01 September 2015

తెలుగు నీతి వాక్యాలు -

1. ఎంతటివారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైనా ఈగల బెడద తప్పించుకోలేదు కదా.
2. మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం.
3. మరణించిన సింహం కన్నా, బతికున్న కుక్క మేలు.
4. స్వయం సమృద్ది సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం.
5. జ్ణానం వంశపారపర్య సంపద కాదు. ఎవరికివారు కష్టపడి ఆర్జించుకోవలసిందే.
6. ఎదుటివారిలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులూ స్నేహితులూ ఎవరూ మిగలరు.
7. మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన నిజం అబద్దమైపోదు.
8. గెలవాలన్న తపన బలీయంగా ఉన్నచోట ఓటమి అడుగైనా పెట్టలేదు.
9. నాయకత్వమంటే దారిపొడవునా ముందు నడవడం కాదు. బాట వెయ్యడం. త్రోవ చూపడం.
10. ఓటమి గురువులాంటిది. ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది.
11. మనసులో మాలిన్యం ఉన్నపుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం.. చేపలు రాత్రింబవళ్లు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా.
12. సక్రమంగా ఉండాలా దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయవైపే మొగ్గు, అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది.
13. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒదుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు.
14. తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ’ఎందుకో నాకీ రోజు అస్సలు ఆకలి వేయ్యడం లేదు’ అని చెప్పే వ్యక్తి.. అమ్మ
15. నీతిని బోధించడానికి అర్హతలేనివాళ్లు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే, ప్రజలకు ఆ వ్యక్తుల మీదే కాక అసలు నీతిమీదే నిరసన భావం ఏర్పడే ప్రమాదం ఉంది.
16. డబ్బు కాదు.. డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనార్థాలకు హేతువులు.
17. కనిపించేదాన్ని చూడటానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి.
18. దుష్టులకు దూరంగా ఉండాలి. కానీ వారితో విరోధంగా ఉండకూడదు.
19. ముందుకు వెళ్ళలేని ప్రతి మనిషీ వెనక్కు వెళ్ళాల్సిందే.
20. ఇప్పటివరకూ వచ్చిన మంచి పుస్తకాలన్నీ చదవటమంటే.. గత శతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖీ మాట్లాడటం.
21. ఒక గమ్యమంటూ లేనివారికి ఏ లాంతరూ దారి చూపలేదు.
22. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారికి నిరాశ అనేది కలగదు.
23. ఇంటికప్పులోని రంధ్రం ఎండలో కన్పించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది.
24. గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరయినట్లే.
25. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్శాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి.
26. నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు. తిట్టుకోనవసరం లేదు. నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి.
27. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకి వెనకా కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం.
28. పొరుగింటి గోడలు శుభ్రంగాలేవని విమర్శించడం కాదు. నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో.
29. నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.
30. రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని.
31. దురలవాట్లు మొదట్లో సాలెగూళ్లు, ఆపై ఇనుప గొలుసులు.
32. ఎదుటి వ్యక్తిని నోరెత్తకుండా చేసినంత మాత్రాన అతడిని నీ దారికి తెచ్చుకున్నట్లు కాదు.
33. తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనిషంటే మరీ ఇష్టం. -అబ్రహాం లింకన్.
34. చెప్పుల్లేని కాళ్లతో నడిచేవారు దారిలో ముళ్లచెట్లు నాటకూడదు.
35. కష్టాలను జయించడానికి నిస్పృకన్నా చిరునవ్వు బలమైన ఆయుధం.
36. ప్రకృతి, కాలం, సహనం.. ఈ మూడూ మాన్పలేని గాయం లేదు.
37. అనంతమైన ద:ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్కమాట తుడిచివేస్తుంది.
38. నువ్వు వెళ్లే దారిలో మొరుగుతూ ఉన్న కుక్కలన్నిటినీ నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు.
39. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు. కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది.
40. సాహసించేవాడి వెనుకే అదృష్టం నడుస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment