24 September 2015

జగద్గురువు శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం ( కాలడి ) :-

కేరళలో గురువాయూర్ కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లా లో ఉంది. ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం. ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు ఆమ్నాయ పీఠాలు స్తాపించి ఆర్షధర్మాన్ని నిల బెట్టారు. వైదిక మతోద్ధారణ చేశారు. అద్వైత మత స్థాపనా చార్యులు గా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు.
పరమ విశిష్టమైన కాకాశ్మీర్ శారదా పీఠాన్ని సమర్ధత నిరూపించి శారదా మాత అంగీకారం తో అధిరోహించి జగద్గురువు లని పించుకొన్నారు. ఆ మహాను భావుడే లేక పోతే చైనా, పాకిస్తాన్ సరిహద్దు లో ఉన్న భారత దేశ ప్రజలు ధర్మానికి దూరమై పోయి ఉండేవారు. ఆయన ప్రబోధం సకల మానవ సోదరత్వమే. ఆధ్యాత్మిక కీర్తి పతాకని ప్రపంచం అంతా రెపరెప లాడించిన ఆ మహనీయ మూర్తి జన్మ స్థలాన్ని దర్శించాలనే తపన. ఆ మాహత్మునికి ఏమిచ్చినా హిందూ జాతి ఋణం తీరనే తీరదు. అలాంటి పవిత్ర కాలడి గురించిన విశేషాలు.

# కాలడి చూడాల్సిన ప్రదేశాలు :-
కాలడికి ఒక కిలో మీటర్ దూరం లో మాణిక్య మంగళం లో శ్రీ కాత్యాయిని మాత దేవాలయం ఉంది .ఇది దుర్గా మాత ఆలయం. ఇక్కడే శంకరుల బాల్యం లో తండ్రి శివ శర్మ ఏదో పని మీద వెడుతూ కొడుకు కు అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టి రమ్మని పంపాడు. అలానే బాల శంకరుడు అమ్మవారి ముందు పాల చెంబు ఉంచి నైవేద్యం పెట్టి తాగమని గోల చేశాడు అమ్మ వారు తాగక పోయే సరికి ఏడుపు లంకించుకొన్నాడు అప్పుడు అమ్మ వారు ప్రత్యక్షమై ఆ క్షీరాన్ని తృప్తిగా త్రాగి శంకరులకు ఆనందాన్ని కలిగించింది. ఈ అమ్మ వారి గురించే తరువాత ‘’సౌందర్య లహరి’’ రాశారు శంకరాచార్య .
కాలడికి రెండు కిలో మీటర్ల దూరం లో ‘’మట్టూర్ తిరు వేలు మాన్ శివ దేవాలయం’’ ఉంది. దీన్నిశంకరుల తండ్రి శివ శర్మ ప్రతిస్టించాడు. ముసలి తనం లో శంకరుని తలి దండ్రులు ఇంత దూరం వచ్చి పూజాదికాలు చేయలేక శివుడిని ప్రార్ధించారు. అప్పుడు కల లో కన్పించి ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’ను అనుసరించి వెడితే తన లింగం దగ్గరకు చేరుస్తుందని చెప్పాడు. అలానే రోజూ చేసేవారు. అందుకే ఈ గుడికి ‘’తిరువెల్ల మాన్ మల్లి ‘’అనే పేరొచ్చింది. అంటే ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’అని అర్ధం.
నయ తోడూ శంకర నారాయణ దేవాలయం కాలడికి మూడు కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇది అద్వైత అర్చనకు గొప్ప స్థానం గా ప్రసిద్ధమైంది. ఈ శివాలయం లో శంకరాచార్య విష్ణువును ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమై ఇక్కడి శివుని లో కలిసి పోయి శివ కేశవులకు భేదం లేదని నిరూపించినగొప్ప క్షేత్రం ఇది. అందుకే ముందు శివుడికి తర్వాత విష్ణువుకు ఇక్కడ అర్చన నిర్వహిస్తారు. మంజప్ప కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో శివ శర్మ పూజారిగా ఉన్న ‘’మంజప్ప కార్విల్లి కావు శివ టెంపుల్ ‘’ఉంది.

అలాగే ‘’తెక్కే మదోం ‘’అనే చోట శ్రీ కృష్ణుని గుడి పక్కనే తిరుచ్చి శంకర మఠం ఉంది ఈ మతానికి చెందిన వారికే పూజార్హత.

శంకరుని తల్లి ఆర్యామ్బకు దహన సంస్కారాలను జరిపిన చోటు ఇప్పుడు శంకరాలయం లోనే ఉంది .పది నంబూద్రి కుటుంబాలలో శంకరునికి సాయం చేసినవి రెండే రెండు కుటుంబాలు. ఈ ప్రాంతాన్ని ‘’కపిల్లమన’’ అంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిత్య దీపారాధన జరుగుతూనే ఉండటం విశేషం.
కాలడి కరవు (ఆడట్టు కడవు )దగ్గరే నది మార్గం మారి కాలడి గ్రామం ఏర్పడింది .ఇక్కడే శంకరులు శ్రీ కృష్ణ విగ్రహం స్థాపించారు. శ్రీ కృష్ణ ఉత్సవాలలో ఇక్కడి నుండే జలాన్ని తీసుకు వెడతారు.

‘’మూతల ల కడవు ‘’అంటే మొసలి ఘాట్ -క్రోకడైల్ ఘాట్ అంటారు. ఇక్కడే నదిలో స్నానం చేస్తుంటే బాల శంకరుని మొసలి పట్టుకోంది. తల్లి అనుమతి తో నీటిలోనే ఆపద్ధర్మ సన్యాస దీక్ష తీసుకొన్నాడు బాల శంకరులు. ఇవి కాక శ్రీ శంకరాచార్య యూని వర్సిటి, కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి చూడ తగిన ప్రదేశాలు.

ఎర్నాకులం జిల్లాలో పెరియార్ నదికి తూర్పున ఉంది కాలడి గ్రామం ఐతే ఇప్పుడు ఈకాలడి గ్రామం చిన్న పట్నంగా మారింది. కొచ్చిన్ -- శోరనుర్ రైలు మార్గంలో కాలడి రైలు స్టేషను వుంది. కొచ్చిన్ నుంచి సుమారు ఇరవై, ఇరవైరెండు కిలోమీటర్ల దూరంలో వుంది. కొచ్చిన్ నుంచి రాష్ట్రరోడ్డురవాణా వారి బస్సు సౌలభ్యం వుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కి ఎనిమిది కిమీ.. దూరం. ఆటో వాళ్ళు నూరు లేక నూటయిరవై రూపాయలు తీసుకుంటారు.



No comments:

Post a Comment