30 October 2013

నారదమహర్షి :

నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు, విష్ణు భక్తుడు, దేవర్షి అని అందరికీ తెలిసినదే. ఆయన అనుగ్రహమే ప్రాతిపధికగా వాల్మీకి, వ్యాస మహర్షులు రామాయణ, భాగవతాది ఉత్కృష్ట రచనలు మనకు అందిచారు. నారదుడు అన్న పేరు గల వారు, పురాణేతిహాసాలలో ఏడుగురు కనిపిస్తారు.

బ్రహ్మ యొక్క మానస పుత్రుడు

పర్వతుడు అనబడే ఋషియొక్క మామగారు
వసిష్ఠుని భార్య ఐన అరుంధతికి సోదరుడు; లేదా సత్యవతి అనే ఆమెకు భర్త
ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, మొదట జగడాలకు తెర తీసినా, చివరికి అది లోక కల్యాణం వైపుకు దారి తీసేట్టు చేయువాడు
కుబేరుని సభాసదుడు
శ్రీరామచంద్రుని సభలో ఉన్న ఎనిమిది మంది ధర్మశాస్త్రవిదులలో ఒకడు
జనమేజేయుని సర్ప యాగం సదస్యులలో ఒకడు

ఇంతకీ అసలు నారదులవారు ఎవరు?

భగవంతుడు స్వయంగా ఎలా అవతరిస్తుంటారో, అలాగే కారణ జన్ములైన మహాపురుషులు కూడా లోకములో అప్పుడప్పుడూ అవతరించి ఆ భగవంతుడి లీలల కొరకు కావలసిన రంగాన్ని సిద్ధం చేయడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అలాంటి మహాపురుషులు అవిద్య, అహంకారము, మమకారములవంటి వికారాలు లేని ముక్త పురుషులై ఉండి కూడా, ముక్తులుగా కాక లోకంలోని జీవుల మధ్యలో తిరుగాడి వారి కల్యాణంకొరకై పాటుపడుతుంటారు. ప్రధానమైన భగవద్ అవతారం సంభవించినపుడు వీరి కార్యభారము పెరిగిపోతుంటుంది. వీరివలన జరిగే కార్యాలన్నీ భగవంతుడి కార్యాలే! అలాంటి మహాపురుషులలో, దేవర్షి నారదుడు ఒకరు. అన్ని యుగాలలో, అన్ని లోకాలలో, ప్రతీ శాస్త్రంలో, అన్ని సమాజాలలో, అన్ని పనుల్లో నారదునికి ప్రవేశమున్నట్టు తెలుస్తోంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరలలోనే కాక, ఈ ఘోర కలికాలంలో సైతం ఆయన ఉన్నట్టు; అర్హతగల భక్తులకు ఆ మహాభాగుని దర్శనం లభిస్తుంటుందని పెద్దలు చెబుతుంటారు.

అన్ని శాస్త్రాలలో మహాపండితుడు, సమస్త తత్త్వపరిజ్ఞాత, వ్యాఖ్యాత అయి ఉండీ, నారదుడు భక్తిమార్గాన్నే ప్రవర్తిల్ల చేసినట్టు తెలుస్తున్నది. వాల్మీకి, కృష్ణ ద్వైపాయనుడు, శుకయోగి, ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి మహానుభావులకు భక్తి మార్గంలో మార్గ దర్శకత్వం చేసినది ఈయనే కదా!

ఇంతకీ ఈయన ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం – స్వయంగా ఈయనే వ్యాసమహర్షికి తెలియజేసారు. రెండు కల్పాలకు సంబంధించిన చరిత్ర శ్రీమద్భాగవతంలో కనబడుతుంది.

దివ్య దృష్టి సంపన్నుడైన వేదవ్యాసమహర్షి, లోక కల్యాణార్థమై వేదములను నాలుగు భాగములుగా విభాగించాడు. పంచమవేదమైన మహాభారతాన్ని – ఎన్నో ఆఖ్యాన, ఉపాఖ్యానాలతో లోకాలకు అందించాడు. పురాణాలను రచించాడు. ఐనా తృప్తి కలుగక పరిపూర్ణ శాంతిని పొందలేదు. ఏదో తక్కువ ఐనట్టు వ్యథ చెందుతున్నప్పుడు, నారద మహర్షి అక్కడికి చేరుకొంటారు. తన పరిస్థితిని తెలియజేసి నివారణోపాయాన్ని వ్యాసుడు తెలియజేయమని కోరుకుంటాడు. అప్పుడు నారదులవారు, తన అన్ని రచనలలో ధర్మాలను వివరించిన విధంగా, (అంటే ధర్మబోధయే ప్రధాన లక్ష్యం) భగవంతుని కీర్తిని కీర్తించలేదు కాబట్టి తనకు అలా వెలితిగా తోస్తున్నదని తెలియజేసి, తన పూర్వ వృత్తాంతాన్ని తెలిపి, వ్యాసుడిని శ్రీమద్భాగవత రచన చేయవలసినదిగా సెలవిస్తారు. అలా నారదుల వారు వ్యాసుడికి తెలిపిన తన వృత్తాంతం…

