03 December 2014

శనీశ్వరుడు :-

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.

జనన వృత్తాంతము :-

అదితి , కస్యపు ముని కుమారుడైన సుర్యభావానునికి ముగ్గురు భార్యలు -- ఉషా(సంజ్ఞా) , చాయ , పద్మిని .

లోకాలన్నితికి వెలుగునిచ్చే సుర్యాడు త్వష్ట ప్రజాపతి "విశ్వకర్మ" కూతురు సంజ్ఞా(ఉమా) దేవిని పెళ్ళిచేసుకున్నాడు . పెళ్ళైన నుండే సూర్యకాంతిని , తేజస్సును భారిచలేక , చూడలేక విచారము తో ఉన్న ఉమాదేవి ని నారదుడు చూసి , విషయము తలుసుకొని ... ఈశ్వరుని తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయమార్గము జప్పెను . అప్పటికే తనకి ముగ్గురు పిల్లు -మొదటివాడు వైవాస్తవ . రెండేవ వాడు యముడు . మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణము పోసి "చాయాదేవి" గా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను, కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సుర్యునివద్దకే వెళ్ళిపొమ్మని చెప్పగా .. గోప్యం గా ఉన్న ఛాయా రహస్యము బయట పడ కూడదనే సదుద్దేశముతో అడవికి పోయి తపస్సు చేయసాగెను . తన అందము , యవ్వనము చూసి ఇతరులబారినుంది తప్పించుకొనుటకు గుఱ్ఱము రూపములో మారిపోయి ఈశ్వరునికి తప్పస్సు చేయసాగెను . సూర్యునికి .. ఛాయాదేవికి "మను (సావర్ణుడు) , శని , తపతి (కూతురు) జన్మిచారు . శని గర్భము లో ఉండగా చాయ ఈశ్వరునికి ఘోర తపస్సు చేసెను . ఉపవాసదీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని , తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని , శని చూపే వినాశకరం గా మారినదని పండితులు అంటారు . సూర్య తేజస్సు లేని ఈబిడ్డ తనబిడ్డ కాదని చాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు . అది విన్న శని తండ్రి అయిన సూర్యున్నే నల్లగా మారిపోవాలని , సూర్యగమనం ఆగిపోవాలని , సూర్య రధం నల్ల రంగు గా అయిపోవాలని శపిస్తాడు . అప్పుడు తన తప్పును తెలుసు కున్న సూర్యుడు ఈశ్వరుని వేడగా ... జరిగిన విషయమంతా సూర్యునకు తెలిజేయగా ఈశ్వరుని కోరిక మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యున్ని శాపవిముక్తి గావించెను . అంతా సుఖము గా ఉన్నా ... శని సూర్యుని పై పగబూని ఈశ్వరుని తపస్సు జేసి ఎన్నో వరాలు పొందెను .

శని జన్మ నక్షత్రము : శని విభావనామ సంవత్సరము , మాఘమాసము ,కృష్ణపక్షము ,చతుర్దశి నాడు , ధనిష్టా నక్షము న జన్మించాడని కొందరంటే .. మార్గశిర మాసము -బహుళ నవమి ,రోహిణీ నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరు అంటారు . . శనీశ్వరుడు కుడి చేతిలో దండము , ఎడమ చేతిలో కమండలము , sword (ఖడ్గము) arrows and two daggers దరించి ఉంటాడు .
శని పెళ్ళి : లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి(ఈమెనే దరిద్రదేవత అంటారు) శనైశ్చరుడి భార్య. అంటే శనిభగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట., యమధర్మరాజు కి సోదరుడు , గ్రహాలకు యువరాజు .

హరిచ్శంద్రుడు , నలుడు , పురుకుత్సుడు , పురూరవుడు , సగరుడు , కార్తవీర్యార్జునుడు , శని మహిమ వల్ల అనేక కస్టాలు పొంది చివరకి శని కృప వల్లే సర్వ సుఖాలు పొందేరు .
శనిదూషణ సర్వదేవతలనూ తిట్టినదాంతో సమానం అని పెద్దలు చెబుతారు. ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమత్‌దీక్షలో ఉన్నవారినీ అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులనూ ఆయన బాధించడని నమ్మిక.


శనీశ్వరుడు మరియు హనుమంతుడు :-

హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైనా హనుమంతుని ప్రార్ధించినచో, ముఖ్యముగా శనివారాలలో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.

శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు భారీ కాయునిగా అవతరించగా, శని హనుమంతుడు భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు. ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుడును తనను విడిచిపెట్టమని వేడుకుంటూ, ఎవరైనా హనుమంతుడిని ప్రార్థించినచో ఆ వ్యక్తిపై తన(శని) యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్ములింపబడునట్లుగా చేసెదెనని శనిభగవానుడు మాట యిచ్చాడు. ఆ తరువాత హనుమంతుడు శనిని విడిచిపెట్టెను.

శనీశ్వరుడు - శివుడు :-

పూర్వము కృతయుగములో కైలాసము లోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు ... ప్రమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాల చెప్పాడు . నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు . ఆ కారణము గా .. ' శని అంతటి శక్తిమంతుదైతే తన ప్రభావాన్ని తనపై (శివునిపై) చూపి , తనను పీడించి శని శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోమను ' అని శివుడు అనగా నారదుడు ఆవిషయము శని తో చెప్పెను . పరమశివుని మాటలకు శనికి అవేశము , పట్టుదల ప్రేరేపించాయి . తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని ... ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను . ఈ విధముగా నారదుడు శివ , శని ల మద్య తగాదా సృష్టించాడు .

నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శనిప్రభావాన పడకుండా జాగ్రత్తపడమని చెప్పి వెళ్ళిపోయెను . " శని తనను ఎలా పీడించగలడో చూస్తాను ' అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండకారణ్యము దారిపట్టాడు శివుడు . ఎవరి ద్రుష్టికీ ఊహకు రాని చోటుకోసం అలోచించాడు . ఆ ఆడవిలోతూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు ఒక పెద్ద రావిచెట్టు తొర్ర లొ ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు. అప్పుడు " ఏ మయింది నీ శపథం " అని ప్రశ్నించాడు ఈశ్వరుడు . ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ " పరమశివుదంతటివాడు దేవతలకు , ఋషులకు , మరి ఎందరికో ఆరాధ్యదైవం , చల్ల్ని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలె చెట్టు తొర్రలో దాగుకోవడమంటే ... ఆ క్షణము శని పట్టినట్లు కాదా ! "అని అడిగాడు శని నెమ్మదిగా వినయం గా . శని సమయస్పూర్తికి , వినయానికి ఆయన ప్రభావానికి , పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు . . తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనేశబ్దము సార్ధకం కాగలదని మానవులు తనను(శనిని) శనీశ్వరా అని పూజిస్తే .. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరము ఇచ్చెను . అలా శనిగ్రహం శనీశ్వరడు అయ్యాడు .

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది :-

సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆహా! శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .


శనీశ్వరుడు మరియు రోమపాద మహారాజు :-

తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా భాద్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను". ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివశిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని చెప్పెను. శని భగవానుని దీవెనలు అందుకున్న తరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తెగా చెప్పబడే 'శాంత'ను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు.

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు [నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం] అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.{జపంచేయటానికి కూడా సమయము వెచ్చించలేనివారి కోసము మేమేమీ చేయలేము}
6. ఆరోజు [కుంటివాళ్ళు,వికలాంగులకు] ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.


ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :-

1 మయూరి నీఎలం ధరించుట
2 శని జపం ప్రతి రోజు జపించుట
3 శని కి తిలభిషేకం చేఇంచుట
4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట
5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట
6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన
7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన
8 హనుమంతుని పూజ వలన
9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన
10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన
11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన
12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన
13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన
14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన
15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన
16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన
17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం
18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన
19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును.


న్యాయాధికారి :-

మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మందపల్లి మందుడు :-

తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. పూర్వం అశ్వత్ధ´, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో వెురపెట్టుకున్నారట. వారి వెురను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చర క్షేత్రంగా పేరుపొందింది. శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ... ఏలినాటిశని, అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఏటా శ్రావణమాసంలోనూ శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.

ఇంకా... మహారాష్ట్రలోని శనిసింగణాపూర్‌ ప్రపంచ ప్రసిద్ధ శనైశ్చరాలయం. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని (23 అడుగులు) ఆవిష్కరించారు.


శని తీర్థయాత్రలు :-

* మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరి శ్రీ శనైశ్చర దేవాలయం, మంగళూరు, కర్ణాటక.
* శ్రీ శని మహాత్మ దేవాలయం పావగడ, తుంకూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
* శనిదేవుని ఆలయం, గ్వాలియర్ కోకిలవనం, వ్రిందావనం.
* శ్రీ శని దేవాలయం బీధ్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర నస్తన్పూర్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర నమూనా తీర్థ్ నందూర్ బార్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర రామేశ్వర తీర్థం.
* శ్రీ శని తీర్థం తిరునలరు పుదుచేరి.
* శ్రీ శని మందిర్ తీర్థం, ఉజ్జయిని.
* శ్రీ శని శింగనాపూర్, మహారాష్ట్ర.
* శ్రీ శని తీర్థ క్షేత్ర, అసోల, ఫతేపూర్ బేరి, మెహ్రులి, ఢిల్లీ.
* శ్రీ సిధ్ శక్తి పీట్ట్ శనిధాం.
* శ్రీ శని దేవాలయం, మడివాల, బెంగుళూరు
* శనైశ్కర దేవాలయం, హస్సన్
* శ్రీ శనిమహాత్మ దేవాలయం, సయ్యాజిరావు మార్గం, మైసూరు.
* శ్రీ శనీశ్వర దేవాలయం, నందివడ్డేమను, నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శనీశ్వర ఆలయం, శ్రీ కాళహస్తి ఆలయం కాంప్లెక్స్, శ్రీ కాళహస్తి, తిరుపతికి 35 కి.మీ. ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శని దేవాలయం, హత్ల, జామ్నగర్ జిల్లా, గుజరాత్
* శ్రీ శనీశ్వరాలయం వీరన్నపాలెం, పర్చూర్ మండలం, ప్రకాశం (జిల్లా) ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శనీశ్వరాలయం, మందపల్లి, రావులపాలెం కి 5 కిలోమీటర్లు దూరం. తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.(ఇది పురాతన ఆలయము)
* శ్రీ శనీశ్వర దేవాలయం, గుంజూరు, వర్తూర్ అనంతరం, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, కన్నన్మంగల, బెల్తూర్ అనంతరం, శ్రీ సత్య సాయి ఆశ్రమం, వైట్ఫీల్డ్, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, చిక్క తిరుపతికి వెళ్ళే మార్గంలో, బెంగుళూరు, సమేతహళ్లి, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, తిరుపతి, తిరుపతి బస్సు స్టాండ్ దగ్గర, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, కంగ్ర, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, హోసూర్ మెయిన్ రోడ్, హొస రోడ్, బసపుర, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, వైట్ఫీల్డ్, సవన హోటల్ దగ్గర, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ అభయ శనీశ్వర దేవాలయం(1956) రామ్మూర్తినగర్, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - రామ్మూర్తినగర్, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - హేబ్బాల్, హేబ్బాల్ ఫ్లైఓవర్ క్రింద, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - అడంబక్కం, చెన్నై, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - డెల్ దగ్గర (నెక్స్ట్ సిగ్నల్ వద్దగల వైట్ గోపుర)కోరమంగల ఇంటర్మీడియట్ రింగ్ రోడ్
* శ్రీ శనైశ్కర దేవాలయం - నతున్గుంజ్, బంకుర, పశ్చిమ బెంగాల్, సంప్ర-ప్రసేన్జిట్ దరిప,S/O లేట్ దేవదాస్ దరిప.
* శ్రీ శనీశ్వర దేవాలయం, అనేకల్, బెంగుళూరు దగ్గర, కర్ణాటక, భారతదేశం.


శనీశ్వరుడు :-

శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా ఏలినాటి శని ప్రసన్నుడవుతాడు. అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. నవగ్రహాలలో ...ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవత. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య. శనీశ్వర జపం నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం || ఓం శం శనయేనమ:|| || ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ || || ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః || శని గాయత్రీ మంత్రం- ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. || ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ || బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం": ||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మేశని|| ||ఓం శం శనైస్కర్యయే నమః|| ||ఓం శం శనైశ్వరాయ నమః|| ||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః || ||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:|| ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం, ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం, ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం, ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం!!
హిందూ జ్యోతీష్య శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' , నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవత. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.

శనీశ్వరుని తల్లిదండ్రులు :-

సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడుభగవానుడికి, అతని రెండవ బార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి , ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది.

ఇతర నామాలు: ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనయే క్రమతి స: (शनये क्रमति सः) అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.

శనీస్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు :-

నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం,నీలం, ఇనుము, అశుభ్రత, మందకొడిగా ఉండటం.
సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి,ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.


గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.(మరి అదే నిజమయితే మన మధ్య నిత్యం జరుగుతున్న అరాచకాలు, అవినీతి, మోసాలు నిరాటకంగా ఎలా సాగి పోతున్నాయి? అని సందేహం కలగవచ్చు. శని దేవుడి ప్రణాళికలేమిటో సామాన్యులమైన మనకు తెలుస్తుందా!). తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి,అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.

నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.

శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .

శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

శనీశ్వరుడి జప మంత్రాలు :-

నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం


|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం :-

ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.

|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||

బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||

||ఓం శం శనైస్కర్యయే నమః||
||ఓం శం శనైశ్వరాయ నమః||
||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||

||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||
ఓం నమో శనైశ్వరా పాహిమాం,
ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,
ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,
ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం


శనిగ్రహ జపం - ఆవాహము :-

అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర
గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే
శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః


కరన్యాసం :-

ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః
ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః
ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః
ఓం శంవాతః - అనామికాభ్యాం నమః
ఓం వాత్వరపాః - కనిష్టికాభ్యాసం నమః
ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః అంగన్యాసము:
ఓం శమగ్ని: - హృదయాయ నమః
ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ
ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్
ఓం శంవాతః - కవచాయహు
ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్
ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం


ఆదిదేవతా :-

ఇమం యమ ప్రస్తరమాహి సీదాంగి రోభి: పితృభిప్సం విదానః!
అత్వా మంత్రాః కవిసహస్త్వా వహ న్వైనారాజన్ హవిషామదయస్వ!!
ప్రత్యథి దేవతా: ప్రజాపతే సత్వ దేవతాన్యోన్యో విశ్వాజాతాని పరితాబభూవ!
యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తువయగ్గౌ శ్యామ పతయోరయీణాం!!


వేదమంత్రం :-

ఓం శమగ్ని రాజ్ఞి భిస్క రచ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః

శని కవచ స్తోత్రము :-

శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు!
నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు!
హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు!
ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు!
పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః!


ఫలశ్రుతి :-


య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్దయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్!


శని మంగళాష్టకమ్ :-

మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః!
నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం!
షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!
శన్యష్టోత్తర శతమామావళి ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః

ఓం శరణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సర్వేశాయ నమః
ఓం సౌమ్యాయ నమః ఓం సురవంద్యాయ నమః ఓం సురలోక విహారిణే నమః
ఓం సుఖాననోవిష్టాయ నమః ఓం సుందరాయ నమః ఓం ఘనాయ నమః
ఓం ఘనరూపాయ నమః ఓం ఘనాభరణధారిణే నమః ఓం ఘనసారవిలేపాయ నమః
ఓం ఖద్యోతాయ నమః ఓం మందాయ నమః ఓం మందచేష్టాయ నమః
ఓం మహనీయగుణాత్మనే నమః ఓం మర్త్యపావనపాదాయ నమః
ఓం మహేశాయ నమః ఓం ఛాయాపుత్త్రాయ నమః ఓం శర్వాయ నమః
ఓం శ్రతూణీరధారిణే నమః ఓం చరస్థిరస్వభావాయ నమః ఓం చంచలాయ నమః
ఓం నీలవర్ణాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నీలాంబసనిభాయ నమః
ఓం నీలాంబరవిభూషాయ నమః ఓం నిశ్చలాయ నమః ఓం వేద్యాయ నమః
ఓం విధిరూపాయ నమః ఓం విరోధాధార భూమయే నమః
ఓం వేదాస్పదస్వాభావాయ నమః ఓం వజ్రదేహాయ నమః ఓం వైరాగ్యదాయ నమః
ఓం వీరాయ నమః ఓం వీతరోగభయాయ నమః ఓం విపత్పరంపరేశాయ నమః
ఓం విశ్వనంద్యాయ నమః ఓం గృద్రహహాయ నమః ఓం గుధాయ నమః
ఓం కూర్మాంగాయ నమః ఓం కురూపిణే నమః ఓం కుత్సితాయ నమః
ఓం గుణాధ్యాయ నమః ఓం గోచరాయ నమః ఓం అవిద్యామూలనాశాయ నమః
ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ఓం ఆయుష్యకారణాయ నమః ఓం ఆపదుద్దర్త్రే నమః
ఓం విష్ణుభక్తాయ నమః ఓం వశినే నమః ఓం వివిధాగమనేదినే నమః
ఓం విధిస్తుత్యాయ నమః ఓం వంద్యాయ నమః ఓం విరూపాక్షాయ నమః
ఓం వరిష్టాయ నమః ఓం వజ్రాంకుశధరాయ నమః ఓం వరదాయ నమః
ఓం అభయహస్తాయ నమః ఓం వామనాయ నమః ఓం జేష్టాపత్నీసమేతాయ నమః
ఓం శ్రేష్టాయ నమః ఓం అమితభాషిణే నమః ఓం కస్టౌఘనాశకాయ నమః
ఓం ఆర్యపుష్టిదాయ నమః ఓం స్తుత్యాయ నమః ఓం స్తోత్రగమ్యాయ నమః
ఓం భక్తివశ్యాయ నమః ఓం భానవే నమః ఓం భానుపుత్త్రాయ నమః
ఓం భావ్యాయ నమః ఓం పావనాయ నమః ఓం ధనుర్మందల సంస్థాయ నమః
ఓం ధనదాయ నమః ఓం ధనుష్మతే నమః ఓం తనుప్రకాశ దేహాయ నమః
ఓం తామసాయ నమః ఓం అశేషజనవంద్యాయ నమః ఓం విశేషఫలదాయినే నమః
ఓం వశీకృతజనిశాయ నమః ఓం పశూనాంపతయే నమః ఓం ఖేచరాయ నమః
ఓం ఖగేశాయ నమః ఓం ఘననీలాంబరాయ నమః ఓం కాఠిన్యమానసాయ నమః
ఓం అరణ్యగణస్తుత్యాయ నమః ఓం నీలచ్చత్రాయ నమః ఓం నిత్యాయ నమః
ఓం నిర్గుణాయ నమః ఓం గుణాత్మనే నమః ఓం నిరామయాయ నమః ఓం నింద్యాయ నమః
ఓం వందనీయాయ నమః ఓం ధీరాయ నమః ఓం దివ్యదేహాయ నమః ఓం దీనార్తి హరణాయ నమః
ఓం దైన్య నాశకరాయ నమః ఓం ఆర్యజనగణణ్యాయ నమః ఓం క్రూరాయ నమః
ఓం క్రూరచేష్టాయ నమః ఓం కామక్రోధకరాయ నమః ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమ:



సన్యాసుల చేతిలో కర్ర ఎందుకు ?

స్వాముల చేతిలో పొడవాటి కర్రలు ఉంటాయి గమనించారా? ఎళ్లవేళలా అవి వారి చేతిలో ఉంటాయి. ఊతకోసమా అంటేకాదు. మరి వాటిని ఎప్పుడు చేత పట్టుకోవడానికి గల కారణం గురించి తెలుసుకుందాం. వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా ఈ పొడవైన కర్ర పట్టుకుంటారు సన్యాసులు (యతులు).

ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది. ' Y' ఆకారంగల యోగదండాన్ని, కమడలాన్ని పట్టుకొని ఉండేవారిని 'తాపసులు' లేదా 'ఋషులు' అని అంటారు. గాలి,నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి కాబట్టి ఐదడుగుల కర్రను కూడా ధరిస్తారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. ఒకే ఒక కర్రను ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు, బోధించేవారు. అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం (శ్రీ శంకరాచార్య మతం) మనిషిలోనే దేవుడిని చూడమని. స్వర్గం, నరకం రెండూ ఇక్కడే ఉన్నాయి. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ మార్గాన, అన్యాయంగా సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు. ఈ అద్వైత సిద్దాంతాన్ని బోధించేవారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒకే కర్ర ఉంటుంది.

రెండు కర్రలు కలిపి ఒక్కటిగాకట్టి ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు. వీరిని 'ద్విదండి ' స్వాములు అంటారు. వీరు జీవుడు, దేవుడు వేర్వేరు (రామానుజాచార్యుల మతం) అని బోధిస్తారు ద్వైత సిద్ధాంతానికి ఉన్న ప్రాచుర్యం అద్వైతానికి లేదు. ఈ మతానికి చెందినవారిని 'జీయరు'లని అంటారు.
మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు. వాళ్లు జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఒకటే అనే నారాయణ తత్వాన్ని బోధిస్తూ ఉంతారు. పొడవైన ఈ దండాలతో దుష్టప్రాణులనుండి రక్షణ కొరకు, ఫలఫుష్పాల సేకరణ చేసుకుంటూ భగవధ్యానం చేసుకుంటారు.

ఋషుల చేతిలో ఉండే 18 అంగులాల యోగదండం జపం చేయదానికి, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. యోగులు రుద్రాక్షమాల నేలపైబడకుండా 'Y' ఆకారంలో ఉన్న యోగదండంపై చేతినిపెట్టి జపమాల తిప్పుతుంటారు.
పాదాభివందనం :-
జ్ఞాన వృద్ధులైన వారి పాదాలకు, మనకంటే పెద్ద వారి పాదాలకు చేసే నమస్కారమే "పాదాభివందనం".

అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః!
చత్వారితస్యవర్ధంతే ఆయుర్విధ్యా యశోబలం!!

