30 October 2013

పుణ్యకర్మలతో శుభ ఫలితాన్ని పెంచుకోవచ్చు :

పరిహార ప్రక్రియలు పాటిస్తే జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తి పొందగలం. అందుకే జపం, దానం, హోమం, శాంతి, దేవాలయ దర్శనం.ఇవి చేయడానికి ముందు మరికొన్ని విషయాలు తెల్సుకొని అప్పుడు పాటించడం మంచిది. భాః అంటే కాంతి. కాంతి విజ్ఞానానికి, ఆనందానికి, పరమాత్మకు సంకేతం. దానియందు ప్రీతిగల వారే భారతీయులు. కర్మ సిద్ధాంతం అంటే (ఈ జన్మలో కాని పూర్వ జన్మలో కాని) తాను చేసిన పనికి ఫలితం తానే అనుభవించాలి అని కొందరి భావన. కాని చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించటం సార్వత్రిక నియమం కాదు. అప్పు చేసినవాడు తీర్చకపోతే జైలుకు వెళ్ళటం కర్మఫలితంగా భావిస్తే ‘తీర్చటం’ అనే ప్రక్రియ జైలుకు పోకుండా కాపాడుతుంది. అంటే పూర్వం చేసిన కర్మను అనుభవించటం ఒక మార్గమైతే దానిని నిరోధించటం కోసం మరో కర్మ చేయటం ఇంకో మార్గం. కాగా జాతకం లో ఉన్నది తప్పక అనుభవించాలి అనే భావన సరైంది కాదు.

బృహజ్జాతక వ్యాఖ్యాత భట్టోత్పలుడు ‘జాతక ఫలితాన్ని అనుభవించుటే తప్పనిసరి అయితే దానిని తె లుసుకోవటం వ్యర్ధం. భావి ఫలితాన్ని ముందుగా తెలుసుకోవటం చేత, క్రియాశీలత లో పించడం భావి దుష్ఫలితాన్ని ముందుగా రాబో యే కోసం ఇప్పటి నుండి దుఃఖించడం అనే నష్టాలుండడం వల్ల జాత క ఫలితం తెలుసుకోవడమే నష్టప్రదం అవుతుంది. శాస్త్ర ప్రయోజనం అది కాదు. ఒక జాతకంలో శుభ ఫలితాన్ని తెలుసుకొని దానికి అనుగుణమైన కృషి చేయటం ద్వారా ఫలితాన్ని సంపూర్ణంగా సాధించవచ్చు. విశేషించి దానాదికములైన పుణ్యకర్మల ద్వారా శుభ ఫలితాన్ని పెంచుకోవచ్చు.

దుష్టఫలితాన్ని ముందుగా తెలుసుకోవటం ద్వారా దానికి వ్యతిరేక దిశలో ప్రయత్నించి దుష్టఫలితాన్ని జయించవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. ఆ దోష ప్రాబల్య శాతాన్ని గమనించి దాన్ని జ యించడం శక్యం కాని పక్షంలో దానికి సిద్ధపడి తన జీవన గమనంలో అనుగుణమైన మార్పులు చేసుకోవచ్చు’ అని వివరించాడు. కర్మ ఫలితం ఉంటుంది. అది దుష్టమైనదైనపుడు దాని నివారణకు చేసే కర్మకూ ఫలితం ఉంటుంది. కర్మను కర్మచేతనే జయించాలి. పూర్వం చేసిన కర్మను దానివల్ల వచ్చే ఫలితాన్ని అదృష్టమని, దైవికమని పిలుస్తుంటా రు.

