30 August 2015

స్నాన ఫలం :-

నది దగ్గరకు వెళ్ళి గంగను ప్రార్థించి , అందు బొడ్దువరకు ఉన్న నీటిలోనికి దిగి మూడుసార్లు మునగాలి. తలవెంట్రుకలను రెండుపాయలుగా చేయాలి. ముక్కు, చెవులు, కండ్లు మూసుకొని మూడుసార్లు మునగాలి. తరువాత ఆచమనం చేసి శిఖను ముడువేసుకొని ఒంటిని రుద్దుకొని స్నానం చేయాలి.
స్నానం ముఖ్యమని గౌణమని (అముక్యమని) రెండురకాలు. ముఖ్యస్నానం నీటితో చేసేది. గౌణస్నానం నీరు లేకుండా ఉంటుంది. నిత్యమని, నైమిత్తికమని, కామ్యమని మరల స్నానం మూడు రకాలు. నిత్యస్నానం ప్రతిరోజూ చేయాలి. గ్రహనం మొదలగు సందర్భాలలో ఆ నిమిత్తాని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. ఓక కోరిక పెట్టుకొని చేసేది కామ్యస్నానం.స్నానం లేకపోతే జపం మొదలగునవి చేయడానికి వీలులేదు. ఆపైన శరీరమలాన్ని పోగొట్టుకోవాలంటే చేయాలి. ఈవిధంగా స్నానానికి కనబడే ఫలం, కనబడని ఫలం ఉన్నాయి. స్నానం చేస్తే పైశరీరానికి శుద్ధి, ఆచమనం చేస్తే లోపల శుద్ధి కలుగుతుందని వేదంలో ఉంది. రూప, తేజస్సు, బలం, సౌచం, ఆయుస్సు, తపస్సు, ఆరోగ్యం, కోరికలు లేకపోవుట, చెడ్డకలలుకన్న దోషంపోవుట, మేధ పెరుగుట అనే పది ఫలాలున్నయని శాస్త్రాలు చెబుతున్నాయి.స్నానం, సూర్యోదయానికి ముందే పళ్ళు తోముకొన్న తరువాత చేయాలి. ముందుగా మట్టిని, ఆవుపేద్డను, పువ్వులను, అక్షతలను, కుశలను, నువ్వులను, గంధాన్ని సమకూర్చుకోవాలని దక్షునిమాట, మూడవ స్నానం చేసేవారు సుర్యాస్తమయానికి మిందే చేయాలిగాని, సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పనికి రాదు. అత్యవసరమైన సందర్భాలలో రాత్రిస్నానం ఉంది. గ్రహణం, పురుడు, మైల మొదలైన సందర్భాలలో, ఒక ప్రతాన్ని ఉద్దేశించినపుడు, సూర్యుడు కర్కాటక రాశిలో, మకరరాశిలో ప్రవేసించే సందర్భాలలో చేయాలి.నిత్యస్నానం చన్నీటితో చేయాలి. వేడినీళ్ళూ పనికిరావు. ఇతరులకు సంబంధించిన నీటిలోగాని, వేడినీటితోగాని స్నానం చేసేవారికి అదృష్టఫలం రాదన్నాడు శంఖుడు. నైమిత్తిక, కామ్యస్నానాలు చన్నిటితోగాని, వేడినీటితోగాని చేయవచ్చని గర్గవచనం (స్మృ.చం) సహజమైన నీటిలో, అంటె, నదులలో, దేవాలయానికి సంబంధించిన సరస్సులలో, చెరువులలో, జలపాతాలలో గాని చేయాలని చాలమంది చెప్పారు. ఇంకొకరు త్రవ్వించిన చెరువులఓను, నూతులలోను పనికిరాదని, కుదరని పక్షంలో మూడుగాని, ఐదుగాని, మట్తిముద్ద్లను అందులో నుంచి తీసి మరీ స్నానం చేయాలి.

