24 August 2015


జీవితం :-

మనకు ఇష్టమున్నా లేకున్నా సూర్యోదయం అయ్యే తీరుతుంది. మనకు ఇష్టమున్నా లేకున్నా మరొక నూతన దినాన్ని ఎదుర్కోవలసిందే. మన ప్రమేయం లేకుండానే చాలా మారిపోతూ ఉంటాయి. అయినప్పటికీ మనం దానిని ఎదుర్కోవడానికి సంసిద్దులముగా ఉండాల్సిందే. మనం ఎన్ని రోజులను గడిపామనేది కాదు ప్రశ్న, ఎంత సంతోషంగా గడిపామనేదే పాయింటు.

మన ప్రమేయం లేని కాలాన్ని మనం సాధ్వినియోగం చేసుకోవలసిన బాధ్యత మనదే. అందుకే ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రలోకి జారుకొనే వరకు ప్రతి క్షణాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించాల్సిందే. అప్పుడే ప్రశాంత జీవన మాధుర్యాన్ని ఆస్వాదించ గలుగుతాము.

జీవితమంటే సుఖ దుఖాల సంగమం అని అందరికి తెలుసు. జీవితమంతా సుఖమే అయితే అందులో త్రిల్లెముంది? అంతా కష్టమే అయితే సుఖమేముంది? జీవితంలో సుఖాన్ని, దుఃఖంను సమానంగా స్వీకరించి మనశాంతిని, మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి క్షణాన్ని అనుభవించే వాడే మనిషి. దుఃఖంలో సంతోషం ఎలా పొంద గల్గుతామనేదే ప్రశ్న?

No comments:

Post a Comment