మహానుభావా! నేను గడిచిన కల్పంలో గత జన్మంలో – ఒక దాసీ పుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇండ్లలో పని చేస్తూ ఉండేది. నేను ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొని ఆ మహానుభావులకి పరిచర్య చేసే వాణ్ణి.

ఓ పుణ్య చరిత్రా! ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోడిపిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధమూ, పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని ఆరాధించేవాణ్ణి. నేనా వేదవేత్తలు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి. ఎండనీ వాననీ లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారు మాటాడకుండా వారి ఆజ్ఞలు నెరవేర్చేవాణ్ణి.

ఈ ప్రకారంగా వర్షాకాలమూ, శరత్కాలమూ గడిచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణమూ ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే శబ్దాలు అమృత రసప్రవాహాలై నాకు వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నింటికీ స్వస్తి చెప్పి భక్తితో భగవంతుడైన హరిని ఆరాధించడం ఆరంభించాను. అప్పుడు నాకు హరిసేవలో అత్యంతమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి, బ్రహ్మ స్వరూపుణ్ణీ అయిన నా యందు, స్థూలమూ సూక్ష్మమూ అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితం అని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల రజస్తమోగుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళటానికి ఉద్యుక్తులైనారు.

ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులూ రాకుండా, చాంచల్యం లేకుండా ముప్పూటలా భక్తితో ఆరాధీంచినందుకు ఆ సాధుపుంగవులు సంప్రీతులైనారు. ఎంతో సంతోషంతో, ఎంతో కారుణ్యంతో ఎంతో వాత్సల్యంతో అతిరహస్యమూ, అమోఘమూ అయిన ఈశ్వరజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు. నేనుకూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల దేవాదిదేవుడైన వాసుదేవుని మాయాప్రభావం తెలుసుకున్నాను. ఈశ్వరార్పణం చేసిన కర్మమే తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం. లోకంలో ఏ పదార్థం వల్ల ఏ రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పొగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స జరిగితే కానీ ఆ రోగం శాంతించదు.

ఈ ప్రకారంగా కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ, ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీకృష్ణ గుణ నామాలను కీర్తించటంలో, సంస్మరించటంలో ఆసక్తులౌతారు.

ఓంకారపూర్వకంగా వాసుదేవ – ప్రద్యుమ్న – సంకర్షణ – అనిరుద్ధ నామాలు, నాలుగూ భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్దర్శనుడై సమదృష్టి కలవాడౌతాడు. నేను ఈ విధంగా ప్రవర్తించినందువల్ల విష్ణుభగవానుడు విశిష్టమైన ఈశ్వరజ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. నా నడవడి నారాయణ మూర్తికి తెలుసు. వ్యాస మహర్షీ! నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు.

మునులలో అగ్రేసరుడవు. ఎంతో ఎరుక కలవాడవు. వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతాలకు శాంతి లభించేటట్లు నీవు చక్కగా వాసుదేవుని యశోగాథలను సంస్తుతించు. ఈ విధంగా నారదమునీంద్రుడు తన పుట్టు పూర్వోత్తరాలు వినిపించగా ఆలకించి, వ్యాసముని నారదుణ్ణి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు.

అయ్యా! మహానుభావులైన ఆ సాధువులు ఎంతో దయతో నీకు ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు గదా! ఆ తరువాత నీ బాల్యం ఎలా గడిచింది? దాసీ పుత్రుడవైన నీవు ఏ ప్రకారంగా నీ దేహాన్ని త్యజించావు? దయచేసి వివరించు.

వ్యాసులవారు అడిగిన ప్రశ్నలకు నారదులవారు ఇలా సమాధానం చెప్పారు.