స్నానం ముఖ్యమని గౌణమని (అముక్యమని) రెండురకాలు. ముఖ్యస్నానం నీటితో చేసేది. గౌణస్నానం నీరు లేకుండా ఉంటుంది. నిత్యమని, నైమిత్తికమని, కామ్యమని మరల స్నానం మూడు రకాలు. నిత్యస్నానం ప్రతిరోజూ చేయాలి. గ్రహనం మొదలగు సందర్భాలలో ఆ నిమిత్తాని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. ఓక కోరిక పెట్టుకొని చేసేది కామ్యస్నానం.

స్నానం లేకపోతే జపం మొదలగునవి చేయడానికి వీలులేదు. ఆపైన శరీరమలాన్ని పోగొట్టుకోవాలంటే చేయాలి. ఈవిధంగా స్నానానికి కనబడే ఫలం, కనబడని ఫలం ఉన్నాయి. స్నానం చేస్తే పైశరీరానికి శుద్ధి, ఆచమనం చేస్తే లోపల శుద్ధి కలుగుతుందని వేదంలో ఉంది. రూప, తేజస్సు, బలం, సౌచం, ఆయుస్సు, తపస్సు, ఆరోగ్యం, కోరికలు లేకపోవుట, చెడ్డకలలుకన్న దోషంపోవుట, మేధ పెరుగుట అనే పది ఫలాలున్నయని శాస్త్రాలు చెబుతున్నాయి.

స్నానం, సూర్యోదయానికి ముందే పళ్ళు తోముకొన్న తరువాత చేయాలి. ముందుగా మట్టిని, ఆవుపేడను, పువ్వులను, అక్షతలను, కుశలను, నువ్వులను, గంధాన్ని సమకూర్చుకోవాలని దక్షునిమాట, మూడవ స్నానం చేసేవారు సుర్యాస్తమయానికి ముందే చేయాలిగాని, సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పనికి రాదు. అత్యవసరమైన సందర్భాలలో రాత్రిస్నానం ఉంది. గ్రహణం, పురుడు, మైల మొదలైన సందర్భాలలో, ఒక ప్రతాన్ని ఉద్దేశించినపుడు, సూర్యుడు కర్కాటక రాశిలో, మకరరాశిలో ప్రవేసించే సందర్భాలలో చేయాలి.

నిత్యస్నానం చన్నీటితో చేయాలి. వేడినీళ్ళూ పనికిరావు. ఇతరులకు సంబంధించిన నీటిలోగాని, వేడినీటితోగాని స్నానం చేసేవారికి అదృష్టఫలం రాదన్నాడు శంఖుడు. నైమిత్తిక, కామ్యస్నానాలు చన్నిటితోగాని, వేడినీటితోగాని చేయవచ్చని గర్గవచనం (స్మృ.చం) సహజమైన నీటిలో, అంటె, నదులలో, దేవాలయానికి సంబంధించిన సరస్సులలో, చెరువులలో, జలపాతాలలో గాని చేయాలని చాలమంది చెప్పారు. ఇంకొకరు త్రవ్వించిన చెరువులలోను, నూతులలోను పనికిరాదని, కుదరని పక్షంలో మూడుగాని, ఐదుగాని, మట్టిముద్దలను అందులో నుంచి తీసి మరీ స్నానం చేయాలి. ఒక పాత్రలోనికి నీటిని తీసుకొని చేయాలి. సముద్రంలో ప్రత్యక్షంగా కలిసే నదులు మినహాయించి, మిగిలిన నదులలో శ్రావణ, భాద్రపద మాసాలలో స్నానం పనికిరాదు. ఆ నదులు అప్పుడు రజస్వలా దోషంతో ఉంటాయని అంటారు. (బురద మొదలగు వాటితో ఉంటుంది కనుక) మరణ సందర్భంలో చేసేది. గ్రహణంలో చేసే స్నానం కూడా పైమాసాలలో బురదతో ఉన్న నదులలో కూడా చేయ వచ్చని గోభిలస్మృతి.

