23 November 2013

భగవద్గీత : 
దేవుణ్ణి పొందేందుకు అంటే పరమాత్మలో ఐక్యమయ్యేందుకు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కొన్ని మార్గాలను తెలిపాడు అవి :
1. కర్మ యోగం : మొదటగా ఈ కర్మలు మనం ఎందుకు చేయాలి. ఇవి అన్నియు
మనకు ఏమి సంబంధం? అంటే మనం ఎన్నో జన్మలనుండి అజ్ఞానంతో నేను అనే భావనతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు. వీటిని అన్నిటిని జ్ఞానంతో చేస్తే మనము వీటి నుండి సంపూర్ణంగా విముక్తి పొందుతాము. అదేలాగు అంటే కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మ అని అంటాము. అది ఏదైనా కావచ్చు. చేసే ప్రతి పనిని మనం ఈ శరీర భావనతో అజ్ఞానంలో వున్నప్పుడు చేస్తూ నేను చెస్తున్నాను అనుకుంటూ వుంటాము. ఆ విధంగా చేయడం వలన మనం మరల కర్మ బంధనాలను ప్రోగు చేసుకుంటున్నాము.కావున ఇక్కడ మనం గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే నీవు అన్నది ఎవరు? అని ఆలోచిస్తే నీవు అన్నది ఆత్మ మాత్రమే, నీవు అన్నది ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఏవి కావు. మరి ఆత్మ ఎప్పటికి ఏమి చేయదు అది అంతరంలో సాక్షి భూతంగా మాత్రం వుంటుంది తప్ప అది అంటూ ఏమి చేయదు. కావున దీనిని గ్రహించి చేసే ప్రతి పనిని నీవు భగవంతార్పణ బుద్దితో, ఫలాపేక్ష రహితుడవై, నిష్కల్మషంగా కర్మలను ఆచరించి వీటి అన్నిటి నుండి నీవు సంపూర్ణంగా విముక్తిని పొందడమే “ముక్తి” .ముక్తి అంటే పరమాత్మ సాగరంలో ఆత్మ ఐక్యం కావడం.ముక్తి పొందడం అంటే నీవు మరల ఈ కర్మ భూమికి రాకుండా (అంటే జన్మ లేకుండా) ఆ దేవదేవుడైన పరంధాముని లో విలీనం అవడం. ఈ విధంగా జ్ఞానంతో కర్మలను ఆచరించడాన్నే “కర్మయోగం” అంటారు.

2. జ్ఞాన యోగం: అసలు జ్ఞానం అంటే ఏమిటి ? జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు అయన పైన వుండి మనం అడిగినవన్నీ తీరుస్తాడు అనుకోవడం కూడ అజ్ఞానమే. మొదట తెలుసుకోవలసింది ఏమిటంటే నీవు ఏది కోరితే అది ఇస్తాడు. అది తీరుతుంది కాని దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు. అన్నది తెలుసుకోవడమే జ్ఞానం.ఈ విధంగా అత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరించడమే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం గ్రహించి నీ మనస్సులో నిర్మలంగా తెలుసుకుంటూ అవలంబిస్తే నీవు అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించి తెలుసుకోవడం మరియు తెలుసుకున్న దానిని అమలుపరచే దేనినే జ్ఞానయోగం అంటారు.

3. భక్తి యోగం : భక్తి అంటే భగవంతునిని మనస్సులో నిరంతరం స్మరించడమే భక్తి. కాని మనం ఎదో ఎప్పుడైనా కస్టాలు వచ్చినపుడు లేకపోతె ఏదైనా భయం అయినపుడు మాత్రం స్వామి ఆంజనేయ అనో లేక మరో వేరే దేవున్నో తలచుకోవం మనకు పరిపాటి. కాని ఇలా కాదు భక్తీ అంటే సంపూర్ణంగా, పరిపూర్ణంగా నీ మనస్సును ఆ పర్మమత్ముని యందే లగ్నం చేయడం. అప్పుడు అందరికి ఒక సందేహం అదేంటి ఎప్పుడు అయన యందే మనస్సును లగ్నం చేస్తే నేను చేయవలసిన పనులు ఎవరు చేస్తారు అనే సందేహం కదా.నీవు చేసే ఏ పనైనా సరే అది ఆయనే చేస్తున్నాడు అని భావించు ఎందుకంటే ఈ ప్రక్రుతి అంతా తానే అయి ఉన్నాడు ఆ విధంగా భావిస్తూ నీ మనస్సు అంతఃకరణాన్ని సుద్దపరచు. ఆ విధంగా నీవు నిరంతర స్మరణతో భక్తితో అన్ని పనులను ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నీ మనస్సుకు ఒక సంపూర్ణత భావం ఏర్పడి అది పరిశుద్దమవుతుంది. ఈ విధంగా ఎల్లవేళలా ఆయనను స్మరిస్తూ వుండడం వలన నీవు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఆయననే పొందుతావు ఆయనలోనే విలీనం అవుతావు. అదియే మోక్షం.