ఆ విధంగా నేను ఆ సాధుపుంగవుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొందిన సంగతి విన్నారు కదా! మా తల్లిది చాలా జాలిగుండె. ఉత్త అమాయకురాలు. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ వరుసగా చేసేది. తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేదికాదు. నేనంటే ఆమెకు పంచప్రాణాలు. “అయ్యో! నా బిడ్డ అలసిపోయాడు, సొలసిపోయాడు, ఆకలి గొన్నాడూ” అని అంటూ రేపులూ మాపులూ అల్లారుముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్దచేసింది. ఎంతో ప్రేమగా మాటి మాటికీ నా బుగ్గలు ముద్దుపెట్టుకొనేది. నా జుట్టు దెవ్వేది. నా ఒళ్ళు నిమిరేది. నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకొనేది. ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచి పోలేక ఇంట్లోనే ఉండిపోయాను.

అయితే నేను సంసారవ్యామోహంలో చిక్కు బడలేదు. జ్ఞానాన్ని కోల్పోలేదు. విషయాంతర వ్యాసక్తుణ్ణి కాలేదు. పంచ వర్షప్రాయం గల నేను అలాగే మా అమ్మను కనిపెట్టుకొని మౌనంగా ఆ బ్రాహ్మణుల ఇండ్లలో కొన్నాళ్ళు గడిపాను.

వ్యాస మునీంద్రా! ఒకనాడు ఏమి జరిగిందంటే మా అమ్మ రాత్రివేళ కటిక చీకటిలో ఆవును పాలు పిండటం కోసం ఇల్లు వదిలి బయటికి వెళ్ళింది. త్రోవలో ఆమె ఒక పామును త్రొక్కింది. ఆ సర్పం ఆమె పాదాన్ని కరిచింది. అత్యంత భయంకరమైన ఆ త్రాచుపాము కోరలలోని విషాగ్ని జ్వాలల వల్ల అమ్మ నేల మీద పడిపోయింది. అలా మా అమ్మ క్రిందపడి విలవిల తన్నుకొని ప్రాణాలు విడిచింది. అప్పుడు నేను ఆ విషాద దృశ్యాన్ని చూచి ఏ మాత్రం కలవరపడకుండా, నా చిత్తం శోకాయత్తం కాకుండా, నిబ్బరించుకొని నిలబడ్డాను. ‘మంచిది; బంధం తెగిపోయింది’ అనుకొన్నాను. ఇక నాకు హరి చరణ స్మరణమే అవశ్య కర్తవ్యమని నిర్ణయించుకొన్నాను.

ఆ విధంగా అనుకొని నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి పల్లెలూ, పట్టణాలూ, నగరాలూ, జనపదాలూ, గ్రామాలూ, పేటలూ, భిల్లవాటికలూ దాటుకొంటూ; ఆటవికులు నివసించే చిట్టడవులూ, రంగు రంగుల ధాతువులతో కూడిన పర్వతాలూ, మదించిన ఏనుగులు కదిలించే విదిలించే కొమ్మలు గల మహావృక్షాలూ, బాటసారుల మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలూ, నానావిధాలైన పక్షుల కలకలా రావాలతో రమణీయమై వికసించిన తామరపూలలోని మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమీంచే గండుతుమ్మెదలతో నిండిన సరస్సులూ అతిక్రమిస్తూ ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలీ దప్పికా అతిశయించాయి. ఒక యేటి మడుగులో శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకొన్నాను.

తోడేళ్ళూ, కోతులూ, ఎలుగుబంట్లూ, వనవరాహాలూ, ఏనుగులూ, మహిషాలూ, ఏదుపందులు, గుడ్లగూబలూ, శరభమృగాలూ, శార్దూలాలూ, కుందేళ్ళూ, మనుబోతులూ, ఖడ్గమృగాలూ, క్రూరసర్పాలూ, కొండచిలువలూ నిండిన భయంకరారణ్యాల గుండా మళ్ళీ ప్రయాణించాను.

దాట శక్యం కాని నీలి తుప్పలతో కూడిన వెదురు పొదరిండ్ల దగ్గిరరగా ఒక రావిచెట్టు క్రింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసికొన్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను.

నా కన్నుల్లో ఆనందబాష్పాలు పొంగిపొరలాయి. నా శరీరమంతా పులకించిపోయింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైంది.

నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్ళీ ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరిగాను. కాని నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో వాచామగోచరుడైన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి.