అసలు బట్టలేకుండా చేయకూడదు. ఒంటినిండా బట్తలు ఉండగా చేయకూడదు. పైబట్ట క్రిందబట్ట ఉండగా చేయాలన్నమాట. భోజనం చేసిన తరువాత కూడదు. నీటిలో ఉండి ఒంటిని రుద్దకూడదు. గట్టుమీద ఉండి చేయాలి. కాలితోగాని, చేతులతోగాని, నీటిని కొట్టకూడదు. చేతులతో నీటిని ఇతరుల మీద చిమ్మకూడదు. బ్రహ్మచారి ఆడుతూ పాడుతూ చేయక దండం మునిగినట్లు చేయాలి.

నైమిత్తిక స్నానం:-
ప్రసవించిన స్త్రీని ముట్తుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ముట్టుకొన్నఫుడు బట్టలుండగానే (సచేలస్నానం) స్నానం చేయాలి. కక్కిన వెంటనే క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, భార్యతో సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను మట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం. కుక్క కరచినపుడు చేయాలని ఆప.ధ.సూలో ఉండగా, కుక్కముట్టుకొన్నా చేయాలని గౌతముని అభిప్రాయం.

కామ్యస్నానం:-
తీర్థాదులలో చేసేటప్పుడు, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, కోరికతో చేసేదానికి కామ్యస్నానం అంటారు. పుష్యమినక్షత్రం, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, అమావాస్య మొదలగు పర్వతిథులలో, మహా నదులలో స్నానం విశేషఫలాన్నిస్తుంది.

మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం వల్ల మహాఫలం లభిస్తుంది. ఆ నెల అంతా నియమం ప్రకారంగా అందరూ స్నానం చేయాలి.

ఈ మాసంలో ఈ శ్లోకాన్ని చదువుతూ సంకల్పం చేయాలి :-
దు:ఖదారిద్ర్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయచ
ప్రత:స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం

దు:ఖాన్ని, దారిద్యాన్ని పోగొట్టేది, విష్ణు ప్రీతికొరకు, పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మాఘమాసంలో స్నానం చేస్తున్నాము.
స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలి :-
మకరస్థే రవౌ మఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేన అనేన మేదేవ యథోక్త ఫలదో భవ

ఓగోవింద, అచ్యుత, మాధవ, మకరరాశిలో సూర్యుడుండగా ఈ స్నానానికి తగిన ఫలం ఇప్పించు అనే ప్రార్థన ఉంటుంది. స్నానం చేసిన తరువాత దోసిలినిండా నీళ్ళు తీసుకొని ఈ శ్లోకం చెబుతూ సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి.

సవితే ప్రసవిత్రే చ ప్రంధామ జలేమమ
త్వత్తేజపా పరిభష్టం పాపంయాతు సహస్రధా

ఓ సూర్యభగవాన్! నీ తేజస్సుచేత నాపాపం వేయి విధాలుగా చీలిపోవుగాక.

రథసప్తమినాడు:-
యద్యత్ జన్మకృతం పాపం మయా సప్తమ జన్మసు
తన్మేరోగం చ సోకం మాకరీ హంతు సప్తమీ
ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనోవాక్కయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతంచ యత్పువ:
ఇతి స్ప్తవిధం పాపం స్నానాన్మే స్ప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి

ఓ మకరరాశిలో ఉన్న సప్తమి! ఈ జన్మలో ఏదుజన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టు రోగాన్ని శోకాని లేకుండా చేయి. తెలిసి తెలీయక చేసిన పాపాన్ని మనస్సు వాక్కు శరీరం ద్వారా చేస్తున్న పాపాలను పోగొట్టు.

ఆనాడు జిల్లేడు ఆకులు, రేగు ఆకులు, పండ్లు, నెత్తిమీద పెట్తుకొని స్నానం చేయడం ఆచారం. ఆపైన సూర్యునికి ఆర్ఘ్యం (దోసిలితో నీళ్ళు వదలుట) ఇవ్వాలి.
సప్త సప్తి మహాప్రీతి సప్తలోకప్రదీవన
సప్తమీ సహితోదేవ, గృహాణార్ఘ్యం దివాకర
ఏడులోకాలకు కాంతినిచ్చే సూర్యదేవ స్ప్తమితిథితో కూడుకున్నవాడా ఈ ఆర్ఘ్యాన్ని తీసుకో.
ఆపైన సూర్యునికి ఈ శ్లోకాని చెబుతూ నమస్కరించాలి.
జననీ సర్వలోకానాం సప్తమీ సప్త సప్తికే
సప్తవ్యాహృతికే దేవి, నమస్తే సూర్యమండల
సూర్యమండలంలో ఉండే ఓ సవితృదేవత! అన్ని లోకాలకు తల్లివి నీవు. భూ: భువ: సువ: మొదలగు వ్యాహృతులతో కూడి యున్నదానవు. నీకు నమస్కారము.

స్నానంలో భేదాలు :-
అభ్యంగన స్నానం: నూనే రాసుకొని కేవలం ఒంటిమలం పోగొట్టుకోవడానికి చేసేది.
సప్తమి, నవమి తిధులు, పర్వమ్రోజులు మినహాయించి, ఎండిన ఉసిరికతో నలుగు పెట్టుకొని స్నానం చేస్తే భాగ్యం కలుగుతుందని మార్కండేయ పురాణం.
సోమ, బుధ, శనివారాలలో తలంటుస్నానం చేస్తే వరుసగా కంతి, ధనం, ఆరోగ్యం కలుగుతాయి.
ఆదివారం చేస్తే బాధ, మంగళ – ఆయుష్షు తగ్గుట, గురువారం – దరిద్రం, శుక్రవారం – అనారోగ్యం కలిగిస్తుందని ప్రమాణ వచనాలునాయి. ఏకాదశి, దశమి, ద్వాదశి, చతుర్దశి, అష్టమి, షష్ఠి అమావాస్య, పూర్ణిమ, సంక్రమణాలలో తలంటుస్నానం పనికిరాదు. కాని నరక చతుర్దశినాడు మాత్రం తప్పక చేయాలి. సన్యాసులు కూడా చేస్తారు.

నెత్తికి రాసుకొన్న నూనే ఒంటిలోన ఏ అవయవాలను తాకినా, నువ్వుల పిండి తిన్నా (తెలకపిండి) ఆయుష్షు తగ్గుతుంది.

కాపిలస్నానం: రోగంతో బాధపడేటప్పుడు వేడి నీళ్ళతోగాని, అది కూడా భరించలేకపోతే తల మినహాయించి మిగిలిన శరీరభాగాల్ని తడిగుడాతో తుడుచుకోవడం, లేదా బొడ్డు వరకు తడుపుకొని ఆపైన తడిబట్టతో శరీరం అంతా తుడుచుకుంటె కాపిలస్నానం అంటారు.
వారునస్నానం: నీటితో చేసేదానికి ఆపేరు.
మంత్రస్నానం: ” ఆపోహిష్ఠాది ” మంత్రాలతో పైన నీటిని చల్లుకొనుట. దీనినే బ్రాహ్మస్నానం అంటారు.
భౌమస్నానం: ఒంటినిండా మట్తి రాసుకొని చేయుట.
ఆగ్నేయస్నానం: ఒంటినిండా విభూతిని రాసుకొనుట.
వాయవ్యస్నానం: ఆవుగిట్టల నుండి రేగిన ధూళి పడుట.
దివ్యస్నానం: సూర్యరశ్మి ఉన్నపుడు వర్షం పడుతూ ఉండగా చేసేది.
మానసిక స్నానం: విష్ణువును భావిస్తూ చేసేది.
స్నానం చేయడానికి వీలులేనివారు, శక్తి లేనివారు, ఈ దిగువ శ్లోకాలు చదువుకొని వాటి అర్థాన్ని మనసారా భావించాలి.

ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం
అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం
శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం
ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం
త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని
చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం
తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం
తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:

ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:
సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం
యోనిత్యమాచరేద్దేవం సవిఎనారాయన స్మృత:
కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:
ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా
తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ
జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే
య:స్నాతి మానసే తీర్దే సయాతి పరమం గతిం
అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:

ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం
నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:
సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా
బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్
ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభసేత్
ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్
సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:


పరమాకాశంలో ఉండె పురుషోత్తముని వాసుదేవుని, నాలుగు భుజములు కలవాని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాదముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై బడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేసించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉంటాడు. మృత్యువును దాటగలడు.

ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి.

రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావిస్తే ఉత్తమగతిని పొందుతాడు.

నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించాలి. తరించాలి.
తీర్థాలలో స్నానం: అంగీరసులనే మహర్షులు స్వర్గానికి వెడుతూ దీక్షా తపస్సులను తీర్థాలలో ఉంచారని, అట్టి తీర్థాలలో స్నానం చేస్తే మనకు అవి వస్తాయని వేదంలో ఉందని పెద్ద్లంటారు. వేదకర్మలు చేయాలనే శ్రద్దను పుట్తించే శక్తి అందులో ఉంది. ఈ విషయం పూర్వకాలం నుంచి పెద్దలు నుడివినదే.
సముద్ర స్నానం: గర్భిణీపతి సముద్రస్నానం చేయకూడదని భర్ద్వాజుడన్నడు. (వై.దీ) పౌర్ణమి, అంవాస్య మొదలగు పర్వదినాల్లోనే సముద్రస్నానం చేయాలి గాని రోజూ చేయకుడదు. సముద్రాన్ని అన్ని వేళల ముట్టుకోకూడదు. రావి, సముద్రం దూరంగా ఉండి సేవింపతగినవేకాని ఎల్లవేళలాముట్టుకోకూడదు. రావిచెట్టుని శనివారంనాడు, సముద్రాన్ని పర్వదినాల లోను తాకవచ్చని భారతం. సముద్రం నీటిని ఆచమనం చేయ కూడదని, మరొక నీటితోనే ఆచమనం చేయాలని, తర్పణాలు మాత్రం సముద్రపు నీటితోనె ఇవ్వలని వై.దీ చేసేటపుడు చదివేశ్లోకం.

రఘువీర పదన్యస
పవిత్రీ కృత పాంసవే
దశకంఠ శిరచ్ఛేద
హేతవే సేతవే నమ:


రాముని పాద ధూళిచే పవిత్రమైనదానవు. రావణుని శిరస్సులను పోగొట్టుటకు కారణమైన ఓ సముద్రమా! నీకు నమస్కారం. రామసేతువునందు ధనుష్కోటియందు ‘ రామనాథ ‘ అని అనాలి. ఎక్కడ స్నానం చేసినా ‘ ధనుష్కోటి ‘ యని మూడుసార్లు అంటే బ్రహ్మపథాన్ని పొందుతాడని పురాణ వచనం.
నదీ స్నానం: తూర్పుగా పోయి సముద్రంలో కలిసే దాన్ని నదియని, పడమరగా పోయి సముద్రంలో కలిసేదాన్ని నదం అని ఆంటారు. గంగ, నది, నర్మద, నదం అవుతుంది. ఈ నదీ నదాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమఫలమని, ప్రవాహం ఉన్న నదిలో చేస్తే ఆరోగ్య కలుగుతుందని అంటారు. చెఱువులు మొదలగువాటిలో చేస్తే మధ్యమఫలం అని, నూతులు మొదలగు వాటిలో చేస్తే అధమ ఫలం అని అంటారు.