4. ధ్యాన యోగం : ధ్యాన యోగం అన్ని యోగాలకంటే చాల చాల ఉన్నతమైనది ఎందుకంటే శరీరముతో వున్నపుడు ఈ శరీరపు అంతరములో వున్న ఆ పరమాత్మునిని, ఆ దేవదేవుడిని పరిపూర్ణంగా దర్శించే భాగ్యం ఈ ఒక్క ధ్యాన యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే దీనిని రాజ యోగం అని కూడ అంటారు. ఎందుకంటే ధ్యాన యోగం అన్నది నిజంగా రాజు (king of the yoga’s) అందుకే దీనిని “రాజయోగం” అని కూడ అంటారు. ధ్యానం అంటే సాధన. సాధన అంటే ప్రతి రోజు ధ్యానం చేసుకోవడం. చాల మందికి అమ్మో ధ్యానం అంటే ఇది చాల కష్టం అని అనుకుంటారు ఎందుకంటే కూర్చుంటే చాలు అంతవరకూ లేని ఆలోచనలు కూడ వెన్ను తట్టి నిద్ర లేచినట్లుగా ఒక్కొక్కటి మన మనస్సులో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యం కాదులే వేరే యోగం అవలంబిస్తాం అనుకుంటారు. కాని అన్నిటికన్నా ధ్యానయోగం మాత్రం చాల శక్తివంతమైనది. ఇది అవలంబించిన వాళ్ళు అంతా మహానుభావులు అయ్యారు. ఎవరైనా సరే ఈ యోగాన్ని ప్రారంబిస్తే చాలు, నిదానంగా తన మనస్సు, బుద్ధి అన్నియు అతని అధీనంలోకి ఖచ్చితంగా వస్తాయి. కాని కొద్దిగా సమయం పడుతుంది.అయితే ప్రతిరోజూ ఖచ్చితంగా అవలంబిస్తే అవి తొందరగా అన్నియు అధీనంలోకి వచ్చి సమాధి స్తితి లోకి వెళ్ళవచ్చు. సమాధి స్తితికి వెళ్తే నీ మనస్సు దాదాపు 70% నీ అధీనంలో వుంటుంది.మనస్సును ఎలా అదుపు చేయాలి ధ్యానంలో? ఇది అందరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న.అవును నిజమే ఈ మనస్సు అంటే సముద్రంలో అలలమాదిరి, అయిన అటువంటి మనస్సును అదుపు చేయొచ్చు. ఎలా అంటే మొదట నీ మనస్సుకు ఒకే ఒకటి చెప్పు అదే, ఈ సమస్త లోకానికి కారణభూతుడైన ఆ దేవదేవుని దర్శనార్థం, ఆ భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించడం కోసం, ఈ సృష్టికి కారణమైన ఆ దేవదేవుడు ఈ శారేరంలోనే అంతరంలో ఉన్నాడు అది జ్యోతిర్లింగస్వరుపుడు అని దానికి చెప్పి నీ శరీరపు హృదయ స్పందన మీదకు నీ మనస్సును మరలుస్తూ అదే విదంగా ఒక దివ్య జ్యోతిని మాత్రమే నీ మనస్సులో ఊహించుకొని ప్రతి దినము చేస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు నీ చెప్పు చేతల్లోకి వస్తుంది.ఈ విధంగా జ్ఞాన మరియు వైరాగ్యాలతో నీ మనస్సును నీ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఆ విధంగా అవలంబించడాన్నే ధ్యాన యోగం అంటారు.ఎందఱో మహానుభావులు ఈ ధ్యాన యోగం ద్వార ఈ సమాజానికి జ్ఞాన బోధ చేశారు. ఎస్తుక్రీస్తు, బుద్దుడు, వివేకానంద స్వామి, రామక్రిష్ణ పరమహంస, రమణ మహర్షి ఇలా ఎందఱో ఎందెందరో అలా వారి స్తాయికి చేరే సంపూర్ణ అవకాశాలు నీకు వున్నాయి. కావున ఈ రోజే ప్రారంబించు . శాశ్వతమైన పరిశుద్దమైన ఆ పరమాత్మను నీ అంతరంలో దర్శించుకొని శరీరం ఉండగానే ముక్తుడవై నీ జన్మకు సార్ధకతను మరియు నీ జన్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చు.

ఓం నమో పరమాత్మయే నమః
దేవున్ని పొందేందుకు మార్గాలు :

1 comment: