27 August 2015

పేస్ బుక్ లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు :-

పేస్ బుక్ లో నాలుగు కాలాలు పాటు ఎవరితో
విరోధం లేకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? పేస్
బుక్ లోని వారి మనస్తత్వ విశ్లేషణ :

***
1. ఇతరుల వ్యక్తిగత
వివరాలను తెలుసుకోవాలని పరిచయం అయిన
నిమిషానికే ప్రయత్నించరాదు. కొందరు అయితే
ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ అంగీకరించగానే అవతల వారి
పాస్ వర్డ్ అడుగుతారు. ఇంకా కొందరు ఒక
అడుగు ముందుకి వెళ్లి లవ్ ప్రోపోజల్
పెడతారు

***
2. మనసుకి కష్టం కలిగినా వెంటనే, ఫ్రెండ్షిప్
అయిన మర్నాడే. ఇతరుల
ముందు మనసును పరవవద్దు. అందరికీ మన
కష్టాలు వినే ఓపిక ఉండదు. కొందరయితే విని
వోదార్చకపోగా అందరితో మీ గురించి
ఏకరువు పెడతారు.

***
3. ఇతరులు స్టేటస్, ఫోటోలు మీకు నచ్చితే
LIKE చెయ్యండి. లేకపొతే ఊరికే వారితో వాదన
చెయ్యకండి. బాగా క్లోజ్ గా ఉన్న మిత్రులకే ఆ
హక్కు ఉంటుంది.

***
4. మన పోస్టింగ్స్ అన్నీ మంచిగా ఉన్నా
అందరూ like చెయ్యలేకపోవచ్చు .

దానికి కారణాలు :-
ఒకటవ కారణం : పోస్టింగ్స్ వారికి అర్థం కాకపోవచ్చు

రెండవ కారణం : వారు వాడేది మొబైల్ ఫోన్ నుంచి కావచ్చు
మూడవ కారణం : ఎవరయినా తమ కన్నా గొప్పవారిని గౌరవిస్తారు కానీ, తమ ఫ్రెండ్ గా ఉండాలి
అనుకోరు. గౌరవం వేరు, స్నేహం వేరు

నాల్గవ కారణం : LIKE ని క్లిక్ చేస్తే వారి ప్రైవసీ దెబ్బతింటుంది.
***
5. చాటింగ్ చేసే ముందు రాత్రినా, పగలా అని
ఆలోచించండి. ముఖ్యముగా మహిళా మిత్రులతో
చాటింగ్ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
వాళ్ళకి అనుమానం మొగుళ్ళు ఉండవచ్చు.
అవతలవారు extrovert నా? introvert
నా??
అని ఒకసారి ఆలోచించాలి. introvert లకి
ఇతరులతో సంభాషించటం ఇష్టం లేక పోవచ్చు.

***
6. అవతల వారు మేజర్ డిప్రెషన్ కి
లోను అయినప్పుడు వారి ప్రవర్తన వింతగా
ఉంటుంది. అటువంటి అప్పుడు చాటింగ్ ని
కట్టేయాలి. లేకపొతే రేపు పొద్దున్న వారు ఏదయినా
సూసైడ్ చేసుకుంటే ముందు పోలీసులు ఎవరితో
అంతకు ముందు రాత్రి మాట్లాడారు అని
ఆరాలు తీస్తారు. మానసిక జబ్బులు కానీ,
తీవ్రమైన అపసామన్య మనస్తత్వం కలవారు కానీ
అవతలివారు అని మీకు డౌట్ అనిపిస్తే జాగ్రత్తగా
ఉండాలి.

***
7. Tagging చేసే ముందు అవతలవారి ఆలోచన
విధానం గురించి తెలుసుకొండి. అదీకాక వారి
ప్రైవసీ దెబ్బతింటుంది. వారికి ఇష్టం లేని
విషయాలు, ఇంట్రెస్ట్ లేని విషయాలను ట్యాగ్ చేస్తే
వారికి చిరాకు రావచ్చు.

***
8. పండితులు, మేధావులు మధ్య జరిగే చర్చలో
విషయం తెలియకుండా
జోక్యం చేసుకోగూడదు. అంటే "శంకరాభరణం"
సినిమాలో చంద్రమోహన్ వృషభం, కాఫీ
అన్నట్లుగా…

***
9. యువతీ యువకుల పోస్టింగ్స్ లో కొన్ని వారికి
మాత్రమే పరిమితం అయ్యే పోస్టింగ్స్ ఉంటాయి.
మేధావుల మాదిరి దూరకండి. అనవసరమయిన నీతి
బోధలు చెయ్యకండి. దానివలన అనవసరం గా
పరువు పోతుంది.

***
10. వాడే ప్రతి పదము అవతలవారి
మనసును బాధ పెడుతుందేమో ఒకటికి
రెండు సార్లు ఆలోచించండి.

***
11. పేస్ బుక్ లో మనకి కనిపించే మనిషి ఒకరు.
నిజజీవితంలో వారి ప్రవర్తన వేరుగా
ఉండవచ్చును. అలానే విప్లవభావాలు ఉన్నాయి
అనుకునేవారు పోలీస్ డిపార్టుమెంటులో
పనిచేసేవారు కావచ్చు. వారు తమకి అప్పగించిన
డ్యూటీలో భాగంగా ఇంటలిజెన్స్ ని సంపాదిస్తారు.
అలానే పోలీస్ డిపార్టుమెంటులో పని
చేస్తున్నాము అని చెప్పి,
వారు తీవ్రవాదులు కావచ్చు. మీరు భామ
అనుకున్న వారు బామ్మ కావచ్చు. మీరు తాతయ్య
అనుకొని స్నేహం చేసిన వారు పైలాపచ్చీసులో
ఉన్నవారు కావచ్చు.

***
12. ఒక్కోసారి అవతలవారు ఏదో ఎమోషన్స్ లో
ఉండి వారి ఫోన్ నెంబర్ ని ఇస్తారు. అది కేవలం ఆ
టైం లో వారు మనలను ఆప్తులుగా భావించి..
దానిని ఆధారంగా తీసుకుని Law లో undue
advantage అంటారు. వెంటనే ఫోన్
చెయ్యకండి. అలానే వారి నెంబర్ ని పదిమందికీ తెలియ
చెయ్యవద్దు.

***
13. శాడిస్ట్ స్వభావం కలవారు ఉంటారు.
చాడీలు చెప్పేవారు ఉంటారు.
వారికెప్పుడూ ఎవరినో ఒకరిని ఏదో అని
ఆనందం పొందుతారు. అలాంటివారు ఇవ్వాళ
ఇంకొకరి గురించి చెడుగా చెప్పి రేపు మీగురించే
చిలవలు పలవలుగా ఇతరులతో
చెప్పవచ్చు.

***
14. మీకు నచ్చని గ్రూప్స్ లోకి మిమ్మల్ని
ఇతరులు చేర్చినా, లేని పోనీ మొహమాటాలకి పోయి
అందులో ఉండక వెంటనే బయటకి వచ్చేయాలి. కొన్ని
గ్రూప్స్ అయితే పేరు ఒకటి, అందులో పోస్టింగ్స్
మటుకు వేరే రకంగా ఉంటాయి. కొన్ని పోస్టింగ్స్
అయితే ఇతరుల మత విశ్వాసాలను, ఆచారాలను,
భాషను కించపరిచే విధంగా ఉంటాయి.
తీవ్రవాదాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటాయి.
రేపు లీగల్ గా ఏదయినా ప్రాబ్లం వస్తే
ఇరుక్కుపోవలసి వస్తుంది.

***
15. Like ని క్లిక్ చేసే ముందు, ఏ మేటర్ అయినా
షేర్ చేసుకునే ముందు ఒకటికి
రెండు మార్లు ఆలోచించండి. అది చట్ట
వ్యతిరేకమా, అనైతికమా అని ఆలోచన చెయ్యాలి.

***
16. అలాగే కొందరు స్వీయ అనురాగ
బద్దులు ఉంటారు ( narcissists ). వారికి
వారి పోస్టింగ్ లే ఇంపార్టెంట్. వేరేవారి గురించి
ఆలోచించరు. అటువంటి వారితో స్నేహం వన్ వే
ట్రాఫిక్. మీ పోస్టింగ్స్ వైపు వారు కన్నెత్తి
చూడరు ఎంతసేపు మీరు అవతల వారి పల్లకీ
మోస్తారు? మన ఆత్మగౌరవం నిలబడాలి అంటే
రెండు వైపులా ట్రాఫిక్ ఉండాలి.

***
17. పేస్ బుక్ లో ఈ మధ్య అసత్య
ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. గుడ్డిగా
నమ్మకుండా ఏ విషయము అయినా నిజమా, కాదా అని
తేలిన పిదపనే Like చెయ్యండి.

***
18. ఒక్కో సారి మీకు తెలియకుండానే మీ పాత
ఫ్రెండ్స్ మీకు దూరం అవుతారు. దానికి
కారణాలు మీరు కాకపోవచ్చు, మీ కొత్త హితులు మీ
పాతవారికి శత్రువులు కావచ్చు.


No comments:

Post a Comment