03 November 2013

విద్యా సుముహూర్తములు :

బహు బాషా విద్యలకు: ఆది,మంగళ,శని వారములు;భరణి,కృత్తిక,ఆర్ద్ర,ఆశ్లేష,మఘ,పుబ్బ,విశాఖ,జ్యేష్ట,పూ.షా.,ఉ.షా.,పూ.భా.రేవతి నక్షత్రములు,చంద్రుడు స్థిర లగ్నమందుట మంచిది.
కంపుటర్,గణిత శాస్త్రములకు:బుధ,గురు వారములు;రోహిణి,ఆర్ద్ర,పుష్యమి,
హస్త,అనూ,శత,పూ.భా.,రేవతి నక్షత్రములు మంచివి.
వేద విద్య నేర్చుకొనుటకు:2,3,5,7,10,11,13
,15 తిధులు;అశ్వి,రోహి,ఆర్ద్ర,పున,పుష్య ఉత్తరాత్రయం,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,శ్రవ,రేవతి, నక్షత్రములు,ద్విస్వభావ లగ్నములు మంచివి.
వ్యాకరణమునకు:సోమ,బుధ,గురు,శుక్ర వారములు;2,3,5,7,10 తిధులు;అశ్వి,రోహి,మృగ,ఆర్ద్ర,పున,పుష్య,హస్త,హస్త,చిత్త,స్వాతి,విశాఖ,అనూరాధ నక్షత్రములు మంచివి.
వైద్యవిద్యకు:ఆది,సోమ,మంగళ వారములు;విదియ,పంచమి,సప్తమి,దశమి తిధులు; అశ్వి, మృగ, ఆర్ద్ర, పున, పుష్య, ఆశ్రే, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ట, మూల,శ్రవ, ధని,శత రేవతి నక్షత్రములు మంచివి.
న్యాయశాస్త్రములకు:సోమ,బుధ,గురు వారములు;అశ్వి,రోహి,పున,పుష్య,హస్త,స్వాతి,శ్రవ,శతభిష నక్షత్రములు మంచివి.
సంగీత నాట్యములకు:సోమ,బుధ,గురు,శుక్ర వారములు:ఉత్తరాత్రయము,ఆర్ద్ర,పుష్య,హస్త,అనూరాధ,జ్యేష్ట,ధని,రేవతి నక్షత్రములు మంచివి.
వీణ,ఫిడేలు,మాండలీను వాద్యములకు:బుధ,గురు,శుక్ర వారములు,5,10,13,15 తిధులు; రోహి,మృగ,పున,పుష్య,హస్త,చిత్త,స్వాతి,అనూ,శ్రవ,ధని,శత,రేవతి నక్షత్రములు మంచివి.
తబలా,మద్దెల మొ!! వాద్యములకు:బుధ,గురు,శుక్ర వారములు;3,5,8,10,13,15 తిధులు;అశ్వి,మృగ,పున,పుష్య,హస్త,చిత్త,స్వాతి,అనూ, శ్రవ, ధని,శత,రేవతి నక్షత్రములు మంచివి.
చిత్రలేఖమునకు:ఆది,సోమ,గురు,శుక్ర వారములు; 2,5,7,11 తిధులు; అశ్వి, భర, రోహి, మృగ, పున, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, ఉ.షా., శ్రవ, పూ.భా.,రేవతి నక్షత్రములు మంచివి.
ఉద్యోగములో చేరుటకు:బుధ,గురు,శుక్ర వారములు; 2,3,5,7,10,11,13 తిధులు;అశ్వి,పున,పుష్య,హస్త,చిత్త,అనూ,రేవతి నక్షత్రములు మంచివి. రవి,కుజులు 10,11 స్థానములో నుండగా శుభలగ్నములలో చేరవలెను.

No comments:

Post a Comment