02 November 2013

వేద పురాణేతిహాసాలలోని సంఖ్యాపరమైన విశేషాలు :

త్రిమూర్తులు :
1. బ్రహ్మ 2. విష్ణు 3. శివుడు
త్రికాలములు :

1. భూతకాలము, 2. వర్తమానకాలము 3. భవిష్యత్ కాలము

త్రిగుణములు :

1. సత్వ 2. రజో 3. తమో గుణములు

త్రికరణములు :

1. మనసు, 2. వాక్కు 3. కాయము

త్రిలోకములు :

1. స్వర్గ లోకము 2. మర్త్య లోకము 3. పాతాళ లోకము

చతుర్వేదములు :

1. ఋగ్వేదము 2. యజుర్వేదము 3. సామ వేదము 4. అధర్వణ వేదము

చతుర్విధ ఉపాయములు :

1. సామ 2. దాన 3. భేద 4. దండ

చతుర్విధ పురుషార్ధములు :

1. ధర్మము 2. అర్ధము 3. కామము 4. మోక్షము

చతురాశ్రమములు :

1. బ్రహ్మచర్యము 2. గృహస్తాశ్రమము 3. వానప్రస్థము 4. సన్యాసము

పంచ యజ్ఞములు :

1. దేవ 2. పితృ 3. బ్రహ్మ 4. ఋషి 5. భూత యజ్ఞములు

పంచ పల్లవములు :

1. మామిడి 2. మర్రి 3. మేడి 4. రావి 5. జువ్వి

పంచ గవ్యములు :

1. ఆవుపాలు 2. ఆవు నెయ్యి 3. ఆవుపాల పెరుగు 4. గో మూత్రము 5. గోమయము

పంచాంగములు :

1. తిధి 2. వారము 3. నక్షత్రము 4. యోగము 5. కరణము

పంచ ప్రాణములు :

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము

పంచామృతములు :

1. ఆవు పాలు, 2. ఆవు పెరుగు, 3. ఆవు నెయ్యి, 4. పటికి బెల్లం, 5. తేనె
షడంగములు :

1. శిక్ష 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. నిరుక్తము 5. జ్యోతిష్యము 6. కల్పము

షట్ దర్శనములు :

1. న్యాయము 2. వైశేషికము 3. శాంఖ్యము, 4. యోగశాస్త్రము 5. పూర్వ మీమాంస 6. ఉత్తర మీమాంస
షట్ చక్రవర్తులు :

1. హరిశ్చంద్రుడు 2. నలుడు 3. పురకుత్సుడు 4. పొరూరవుడు 5. సగరుడు 6. కార్తవీర్యుడు

అరిషడ్వర్గములు :

1. కామము 2. క్రోధము 3. లోభము 4. మోహము, 5. మదము 6. మాత్సరము

సప్త ఋషులు :

1. కశ్యపుడు 2. అత్రి 3. భరద్వాజుడు 4. విశ్వామిత్రుడు 5. జమదగ్ని 6. గౌతముడు 7. వశిష్టుడు

ఊర్ధ్వ లోకములు :

1. భూలోకము 2. భువర్లోకము 3. సువర్లోకము 4. మహర్లోకము 5. జనలోకము 6. తపోలోకము 7. సత్యలోకము

అధో లోకములు :

1. అతలలోకము 2. వితలలోకము 3. సుతల లోకము 4. రసాతలము 5. తలాతలము 6. మహాతలము 7. పాతాళ లోకము

నవధాన్యములు :

1. గోధుమలు 2. ధాన్యము 3. కందులు 4. పెసలు 5. శనగలు 6. బొబ్బర్లు 7. నువ్వులు 8. మినుములు 9. ఉలవలు

నవరత్నములు :

1. వజ్రము 2. వైఢూర్యము 3. నీలము 4. గోమేధికము 5. పుష్యరాగము 6. ముత్యము 7. పద్మరాగము (కెంపు) 8. పగడము (ప్రవాళము, 9. మరకతము (పచ్చ)


దశావతారములు :

1. మత్స్య 2. కూర్మ 3. వరాహ 4. నారసింహ 5. వామన 6. పరశురామ 7. రామ 8. కృష్ణ 9. బుద్ధ 10. కల్కి

ఏకాదశ రుద్రులు :

1.అజుడు 2. ఏకపాదుడు 3. అహోర్భ్యుద్యుడు 4. తృష్ణ 5. రుద్రుడు 6. హరుడు 7. శంభుడు 8. త్ర్యంబకుడు 9. ఈశానుడు 10. అపరాజితుడు 11. త్రిభువనుడు


ద్వాదశ ఆదిత్యులు :

1. ధాత 2. అర్యముడు 3. మిత్రుడు 4. వరుణుడు 5. ఇంద్రుడు 6. వివస్వంతుడు 7. అంశుమంతుడు 8. త్వష్ట 9. విష్ణువు 10. భగుడు 11. పూషుడు 12. క్రతువు

అష్టాదశ పురాణాలు :

1. బ్రహ్మ 2. పద్మ 3. విష్ణు 4. శివ 5. లింగ 6. గరుడ 7. అగ్ని 8. స్చంద 9. భవిష్య 10. బ్రహ్మవైవర్త 11. నారద 12. దేవీ భాగవతం 13. మార్కండేయ 14. వామన 15. వరాహ 16. మత్స్య 17. కూర్మ 18. బ్రహ్మాండ పురాణం

స్మృతులు :

1. మను 2. పరాశర 3. గౌతమ 4. వశిష్ట 5. లిఖిత 6. ఆపస్తంభ 7. శంభ 8. అత్రి 9. విష్ణు 10. హరిత 11. యమ 12. ఆంగీరస 13. బొధాయన 14. ఉశన 15. సంవర్త 16. బృహస్పతి 17. కాత్యాయన 18. దక్ష 19. వ్యాస 20. యాజ్ఞవల్క్య 21. శతాతర


అష్టాంగ యోగములు :

1. యమ 2. నియమ 3. ఆసన 4. ప్రాణాయామ 5. ప్రత్యహార 6. ధారణ 7. ధ్యాన 8. సమాధి.

అష్టలక్ష్ములు :

1. ధనలక్ష్మి 2. ధాన్యలక్ష్మి 3. ధైర్యలక్ష్మి 4. విజయలక్ష్మి 5. ఆదిలక్ష్మి 6. విద్యాలక్ష్మి 7. గజలక్ష్మి 8. సంతాన లక్ష్మి

అష్ట దిక్పాలకులు :

1. తూర్పు - ఇంద్రుడు 2. ఆగ్నేయం - అగ్ని 3. దక్షిణం - యముడు 4. నైఋతి - నిర్రుతి 5. పశ్చిమం - వరుణుడు 6. వాయవ్యం - వాయువు 7. ఉత్తరం - కుబేరుడు 8. ఈశాన్యం - ఈశానుడు.

No comments:

Post a Comment