04 November 2013

విభూధిని ఎందుకు ధరిస్తారు ?

ప్రార్థనా సమయంలో ఆ కాలంలో ప్రతీ హిందువు విభూదిని నొసటి భాగాన పులుముకునేవారు. విభూతిలో ఉన్న ఔషదీయ గుణాలు ఈ అభ్యాసాన్ని అర్థవంతం చేస్తుంది. స్వచ్చమైన విభూడికి ఎన్నో శుభలక్షణాలు ఉన్నాయి. స్వచ్చమైన విభూదిని పొందడానికి మొదట గడ్డిమాత్రమే తినే అవు పేడను సేకరించాలి. ఆ పేడను దాన్యపు పొట్టులో శివరాత్రి రోజు కాల్చాలి. కాల్చిన పేడను నీటిలో కడిగిన అనంతరం ఆరబెట్టాలి. ఆ పిమ్మట దానిని పరమేశ్వరుడికి అర్పించాలి. ఈ విభూదిని శుభ్రమైన చోటపెట్టి వాడుకోవాలి.
విభూదిని తడిపిగాని, పొడిగా గానీ వాడుకోవచ్చు. విభూది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. హిందువుల విశ్వాసం ప్రకారం విభూదిని ధరించడం వాల్ల శివుడు ప్రసంనుడవుటాడని విభూదిని నుదురు, మెడ, భుజాలు, చేతి మదిమలు మరియు మోచేతుల్లో ధరిస్తారు.
జ్వరంతో బాధపడుతున్న వాడికి నుదిటిపై తడి విభూదిని పూస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. హోమంలో వేసిన ఔషదీయ కర్రలు మరియు ఆవు నెయ్యి పవిత్ర బస్మాన్ని మిగుల్చుతుంది. హోమబస్మం కూడా వాడవచ్చు. ఇందులోనూ అనేక ఔషదీయగునాలు ఉన్నాయి.

No comments:

Post a Comment