02 November 2013

దైవకృపకు ఉపకరించే మార్గాలు :

ప్రార్థన, పూజ అనేవి నేడు హిందూ మతంతో అభిన్నమై పోయాయి. ధ్యానం ద్వారా భగవంతునితో తాదాత్మ్యం చెందడం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత అనుభూతిగా పరిగణింపబడుచున్నది. తీవ్రసాధనలు, కఠోర తపస్సు, భగవత్కౄప – వీటి ద్వారా ఈ అనుభూతి కలుగుతుంది. ఏ ఒకరిద్దరు సాధకులు మాత్రమే తిన్నగా ఈ స్థితికి అర్హులై ఉంటారు. అత్యధికశాతమంది ప్రారంభనుండే క్రమేపి వెళ్లవలసినవారై ఉంటారు. ఇటువంటి ప్రారంభ సాధనే ప్రార్థన.
ఈ ప్రపంచమూ, దానొలోని వస్తువులూ మనకు వాస్తవంగా ద్యోతకమవడం సహజం. కాని, ప్రాపంచిక వాస్తవికత కంటే ఉన్నతమైన సత్యం మరొకటి ఉన్నదని, ఆ సత్యమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నదనీ జీవితానుభవాలు మనకు తెలియచేస్తాయి. ఆ సత్యవస్తువైన భగవంతునితో అనుసంధానము ఏర్పరచుకోవాలని భావించడం సహజం. స్పష్టంగా కాకపోయినా ఏదో అస్పష్టమాత్రంగా గ్రహించిన ఆ భగవంతుని వైపుగా చేతులు జోడిస్తాడు మానవుడు. తనకు మార్గం చూపమనీ, ఆ పరిపూర్ణ స్త్యస్వరూపమైన భగవంతుని మన స్ఫూర్తిగా వేడుకొంటాడు. ఇదే ప్రార్థన.
ప్రార్థన విధములు, అనేకములు ఉండవచ్చు. మనిషి మనిషికి మారవచ్చు. కాని, దాని ముఖ్యోద్దేశం అందరికీ ఒకటే. ఒక జీవికి భగవంతునికి మధ్య ప్రత్యేకమైన బాంధవ్యమును పెంపొందించటానికి పనిసి వచ్చే సాధనమే ప్రార్థన. అంటే సౄష్టికి, సౄష్టికర్తకు మధ్యవుండే బంధాన్ని బలపరిచేదే ప్రార్థన.
సాధారణంగా దేనినైనా స్వీకరించే స్థితిలో ఉండటం మనస్సు ప్రవౄత్తి. అందుచేతనే ఆధ్యాత్మిక జీవితంలో తొలిమెట్టు ప్రార్థన. ఈ ప్రార్థనా ఫలితంగా భగవంతుని అనుగ్రహజనితవీక్షణం, విశ్వాసం, ప్రేమ, బలిమి రూపాలలో ప్రసరించిమన మనస్సును నింపుతుంది. మొత్తానికి ప్రార్థన మనిషికి ఆధ్యాత్మిక జ్ణ్జానమును పొందుటకు కావలసిన మనో వికాసమును కలుగజేస్తుంది.
ప్రార్థన చేయు విధానములు
ప్రార్థనను మూడు విధాల ఆచరించవచ్చు. అవి కాయిక, వాచిక, మానసలుగా పేర్కొనవచ్చు.
ఆచారకర్మ లేక ఒక పూజను చేయడం కాయిక పూజ కిందికి వస్తుంది. భగవంతుని పొగుడుతూ పాడుత, వేదములలోని ధ్యాన శ్లోకములను పఠించుట, భక్తి గీతములను పాడుత – వాచిక ప్రార్థన అనబడును. నిశ్శబ్దముగా మనసులో భగవంతుని ధ్యానము చేసుకొనుట మానస ప్రార్థనగా పేర్కొనవచ్చు.
ప్రార్థనవల్ల కలిగే ఫలితములు
ప్రతి పనికి ఫలమున్నట్లే ప్రార్ధనవలన కూడా మనిషికి ఫలితము దక్కుతుంది. ఇది రెండు విధాలుగా ఉండును. ఒకటి దౄష్టఫలం (కనిపించునది) రెండవది అదౄష్టఫలం (కంటికి కనిపించనిది)
దౄష్టఫలం
ప్రార్థన చేయుట వలన మునుముందుగా మనిషి కలిగే ప్రయోజనమేమనగా తన శక్తి సామర్ఘ్యములు పరిమితిగలవని, అందరికన్నా బలవంతుడు పైనున్న భగవంతుడని ఒప్పుకోవడం వల్ల వచ్చే ఉపశమనము. పరిస్థితులు మన అదుపులో లేనప్పుడు జగద్రక్షకుడైన పరమేశ్వరుని పార్థించి, ఆయన దయకే మన కర్మఫలాన్ని వదలి వేసినప్పుడు మనకు ఆదుర్దా తగ్గి మనశ్శాంతి కలుగుతుంది.
అదౄష్ట ఫలము
దైవప్రార్థన వలన మనకంటికి కనబడకుండా వచ్చే ఫలితాన్ని పుణ్యమంటారు. ఇహమునందును పరమునందును కలిగే సుఖము మనిషి చేసుకొన్న పుణ్యము మీద ఆధారపడి ఉండును.
ప్రార్థన యొక్క పరమార్థం
మనవులు వేరువేరు ఉద్దేశములతో, ఆశయములతో దైవ ప్రార్థన చేస్తుంటారు. శ్రీ కౄష్ణ భగవానుడు భగవద్గీతలో భక్తులను నాలుగు విధాలుగా పేర్కొన్నాడు. మొదటి రకం భక్తుని ఆర్త అని పిలుస్తారు. ఈ వ్యక్తి తను కష్టములలోనున్నపుడు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నపుడు భగవంతుని జ్ణ్జాపకము తెచ్చుకొనును. పరిస్థితులు తనుకు అనుకూలముగానున్నపుడు దానికంతకు కారణము తనే అని భావించును. రెండవ రకము భక్తుని ఆర్దార్థి అంటారు. ఇతడు ఆధ్యాత్మిక చింతన కలిగి తన జీవితము మీద భగవంతుడు దయచూపుతున్నడన్న విషయమును గ్రహించియుండును. కాని, ఇతదు తన స్వప్రయోజనము ఆశించే దైవప్రార్థన చేయును.
ఆర్థార్థి దౄష్టి ఎప్పుడు ఇహసుఖములమీద, భౌతిక సంపదలమీదే ఉండును. ఆర్త భక్తుని వలె ఆర్థార్థి భక్తుడు కూడా కష్టములనుండి విముక్తి కలిగించుటకే దైవప్రార్థన చేయును. మూడవ రకము భక్తుని జిజ్ణ్జాసుడంటారు. ఇతడు మోక్షమును పొందుటకు, జీవితము లోని అశుభములను పారద్రోలుటకు జ్ణ్జాన సంపాదన చేయును. మోక్షము సంపాదించుట అందరి జీవితాశయమైనప్పటికి, ఒక్క జిజ్ణ్జాసు మాత్రమే జ్ణ్జాన సంపాదన వలనే మోక్షము లభించునన్న సత్యము గ్రహించి దానికై పాటుపడును. అతని ప్రార్థన – జ్ణ్జానము సంపాదించుటకు కావలసిన బుద్ధికుశలత, మనోవికాసము తనకు కలుగచేయమని వెడుకొనుత. నాలుగవ రకం భక్తుడు జ్ణ్జాని. ఇతడు తనయందే భగవంతున్నాడని తలచును. తనకు భగవంతుని భేదములేదని తలచును. జ్ణ్జాని చేసే ప్రార్థన సర్వోత్తమమైనది. అది జ్ణ్జానమును విశదీకరించు సాధన.
పూజ
ప్రార్థన మూలంగా మనం భగవంతుని నుండి అనేకములు పొందుతాం. అందుచేత పరిపక్వత చెందిన మనస్సుతో భగవంతునికి కొన్నిటికి సమర్పిస్తాం. ఇలా వచ్చి పుచ్చుకోవడాలు కొనసాగుతున్నపుడు, మనం క్రమక్రమంగా భగవంతుని సమీపిస్తాం. ధ్యాన స్థితి నెలకొంటుంది. ధ్యానస్థితిని ఉపాసన అని పేర్కొంటారు. ఉపాసన (ఉప ఆసన) అంటే దగ్గరగా ఉండడం. భగవంతునికి దగ్గరగా ఉండడమన్నమాట.