నాయనా! ఎందుకు వృథాగా ఆయాసపడతావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలితకర్ములైన ముని ముఖ్యులే నన్ను చూడగలుగుతారు. అంతే కాని జితేంద్రియులు కాని వారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణ కాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. వత్సా! నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలూ దూరమౌతాయి. నన్ను సేవించటం వల్ల నా భక్తి అచిరకాలంలోనే నీ మదిలో పదిలమౌతుంది. కుమారా! నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదలిన అనంతరం నా అనుజ్ఞతో మళ్ళీ జన్మలో నా భక్తుడవై ఉద్భవిస్తావు. విను చిట్టితండ్రీ! ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్ళీ జన్మిస్తావు. నీకు పూర్వ స్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్య గుణసంపన్నులైన హరి భక్తులలో అగ్రగణ్యుడవై పేరెన్నిక గంటావు.

ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి, సర్వనియంత, వేదమయంబయిన ఆ మహాభూతానికి నేను తలవంచి మ్రొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను. మాత్సర్యాన్ని దిగనాడాను. కామాన్ని నిర్జించాను. క్రోధాన్ని వర్జించాను. లోభాన్ని, మోహాన్ని పారద్రోలాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమపవిత్రాలయిన హరి చరిత్రాలను స్మరిస్తూ నిత్యసంతుష్టుడినై వాసుదేవుని హృదయంలో పదిలపరచుకొన్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగసాగాను. కొన్నాళ్ళకు మెరుపు మెరిసినట్టుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమయింది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్త్వగుణాత్మకమైన భాగవతదేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవ జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని విశ్వాసంతో పాటు నేనూ భగవానుని ఉదరంలో ప్రవేశించాను. వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించబోయే బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలయిన మునులూ, నేనూ జన్మించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై, భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై, పరబ్రహ్మ ప్రతిపాదకాలైన సప్తస్వరాలు తమంతట తామే మ్రోగే ఈ “మహతీ” వీణ మీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను.

తీర్థపాదుడైన దేవాది దేవుడు వాసుదేవుడు. నేను ఆయన లీలలను గానం చేసినప్పుడు పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో అచ్చు గ్రుద్దినట్లు కానవచ్చేవాడు.

ఓ వ్యాసమునీంద్రా! ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే క్రిందుమీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టు చేర్చే తెప్పవంటిది.

యమమూ, నియమమూ, ప్రాణాయామమూ, ప్రత్యాహారమూ మొదలైన అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకొన్నప్పటికీ కామమూ, రోషమూ మొదలైన వానిచే అది మాటి మాటికీ రెచ్చిపోతూనే ఉంటుంది. కాని శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. మునికులభూషణా! నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను.

అని ఈ ప్రకారంగా పరమపూజ్యుడైన బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు బాదరాయణ మునింద్రునితో పలికి వీడ్కోలందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్ళిపోయాడు.
నారదమహర్షి :

నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు, విష్ణు భక్తుడు, దేవర్షి అని అందరికీ తెలిసినదే. ఆయన అనుగ్రహమే ప్రాతిపధికగా వాల్మీకి, వ్యాస మహర్షులు రామాయణ, భాగవతాది ఉత్కృష్ట రచనలు మనకు అందిచారు. నారదుడు అన్న పేరు గల వారు, పురాణేతిహాసాలలో ఏడుగురు కనిపిస్తారు.

బ్రహ్మ యొక్క మానస పుత్రుడు
పర్వతుడు అనబడే ఋషియొక్క మామగారు
వసిష్ఠుని భార్య ఐన అరుంధతికి సోదరుడు; లేదా సత్యవతి అనే ఆమెకు భర్త
ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, మొదట జగడాలకు తెర తీసినా, చివరికి అది లోక కల్యాణం వైపుకు దారి తీసేట్టు చేయువాడు
కుబేరుని సభాసదుడు
శ్రీరామచంద్రుని సభలో ఉన్న ఎనిమిది మంది ధర్మశాస్త్రవిదులలో ఒకడు
జనమేజేయుని సర్ప యాగం సదస్యులలో ఒకడు

ఇంతకీ అసలు నారదులవారు ఎవరు?