‘విహన్యాద్దుర్బలం దైవం పురుషేన విపశ్చితా’ అనే వ్యాసుని వచనం పూర్వకర్మను ప్రస్తుత కర్మచే జయించవచ్చనే అభిప్రాయా న్ని బలపరుస్తుంది. మనమిదివరలో చేసిన కర్మననుసరించి మన జననం సంభవిస్తుంది. మన జననం మన చేతిలో లేదు కానీ అప్పటి గ్రహస్థితి పూర్వకర్మకు అనుగుణంగా ఉం టుంది. ఆ గ్రహ స్థితి ప్రభావం కాలక్రమం లో దశాక్రమాన్ననుసరించి ఆయా భావనల ను ప్రేరేపిస్తుంది. ప్రేరేపించబడిన భావనకు స్పందించిన వ్యక్తి తన భావాలను అనుసరిం చి ప్రవర్తించకుండా శాస్త్రం, సామాజిక న్యా యం, అనుభవం ఆధారంగా చేసుకొని వివేకంతో ప్రవర్తించి మంచిని పెంచుకోవడం, చెడును తొలగించుకోవడం చేయవలసి ఉంటుంది.

దిష ఫలితం సిద్ధంచే సమయాన్ని జాతకం తెలుపుతుంది. దానిని ముందుగా గుర్తించ డం ద్వారా దానిని జయించే అవకాశా న్ని జాతకం కల్పిస్తుంది. ‘యదుపచితమన్య జన్మని శుభ శుభం తస్య కర్మణః పంక్తిం వ్యం జయతి శాస్త్రమేతత్‌ తమసి ద్రవ్యాణి దీపమేవ’ అన్నారు వరాహమిహిరుడు. పూర్వ జన్మ లో చేసిన శుభాశుభ కర్మల ఫలానుభవ కాలాలాను ఈ శాస్త్రం సూచిస్తుంది. చీకటిలేని వస్తువులను దీపం సహాయంతో గుర్తించినట్లుగా కలుగబోయే శుభాశుభాలను జాతకం ద్వారా గుర్తించి అనుకూ ల వ్యతిరేక ప్రక్రియల ద్వారా జీవితాన్ని సుఖవంతం చేసుకోవటానికి ఈ శాస్త్రం సహకరిస్తుంది.

కర్మ 3 విధాలు. ప్రారబ్ధం, సంచితం, ఆగామి. ప్రారబ్ధం అంటే - పూర్వజన్మలో మనం చేసిన కర్మకు ఫలితం అనుభవించడం. ప్ర-ఆరబ్ధం... ఇంతకు ముందే ఆరంభింపబడింది. దానిని జయించశక్యం కాదు. విడిచిపెట్టిన బాణం మార్గాన్ని మళ్ళించడం అంత సులభం కాదు. సంచితం.. సంచితకర్మ అంటే పూర్వం చేసినది, నిల్వ ఉండడం. ఆగామి అంటే రాబోయే కాలంలో పరిపక్వమయ్యేది. మన సత్ప్రవర్తన ద్వారా ఆగామిని మంచిగా మలచుకోవచ్చు. మన ప్రతిక్రియల ద్వారా దుష్టమైన సంచిత కర్మను తొలగించుకోవచ్చు. దుష్టదశ వచ్చే వరకూ ఆగి దుష్టఫలితాన్ని అనుభవించడం ప్రారంభించిన తర్వాత దాన్ని తొలగించుకోవడం అనేది అనారోగ్యం వచ్చాక మందు పుచ్చుకోవడం లాంటిది. జాత కం ద్వారా రాబోయే దుష్టఫలాన్ని ముందుగా గుర్తించి అష్టమవర్గ ద్వారా దాని శాతాన్ని గుర్తించి దుష్టఫలితానికి వ్యతిరేకంగా మనం చేయవలసిన కృషిని అంచనా వేసుకొని ఆధ్యాత్మిక లౌకిక ప్రయత్నాల ద్వారా కృషి చేసి దుష్ఫలితాన్ని అధిగమించవచ్చు.

ఉదాహరణకి నిన్న ఒక వ్యక్తి మనం కొట్టాం. ఈ రోజు అతను మనని కొట్టేందుకు 10 మం దిని వెంటేసుకు వస్తున్నాడు. ఈ విషయా న్ని ముందుగా తెల్సుకుని మనం అతని చేతిలో దెబ్బలు తినటం తప్పనిసరి అని తెలిస్తే మూ డు విధాలుగా దానిని అధిగమించవచ్చు.

