02 November 2013

జాతస్య హి ధ్రువోమృత్యు ర్ధృవం జన్మ మృతస్య చ | తస్మాదపరిహార్యేర్ధే | న త్వం శోచితు మర్హసి ||
 
అర్ధం: పుట్టినవానికి చావు తప్పదు; చచ్చిన వానికి పుట్టుక తప్పదు.ఈ విశ్వంలో శాశ్వతమైనది ఏదీలేదు; అట్లని అశాశ్వతమైనదీ ఏదీలేదని తెలుస్తున్నది. ఈ విషయాన్ని జీవులకు,
వస్తువులు లేదా పదార్ధాలకి అన్వయిస్తే, ఈ రోజు పుట్టిన జీవి, రేపు చనిపోతే, ఆతరువాత ఆ జీవి మరల పుడుతున్నాడని తెలుస్తుంది. మరణానికి, మరల పుట్టుకకి మధ్యవున్న ‘సంధికాలం’ మనకు కనబడటంలేదు/తెలియటంలేదు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. అయితే, మానవుడు తన పుట్టుక రహస్యాన్ని తెలుసుకోగలిగాడు. కానీ, మరణానంతరం ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు. పుట్టుక సంతోషాన్ని కలిగిస్తుండగా, మరణం ఎంతో దుఃఖాన్ని, భయాల్ని మిగులు స్తుంది. ఇక, మరణించిన మనిషి శరీరానికి చేసే దహన సంస్కా రాలు ఎంతో బాధ, భయంతో కూడుకున్నవి. ఎంతగా ఆలోచించి నప్పటికీ మరణించిన ప్రాణికి ఏమవుతుంది? అనే ప్రశ్న మానవుల్ని వేధిస్తూనే ఉంది.

 
శ్లో|| 'నైనం ఛిందం తి శస్త్రాణి, నైనందహతి పావకంః(అంటే 'ఆత్మను ఆయుధాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు' అని అర్థం. అంతేకాదు
శ్లో|| 'య ఏనం వేత్తి హంతారం, యశ్చైనం మన్యతే హతం,ఉభౌతౌ నవిజానీతో నాయం హన్తి నహన్యతే||
అంటే 'ఈ ఆత్మ చంపుతుందని కాని, చంపబడుతుందని కాని భావించే వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపేదికాని, చచ్చేదికానే కాదు..'' అని అర్థం.అయితే, 'ఆత్మ' ఏమవుతుంది? భగవద్గీత ఇలా చెప్పింది.
శ్లో|| వాసాంసిజీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరోపరాణి,తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ||అంటే ''మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి, కొత్తబట్టలు వేసుకున్నట్లే, ఆత్మ కృశించిన శరీరాలను వదిలి కొత్త దేహాన్ని పొందుతుంది'' అని అర్థం.కాబట్టి, ఆత్మకు చావులేదనీ, అది మనిషి మరణించినప్పుడు అతని దేహాన్ని వదిలి, మరొక దేహ రూపంలో పునర్జన్మ ఎత్తుతుందనీ మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే, పునర్జన్మ ఎత్తే లోపల ఆత్మ, తన పూర్వజన్మలో పుణ్యాలు చేస్తే స్వరసుఖాలు అనుభవిస్తుందని, పాపకార్యాలు, అంటే మనుస్మృతిలాంటి గ్రంథాలలో చెప్పినవాటికి వ్యతిరేకమైన పనులు చేస్తే నరకబాధలు అనుభవిస్తుందనీ, 'గరుడ పురాణం' వంటి పురాణాలు వివరించాయి. ఇవే ప్రచారంలో ఉన్నాయి. ఎందుకని? నరకబాధల భీతి సామాన్య ప్రజలలో పెరిగితే, వారు వేటినైతే పాపకార్యాలుగా చెప్తున్నారో వాటిని చేయడానికి సామాన్యులు భయపడతారు.

 
ఈ విచిత్ర విషయం ఉంది.శ్లో|| 'ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవ ద్వదతి తధైవచాన,
ఆశ్చర్య వచ్చైవమన్యః శృణోతిశృత్వా, ప్యౌనంవేదన చైవకశ్చిత్||అంటే, ''ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకొ కడు దీన్ని గురించి విచిత్రంగా మాట్లాడు తున్నాడు. మరొకడు వింతగా వింటు న్నాడు. అయితే, ఈ ఆత్మ స్వరూప స్వభా వాలు తెలుసుకున్న వాడు 'ఒక్కడూ లేడు' అని అర్థం.


No comments:

Post a Comment