జ్యోతిషం :-
మానవునకు భగవంతుడిచ్చిన విఙ్ఞానసంపద అపౌరుషేయాలైన వేదాలు. వాటిని మించిన విఙ్ఞానం ఈ సృష్టిలో మరొకటి లేదు. శిక్ష - వ్యాకరణం - ఛందస్సు - నిరుక్తము - జ్యోతిషము - కల్పము అనునవి ‘వేదాంగములు.’ ఈ ఆరు శాస్త్రములు మానవుని అభ్యుదయానికి పట్టుకొమ్మలు. భవిష్యద్రష్ఠలైన ఋషులు ఈ ఆరు శాస్త్రాలను తమ తపశ్శక్తితో, మనోనేత్రంతో దర్శించి మానవాళికి అర్పించి మహోపకారం చేసారు.
కానీ., నేటి ఆదునిక విఙ్ఞానమిచ్చిన మత్తులో, తమంతటివారు లేరనే అహంకారంతో, కొందరు మేథావంతులు వేదాలను విమర్శిస్తూ, ‘జ్యోతిష్యం ఓ అంథవిశ్వాసం...మూఢనమ్మకం’ అంటూ బురద జల్లుతున్నారు. అది వారి అఙ్ఞానానికి నిదర్శనమే కానీ..ఈ శాస్త్రానికి వచ్చే నష్టం ఏమీలేదు. సరే... ఇక ఈ శాస్త్ర విషయానికి వస్తే.. వేదపురుషునకు నేత్రస్థానమే..ఈ ‘జ్యోతిశ్శాస్త్రము’. ఈ నేత్రము ద్వారా, మానవుడు తన జీవితము నందలి భూత, భవిష్యత్, వర్తమానములను అవగాహన చేసుకొని, వాటికి అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుని, సుఖవంతమైన జీవితానికి మార్గాలు వేసుకుంటాడు.

‘ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం జరిగేది జరగక మానదు కదా..ఇక
భవిష్యత్తు తెలుసుకుని మాత్రం చేసేదేముంది’ అనే మెట్ట వేదాంతులకు నేను
చెప్పేది ఒక్కటే. ఆకాశం కారు మేఘావృతమైనప్పుడు, వర్షం పడుతుందేమోనన్న
భావనతో కూడా ఓ గొడుగు తీసుకుని వెడతాం. వర్షం పడచ్చు., పడకపోవచ్చు. ఒకవేళ
పడితే..వర్షం నుంచి ఆ గొడుగు నిన్ను రక్షిస్తుంది. జ్యోతిశ్శాస్త్రము ఇచ్చే
రక్షణ కూడా అటువంటిదే. చీకటిలో నడిచే వ్యక్తి.. తనతోపాటు ఓ బ్యాటరీలైట్
తీసుకుని వెడతాడు. ఎందుకు? దారి చక్కగా కనబడడానికి, చీకటిలో ప్రమాదాల బారిన
పడకుండా ఉండడానికి. అంతమాత్రాన ఆ వ్యక్తిని మూర్ఖుడని, అంథవిశ్వాసి అని
అనుకోవడం మన మూర్ఖత్వానికి నిదర్శనం. ఈ దృష్టితో ఈ శాస్త్రాన్ని
పరిశీలించాలి. వేదపురుషునకు ‘జ్యోతిషము’ నేత్రమైతే...ఈ జ్యోతిషానికి.,
సూర్య, చంద్రులు నేత్రాలు. తక్కిన ప్రథాన గ్రహాలయిన గురు, శుక్ర, బుధ, కుజ,
శనులు., పంచ భూతాలకూ ప్రతినిధులు. ఇక మిగిలిన రాహు, కేతువులు.,
భౌతికరూపాలు లేని ఛాయాగ్రహాలు మాత్రమే. ఈ భూమిపై జన్మించే, ప్రతి ప్రాణి
జీవనగతులను నిర్దేశించేవి ఈ నవగ్రహాలే. జీవుడు., తన ప్రారబ్ధ కర్మనుసారంగా,
ఈ భూమిపై జన్మించి, కష్ట,సుఖములను అనుభవించుచున్నాడు. వాటికి
న్యాయనిర్ణేతలు ఈ నవగ్రహాలే.
శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు. దానిని సరిగ్గా అర్థం చేసుకోలేని మిడిమిడి ఙ్ఞానంగల కుహనా పండితులవల్ల, ఈ శాస్త్రానికి కళంకం అంటుకుంటోందే కానీ..ఈ శాస్త్రం ఎప్పుడూ సత్యాలనే వక్కాణిస్తుంది. వైద్యశాస్తం మీద పట్టులేని ఓ వైద్యుని కారణంగా., ఆ శాస్త్రానే దూషించడం తప్పు. గ్రహాల స్థితిగతులను సరిగ్గా లెక్కించి, తార్కికదృష్టితో భవిష్యత్తును పరిశీలించగల సిద్ధాంతిని ఆశ్రయించాలి. వారు చెప్పిన సూత్రాలను చక్కగా పాటించాలి. అప్పుడే..ఈ శాస్త్రంయొక్క ఫలితాలను చక్కగా అందుకోగలరు. నేటి ఆధునిక సూక్ష్మదర్శినులు లేని ప్రాచీనకాలంలో..మన పూర్వులు కళ్ళు మూసుకుని, కేవలం వేళ్ళమీద లెక్కలు కట్టి, ఖగోళంలోని గ్రహాల స్థితిగతులను, వాటి మధ్యనున్న దూరాన్ని, వాటి గమన వేగాన్ని,అక్కడి వాతావరణ వివరాలను చెప్పడమే కాకుండా.,ఎన్ని గంటల ఎన్ని నిముషాలకు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయో కచ్చితంగా చెప్పగలిగారంటే..ఈ జ్యోతిశ్శాస్త్ర పరిఙ్ఞానంతోనే కదా. అటువంటప్పుడు ఈ శాస్త్రం భూటకం ఎందుకు అవుతుంది ? ఆధునిక విఙ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా...అంతరిక్షంలోకి, అంతరిక్షనౌకలను పంపేటప్పుడు కూడా...మంచి ముహూర్తం చూసే పంపుతూండడం గమనార్హం. ఈ విషయాన్ని విఙ్ఞానవేత్తల మని విర్రవీగే మేథావంతులు గుర్తించమని మనవి.

No comments:
Post a Comment