1. అతను ఎన్నింటికి వస్తున్నాడో తెలుసుకొని అతను వచ్చే ముందే అతనికన్నా ఎక్కువ బలగంతో వెళ్లి క్షమాపణ కోరడం ఒక మార్గం. జాతకంలో అన్ని దుష్టఫలితం శాతాన్ని గమనించి దానాదుల ద్వారా దానికన్నా ఎక్కువ పుణ్యాన్ని సంపాదించి గతంలో తాను చేసిన అపరాధాలను క్షమించమని ప్రార్థించేటువంటిది ఇది. దీనిలో సాత్వికత, ప్రశాంతి ఉన్నాయి.
2. ఎదుటివాడు 10మందితో వస్తే అతన్ని జయించే విధంగా ఇంకా ఎక్కువమందితో వెళ్లి ఎదరించడం ఇంకో పద్ధతి. జాతకంలో దుష్టసమయాన్ని గుర్తించి లౌకకమైన కృషిని పెంచి దుష్టఫలితాన్ని అదిగమించే ప్రయత్నం చేయ డం ఇలాంటిదే. దీనిలో ఉద్రేకం, కొంత దెబ్బలు తగలడం వంటి నష్టాలు కూడా ఉన్నాయి.
3. అతను వచ్చే సమయానికి అతనికి కనిపించకుండా దాక్కోవడం. దీనిలో మానసిక భీతి, ఆందోళన ఉన్నాయి. మనకు జాతకంలో వచ్చే దుష్టసమయాన్ని గుర్తించి నూతన ప్రయత్నాలు చేయకపోవడం. దీనిలో అశాంతి, దుఃఖ భావన, నిరుత్సాహం ఉంటాయి. ఆ విధంగా చేసే 3 ప్ర క్రియలలోనూ ‘రాబోయే దుష్టఫలితాన్ని ముం దుగా గుర్తించగలగడం తప్పనిసరి. జాతకం ఒక్కటే మార్గం కాగా కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా జాతకం ద్వారా మన జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశాలను జ్యోతిషశాస్త్రం అనే కరదీపిక చూపుతోంది.

కనుక మన జాతకంలో రాబోయే చెడ్డ సమయాన్ని కానీ, నడుస్తు న్న చెడ్డ సమయాన్ని గాని గుర్తించి (ఏమి చేసినా కలిసి రావటం లేదు, సమస్యలు, చిక్కులు, డిప్రెషన్‌ మొదలైన సమస్యలు ఏవైనా సరే) జాతకా న్ని వేయించుకొని (మన తలరాతలు మార్చే శక్తి ఈ శాస్త్రానికి లేకపోయినా ఏ సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకొని ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడేయించే పరిస్థితులు మనకు కల్పిస్తుంది. చీకటిలో టార్చ్‌లా పడవకి చుక్కానిలా.. మనిషికి మార్గాన్ని నిర్దేశిస్తుంది). దానికి తగిన పరిహారాలు ‘జపం, దానం, హోమం, శాంతి, ఓషధులు, రత్నధారణ, మొక్కల పెంప కం, దేవాలయ దర్శనం, మంత్ర జపం’ మొదలైనవి పాటిస్తూ.. వాస్తుపరంగా చిన్న చిన్న మార్పుల్ని చేసుకొని జీవితాన్ని ఆనందకరంగా మార్చుకోగలరు. జ్వరం వస్తే డాక్టర్‌ దగ్గరకు వెళ్ళి మం దు వేసుకున్నట్టే ఏదన్నా సమస్యలు వస్తే జ్యోతిష్కుని సంప్రదించి పరిహారాలు పాటించి ఉపశమనం పొందవచ్చు.

No comments:

Post a Comment