వచ్చే,ముహూర్తాలలో మొదటిదిది. దీనినే "బ్రహ్మముహూర్తం" అంటారు.అనగా రోజుమొత్తం లో "ఇరవై తొమ్మిదవది" బ్రహ్మ ముహూర్తం.ఈ ముహూర్తానికి అధి దేవత "బ్రహ్మ".కాబట్టి దీనికి " బ్రహ్మ ముహూర్తం" అనే పేరు వచ్చింది.సూర్యోదయం అవడానికి,98-48 నిమిషాల మధ్యకాలం ఇది.ఈ కాలంలో మానవుడు నిద్ర లేవడం,అన్నివిధాలా మంచిది.

వేకువ జామున లేవడం వలన ఫలితాలు :

ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలకు బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో నిదుర లేవ వలెను . ముందుగా శ్రమగా అనిపించినా అలవాటు అయ్యేకొలది సులభం అనిపిస్తుంది .దీని వలన ఆరోగ్యం, పరిపూర్ణ ఆయుషు కలుగుతాయి . బ్రహ్మ ముహూర్త వేళలో దేవతలు, మన పెద్దలు మన ఇంటికి వొస్తారు .ఆ టైములో మనం మెలకువ తో వుంది వారిని మనసారా తలచుకొంటే వారందరూ సంతోషపడి మనకు మంచిని చేస్తారు .

ఏ దిశలో కూర్చొని భోజనం చేయవలెను:


తూర్పు-- ఆయుషు పెరుగును

పడమర-- ఐశ్వర్యం పెరుగును
ఉత్తరం-- దరిద్రం
దక్షిణం-- కీర్తి పెరుగును


ఒక మూల కూర్చొని భోజనం చేయ రాదు .

No comments:

Post a Comment