అర్హులైన కొందరి జీవితంలో ప్రార్థనే ధ్యానంగా రూపాంతరం చెందడం కద్దు. కాని, అనేకులకు ప్రార్థనకు, ధ్యానానికి నడుమ ఒక మెట్టు ఆవశ్యకమవుతుంది. అదే పూజ. ఈ విధంగా పూజ మానవుణ్ణి భగవంతుని దగ్గరకు తీసుకొని పోతుంది. భగవద్దర్శనం కలిగిస్తుంది.
పూజకు మూలాధారమైనవి

దృష్టఫలం
ప్రార్థన చేయుట వలన మునుముందుగా మనిషి కలిగే ప్రయోజనమేమనగా తన శక్తి సామర్ఘ్యములు పరిమితిగలవని, అందరికన్నా బలవంతుడు పైనున్న భగవంతుడని ఒప్పుకోవడం వల్ల వచ్చే ఉపశమనము. పరిస్థితులు మన అదుపులో లేనప్పుడు జగద్రక్షకుడైన పరమేశ్వరుని పార్థించి, ఆయన దయకే మన కర్మఫలాన్ని వదలి వేసినప్పుడు మనకు ఆదుర్దా తగ్గి మనశ్శాంతి కలుగుతుంది.
అదృష్ట ఫలము
దైవప్రార్థన వలన మనకంటికి కనబడకుండా వచ్చే ఫలితాన్ని పుణ్యమంటారు. ఇహమునందును పరమునందును కలిగే సుఖము మనిషి చేసుకొన్న పుణ్యము మీద ఆధారపడి ఉండును.
ప్రార్థన యొక్క పరమార్థం
మనవులు వేరువేరు ఉద్దేశములతో, ఆశయములతో దైవ ప్రార్థన చేస్తుంటారు. శ్రీ కౄష్ణ భగవానుడు భగవద్గీతలో భక్తులను నాలుగు విధాలుగా పేర్కొన్నాడు. మొదటి రకం భక్తుని ఆర్త అని పిలుస్తారు. ఈ వ్యక్తి తను కష్టములలోనున్నపుడు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నపుడు భగవంతుని జ్ణ్జాపకము తెచ్చుకొనును. పరిస్థితులు తనుకు అనుకూలముగానున్నపుడు దానికంతకు కారణము తనే అని భావించును. రెండవ రకము భక్తుని ఆర్దార్థి అంటారు. ఇతడు ఆధ్యాత్మిక చింతన కలిగి తన జీవితము మీద భగవంతుడు దయచూపుతున్నడన్న విషయమును గ్రహించియుండును. కాని, ఇతదు తన స్వప్రయోజనము ఆశించే దైవప్రార్థన చేయును.
ఆర్థార్థి దౄష్టి ఎప్పుడు ఇహసుఖములమీద, భౌతిక సంపదలమీదే ఉండును. ఆర్త భక్తుని వలె ఆర్థార్థి భక్తుడు కూడా కష్టములనుండి విముక్తి కలిగించుటకే దైవప్రార్థన చేయును. మూడవ రకము భక్తుని జిజ్ణ్జాసుడంటారు. ఇతడు మోక్షమును పొందుటకు, జీవితము లోని అశుభములను పారద్రోలుటకు జ్ణ్జాన సంపాదన చేయును. మోక్షము సంపాదించుట అందరి జీవితాశయమైనప్పటికి, ఒక్క జిజ్ణ్జాసు మాత్రమే జ్ణ్జాన సంపాదన వలనే మోక్షము లభించునన్న సత్యము గ్రహించి దానికై పాటుపడును. అతని ప్రార్థన – జ్ణ్జానము సంపాదించుటకు కావలసిన బుద్ధికుశలత, మనోవికాసము తనకు కలుగచేయమని వెడుకొనుత. నాలుగవ రకం భక్తుడు జ్ణ్జాని. ఇతడు తనయందే భగవంతున్నాడని తలచును. తనకు భగవంతుని భేదములేదని తలచును. జ్ణ్జాని చేసే ప్రార్థన సర్వోత్తమమైనది. అది జ్ణ్జానమును విశదీకరించు సాధన.
పూజ
ప్రార్థన మూలంగా మనం భగవంతుని నుండి అనేకములు పొందుతాం. అందుచేత పరిపక్వత చెందిన మనస్సుతో భగవంతునికి కొన్నిటికి సమర్పిస్తాం. ఇలా వచ్చి పుచ్చుకోవడాలు కొనసాగుతున్నపుడు, మనం క్రమక్రమంగా భగవంతుని సమీపిస్తాం. ధ్యాన స్థితి నెలకొంటుంది. ధ్యానస్థితిని ఉపాసన అని పేర్కొంటారు. ఉపాసన (ఉప ఆసన) అంటే దగ్గరగా ఉండడం. భగవంతునికి దగ్గరగా ఉండడమన్నమాట.
అర్హులైన కొందరి జీవితంలో ప్రార్థనే ధ్యానంగా రూపాంతరం చెందడం కద్దు. కాని, అనేకులకు ప్రార్థనకు, ధ్యానానికి నడుమ ఒక మెట్టు ఆవశ్యకమవుతుంది. అదే పూజ. ఈ విధంగా పూజ మానవుణ్ణి భగవంతుని దగ్గరకు తీసుకొని పోతుంది. భగవద్దర్శనం కలిగిస్తుంది.
పూజకు మూలాధారమైనవి:
1. త్యాగం: దైవం నిమిత్తం ఒక వస్తువును త్యాగం చేయడం, అంటే సమర్పించడం పూజ. అది ఒక పుష్పమే కావచ్చు. పదార్థమే కావచ్చు. మనస్సే కావచ్చు, పనియే కావచ్చు. ఎలాటిదైనా దానిని త్యాగభావంతో సమర్పించాలి. ప్రార్థనద్వారా పరిపక్వత సంతరించుకొన్న మనస్సుతో సమర్పించాలి. పత్రం, పుష్పం, ఫలం< తోయం – వీటిలో వేటినైనా స్వీకరిస్తానని భగవద్గీతలో భగవానుడు తెలిపే ఉన్నాడు. కాని దాన్ని సభక్తికంగా సమర్పించాలని ఆయన వక్కాణించాడు. 2. పవిత్రత: హిందూమతం మూడు రకాల పవిత్రతను ప్రస్తావిస్తుంది.
మొదటిది అధి భౌతికం: భౌతిక స్థితిలో అంటే బాహ్యమైన పవిత్రత. పూజాద్రవ్యాలన్నిటిని మంత్రోచ్ఛారణ చేస్తూ నీటితో శుభ్రపరచడమే ఇది.
రెండవది అధి దైవతం: ఒక్కో వస్తువుకూ, శరీరంలోని ఒక్కో అంగానికి ఒక దివ్యరూపం ఉంటుంది. అవి ఒక్కోదేవత అధీనంలో ఉంటాయి. ఈ దేవతను అధిష్టానదేవతగా పేర్కొంటారు. ఈ దెవతలను గంట, దీపం, శంఖం, పువ్వులు, నీరు ఇత్యాదులతో ఆవాహన చేయడం వల్ల ఆ వస్తువులు పవిత్రీకరింప బడతాయి.
మూడవది ఆధ్యాత్మికం:- మానవ ఆత్మ శాశ్వతంగా పవిత్రమైనది. స్వయంప్రకాశమైనది. పాపం, అపవిత్రతలు మనస్సుకే వర్ణిస్తాయి. అందుచేత మనస్సున పవిత్రీకరించడం మూలంగా ఆత్మ తన స్వాభావిక ప్రకాశాన్ని, వైభవాన్ని అభివ్యక్తీకరిస్తుంది.
నాలుగవై దివ్యబంధం:- పూజించే వ్యక్తికి, ఇష్టదైవానికి మధ్య ఒక బంధం నెలకొనాలి. పూజించే విగ్రహంలో భగవంతుడు నెలకొని ఉన్నట్లు భావించాలి. అక్కడ నెలకొని ఉన్న ఆయనతో పూజించే వ్యక్తి ఎడతెగని బంధాన్ని ప్రేమబంధాన్ని ఏర్పరచుకోవాలి.