భగవంతుడు స్వయంగా ఎలా అవతరిస్తుంటారో, అలాగే కారణ జన్ములైన మహాపురుషులు కూడా లోకములో అప్పుడప్పుడూ అవతరించి ఆ భగవంతుడి లీలల కొరకు కావలసిన రంగాన్ని సిద్ధం చేయడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అలాంటి మహాపురుషులు అవిద్య, అహంకారము, మమకారములవంటి వికారాలు లేని ముక్త పురుషులై ఉండి కూడా, ముక్తులుగా కాక లోకంలోని జీవుల మధ్యలో తిరుగాడి వారి కల్యాణంకొరకై పాటుపడుతుంటారు. ప్రధానమైన భగవద్ అవతారం సంభవించినపుడు వీరి కార్యభారము పెరిగిపోతుంటుంది. వీరివలన జరిగే కార్యాలన్నీ భగవంతుడి కార్యాలే! అలాంటి మహాపురుషులలో, దేవర్షి నారదుడు ఒకరు. అన్ని యుగాలలో, అన్ని లోకాలలో, ప్రతీ శాస్త్రంలో, అన్ని సమాజాలలో, అన్ని పనుల్లో నారదునికి ప్రవేశమున్నట్టు తెలుస్తోంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరలలోనే కాక, ఈ ఘోర కలికాలంలో సైతం ఆయన ఉన్నట్టు; అర్హతగల భక్తులకు ఆ మహాభాగుని దర్శనం లభిస్తుంటుందని పెద్దలు చెబుతుంటారు.

అన్ని శాస్త్రాలలో మహాపండితుడు, సమస్త తత్త్వపరిజ్ఞాత, వ్యాఖ్యాత అయి ఉండీ, నారదుడు భక్తిమార్గాన్నే ప్రవర్తిల్ల చేసినట్టు తెలుస్తున్నది. వాల్మీకి, కృష్ణ ద్వైపాయనుడు, శుకయోగి, ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి మహానుభావులకు భక్తి మార్గంలో మార్గ దర్శకత్వం చేసినది ఈయనే కదా!

ఇంతకీ ఈయన ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం – స్వయంగా ఈయనే వ్యాసమహర్షికి తెలియజేసారు. రెండు కల్పాలకు సంబంధించిన చరిత్ర శ్రీమద్భాగవతంలో కనబడుతుంది.

దివ్య దృష్టి సంపన్నుడైన వేదవ్యాసమహర్షి, లోక కల్యాణార్థమై వేదములను నాలుగు భాగములుగా విభాగించాడు. పంచమవేదమైన మహాభారతాన్ని – ఎన్నో ఆఖ్యాన, ఉపాఖ్యానాలతో లోకాలకు అందించాడు. పురాణాలను రచించాడు. ఐనా తృప్తి కలుగక పరిపూర్ణ శాంతిని పొందలేదు. ఏదో తక్కువ ఐనట్టు వ్యథ చెందుతున్నప్పుడు, నారద మహర్షి అక్కడికి చేరుకొంటారు. తన పరిస్థితిని తెలియజేసి నివారణోపాయాన్ని వ్యాసుడు తెలియజేయమని కోరుకుంటాడు. అప్పుడు నారదులవారు, తన అన్ని రచనలలో ధర్మాలను వివరించిన విధంగా, (అంటే ధర్మబోధయే ప్రధాన లక్ష్యం) భగవంతుని కీర్తిని కీర్తించలేదు కాబట్టి తనకు అలా వెలితిగా తోస్తున్నదని తెలియజేసి, తన పూర్వ వృత్తాంతాన్ని తెలిపి, వ్యాసుడిని శ్రీమద్భాగవత రచన చేయవలసినదిగా సెలవిస్తారు. అలా నారదుల వారు వ్యాసుడికి తెలిపిన తన వృత్తాంతం…

మహానుభావా! నేను గడిచిన కల్పంలో గత జన్మంలో – ఒక దాసీ పుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇండ్లలో పని చేస్తూ ఉండేది. నేను ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొని ఆ మహానుభావులకి పరిచర్య చేసే వాణ్ణి.

ఓ పుణ్య చరిత్రా! ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోడిపిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధమూ, పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని ఆరాధించేవాణ్ణి. నేనా వేదవేత్తలు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి. ఎండనీ వాననీ లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారు మాటాడకుండా వారి ఆజ్ఞలు నెరవేర్చేవాణ్ణి.

ఈ ప్రకారంగా వర్షాకాలమూ, శరత్కాలమూ గడిచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణమూ ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే శబ్దాలు అమృత రసప్రవాహాలై నాకు వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నింటికీ స్వస్తి చెప్పి భక్తితో భగవంతుడైన హరిని ఆరాధించడం ఆరంభించాను. అప్పుడు నాకు హరిసేవలో అత్యంతమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి, బ

No comments:

Post a Comment