అంటే వయసువల్ల కాని , విద్యవల్ల కాని అధికులైనవారికి ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తే , మనకి ఆయువు, విద్య, కీర్తి, బలం, ఐశ్వార్యాభివృద్ధి లభిస్తాయని మనుధర్మశాస్త్రంలో మనువు చెప్పిన మాట ఇది.
'నమస్కారం' మన సంస్కారానికి చక్కని పురస్కారం. ఇక యోగభ్యాసంలో మొదటి భంగిమ "నమస్తే." వినయానికి ప్రతీక నమస్తే. రెండు చేతులు జోడించి నమస్తే చెప్పడం మంచిది. 'నమస్తే ' బార్య భర్తల ఆదర్శ దాంపత్యానికి కూడా పతాకగా నిలిచే విధంగా "పాణిగ్రహణం " చేయిస్తున్నాము. దీనినే "కరచాలనం" అని కొందరంటారు."కరచాలనం" ఒక విధమైన నమస్కార పద్ధతి. కరచాలనం భారతీయ సంస్కృతికి సంభంధించినది కాకపోయినా, అతి సులువుగా, సౌకర్యాంతంగా చేసే నమస్కారంగా, మన జీవితంలో భాగమయిపోయింది. అయితే, పెద్దలకు, గురువులకు "ఏకహస్తాభివందనం" చెయ్యకూడదని హితవచనం. ఇటువంటి వారికి కరచాలనం చేసే సంధర్భం వచ్చినపుడు, వారి చేతులను , మన రెండు చేతులలోకి తీసుకొని, నమస్కరించడం ఉత్తమం. అయితే, అసలు శరీరంలో ఏ ఇతర అవయవాలకీ కాకుండా కేవలం పాదాలకు మాత్రమే ఎందుకు నమస్కరించాలి? అన్న విషయానికి వస్తే, యోగులలోను, మహాత్ములలోను, మన మంచిని కోరే పెద్దలలోను అభివృద్ధిని కోరే సద్గుణం ఉంటుంది. అటువంటి సాత్వికాభివృద్ధి యొక్క భావనాశక్తి, వారి శరీరంలో ప్రవహించి, వారి అరచేతులలోనూ, పాదాలలోను నిలిచి ఉంటుంది. అందుకే వారి పాదాలకు నమస్కరిస్తే, తమ అరచేయిని మన శిరస్సుపై ఉంచి ఆశీర్వదిస్తే , వారి సాత్విక శక్తి మనలో ప్రవేశించి, మనకు ప్రతిస్పందన కలుగుతుంది. ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది. అందుకే మనపెద్దలకు, గురువులకు పాదాభివందనం చేసేప్పుడు, వారి కుడి పాదాన్ని మన కుడి చేతిలోను, వారి ఎడమ పాదాన్ని మన ఎడమ చేతితోను తాకుతూ వందనం చేయాలని మను ధర్మశాస్త్రంలో పేర్కొన్నాడు. అంటే మనం నమస్కారం చేస్తున్నప్పుడు , మన చేతులను ఒక దానిపై మరొకటి " X " క్రాస్ గా పెట్టి నమస్కరించాలి. ఈ ప్రక్రియలో ఎడమ చేయి క్రింద, కుడి చేయి పైన ఉండేట్లు చూసుకోవాలి. మనకంటే చిన్నవారికి నమస్కారం చెయ్యకూడదు. మనకంటే పెద్దవారికి, వారి బార్యలకు నమస్కారం చెయ్యాలి. గురుపత్ని మనకంటే వయస్సులో చిన్నవారైనా, వారి వయస్సు లెక్కలోకి రాదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినదేమింటంటే యువతులకు నమస్కరించేప్పుడు, వారి పాదాలను తాకకుండా నమస్కరించాలి. ఇంక ఈ నమస్కార ప్రక్రియలో "సాష్టాంగ నమస్కారం" కూడా ఉంది. ఇందులో 3 యోగాసనాలు కూడా ఇమిడి ఉన్నాయి.

02 December 2014

Tell Your Birth Year in Telugu Year :-

(1867,1927,1987) Prabhava ప్రభవ
(1868,1928,1988) Vibhava విభవ
(1869,1929,1989) Sukla శుక్ల
(1870,1930,1990) Pramodyuta ప్రమోద్యూత
(1871,1931,1991) Prajothpatti ప్రజోత్పత్తి
(1872,1932,1992) Angīrasa అంగీరస
(1873,1933,1993) Srīmukha శ్రీముఖ
(1874,1934,1994) Bhāva భావ
(1875,1935,1995) Yuva యువ
(1876,1936,1996) Dhāta ధాత
(1877,1937,1997) Īswara ఈశ్వర
(1878,1938,1998) Bahudhānya బహుధాన్య
(1879,1939,1999) Pramādhi ప్రమాధి
(1880,1940,2000) Vikrama విక్రమ
(1881,1941,2001) Vrisha వృష
(1882,1942,2002) Chitrabhānu చిత్రభాను
(1883,1943,2003) Svabhānu స్వభాను
(1884,1944,2004) Tārana తారణ
(1885,1945,2005) Pārthiva పార్థివ
(1886,1946,2006) Vyaya వ్యయ
(1887,1947,2007) Sarvajit సర్వజిత్
(1888,1948,2008) Sarvadhāri సర్వధారి
(1889,1949,2009) Virodhi విరోధి
(1890,1950,2010) Vikruti వికృతి
(1891,1951,2011) Khara ఖర
(1892,1952,2012) Nandana నందన
(1893,1953,2013) Vijaya విజయ
(1894,1954,2014) Jaya జయ
(1895,1955,2015) Manmadha మన్మధ
(1896,1956,2016) Durmukhi దుర్ముఖి
(1897,1957,2017) Hevalambi హేవళంబి
(1898,1958,2018) Vilambi విళంబి
(1899,1959,2019) Vikāri వికారి
(1900,1960,2020) Sārvari శార్వరి
(1901,1961,2021) Plava ప్లవ
(1902,1962,2022) Subhakrit శుభకృత్
(1903,1963,2023) Sobhakrit శోభకృత్
(1904,1964,2024) Krodhi క్రోధి
(1905,1965,2025) Viswāvasu విశ్వావసు
(1906,1966,2026) Parābhava పరాభవ
(1907,1967,2027) Plavanga ప్లవంగ
(1908,1968,2028) Kīlaka కీలక
(1909,1969,2029) Soumya సౌమ్య
(1910,1970,2030) Sādhārana సాధారణ
(1911,1971,2031) Virodhikrit విరోధికృత్
(1912,1972,2032) Paridhāvi పరిధావి
(1913,1973,2033) Pramādi ప్రమాది
(1914,1974,2034) Ānanda ఆనంద
(1915,1975,2035) Rakshasa రక్షస
(1916,1976,2036) NaLa నల
(1917,1977,2037) Pingala పింగళ
(1918,1978,2038) Kālayukti కాళయుక్తి
(1919,1979,2039) Siddhārthi సిద్ధార్థి
(1920,1980,2040) Roudri రౌద్రి
(1921,1981,2041) Durmathi దుర్మతి
(1922,1982,2042) Dundubhi దుందుభి
(1923,1983,2043) Rudhirodgāri రుధిరోద్గారి
(1924,1984,2044) Raktākshi రక్తక్షి
(1925,1985,2045) Krodhana క్రధన
(1926,1986,2046) Akshaya అక్షయ

శ్రీ వైష్ణవి దేవి :-

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఆ చల్లని తల్లి త్రిశక్తి శ్రీ సరస్వతి, శ్రీలక్ష్మి, శ్రీమహాకాళి రూపాల్లో శ్రీ వైష్ణవదేవి పేరుతో కొలువుదీరి భక్తుల ఆరాధానలందుకుంటున్న దివ్యక్షేత్రం. ’జ్వాలాక్షేత్ర” ఇది అష్టాదశ శక్తిపీఠాలలో 15వ శక్తిపీఠం.కాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాకు 14కిలోమీటర్ల దూరంలో శ్రీ మాతా వైష్ణవీ దేవి కొలువై ఉన్న జ్వాలా క్షేత్రం.

త్రేతాయుగంలో శ్రీరాముడు లంకానగరములో దండయాత్రకు బయలుదేరేముందు జగన్మాతను ప్రార్ధించగా జగన్మాత సరస్వతి, లక్ష్మి, మహాకాళి రూపాల్లో ప్రత్యక్షమై ఆయన పూజలందుకున్నట్లు చెప్పబడింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పూజలందుకున్న ఆ జగన్మాత ద్వాపరయుగంలో ఉత్తర భారతదేశానికి వెళ్ళి జమ్ము ప్రాంతాల్లోని అదవుల్లో కొలువుదీరినట్లు చెప్పబడుతుంది. ఈ విధంగా త్రేతాయుగం, ద్వాపరయుగంలో పూజలందుకున్న ఈ అమ్మవారు కలియుగంలో కొలువుదీరడాన్ని ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.

ఎత్తయిన పర్వత శ్రేణులు, వాటిపైన ఆకాశన్నంటే వివిధ వృక్షాలు, ఆహ్లాదాన్ని కలిగించే అందమైన ప్రకృతి శోభ మధ్య త్రికూట పర్వతం పైన ’శ్రీ వైష్ణవీ దేవి’ ఆలయం ఉంది. ఆలయం సముద్ర మట్టానికి సుమారు 5,200 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీ వైష్ణవదేవీ యాత్ర కత్రా నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడినుంది ఆలయం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు సాధారణంగా కాలినడకనే వెళతారు. ఈ దారిలో వాహనాలు వెళ్ళలేవు. నడవలేని వారికి , వృద్ధులకు గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. కత్రాకు కొంత దూరంలో ’భూమికా మందిరం ’ ఉంది. .ఇక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్‍లో భక్తులు దర్శనానికి వెళ్ళేముండు తమ పేర్లను నమోదు చేసుకోని రసీదు పొందాలి. ఆ రసీదు ఉన్నవారే దర్శనానికి అర్హులు. ప్రయాణ మార్గంలో కత్రా నుంచి సుమారు రెండు కిలోమీటర్లు దాటగానే ’దక్షిణ దర్వాజా’ ఉంది. ఇక్కడినుండి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల దీనికి ’దర్సన దర్వాజా’ అని కూడా పేరు. దీనిని దాటిన తర్వాత ’ బాణ్ గంగా’ ఉంది. వైష్ణవీదేవి బాణం వేయగా అక్కడ ఉన్న రాయి నుండి గంగ ఉద్భవించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెపుతారు.

బాణ్‍గంగాకు ఒకటిన్నార కిలోమీటర్లు దూరంలో ’చరణ పాదుకా’ అనే ప్రాంతం ఉంది. ఇక్కడి అమ్మవారి పాదముద్రల నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. దీని భక్తులు తీర్ధంగా స్వీకరిస్తారు. మరి కొంత దూరంలో ’ఆదికుమారి మందిరం’ ఉంది. తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో ’సాంజీ భేట్’ ఉంది. ఇక్కడి నుండి మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శ్రీవైష్ణవీదేవి ఆలయం ఉంది. సాంజీ భేట్ వరకు కొండను ఎక్కుతూ వచ్చిన భక్తులు ఇక్కడ నుండి కొండ దిగుతూ ఆలయాన్ని చేరుకుంటారు. విశాలమైన వివిధ భవనాలుగా, అపార్టుమెంటుల్లాగా కనిపించే ఆలయంపై ఉత్తర భారత శైలిలో నిర్మించిన గోపురం ఉంది. ఆలయం పైభాగంలో సింహం ప్రతిమలు దర్శనమిస్తాయి. శ్రీ ఆంజనేయస్వామి చిహ్నం ఉన్న లోహపతాకం ఎప్పుడూ ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులందరూ ఒకే క్యూలైనులో వెళ్ళవలసిందే ప్రత్యేక దర్శనాలు వంటివి లేవు.
జగన్మాత శ్రీవైష్ణవిదేవి గుహలోపల కొలువుదీరి ఉంది. సుమారు 98 అడుగుల గుహలో గుహగోడపై శ్రీవైష్ణవీదేవి దర్శనమిస్తుంది. ఈ గుహలోకి కొంతదూరం వంగి, మరికొంత దూరం పాకుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. గుహలో కొలువుదీరిన జగన్మాత రాయి రూపంలో దర్శనమిస్తుంది.. ఈ మూర్తి క్రిందిభాగం ఒకటిగానే ఉండి శిఖరస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి మూడుగా విభజింపబడి ఉంటుంది. ఎడమవైపు తెల్లని భాగం శ్రీ సరస్వతిగా, మధ్యలోని పచ్చని భాగం శ్రీలక్ష్మిగా, కుడివైపున ఉన్న నల్లని భాగం శ్రీమహాకాళిగా చెప్పబడుతూ ఉంది.అంటే ఈమె ముగ్గురు శక్తుల సమ్మేళనంతో ఏర్పడిన ఏకరూపం. అమ్మవారు కొలువుదీరి ఉన్న గుహలో అమ్మవారి కంటే ముందే ’చరణ్ గంగా’ ఉంది. ప్రవహిస్తూ ఉన్న ఈ నీటిలో భక్తులు కాళ్ళు కడుక్కుని అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న బైరవనాధుడిని దర్శించుకుంటారు.