పూజాక్రియ:- వేదకాలంలో ప్రార్థనల ద్వారా, యజ్ణ్జాలద్వారా దైవంతో అనుసంధానం ఏర్పరచుకొన్నారు. తదనంతర కాలంలో అది పూజగా రూపుదిద్దుకొని పెంపొందింది.
సామన్యంగా దైనందిన పూజలో ఆరుమెట్లున్నాయి. అవి 1. ఆయత్తం (పూర్వాంగం), 2. పవిత్రీకరణ (శుద్ధి), 3. తనను దివ్యునిగా చేసుకోవడం (భూరుశుద్ధి), 4. దైవాన్ని ఆవాహన చేయడం (ఆవాహన), 5. సేవ (ఉపహారం) 6. ముగింపు (పుష్పాంజలి). ఇవేకాక ప్రసాదం, హారతి కూడా పుజాకార్యక్రమంలో భాగమై ఉన్నాయి.
ప్రసాదం: పూజలలో అభిషేకింపబడిన, నివేదింపబడినవన్నీ తుదకు ప్రసాదంగా పంచిపెట్టబడతాయి. ప్రసాదం మన దేహాలను పవిత్రీకరిస్తుందని విశ్వాసం. అదేకాక ప్రసాదం అనే సంస్కౄత పదానికి అనుగ్రహం అని అర్థం. అందుచేత ప్రసాదం పుచ్చుకోవడం భగవంతుని అనుగ్రహం పొందడమవుతుంది.
ఆరాత్రికం (ఆరతి): ధూపం, దీపం ఇత్యాదులను దైవ సమక్షంలో చూపించే క్రియ ఇది. ఈ సమయంలో విగ్రహంలో దైవం ఉనికి విశిష్టంగా అభివ్యక్తీకరణ చేసుకుంటుందని భక్తుల విశ్వాసం. సామన్యంగా ఆరతి సమయంలో గంట, శంఖం వంటి వాటిద్వారా నాదం వెలువరింప చేస్తారు. అందువల్ల ఆ వేళలో మనస్సు ఏకాగ్రమై దైవచింతనకు దోహదం చేస్తోంది.
‘హారతి ఇతి హారతీ – దౄష్టిదోషాన్ని హరించేది హారతి. అందుకే దాన్ని నీరాజనం అని కూడా అంటారు. దేవుడిపైన దర్శించాడానికి వచ్చిన ఎంతోమంది దౄష్టి పడుతుంది. ఆ దౄష్టి దోషం తొలగడానికి అర్చకులు హారతి ఇచ్చి, భక్తులందరికీ చూపెడతారు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ ఆ హారతికి దణ్ణం పెట్టుకోవాలి భక్తిగా. చిన్నపిల్లలకు, శుభ కార్యాల్లోనూ హారతితో దిష్టితీసి పెరట్లో ఓ మూల పడేస్తారు. అలాగే దేవుడికి మంగళం కలగాలని హారతి ఇచ్చి, శ్లోకాలు చదివి, ఆ హారతిని ఒక పక్కన పెడతారు. ఇది సరైన పద్ధతి.
దీపారాధన
దీపంజ్యోతి: పరబ్రహ్మ దీప: సర్వతమోపహ:!!
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపో నమోస్తుతే!!

దీపంజ్యోతిపరబ్రహ్మ తత్వాన్ని తెలుపుతుంది. అజ్ణ్జానాంధకారాన్ని తొలగిస్తుంది.
దీపారాధన సంధ్యా సమయాలకే పరిమితమైన వ్యవహారం కాదు. నిత్య పూజలో, వైదిక కర్మల్లో, పండుగల్లో వ్రతాల్లో, చివరకు ప్రారంభోత్సవాది సాంఘిక కార్యకలాపాలన్నింటిలో దీప ప్రజ్ణ్జ్వలన ప్రప్రథమ అంశం. ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా దీపారాధన చేయకుండా మొదలు పెట్టరు.
మన పెద్దలు దైవకృపకు ఇలాంటి పద్ధతులను చెప్పారు.

No comments:

Post a Comment