స్నానం చేసే పద్ధతి :
(వైదిక పద్ధతి)
నది దగ్గరకు వెళ్ళి గంగను ప్రార్థించి, అందు దిగి బొడ్డువరకు ఉన్న నీటిలోనికి దిగి మూడుసార్లు మునగాలి. తలవెంట్రుకలనురెండుపాయలుగా చేయాలి. ముక్కు, చెవులు, కండ్లు మూసుకొని మూడుసార్లు మునగాలి. తరువాత ఆచమనం చేసి శిఖను ముడి వేసుకొని ఒంటిని రుద్దుకొని స్నానం చేయాలి. ‘ హిరణ్యశృంగం ‘ అనే మంత్రాన్ని చదవాలి. ‘ ఆపోహిష్ఠాది ‘ మంత్రాలల్తో నీటిని చల్లుకోవాలి.పవమానసూక్తాలను చదువుతూ స్నానం చేయాలి. “యదపాంక్రూరం” అనే మంత్రాన్ని చదువుతూ బొటనవ్రేలితో యజ్ఞోపవీతం పట్తుకొని నీటిని మూడుసార్లు గుండ్రంగా త్రిప్పుతూ మూడుసార్లు స్నానం చేయాలి. ‘ ఇమం మే గంగ ‘ అనే మంత్రాన్ని చ్బుతూ గంగను అభిమంత్రించుట – ఋతంచ – అనే పాపం పోయే మంత్రాలను చదివి నీటిలో మునుగుట – “ఆర్ద్రం జ్వలతి” అనే మంత్రంతో ఆచమనం – తరువాత దేవ ఋషి పితృ తర్పణాలు – ఇత్యాదిగా వైదికపద్ధతి ఉంటుంది. కాని ఈ పద్ధతిని ఎవ్వరోగాని ఆచరించడం లేదు.

స్నానం వెనుక తర్పణం :-
ఈ జన్మకు కారణమైన పితృదేవతలకు, సృష్టికి కారణమైన దేవతలకు, విజ్ఞానం అందించి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టే ఋషులకు కృతజ్ఞతను వెల్లడిస్తూ, అందరూ తృప్తిని పొందుదురుకాగ అనే ఉత్తమమైన భావనతో స్నానం చేసిన వెంటనే ఇంకా తల తుడుచుకో కుండగానే దేవ ఋషి పితృతర్పణాలియ్యాలి.
స్నానం చేసే సమయంలోనే నీటిలో నిలబడి పైవారికి నీటిని విడిచెపెట్టలి. స్నాం చేసేటప్పుడు చేయాలని, తరువాత బ్రహ్మయజ్ఞంలో కూడా చేయాలని కొందరనగా, సంధ్యావందనం అయిన తరువాత ఒక్కమారే చేయాలని కొందరన్నారు.

శంఖుడు, ఒక సూక్ష్మమార్గం చెప్పడు. గడ్డిపరక మొదలుకొని బ్రహ్మ వరకు అంద్రౌ తృప్తిని పొందుదురుగాక అనే ఒక శ్లోకాన్ని చదివి మూడుసార్లు నీటిని విడిచిపెట్టితే చాలన్నాడు. ఈ దిగువ శ్లోకంలో మొదటి వాక్యం చాలు.

ఆబ్రహ్మస్తంబ పర్యంతం జగత్తృప్యతు ఇతిబ్రువన్
జలాంజలిత్రయం దద్యత్ ఏతత్ సంక్షేప తర్పణం!!


తర్పణం విడిచేటప్పుడు బట్టాను పిండకుండా ఉండగా నీటిని వదలాలి. బట్ట విడుపు నీళ్ళు సంతానం లేకపోయిన వారికి తృప్తినిస్తాయని ఈ సందర్భంలో ఒక శ్లోకం చదువుతారు.
యేకేచాస్మత్ కులే జాతా
అపుత్రా గోత్రిణో మృతా:
తేగృహ్ణంతు మయా దత్తం
వస్త్రనిష్పీడనోదకం!!


బొట్టనవ్రేలి యొక్క మొదటిభాగంలో బ్రహ్మతీర్థం; చిటికెనవ్రేలి మొదట్లో కాయతీర్థం, వ్రేళ్ళ చివరలలో దైవతీర్థం, చూపుడు వ్రేలు, బొటనవ్రేలు మధ్యలో పితృతీర్థం ఉంటాయి. పితృతీర్థంతో పితృదేవతలకు, దైఅ త్రీర్థంతో దేవతలకు, కాయత్రీర్థంతో ఋషులౌ తర్పణం ఇవ్వాలి.
కట్టుకున్న బట్టతో తుడుచుకోకూడదు. నీరు ఆరడంకోసం తలను ఆడించకూడదు.
ఇలా స్నాన విధులను గురించి మన పూర్వులు ఎన్నెన్నో విషయాలను చెప్పారు .

No comments:

Post a Comment