ప్రతీ రోజు పూజలుజరిగే శ్రీవైష్ణవిదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల సంధర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి జమ్ముకు వెళ్ళేందుకు రైలు సౌకర్యాలు ఉన్నాయి. కత్రాతో పాటు మార్గమంతా త్రికూట పర్వత ప్రాంతంలోనూ వసతి గృహాలు, సత్రాలు ఉన్నాయి. రోజంతా ఆలయం తెరిచే ఉంటుంది. అయితే జనవరి , ఫిబ్రవరి నెలల్లో మంచు వల్ల ప్రయాణం కష్టమవుతుంది కనుక మిగతా సమయాల్లో వైష్ణవి దేవి యాత్రకు వెళ్ళడం మంచిది.
వాస్తు :-


రావణ లంక :-
రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది. ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి పురాణం అంతకంటే కాదు.. లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ.. ఒక మహా అసురుని ఉనికిని ఇవాళ్టికీ చాటి చెప్తున్న కథ.. ఇంతకాలం మిథ్యగా భావిస్తున్న చరిత్ర. రావణ రహస్య మిది..
ఇదేదో సోది రామాయణ కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం... వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపును తిప్పనున్న నిజం... ఒక నాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం... సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం.

లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.

రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం..ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.

సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు.

ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్ళు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.

రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్‌ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.

ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది.


ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్‌ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా?

శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్‌... ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.


దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్‌ పారమల్‌ ఫార్మాస్యూటికల్‌‌స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి.

విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్‌గా కనిపిస్తుంది...

రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా.

మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు... రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు.

 శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు... గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది.
ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది.

మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.

రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్‌ రామచరిత మానస్‌లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి..

తులసీదాస్‌ రాసిన రామచరితమానస్‌ ఒరిజినల్‌ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది.

కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది.

ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్‌ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరకడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్‌కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే , అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్‌లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ.

శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.

రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నమ్ముతున్నారు .. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కాలమే సమాధానం.

రావణుడు.. రామాయణం... భారతీయ సంస్కృతి, నాగరికతలతో గాఢంగా పెనవేసుకుని పోయిన అంశాలు.. శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో ఏడువేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది.. అంతే కాదు.. రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి.లంకలో రావణ రహస్యం గురించి మరి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం.
మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి స్వయంగా రాసిన అసలైన రామాయణాన్ని చదివిన వాళ్లు వేళ్లపైన లెక్కించదగిన వాళ్లే ఉంటారు.. ఈ తరానికి తెలిసిందల్లా, ఎక్కువగా సినిమాల్లో చూసిన రామాయణ కథే...ఈ దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేం.. వాల్మీకి రాసింది ఒక రామాయణం.. వేర్వేరు భాషల్లో వేర్వేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి.. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాళ్లలో మరో సరికొత్త రామాయణం ఆవిష్కారం అవుతోంది.

రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు? అని అడిగితే టక్కున వచ్చే జవాబు అశోక వనం.. కానీ లంక అదే శ్రీలంకలో సీన్‌ వేరేలా ఉంది.. సీతాదేవిని పరిస్థితులను బట్టి, ముందు జాగ్రత్త చర్యగా వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట..పంచవటిలో, పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్‌ తోటలోని తన ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యాడు.. పక్కనే ఉన్న తన భార్య మండోదరి దేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడు.

లంకాపురంలో అతిగొప్ప ప్యాలెస్‌ మండోదరికి ఉండేదిట..చుట్టూ జలపాతాలు.. పూల తోటలు. అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే. ఆ తరువాత అశోకవాటికకు తరలించాడు.. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది. అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడు.. ఆకాశమార్గంలో లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్‌ వ్యూ ద్వారా సీతాదేవికి వర్ణిస్తూ చూపించాడట రావణుడు.

అశోక వాటికకు సమీపంలోనే సీతా పకన్‌ అనే చిన్న ప్రాంతం ఉంది.. చుట్టూ కమ్ముకుని ఉన్న దట్టమైన అడవి.. నిటారుగా నిలుచుని వున్న వృక్షాల మధ్య ౨౦౦ గజాల మేరకు ఉన్న చిన్న స్థలం.. అంత అడవిలో ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు.. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట.. సీతాదేవి లంకనుంచి అయోధ్యకు వెళ్లిన తరువాత ఇది పూర్తిగా డ్రె అయిపోయింది.. అప్పటి నుంచి ఇలాగే ఉంది.

ఇస్త్రిపుర . అంటే ఏరియా ఆఫ్‌ వుమెన్‌ అని అర్థం. హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సం అంతా చేసేశాక, ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించాడట. ఇక్కడి నుంచి కూడా రావణ గోడా అనే ప్రాంతానికి సీతను షిప్ట్‌ చేసినట్లు చెప్తారు.. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉంది...
ఈ ప్రాంతాన్ని దిశృంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది.. దీంతో పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది.. రావణ సంహారం తరువాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే... ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్తూపాన్ని కూడా నిర్మించారు..


లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాళ్లను మనం చూడవచ్చు. అదే సమయంలో రామాయణంలో రావణుడి సంబంధించినంత వరకు మిగతా కేరెక్టర్లు కొన్ని ఉన్నాయి..వాళ్లకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ మనకు లంకలో కనిపిస్తాయి.

లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం...ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది.. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి చిత్రపటం మనకు కనిపిస్తుంది..అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు.
 
రావణుడి కొడుకు ఇంద్రజిత్‌.. ఇతను కూడా శివుడికి మహా భక్తుడు.. ఈతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాళ్టికీ పూజలందుకుంటున్నాయి.


రావణుడి తల్లి కేకసి.. ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది.. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది.. శ్రీలంకలోని తిరుక్కోవిల్‌లో ఆమె తల్లి భవంతి ఉండేది.. ఇప్పుడా ప్రాంతంలో దేవాలయం ఉంది..ఇక్కడో విచిత్రం ఉంది.. తన తల్లి మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరవైందట.. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టాడట.. దీంతో ఏడు ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు రకాలుగా ఉండటం ఇక్కడి విచిత్రం.

తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది.. లంకారాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీఫారమ్‌.. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట ఉండేది.. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు.. దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది.. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్‌ హౌస్‌ కనిపిస్తుంది.
ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి.. లంకాదహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు రెస్ట్‌ తీసుకున్నాడు.. దాన్ని ఇప్పుడు రామ్‌ బోడా అంటారు.. అక్కడ చిన్మయ మిషన్‌ వాళ్లు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు.

రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు..లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు.. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు.. కానీ, రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి చెస్‌ను కనుక్కొన్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణబ్రహ్మ.
రావణుడికి సంబంధించి అయిదు విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కొందని చెప్పుకున్నాం.. గుర్లపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది.. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదిట.. దీనికి సింహళభాషలో గుర్లపోత అంటారు..అంటే పక్షి వాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు.. అంటే ఎగిరే నెమలి అని అర్థం.

రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది.. లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది.. ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని నిర్మించాడట రావణుడు.. ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవిట.


లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్‌ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్‌ కలిపే నెట్‌వర్క్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి.

ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు.. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని స్పష్టంగా తెలుస్తుంది.. రావణ గుహకే దాదాపు ఏడు వందల దాకా కిటికీలు ఉన్నాయి.

ఎంత గొప్ప నగర నిర్మాణం.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం.. ఎంత గొప్ప నాగరికత.. భారత దక్షిణా పథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక వైభవం విలసిల్లిన లంకానగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది? తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు.

పధ్నాలుగేళ్ల వనవాసానికి అయోధ్య నుంచి బయలు దేరిన రామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్లాడు.. అప్పటికి దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది.. దండకారణ్యంలో రావణుడి గవర్నర్‌ ఖరుడు పరిపాలన సాగించాడు.. రాముడు ఖరదూషణులను ఇక్కడే చంపాడు.

పంచవటి నుంచి కిష్కింధకు వెళ్లిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని కలుసుకున్నాడు.. ఆ సైన్యం తోనే శ్రీలంకకు చేరుకున్నాడు.. భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలైమన్నార్‌ దాకా నిర్మించాడు. నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలోని నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది.. ఇదేం విచిత్రం కాదు.. నీటిపై తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్‌లోని రామప్ప దేవాలయ గోపురంలోనూ మనం చూడవచ్చు.. లైట్‌వెయిట్‌ స్టోన్స్‌, నీరు, ఇసుక.. పునాదులపై నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైన విద్యలు.. రామ సేతువు ఇవాళ్టికీ సుమారు ౩౦ కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తుంది.

శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నీలవరై పుత్తుర్‌ దగ్గర మొదట ఆగాడట.. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది.

నీలవరై పుత్తుర్‌ దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి సైన్యం తరలింది.. లగ్గల అంటే టార్గెట్‌ రాక్‌ అని అర్థం.. ఈ పర్వత పై భాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది.. ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది.. అటు వాయవ్య దిశలో తలైమన్నార్‌ ఉంటుంది.. రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే.. ఈ తిరుకోణేశ్వరంలోనే రావణుడు తపస్సు అదేనండీ ఇవాళ మనం అనే మెడిటేషన్‌ చేసేవాడు.

ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి దశకంఠుడు నేలకొరిగాడు.. రాక్షస సంహారం జరిగింది. సుందరలంక స్మశానంగా మారిపోయింది.. రాముడు వనవాసానికి వెళ్లేనాటికా ఆయన వయసు ౨౫ సంవత్సరాలు.. రావణున్ని హతమార్చేప్పటికి రాముడు ౩౯ ఏళ్ల వాడు.

రావణ సంహారంతో రామాయణం ముగియలేదు.. యుద్ధం తరువాత రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినప్పుడూ లంకలోని కొన్ని ప్రాంతాలలో ఆగాడు.. సేద తీరాడు.. పరమేశ్వరుని కొలిచాడు.

రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు.


వందారుమూలైలో ఉన్నప్పుడు రాముడికి అనుమానం కలిగింది.. రావణుడు బ్రాహ్మణుడు.. అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరాడు.. అప్పుడు శివుడు నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రాముడికి సూచించాడట.. దీంతో రాముడు లంకలో మానావారి అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.. దీన్ని రామలింగ శివుడని కొలుస్తారు.. ఆ తరువాత తిరుకోణేశ్వరంలో, అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు... చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు..
పుష్పకంపై తిరిగి వెళ్తూ, రాముడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లాడని కూడా కథనం చెప్తారు.. మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది..