01 November 2013

సంకటహరచతుర్థి :

ప్రతిమాసంలోనూ వచ్చే బహుళ చతుర్థి (బహుళ చవితి)ని సంకట హర చతుర్థి లేదా సంకట విమోచక చతుర్థిగా పిలుస్తారు. జాతకంలో కేతు మహర్దశ నడుస్తున్నవారు, కష్టాలు, కడగళ్లనుభవించేవారు, తరచు కార్యహాని కలుగుతున్నవారు ఈ వ్రతం చేయడం మంచిది. ఆరోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట గుడికెళ్లి గరికపై ప్రమిదనుంచి దీపారాధన చేసి, గరికపోచలు, పుష్పాలు, పత్రితో గణపతిని పూజించి, లడ్డూలు లేదా ఉండ్రాళ్లు నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రతి మాసంలోనూ వచ్చే సంకటహర చతుర్థినాడు ఇదేవిధంగా ఆచరించగలిగితే సకల దోషాలూ పోయి, సత్ఫలితాలు కలుగుతాయి. కార్యజయం కలుగుతుంది. ప్రతి బహుళ చతుర్థినాడూ వినాయక చవితిరోజు చేసినట్లే పత్రితోనూ, పుష్పాలతోనూ గణపతికి పూజ చేస్తే అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతోనూ, సమస్యలతోనూ బాధపడేవారు సంకటహర చతుర్థి వ్రతంతోపాటు ఈ కింది స్తోత్రాన్ని విడవకుండా ఆరుమాసాలపాటు పఠించడం వల్ల చక్కటి ఫలితముంటుంది. వ్రతాన్ని ఆచరించలేనివారు కనీసం సంకటహర గణపతి స్తోత్రాన్ని నాలుగుసార్లు పారాయణ చేసినా మంచిదే. ఈ వ్రతాచరణ వల్ల విఘ్నాలు తొలగి పనులు సజావుగా సాగుతాయి. కేతుగ్రహ బాధలు తొలగుతాయి.

సంకట విమోచక గణపతి స్తోత్రం :

ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం

భక్తావాస స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే
ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం

లంబోదరం పంచమంచ షష్టం వికటమేవచ

సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననం
ద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాన్నిత్యం
నచ విఘ్నభయం తస్యసర్వసిద్ధికరం ప్రభోః
విద్యార్థీ లభతే విద్యా ధనార్థీ లభతే ధనం
పుత్రార్థీ లభేత్ పుత్రం మోక్షార్థీ లభేత్ గతిం
జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చః లిఖిత్వాయత్సమర్పయేత్
తస్య విద్యా భ వేత్సర్వా గణేశస్య ప్రసాదతః

గణపతి పూజ ఆచరించాలి ఇలా:

* ఏ పని చేపట్టినా ముందుకు సాగక ఇబ్బందులు పడేవారు బుధవారం లేదా చవితి తిథి లేదా వేరే ఏదైనా మంచి తిథినాడు దంతధావనం కూడా చేయకుండానే ‘ఓం గం గణపతయే నమః’ అనే మంత్రాన్ని 21 మార్లు పఠించాలి. ఇలా కనీసం 21 రోజులు విడవకుండా పఠించడం వల్ల శుభం కలుగుతుంది. అయితే అది పెద్దల సలహాతో ఆచరించడం మంచిది.
* ఏ పూజలోనైనా ముందుగా హరిద్రా గణపతిని (పసుపుతో గణపతి ప్రతిమను చేసి, తమలపాకులో ఉంచాలి) పూజించడం మంచిది.
* వినాయక చవితినాడు తప్ప తక్కిన రోజుల్లో తులసి దళాలతో పూజించరాదు
* గరిక పోచలతోనూ, పత్రితోనూ పూజిస్తే ప్రసన్నుడవుతాడు
* నారికేళము, అరటిపండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు నివేదిస్తే సంతుష్టుడవుతాడు
* గణపతిని పూజిస్తే లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురూ ప్రసన్నులవుతారు.
* బుధవారం నాడు గణపతి ప్రీత్యర్థం తెల్లటి వస్త్రాలు ధరించడం మంచిది.
* వైష్ణవ సంప్రదాయంలో గణపతిని విష్వక్సేనుడంటారు.

ఇంటిలో వాస్తుదోషం ఉందని తెలిసి, దానిని తొలగించడం సాధ్యంగాక ఏం చేయాలో తెలియక సతమతమయ్యేవారు దోషం ఉన్న ప్రదేశంలో పసుపు కొమ్ముతో లేదా తెల్లజిల్లేడు వేరుతో రూపొందించిన వినాయకుని ప్రతిమనుంచి ప్రతిరోజూ ధూప దీప నైవేద్యాలు సమర్పించడం వల్ల దోషం చాలా వరకు తొలగుతుంది.

ఏదయినా ముఖ్యమైన పని నిమిత్తం బయల్దేరి వెళ్లేటప్పుడు ‘‘వక్రతుండ మహాకాయం కోటి సూర్యసమప్రభం నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’’ అని చదువుకొని వినాయకునికి భక్తితో నమస్కరించి వెళితే కార్యజయం కలుగుతుంది. 21 గణపతికి ఇష్టమైన సంఖ్య. కాబట్టి ఏదయినా కోరిక కోరుకొని వినాయకునికి 21 ఉండ్రాళ్లు నివేదిస్తానని మొక్కుకుని, కోరిక తీరిన తర్వాత మొక్కు తీర్చుకుంటే మంచిది.
జిల్లేడు, పల్లేరు, గరిక వినాయకునికి ప్రీతికరమైనవి. గణేశునికి చేసే పూజలో వాటిని ఉపయోగిస్తే మంచిది.

No comments:

Post a Comment